ఐపీఎల్-2022 సీజన్ కోసం మెగా వేలం ఫిబ్రవరిలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ మెగా వేలానికి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. గాయంతో గత కొద్ది రోజులుగా బాధపడుతున్న ఆర్చర్ ఐపీఎల్-2021 సీజన్‌కు కూడా దూరమయ్యాడు. కాగా ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు జోఫ్రా ఆర్చర్ గత కొన్నేళ్లుగా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్-2022 సీజన్ మెగా వేలం ముందు ఆర్చర్‌ని రాజస్తాన్ రీటైన్ చేసుకోలేదు. దీంతో మెగా వేలంలో అతడి కోసం చాలా జట్లు పోటీపడతాయని అంతా భావించారు. అయితే తాజాగా రెండోసారి ఆర్చర్ చేతికి శస్త్రచికిత్స జరిగింది. దీంతో అతడికి 15 నెలలపాటు విశ్రాంతి అవసరం అని వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు దృవీకరించింది.
"ఆర్చర్ కుడి చేయికి రెండవ ఆపరేషన్ డిసెంబర్ 11న లండన్‌లో జరిగింది. అతడి ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. కానీ అతడు తిరిగి క్రికెట్ ఫీల్డ్‌లో అడుగుపెట్టడానికి కాస్త సమయం పడుతుంది. ఇక రానున్న సిరీస్‌లు అన్నింటికీ ఆర్చర్ అందుబాటులో ఉండడు" అని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు పేర్కొంది. కాగా గాయం కారణంగా ఆర్చర్ గత 9నెలలగా ఇంగ్లండ్ జట్టుకు దూరంగా ఉన్నాడు. దీంతో ప్రతిష్టాత్మక యాషీస్ సిరీస్‌కు కూడా దూరమయ్యాడు.
చదవండి: IND Vs SA: అతడు ప్రపంచ స్ధాయి బౌలర్.. సౌతాఫ్రికాకు ఇక చుక్కలే!
Comments
Please login to add a commentAdd a comment