
భువనేశ్వర్ కుమార్(PC: SRH)
IPL 2022- Sunrisers Hyderabad: ‘‘తిరిగి సన్‌రైజర్స్ జట్టుతో చేరడం సంతోషంగా ఉంది. కొత్త ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందిని కలిసేందుకు ఆతురతగా ఎదురుచూస్తున్నా. ఈసారి అభిమానులకు అద్భుతమైన బహుమతి ఇవ్వాలని భావిస్తున్నాం. వారి ముఖాలపై చిరునవ్వులు పూయించాలన్నదే మా లక్ష్యం. వ్యక్తిగతంగా నాకంటూ ప్రత్యేకమైన లక్ష్యాలేమీ లేవు.
సమష్టి కృషితో ముందుకు సాగి ఈ సారి ట్రోఫీ గెలవాలని కోరుకుంటున్నాం. ఇదంతా తేలికగా సాధ్యమయ్యే విషయం కాదని తెలుసు. మేము చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఏదేమైనా అభిమానులను ఖుషీ చేయడానికి శక్తిమేర ప్రయత్నిస్తాం’’ అని టీమిండియా బౌలర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అన్నాడు. ఐపీఎల్-2022 సీజన్‌లో టైటిల్ గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.
కాగా మెగా వేలంలో నేపథ్యంలో రిటెన్షన్‌లో భాగంగా హైదరాబాద్ భువీని వదిలేసింది. అయితే, వేలంలో అతడిని 4.2 కోట్లు ఖర్చు చేసి తిరిగి సొంతం చేసుకుంది. ఈ క్రమంలో తాజా సీజన్ కోసం సన్నద్ధమవుతున్న ఆరెంజ్ ఆర్మీతో భువీ చేరాడు. కాగా మార్చి 29 న విలియమ్సన్ సారథ్యంలోని సన్‌రైజర్స్ రాజస్థాన్ రాయల్స్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. కాగా 2016లో సన్‌రైజర్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే.
చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్ చేసిన అతి పెద్ద తప్పు ఇదే! అతడిని అనవసరంగా వదిలేసి..
Comments
Please login to add a commentAdd a comment