Courtesy: IPL Twitter
ఐపీఎల్-2022 చివరి అంకానికి చేరుకుంది. ఆయా జట్లు తమ అఖరి లీగ్ మ్యాచ్‌ల్లో తలపడతున్నాయి. కొన్ని జట్లు ప్లే ఆఫ్ స్థానాలు కోసం పోటీపడుతుంటే.. మరి కొన్ని జట్లు అఖరి మ్యాచ్‌ల్లో విజయం సాధించి పరువు నిలుపుకోవాలని భావిస్తోన్నాయి. ఈ క్రమంలో ప్లే ఆఫ్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు మంగళవారం వాంఖడే వేదికగా అమీతుమీ తేల్చుకోవడానికి సిద్దమయ్యాయి.
కాగా ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ కేవలం మూడు మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించింది. ఇక ఎస్‌ఆర్‌హెచ్ 12 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కూడా భారీ మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ముంబై తమ అఖరి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించింది. బౌలింగ్ పరంగా ముంబై అద్భుతంగా రాణిస్తోంది. అయితే బ్యాటర్లు మాత్రం పూర్తిగా నిరాశ పరుస్తున్నారు. ఇక ఎస్‌ఆర్ హెచ్ తమ చివరి మ్యాచ్‌లో కేకేఆర్ చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో బౌలర్లు రాణించి నప్పటికీ..బ్యాటర్లు విఫలమమయ్యారు.
పిచ్ రిపోర్ట్
వాంఖడే స్టేడియంలో గత రెండు మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్‌లు నమోదు అయ్యాయి. టాస్ గెలిచిన కెప్టెన్ తొలుత బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.
హెడ్ టూ హెడ్ రికార్డులు
ఇక ఇరు జట్లు ఇప్పటి వరకు ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ముఖాముఖి 17 సార్లు తలపడగా.. ఎస్‌ఆర్‌హెచ్ 8 మ్యాచ్‌ల్లో, ముంబై 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
తుది జట్లు అంచనా
ముంబై ఇండియన్స్
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రెవిస్, ఆర్యన్ జుయల్, టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్, కుమార్ కార్తికేయ, మయాంక్ మార్కండే, జస్ప్రీత్ బుమ్రా, రిలే మెరెడిత్
సన్‌రైజర్స్ హైదరాబాద్
అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, సీన్ అబాట్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్
చదవండి: IPL 2022: 'మయాంక్ ఏం కెప్టెన్సీ చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు'
Comments
Please login to add a commentAdd a comment