ముంబై: టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఫ్యాన్స్‌ను ఉత్సాహపరచడంలో ఎప్పుడు ముందుంటాడు. తాజాగా 2025లో మీ దృష్టిలో ఉత్తమ ఆటగాడిగా ఎవరుంటారో చెప్పాలంటూ రాజస్తాన్ రాయల్స్ బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులను అడుగుతూ ఒక ఫోటోను షేర్ చేసింది. దీనిపై జడేజా వినూత్న రీతిలో స్పందించాడు. ''2025లోనా .. ఇంకెవరు నేనే ఉత్తమ ఆటగాడిగా ఉంటా.. అందులో సందేహం లేదు'' అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. జడేజా ఇచ్చిన సమాధానం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.
జడేజా ప్రస్తుత తరంలో ఉత్తమ ఆల్‌రౌండర్ల జాబితాలో ఒకడిగా ఉన్నాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో తమ పోస్టుపై జడేజా పెట్టిన కామెంట్‌కు సంతృప్తి చెందిన రాజస్తాన్ రాయల్స్..'' మాకు సమాధానం దొరికింది.. ఇది ఇక్కడితో ముగిద్దాం'' అంటూ కామెంట్ చేసింది. కాగా ఆసీస్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా మూడో టెస్టు మ్యాచ్‌లో జడేజా బ్యాటింగ్ చేస్తుండగా.. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో జడేజా బొటనవేలికి తీవ్ర గాయమైంది. వైద్యులు అతన్ని పరీక్షించగా.. ఆరు వారాల విశ్రాంతి అవసరం కావడంతో ఆసీస్‌తో జరిగిన నాలుగో టెస్టుతో పాటు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు.
అంతేగాక రేపటినుంచి ప్రారంభం కానున్న 5 టీ20ల సిరీస్‌కు జడేజా అందుబాటులో ఉండడు. ఆ తర్వాత జరిగే మూడు వన్డేల సిరీస్ మాత్రం ఆడే అవకాశం ఉన్నట్లు టీమిండియా మేనేజ్‌మెంట్ తెలిపింది. కాగా జడేజా తన ప్రాక్టీస్‌కు సంబందించిన వీడియోనూ తన ట్విటర్‌లో షేర్ చేశాడు. నా ప్రాక్టీస్ మెళ్లిగా ఆరంభించా.. కానీ కచ్చితంగా జట్టులోకి వస్తా అంటూ కామెంట్ చేశాడు. ఇక ఏప్రిల్ 9 నుంచి జరగనున్న ఐపీఎల్ 14వ సీజన్‌కు మాత్రం జడేజా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాడు. ఇక టీమిండియా తరపున జడేజా 51 టెస్టుల్లో 1954 పరుగులు.. 220 వికెట్లు, 168 వన్డేల్లో 2411 పరుగులు.. 187 వికెట్లు, 50 టీ20ల్లో 217 పరుగులు.. 39 వికెట్లు సాధించాడు.
చదవండి:
'నేను నీలాగా కావాలంటే ఎన్ని ఆమ్లెట్స్ తినాలి'
'ద్రవిడ్ భయ్యా.. ఎవరీ కుర్రాడు కుమ్మేస్తున్నాడు'
Slowly but surely 💪🏻 pic.twitter.com/7uARo5bhms
— Ravindrasinh jadeja (@imjadeja) March 9, 2021
Comments
Please login to add a commentAdd a comment