PC: IPL. Com
ఐపీఎల్-2022లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ సెంచరీల మోత మోగిస్తున్నాడు. శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో బట్లర్ మరో అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో బట్లర్ 65 బంతుల్లో 116 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 9 సిక్స్‌లు ఉన్నాయి. ఈ ఏడాది సీజన్‌లో బట్లర్ మూడో సెంచరీ నమోదు చేశాడు.
ఇక ఈ సీజన్‌లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన బట్లర్ 491 పరగులు సాధించి.. ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు. కాగా వరుస సెంచరీలతో అదరగొడుతున్న బట్లర్‌పై నెటిజన్లతో పాటు మాజీ క్రికెటర్‌లు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "ప్రపంచంలోనే బట్లర్ అత్యత్తుమ టీ20 ఆటగాడు" అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ట్విట్ చేశాడు.
ఇక టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్పాన్ పఠాన్ స్పందిస్తూ.. "బట్లర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లీ రికార్డుకు బట్లర్ చేరువలో ఉన్నాడు అని పేర్కొన్నాడు. కాగా ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ ఢిల్లీపై 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా జోస్ బట్లర్ (65 బంతుల్లో 116; 9 ఫోర్లు, 9 సిక్స్‌లు) నిలిచాడు.
చదవండి: IPL 2022: ధోని ఫినిషింగ్ టచ్‌కు జడేజా ఫిదా.. ఏం చేశాడంటే.. ?
Buttler’s breathtaking form continues with another sensational ton! 👏#PPpedia pic.twitter.com/GC40YMyXIU
— parthiv patel (@parthiv9) April 22, 2022
No one is anywhere close to batting like @josbuttler in T20 cricket at the moment .. Incredible .. #IPL2022
— Michael Vaughan (@MichaelVaughan) April 22, 2022
That's that from Match 34. @rajasthanroyals take this home by a 15-run win.
— IndianPremierLeague (@IPL) April 22, 2022
Scorecard - https://t.co/IOIoa87Os8 #DCvRR #TATAIPL pic.twitter.com/D2JXBfMTSp
Comments
Please login to add a commentAdd a comment