Courtesy: IPL Twitter
ఇద్దరు ప్రజా ప్రతినిధులు.. అది కూడా పె...
కృష్ణా, సాక్షి: గన్నవరం ఎయిర్‌పోర్టు�...
ఏలూరు, సాక్షి: ఏపీ బీజేపీలో అసంతృప్తి ...
బెంగళూరు, సాక్షి: కర్ణాటక రోడ్డు మరోస�...
హైదరాబాద్, సాక్షి: సంక్షేమ పథకాల లబ్�...
ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ తన ఇంట్లోన�...
విజయవాడ, సాక్షి: సీనియర్ ఐపీఎస్ అధ�...
ఎక్కడ అరుణాచల్ ప్రదేశ్.. ఎక్కడ గుజర�...
పగలు మనుషులకేనా? ప్రకృతిలో ఉన్న ప్రత�...
సాక్షి, తాడేపల్లి: ఏపీలో విద్య పేరుతో ...
సాక్షి, ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో వ�...
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి రాజకీయం మారుత�...
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి సర్కార్�...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్ర�...
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో అధ...
Published Tue, Mar 29 2022 7:01 PM | Last Updated on Tue, Mar 29 2022 11:17 PM
Courtesy: IPL Twitter
IPL 2022: రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ లైవ్ అప్డేట్స్
ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎయిడెన్ మార్ర్కమ్ 57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వాషింగ్టన్ సుందర్ 40 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్లలో చహల్ 3, బౌల్ట్, ప్రసిధ్ కృష్ణ చెరో రెండు వికెట్లు తీశారు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్(27 బంతుల్లో 55) కు తోడు చివర్లో హెట్‌మైర్(13 బంతుల్లో 32) మెరుపులు మెరిపించగా.. బట్లర్ 35, పడిక్కల్ 41 కీలకపాత్ర పోషించారు.
211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ ఓటమి దిశగా సాగుతుంది. 18 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ఎయిడెన్ మార్ర్కమ్ 44 పరుగులు, వాషింగ్టన సుందర్ 29 పరుగులతో ఆడుతున్నారు.
అబ్దుల్ సమద్(4) రూపంలో ఎస్ఆర్హెచ్ ఐదో వికెట్ కోల్పోయింది. చహల్ బౌలింగ్‌లో రియాన్ పరాగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 13 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. మార్ర్కమ్ 24, షెపర్డ్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.
211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ ఫేలవ ఆటతీరును కనబరుస్తోంది. 5 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 13 పరుగులు చేసింది. రూ. 10.5 కోట్లు పెట్టిన నికోలస్ పూరన్ డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం 6 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 14 పరుగులు చేసింది. మార్క్రమ్ 4, అభిషేక్ 3 పరుగులతో ఆడుతున్నారు.
ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ సంజూ శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్(27 బంతుల్లో 55) కు తోడు చివర్లో హెట్‌మైర్(13 బంతుల్లో 32) మెరుపులు మెరిపించడంతో రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ 41, బట్లర్ 35 పరుగులతో జట్టు స్కోరులో కీలకపాత్ర పోషించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో నటరాజన్, ఉమ్రాన్ మాలిక్‌లు చెరో రెండు వికెట్లు తీయగా.. భువనేశ్వర్, షెపర్డ్ తలా ఒక వికెట్ తీశారు.
హాఫ్ సెంచరీ సాధించిన కాసేపటికే సంజూ శాంసన్(55) భువనేశ్వర్ బౌలింగ్‌లో అబ్దుల్ సమద్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 27 బంతుల్లో 55 పరుగులు చేసిన శాంసన్ ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం రాజస్తాన్ 17 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.
దాటిగా ఆడతున్న దేవదత్ పడిక్కల్(41) ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్ 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. సంజూ శాంసన్ 42 పరుగులతో ఆడుతున్నాడు.
ఎస్ఆర్హెచ్తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్స్ సంజూ శాంసన్, పడిక్కల్‌లు దంచికొడుతున్నారు. 14 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. శాంసన్ 37, పడిక్కల్ 36 పరుగులతో ఆడతున్నారు.
రాజస్తాన్ రాయల్స్ 11 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. సంజూ శామ్సన్ 17 బంతుల్లో 36 పరుగులు, దేవ్‌దత్ పడిక్కల్ 9 బంతుల్లో 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఎస్ఆర్హెచ్తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 8.1 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి 75 పరుగులు చేసింది. బట్లర్ 28 బంతుల్లో 35 పరుగులు చేసి వెనుదిరిగాడు. సంజూ శామ్సన్ 9 బంతుల్లో 15 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు.
యశస్వి జైశ్వాల్(20) రూపంలో రాజస్తాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. షెపర్డ్ బౌలింగ్‌లో మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి జైశ్వాల్ వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్ 6.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 58 పరుగులు చేసింది. జాస్ బట్లర్ 33 పరుగులతో దూకుడుగా ఆడుతున్నాడు.
ఎస్ఆర్హెచ్తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జాస్ బట్లర్ తొలి ఓవర్లోనే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్ ఐదో బంతిని బట్లర్ పూరన్‌కు క్యాచ్ ఇచ్చాడు. అయితే రిప్లేలో నోబాల్ అని తెలియడంతో బట్లర్ బతికిపోయాడు. ప్రస్తుతం రాజస్తాన్ 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. జైశ్వాల్ 6, బట్లర్ 5 పరుగులతో ఆడుతున్నారు
ఐపీఎల్ 2022లో మంగళవారం రాజస్తాన్ రాయల్స్, ఎస్ఆర్హెచ్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఎంచుకుంది. గత సీజన్లో ఈ రెండు జట్లు నాసిరక ప్రదర్శనతో వరుసగా ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచిన సంగతి తెలిసిందే. కాగా ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఎన్నడూ లేనంత బలంగా కనిపిస్తుండగా.. ఇందు భిన్నంగా ఎస్ఆర్హెచ్ చాలా బలహీనంగా, ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగనుంది.
గత రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్లు 15 సార్లు తలపడగా.. ఆరెంజ్ ఆర్మీ ఎనిమిది సార్లు, రాజస్తాన్ రాయల్స్ ఏడు మ్యాచ్‌ల్లో విజయాలు నమోదు చేశాయి. గత సీజన్లో ఈ రెండు జట్లు రెండుసార్లు తలపడగా.. ఎస్ఆర్హెచ్ ఒకసారి.. రాజస్తాన్ మరోసారి గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment