IPL 2021: ఐదు వికెట్ల ఘనత అందుకున్న మూడో పిన్న వయస్కుడిగా | Arshdeep Singh Youngest To Take 5 Wicket Haul IPL 2021 | Sakshi
Sakshi News home page

IPL 2021: ఐదు వికెట్ల ఘనత అందుకున్న మూడో పిన్న వయస్కుడిగా

Published Tue, Sep 21 2021 10:26 PM | Last Updated on Tue, Sep 21 2021 10:50 PM

Arshdeep Singh Youngest To Take 5 Wicket Haul IPL 2021 - Sakshi

Courtesy: IPL Twitter

దుబాయ్‌: పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ 5 వికెట్లతో మెరిశాడు. రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హర్ష్‌దీప్‌ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ నేపథ్యంలో హర్ష్‌దీప్‌ పలు రికార్డులు సాధించాడు. ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కులో 5 వికెట్ల ఘనత సాధించిన మూడో బౌలర్‌గా హర్ష్‌దీప్‌ రికార్డులకెక్కాడు. ఇంతకముందు జైదేవ్‌ ఉనాద్కట్‌ 21 ఏళ్ల 204 రోజులు (5/25; వర్సెస్‌ డెక్కన్‌ చార్జర్స్‌, 2013)తొలి స్థానంలో ఉన్నాడు. అల్జారీ జోసెఫ్‌ 22 ఏళ్ల 228 రోజులు(6/12; వర్సెస్‌ సన్‌రైజర్స్‌ హైదరబాద్‌, 2019) రెండో స్థానంలో ఉన్నాడు. ఇషాంత్‌ శర్మ 22 ఏళ్ల 237 రోజులు(5/12; కొచ్చి టస్కర్స్‌, 2011) నాలుగో స్థానంలో ఉన్నాడు. 

అంతేగాక అన్‌క్యాపడ్‌ ప్లేయర్‌గా ఐపీఎల్‌లో 5 వికెట్ల ఘనత అందుకున్న నాలుగో ఆటగాడిగా నిలిచాడు. ఇంతకముందు అంకిత్‌ రాజ్‌పుత్‌(5/14;2018), వరుణ్‌ చక్రవర్తి( 5/20; 2020), హర్షల్‌ పటేల్‌(5/27; 2021)లు ఈ ఘనత అందుకున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement