Rohit sharma(PC: IPl.com/bcci)
ఐపీఎల్‌లో టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ మాజీ సారథి రోహిత్ శర్మ అరుదైన రికార్డుకు చేరవయ్యాడు. ఐపీఎల్-2024లో భాగంగా బుధవారం ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ రోహిత్ శర్మకు చాలా ప్రత్యేకం. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున 200 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా రోహిత్ రికార్డులకెక్కనున్నాడు.
ఇప్పటివరకు ఏ క్రికెటర్ కూడా ముంబై తరపున 200 మ్యాచ్‌లు ఆడలేదు. ఐపీఎల్ 2011 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్‌తో జతకట్టిన హిట్‌మ్యాన్.. ఇప్పటివరకు 199 మ్యాచ్‌లు ఆడాడు. 199 మ్యాచ్‌ల్లో ముంబై తరపున రోహిత్ 5084 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో ముంబై తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా రోహిత్ శర్మనే.
ఇక ఈ క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఒకే ఫ్రాంచైజీకి 200 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన మూడో ఆటగాడిగా రోహిత్ నిలవనున్నాడు. ఈ జాబితాలో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి(239), సీఎస్‌కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని(221) తొలి రెండు స్ధానాల్లో ఉన్నాడు. ఇక ఐపీఎల్-2024 సీజన్‌ను రోహిత్ ఘనంగా ఆరంభించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 43 పరుగులతో శర్మ అదరగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment