
Courtesy: IPL Twitter
అబుదాబి: ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓటమి పాలైంది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు మాత్రమే చేయడంతో 33 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కెప్టెన్ సంజూ శాంసన్( 69, 52 బంతులు; 8 ఫోర్లు, ఒక సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మహిపాల్ లామ్రోర్ 19 పరుగులు చేశాడు. కాగా శాంసన్ తన మెరుపులతో ఒంటరి పోరాటం చేసినప్పటికి... మిగతా బ్యాట్స్‌మన్ సహకారం కరువైంది. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులకు నలుగురు బ్యాటర్స్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో అన్‌రిచ్ నోర్ట్జే 2 వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్,అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ తీశారు.
అంతకముందు ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో శ్రేయాస్ అయ్యర్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ 10 మ్యాచ్‌ల్లో 8 విజయాలు.. రెండు ఓటములతో 16 పాయింట్లు సాధించి టాప్ పొజీషన్‌కు చేరుకొని ప్లేఆఫ్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది. మరోవైపు రాజస్తాన్ ఓటమితో 9 మ్యాచ్‌ల్లో 4 విజయాలు.. 5 ఓటములతో 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment