Rajasthan Royals Sanju Samson Shares His Workout Routine Ahead IPL 2022 - Sakshi
Sakshi News home page

Sanju Samson: కండలు కరిగించాడు.. ఇక సిక్సర్ల వర్షమేనా!

Published Thu, Mar 17 2022 2:08 PM | Last Updated on Thu, Mar 17 2022 3:24 PM

Sanju Samson Shares Photo About Doing Fitness Ready For IPL 2022 - Sakshi

రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శామ్సన్‌ కండలు కరిగించే పనిలో ఉన్నాడు. కరోనా బారిన పడి కోలుకున్న సంజూ బ్యాటింగ్‌లో పదును పెంచుకునేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. తాజాగా ''క్వారంటైన్‌ గోయింగ్‌ స్ట్రాంగ్‌'' అంటూ సంజూ శాంసన్‌ స్వయంగా ట్విటర్‌లో ఫోటో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇక మరో 9 రోజుల్లో ఐపీఎల్‌ 15వ సీజన్‌ ఆరంభం కానున్న నేపథ్యంలో సంజూ ఇక సిక్సర్ల వర్షం కురిపించడం ఖాయమని పలువురు ఫ్యాన్స్‌ పేర్కొంటున్నారు. స్వతహగా ఆర్మ్‌ పవర్‌ ఉన్న ఆటగాళ్లలో సంజూ శాంసన్‌ ఒకడు. బంతిని బలంగా బాదడంలో శాంసన్‌ సిద్దహస్తుడు. అందుకే భారీ షాట్లకు పెట్టింది పేరు. జట్టుగా పలు సీజన్లలో రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌గా విఫలమైనప్పటికి.. బ్యాట్స్‌మగా మాత్రం ఎప్పుడు ఫెయిల్యూర్‌ కాలేదనే చెప్పాలి.

శాంసన్‌ పవర్‌హిట్టింగ్ గురించి మాట్లాడితే ఒక విషయం తప్పకుండా ప్రస్తావించుకోవాల్సిందే. జనవరి 2020లో న్యూజిలాండ్‌ గడ్డపై పర్యటించిన టీమిండియా ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌​ఆడింది. ఈ సిరీస్‌లో మూడు, నాలుగు టి20లు సూపర్‌ ఓవర్‌కు దారి తీశాయి. ఈ రెండుసార్లు తాను సంజూనే రోహిత్‌కు జతగా పంపాలని అనుకున్నట్లు అప్పటి కెప్టెన్‌ కోహ్లి పేర్కొన్నాడు. కానీ కేఎల్‌ రాహుల్‌ దీనిని వ్యతిరేకించడంతో నాలుగో టి20లో నేను బరిలోకి దిగా. భయమనే పదమే తెలియని శాంసన్‌లో మంచి హిట్టింగ్‌ పవర్‌ దాగుంది అని కోహ్లి తెలిపాడు. అయితే సూపర్‌ ఓవర్‌లో రాహుల్‌ ఔట్‌ కావడం.. వెంటనే కోహ్లి శాంసన్‌ను బ్యాటింగ్‌కు పిలవడం కొస మెరుపు. టీమిండియా తరపున 13 టి20లు, ఒక వన్డే మ్యాచ్‌ ఆడిన సంజూ శాంసన్‌.. ఐపీఎల్‌లో 121 మ్యాచ్‌లాడి 3068 పరుగులు చేశాడు. 

చదవండి: David Warner: వార్నర్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఏమైనా చేశావా?!

Tennis Grandslams: ప్రతిష్టాత్మక టెన్నిస్‌ గ్రాండ్‌స్లామ్స్‌లో కీలక మార్పు.. ఇకపై

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement