సంగారెడ్డి, సాక్షి: పటాన్చెరులో కాం�...
అన్నమయ్య, సాక్షి: టీడీపీ జాతీయ కార్యద...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమ�...
క్యాపిటల్ ఘటనలో నిందితులకు క్షమాభి�...
ఇద్దరు ప్రజా ప్రతినిధులు.. అది కూడా పె...
కృష్ణా, సాక్షి: గన్నవరం ఎయిర్‌పోర్టు�...
ఏలూరు, సాక్షి: ఏపీ బీజేపీలో అసంతృప్తి ...
బెంగళూరు, సాక్షి: కర్ణాటక రోడ్డు మరోస�...
హైదరాబాద్, సాక్షి: సంక్షేమ పథకాల లబ్�...
ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ తన ఇంట్లోన�...
విజయవాడ, సాక్షి: సీనియర్ ఐపీఎస్ అధ�...
ఎక్కడ అరుణాచల్ ప్రదేశ్.. ఎక్కడ గుజర�...
పగలు మనుషులకేనా? ప్రకృతిలో ఉన్న ప్రత�...
సాక్షి, తాడేపల్లి: ఏపీలో విద్య పేరుతో ...
సాక్షి, ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో వ�...
Published Tue, Apr 5 2022 7:06 PM | Last Updated on Tue, Apr 5 2022 11:29 PM
IPL 2022: రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ ఆర్సీబీ లైవ్ అప్డేట్స్
రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దినేశ్ కార్తిక్ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 23 బంతుల్లోనే 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 44 పరుగులు చేశాడు. తద్వారా ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఒక దశలో 87 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. ఈ దశలో షాబాజ్ అహ్మద్(45) నిలకడైన ఆటతీరు ప్రదర్శించాడు. ఇక కార్తిక్ మరో నిదహాస్ ఇన్నింగ్స్‌ను తలపించాడు. ఆరంభం నుంచి దూకుడైన ఆటతీరుతో మెప్పించిన కార్తిక్ చివరి వరకు నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. రాజస్తాన్ బౌలర్లలో బౌల్ట్, చహల్ చెరో రెండు వికెట్లు తీయగా.. నవదీప్ సైనీ ఒక వికెట్ తీశాడు.
నిలకడగా ఆడుతున్న షాబాజ్ అహ్మద్(45) బౌల్ట్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. దీంతో ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. ఆర్సీబీ విజయానికి 13 బంతుల్లో 16 పరుగులు కావాల్సి ఉంది.
15 ఓవర్లలో ఆర్సీబీ ఐదు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. దినేశ్ కార్తిక్ 31, షాబాజ్ అహ్మద్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆర్సీబీ విజయానికి 30 బంతుల్లో 45 పరుగులు కావాలి.
ఆర్సీబీ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. చహల్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్లో మొదట కోహ్లి శాంసన్ మెరుపు ఫీల్డింగ్‌కు రనౌట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే డేవిడ్ విల్లే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం ఆర్సీబీ 4 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది.
170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన డుప్లెసిస్ చహల్ బౌలింగ్‌లో బౌల్ట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్సీబీ వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది.
170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. డుప్లెసిస్ 18, అనూజ్ రావత్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. జాస్ బట్లర్ (47 బంతుల్లో 70 నాటౌట్, 6 సిక్సర్లు), హెట్‌మైర్(31 బంతుల్లో 42 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. అంతకముందు పడిక్కల్ 38 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆర్సీబీ బౌలర్లలో డేవిడ్ విల్లీ, హసరంగా, హర్షల్ పటేల్ తలా ఒక వికెట్ తీశారు.
ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ మూడో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన కెప్టెన్ సంజూ శాంసన్ హసరంగా బౌలింగ్‌లో కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్ 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. బట్లర్ 34, హెట్‌మైర్ 9 పరుగులతో ఆడుతన్నాడు
38 పరుగులు చేసిన దేవదత్ పడిక్కల్ హర్షల్ పటేల్ బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. బట్లర్ 31 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ దూకుడుగా ఆడుతోంది. 9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది. పడిక్కల్ 36, బట్లర్ 30 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 30 పరుగులు చేసింది. పడిక్క్ 18, బట్లర్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.
యశస్వి జైశ్వాల్(4) రూపంలో రాజస్తాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. డేవిడ్ విల్లీ బౌలింగ్‌లో జైశ్వాల్ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్ 2 ఓవర్లలో వికెట్ నష్టానికి 7 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2022లో భాగంగా మంగళవారం ఆర్సీబీ, రాజస్తాన్ రాయల్స్ మధ్య ఆసక్తికర పోరు మొదలైంది. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. రాజస్తాన్ తాను ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ అద్భుత విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టాప్‌లో ఉండగా.. రెండు మ్యాచ్‌ల్లో ఒక విజయం.. ఒక ఓటమితో ఆర్సీబీ ఏడో స్థానంలో ఉంది.
ఇరు జట్లు ఇప్పటివరకు 24 మ్యాచ్‌లలో తలపడ్డాయి. ఇందులో పన్నెండింటిలో ఆర్సీబీ విజయం సాధించగా.. రాజస్తాన్ 10 మ్యాచ్‌లలో గెలుపొందింది. మరో రెండు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.
Comments
Please login to add a commentAdd a comment