ఐపీఎల్ వల్ల ఫిట్‌నెస్ పెరిగింది
జైపూర్: ఐపీఎల్ వల్లే భారత క్రికెట్‌లో ఫిట్‌నెస్ ప్రమాణాలు పెరిగాయని జట్టు మాజీ ఫిజియో జాన్ గ్లోస్టర్ అభిప్రాయపడ్డాడు. 2008లో భారత జట్టు ఫిజియో బాధ్యతల నుంచి తప్పుకున్న గ్లోస్టర్... ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టుతో పని చేస్తున్నారు.
‘లీగ్‌లో ఒక్క రాజస్థాన్ జట్టు మాత్రమే రెగ్యులర్ ఫిజియోను నియమించుకుంది. ఇది ప్లేయర్లకు బాగా ఉపకరించే విషయం. నేను కూడా ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉండాలనుకుంటాను. ఆటగాళ్ల కెరీర్‌ను పొడిగించుకునేందుకు నా వంతు సహాయం చేస్తాను’ అని గ్లోస్టర్ పేర్కొన్నాడు. గాయాల నుంచి కోలుకునేందుకు, తిరిగి బరిలో దిగేందుకు ఎప్పటికప్పుడు ఆటగాళ్లతో చర్చిస్తానన్నాడు.