IPL 2022: Yuzvendra Chahal Shocking Comments Drunk Player Dangled Him From Balcon - Sakshi
Sakshi News home page

Yuzvendra Chahal: ఆ క్రికెటర్‌ తాగిన మైకంలో నన్ను... చహల్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. చచ్చేవాడిని!

Published Fri, Apr 8 2022 2:26 PM | Last Updated on Fri, Apr 8 2022 4:46 PM

Yuzvendra Chahal Shocking Comments Drunk Player Dangled Him From Balcony - Sakshi

సహచర ఆటగాళ్లతో చహల్‌(PC: IPL/ BCCI)

IPL 2022- Rajasthan Royals Players: ‘‘నిజానికి ఈ విషయం కొంతమందికి మాత్రమే తెలుసు. 2013లో ఈ ఘటన జరిగింది. అప్పుడు నేను ముంబై ఇండియన్స్‌ జట్టులో ఉన్నాను. బెంగళూరులో మ్యాచ్‌ ఆడాము. ఆ తర్వాత హోటల్‌కు చేరుకున్నాం. నా సహచర ఆటగాడు ఒకరు బాగా తాగేసి ఉన్నాడు. తాగిన మైకంలో నన్ను తన దగ్గరకు పిలిచాడు. ఒక్కసారిగా నన్ను ఎత్తిపట్టుకుని బాల్కనీ నుంచి వేలాడదీశాడు. 

తన చుట్టూ నేను చేతులు వేసి పట్టుకుని ఉన్నాను. ఏమాత్రం పట్టు కోల్పోయినా 15వ అంతస్తు నుంచి కిందపడిపోయే వాడినే. అప్పటికే చాలా మంది అక్కడికి చేరుకున్నారు. నన్ను ఆ విపత్కర పరిస్థితి నుంచి బయటపడేశారు. స్పృహ కోల్పోయిన నాకు నీళ్లు ఇచ్చి కుదుటపడేలా చేశారు’’ అని టీమిండియా ఆటగాడు, రాజస్తాన్‌ రాయల్స్‌ స్టార్‌ బౌలర్‌ యజువేంద్ర చహల్‌ తనకు ఎదురైన చేదు అనుభవం గురించి పంచుకున్నాడు. 

సహచర ఆటగాళ్లు రవిచంద్ర అశ్విన్‌, కరుణ్‌ నాయర్‌తో కలిసి తన జీవితంలో జరిగిన దుర్ఘటనను, అందులో నుంచి బయటపడిన తీరును వివరించాడు. బయటకు వెళ్లినపుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, లేనిపక్షంలో ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుందని చహల్‌ చెప్పుకొచ్చాడు.

తాను అతిపెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడని, తనకు అదొక పునర్జన్మ లాంటిదని పేర్కొన్నాడు. దయచేసి అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశాడు. అయితే తనకు ఆ పరిస్థితి కల్పించిన క్రికెటర్‌ ఎవరన్న విషయాన్ని మాత్రం చహల్‌ బయటపెట్టలేదు.

ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్‌ రాయల్స్‌ తమ సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేసింది. కాగా 2013 తర్వాత రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టులోకి వచ్చిన చహల్‌ చాలా కాలం పాటు ఆ ఫ్రాంఛైజీతోనే కొనసాగాడు. అయితే, ఐపీఎల్‌ మెగా వేలం-2022 నేపథ్యంలో ఆర్సీబీ అతడిని రిటైన్‌ చేసుకోలేదు. దీంతో రాజస్తాన్‌ చహల్‌ను కొనుగోలు చేసింది. ఇక ఈ సీజన్‌లో రాజస్తాన్‌ గెలిచిన రెండు మ్యాచ్‌లలో చహల్‌ తన వంతు పాత్ర పోషించాడు.

చదవండి: IPL 2022: కోహ్లి స్టైల్లో బదోని సెలబ్రేషన్స్‌.. వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement