ఐపీఎల్ మెగావేలం ఆటగాళ్ల తలరాతను మారుస్తుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోట్లు కొల్లగొట్టే ఆటగాళ్లు ఉంటారు.. కనీస ధరకు అమ్ముడుపోయేవారుంటారు.. అన్‌సోల్డ్ జాబితా ఆటగాళ్లు ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే.. ఒక సీజన్‌లో ప్రత్యర్థులుగా మాటల తూటాలు పేల్చుకున్న ఇద్దరు ఆటగాళ్లు వేలంలో ఒకే జట్టులోకి వస్తే ఆ మజా వేరుగా ఉంటుంది. ఈ జాబితాలో మొదట చెప్పుకోవాల్సింది.. అశ్విన్- జాస్ బట్లర్ గురించే.
అశ్విన్- బట్లర్ అనగానే మొదట గుర్తుకువచ్చేంది మన్కడింగ్ వివాదం. 2019 ఐపీఎల్ సీజన్‌లో అశ్విన్.. బట్లర్‌ను మన్కడింగ్ చేయడం వివాదాస్పదంగా మారింది. అశ్విన్ క్రీడాస్పూర్తికి విరుద్ధంగా ప్రవర్తించాడంటూ కొందరు కామెంట్ చేస్తే.. మరికొందరు అశ్విన్ పనిని సమర్థించారు. అప్పటి నుంచి బట్లర్, అశ్విన్ ఎడమొహం, పెడమొహంగానే ఉంటున్నారు. తాజాగా జరిగిన మెగావేలంలో అశ్విన్‌ను రాజస్తాన్ రాయల్స్ రూ. 5 కోట్లకు కొనుగోలు చేసింది.
కాగా గత సీజన్‌లో దుమ్మురేపిన బట్లర్‌ను రాజస్తాన్ రాయల్స్ రిటైన్ చేసుకుంది. ఇప్పుడు వీరిద్దరూ ఒకే టీమ్ లోకి రావడం ఆసక్తిగా మారింది. అయితే అశ్విన్ రాజస్తాన్ రాయల్స్‌లోకి రావడంపై జాస్ బట్లర్ స్పందించాడు. '' రాజస్తాన్ రాయల్స్‌కు వచ్చినందుకు ముందుగా అశ్‌కు కృతజ్ఞతలు. మన్కడింగ్ అంశం గుర్తు చేస్తూ.. అశ్విన్ నువ్వు బాధపడకు.. నేను ఇప్పుడు క్రీజులోనే ఉన్నా. పింక్ డ్రెస్‌లో నిన్ను చూసేందుకు ఎదురుచూస్తున్నా. నీతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నా'' అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు.
To Ash, with love 💗
— Rajasthan Royals (@rajasthanroyals) February 12, 2022
- @josbuttler#RoyalsFamily | @ashwinravi99 | #IPLAuction pic.twitter.com/t7LJRPPtwa
బరోడా విడదీసింది.. లక్నో కలిపింది..
ఇక ఇదే మెగావేలంలో ఆల్‌రౌండర్లు కృనాల్ పాండ్యా, దీపక్ హుడాలు ఒకే జట్టుకు వెళ్లారు. లక్నో సూపర్‌జెయింట్స్ కృనాల్‌కు రూ. 8.25 కోట్లు, దీపక్ హుడాకు రూ. 5.75 కోట్లు వెచ్చించింది. అయితే ఈ ఇద్దరి మధ్య జరిగిన వివాదం క్రికెట్ ప్రేమికులు మరిచిపోలేరు. దేశవాలీ టోర్నీలో బరోడా తరపున ప్రాతినిధ్యం వహించిన సమయంలో ఈ ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి ముందు బరోడా టీమ్ కెప్టెన్ గా ఉన్న పాండ్యా తనను తిట్టి, టీమ్‌లో చాన్స్ ఇవ్వనని బెదిరించాడని హుడా ఆరోపించాడు. ఈ వివాదంపై విచారణ జరిపిన బరోడా క్రికెట్ అసోసియేషన్ హుడాదే తప్పంటూ టీమ్ నుంచి అతడిని సస్పెండ్ చేసింది. దాంతో హుడా బరోడా టీమ్‌కు గుడ్‌బై చెప్పి రాజస్థాన్ టీమ్ తరఫున బరిలోకి దిగాడు. ఇప్పుడు ఐపీఎల్ లో లక్నో టీమ్ లో పాండ్యాతో కలిసి ఆడనున్నాడు. మరి ఇప్పుడు కృనాల్‌తో కలిసి దీపక్ హుడా ఒకే టీమ్ తరపున డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోనుండడం ఆసక్తి కలిగిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment