Courtesy: IPL Twitter
Breadcrumb
- HOME
IPL 2022: ముంబై ఇండియన్స్‌కు మరో ఓటమి.. రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం
Published Sat, Apr 2 2022 2:48 PM | Last Updated on Sat, Apr 2 2022 7:37 PM
Live Updates
IPL 2022: ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ లైవ్ అప్డేట్స్
ముంబై ఇండియన్స్‌కు మరో ఓటమి.. రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం
ఐపీఎల్-2022లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిపోయింది. డివై పాటిల్ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ పరాజాయం పాలైంది.
194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులకే పరిమితమైంది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(61), ఇషాన్ కిషన్(54) పరగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్లలో చహాల్,నవ్‌దీప్ సైనీ రెండు వికెట్లు, బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, అశ్విన్ చెరో వికెట్ సాధించారు. అంతకుముందు రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్ జోష్ బట్లర్ అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. 68 బంతుల్లో 100 పరుగులు సాధించాడు. అతడితో పాటు కెప్టెన్ శాంసన్(30), హెట్‌మైర్(35) పరుగులతో రాణించారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా,మిల్స్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, పొలార్డ్ ఒక వికెట్ సాధించాడు.
ఐదో వికెట్ కోల్పోయిన ముంబై.. టిమ్ డేవిడ్ ఔట్
136 పరుగుల వద్ద టిమ్ డేవిడ్ ఔటయ్యాడు. చాహల్ బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యాడు.
బిగ్ బ్లో.. తిలక్ వర్మ క్లీన్ బౌల్డ్
విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన హైదరబాదీ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ (33 బంతుల్లో 61 పరుగులు) చేసి రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
మూడో వికెట్ కోల్పోయిన ముంబై.. కిషన్ ఔట్
121 పరుగుల వద్ద ముంబై ఇషాన్ కిషన్ రూపంలో మూడో వికెట్ కోల్పోయింది. 54 పరుగులు చేసిన కిషన్.. బౌల్ట్ బౌలింగ్‌లో సైనికు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ముంబై విజయానికి ఇంకా 42 బంతుల్లో 73 పరుగులు కావాలి.
గేర్ మార్చిన ముంబై బ్యాట్స్‌మెన్..
భారీ టార్గెట్‌ను చేధించే దిశగా ముంబై టీమ్ దూసుకుపోతోంది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ ఇషాన్ కిషన్(39 బంతుల్లో 48 పరుగులు), తిలక్ వర్మ (24 బంతుల్లో 46 పరుగులు) విధ్వంస ఇన్నింగ్స్ ఆడుతున్నారు. దీంతో 12 ఓవర్లకు ముంబై స్కోరు.. 112/2కు చేరుకుంది.
రెండో వికెట్ డౌన్.. అన్మోల్ప్రీత్ సింగ్ అవుట్
భారీ లక్ష్య చేధనలో ముంబై ఇండియన్స్‌కు నాలుగో ఓవర్లోనే మరో షాక్ తగిలింది. అన్మోల్ప్రీత్ సింగ్(5) పరుగులు చేసి నవదీప్ సైనీ బౌలింగ్‌లో పడిక్కల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
తొలి వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్.. రోహిత్ ఔట్
194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆదిలోనే షాక్ తగిలింది. 10 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో పరాగ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
చెలరేగిన రాజస్తాన్ బ్యాటర్లు.. ముంబై టార్గెట్ 194 పరుగులు
ముంబై ఇండియన్స్‌తో జరగుతోన్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్ సాధించింది. రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్ జోష్ బట్లర్ అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. 68 బంతుల్లో 100 పరుగులు సాధించాడు.
అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. అతడితో పాటు కెప్టెన్ శాంసన్(30), హెట్‌మైర్(35) పరుగులతో రాణించారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా,మిల్స్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, పొలార్డ్ ఒక వికెట్ సాధించాడు.
ఒకే ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయిన రాజస్తాన్
బుమ్రా వేసిన 19 ఓవర్లో రాజస్తాన్ వరుస క్రమంలో మూడు వికెట్లు కోల్పోయింది. 35 పరుగలు చేసిన హెట్‌మైర్ తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరగగా, బట్లర్ క్లీన్ బౌల్డయ్యాడు. అదేవిధంగా రవిచంద్రన్ అశ్విన్ రౌనౌటయ్యాడు. 19 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.
