IPL 2023 SRH Vs MI: Ishan Kishans Powerful Straight Shot Gives Rohit Sharma Leg Injury Scare - Sakshi
Sakshi News home page

IPL 2023 SRH Vs MI: ఇషాన్‌ కిషన్‌ భారీ షాట్‌.. దెబ్బకు రోహిత్‌ కిందపడిపోయాడు! వీడియో వైరల్‌

Published Wed, Apr 19 2023 11:36 AM | Last Updated on Wed, Apr 19 2023 12:04 PM

Ishan Kishans powerful straight shot gives Rohit Sharma leg injury scare - Sakshi

ఐపీఎల్‌-2023లో హైదరాబాద్‌ వేదికగా ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో మంబై ఇన్నింగ్స్‌ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ముంబై ఇండియన్స్‌ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ కొట్టిన భారీ షాట్‌కు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కింద పడిపోయాడు.

ఏం జరిగిందంటే?
ముంబై ఇన్నింగ్స్‌ 4 ఓవర్‌ వేసిన జానెసన్‌ బౌలింగ్‌లో ఇషాన్‌ కిషన్‌ స్ట్రైట్‌ డ్రైవ్‌ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న రోహిత్‌ శర్మ కాలి ప్యాడ్‌కు బలంగా తాకింది. దెబ్బకు రోహిత్‌ కింద పడిపోయాడు. అయితే అదృష్టవశాత్తూ రోహిత్‌కు ఎటువంటి గాయం కాలేదు. కిందపడిన వెంటనే లేచి ఆటను హిట్‌ మ్యాన్‌ కొనసాగించాడు. 

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో రోహిత్‌, కిషన్‌ ముంబైకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు 41 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్‌ 24 పరుగులు చేసి పెవిలియన్‌ చేరగా.. కిషన్‌ 38 పరుగులతో ఆకట్టుకున్నాడు.

ఇక ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచిన కామెరాన్ గ్రీన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. తొలుత బ్యాటింగ్‌లో 64 పరుగులతో ఆజేయంగా నిలిచిన గ్రీన్‌.. అనంతరం బౌలింగ్‌లో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు.
చదవండిIPL 2023: సచిన్‌ కొడుకుతో అట్లుటంది మరి.. శబాష్‌ అర్జున్‌! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement