PC: IPL.com
ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్ మిడిలార్డర్ బ్యాటర్ దీపక్ హుడా తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి హుడా నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో 4 బంతులు ఎదుర్కొన్న దీపక్.. కేవలం 2 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన హుడా 6.50 సగటుతో కేవలం 39 పరుగులు మాత్రమే సాధించాడు.
అతడి ఇన్నింగ్స్‌లలో 17 పరుగులు అత్యధిక స్కోర్‌గా ఉన్నాయి. గతేడాది సీజన్‌లో మాత్రం హుడా అద్భుతంగా రాణించాడు. ఈ సీజన్‌లో మాత్రం తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఇక దారుణ ప్రదర్శన కనబరుస్తున్న హుడా నెటిజన్లు మండిపడుతున్నారు. అదే విధంగా వరుసగా విఫలమవతున్నప్పటికీ హుడాకు.. లక్నో ఎందుకు ఛాన్స్‌లు ఇస్తుందో ఆర్ధం కావడం లేదని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
మరి కొంత మంది.. అతడు ఎందుకు వస్తున్నాడో తెలియదు, ప్రతీ మ్యాచ్‌లో ఒకటే ఆటతీరు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రాజస్తాన్ రాయల్స్‌పై 10 పరుగుల తేడాతో లక్నో విజయం సాధిచింది. ఈ ఏడాది సీజన్‌లో లక్నోకు ఇది నాలుగో విజయం. దీంతో పాయింట్ల పట్టికలో లక్నో 8 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంది.
చదవండి: Sanju Samson: 'గెలవాల్సిన మ్యాచ్‌ను పోగొట్టుకున్నాం.. ఇదో గుణపాఠం'
#KLRahul: 'డికాక్‌ను మిస్ అవుతున్నా.. ఏం చేయలేని పరిస్థితి!'
Comments
Please login to add a commentAdd a comment