బట్లర్ అద్భుతమైన సెంచరీ..
ముంబై ఇండియన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో జోష్ బట్లర్ అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. 66 బంతుల్లో బట్లర్ సెంచరీ సాధించాడు. అతడి సెంచరీలో 11 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి.
మూడో వికెట్ కోల్పోయిన రాజస్తాన్
130 పరుగులు వద్ద రాజస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన శాంసన్.. పొలార్డ్ బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఇక 96 పరుగులు చేసి బట్లర్ సెంచరీకు చెరువలో ఉన్నాడు.
బట్లర్ అర్ధ సెంచరీ.. 9 ఓవర్లకు స్కోర్: 73/0
9 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. కాగా బట్లర్ అర్ధ సెంచరీతో మెరిశాడు. క్రీజులో బట్లర్(57), శాంసన్(7) పరుగులతో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన రాజస్తాన్
48 పరుగులు వద్ద రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన పడిక్కల్.. టైమిల్ మిల్స్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
తొలి వికెట్ కోల్పోయిన రాజస్తాన్ రాయల్స్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. కేవలం 2 పరుగులు మాత్రమే జైస్వాల్.. బుమ్రా బౌలింగ్‌లో టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 3 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై
ఐపీఎల్-2022లో భాగంగా శనివారం ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య రసవత్తరమైన పోరు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి చెందిన ముంబై ఈ మ్యాచ్‌లో గెలిచి బోణీ కొట్టాలని భావిస్తోంది.
మరో వైపు ఎస్ఆర్హెచ్పై ఘన విజయం సాధించిన రాజస్తాన్.. ముంబైను మట్టి కరిపించాలని ఉర్రూతలూగుతోంది. ఇక ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మొత్తం 25 మ్యాచ్‌లు జరగ్గా 13 మ్యాచ్‌ల్లో ముంబై, 11 మ్యాచ్‌ల్లో రాజస్థాన్ గెలుపొందాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.
తుది జట్లు
ముంబై: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), అన్మోల్ప్రీత్ సింగ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్, బాసిల్ థంపి
రాజస్తాన్: జోష్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కెప్టెన్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్,ట్రెంట్ బౌల్ట్, నవదీప్ సైనీ, ప్రసిద్ధ్ కృష్ణ
Related News By Category
Related News By Tags
-
హిట్‌మ్యాన్ ఖాతాలో మరో రెండు చెత్త రికార్డులు
ఐపీఎల్ 2022 సీజన్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు చేదు అనుభవాల్ని మిగిల్చింది. ఐపీఎల్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా రోహిత్ ఈ సీజన్లో చెత్త రికార్డులన్నీ తన పేరిట లిఖించుకున్నాడు. ఈ ...
-
ఊహించని ట్విస్ట్; మనం ఒకటి తలిస్తే దేవుడు మరోలా..
ఐపీఎల్ 2022 సీజన్లో శనివారం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో పెద్దగా రాణించలేదు. 14 మ్యాచ్‌ల్లో 4 ...
-
కోహ్లి అభిమానులంతా రోహిత్ వెంటే.. హిట్‌మ్యాన్ రెచ్చిపోవడం ఖాయం..!
ఐపీఎల్ 2022 సీజన్లో ఇవాళ (మే 21) అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగనుంది. ప్లే ఆఫ్స్ నాలుగో స్థానాన్ని ఖరారు చేసే ఈ బిగ్ ఫైట్‌లో ఢిల్లీ క్యాపిటల్స్.. ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టనుంది. 13 మ్యాచ్‌ల్లో 10 ప...
-
ముంబై ఇండియన్స్‌పై ఎస్ఆర్హెచ్ విజయం
-
ముంబై ఇండియన్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్.. ఇరు జట్లలో భారీ మార్పులు..!
ఐపీఎల్-2022 చివరి అంకానికి చేరుకుంది. ఆయా జట్లు తమ అఖరి లీగ్ మ్యాచ్‌ల్లో తలపడతున్నాయి. కొన్ని జట్లు ప్లే ఆఫ్ స్థానాలు కోసం పోటీపడుతుంటే.. మరి కొన్ని జట్లు అఖరి మ్యాచ్‌ల్లో విజయం సాధించి పరువు నిలుప...
Comments
Please login to add a commentAdd a comment