సూర్యకుమార్‌ను ఎందుకు పక్కనబెట్టారు.. ?! | IPL 2022: Reason Why Surya Kumar Yadav Not Played Vs Rajastan Royals | Sakshi
Sakshi News home page

IPL 2022: సూర్యకుమార్‌ను ఎందుకు పక్కనబెట్టారు.. ?!

Published Sat, Apr 2 2022 7:32 PM | Last Updated on Sat, Apr 2 2022 7:40 PM

IPL 2022: Reason Why Surya Kumar Yadav Not Played Vs Rajastan Royals - Sakshi

Courtesy: IPL Twitter

ఐపీఎల్‌ 2022లో భాగంగా ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌కు అందుబాటులో లేడు. గాయం కారణంగా బెంగళూరులోని ఎన్‌సీఏ అకాడమీలో రీహాబిటేషన్‌ పూర్తి చేసుకున్న సూర్య ఇటీవలే జట్టుతో కలిశాడు. బయోబబూల్‌ కూడా పూర్తి చేసుకున్నప్పటికి శనివారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్‌ ఆడకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఇక రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ పరాజయం పాలైంది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెటల​ నష్టానికి 170 పరుగులు చేసి 23 పరుగుల తేడాతో రాజస్తాన్‌కు మ్యాచ్‌ను అప్పగించింది. 

అయితే సూర్యకుమార్‌ను ఆడించకపోవడంపై అభిమానులు ముంబై ఇండియన్స్‌పై విమర్శలు కురిపించారు. సూర్యను ఆడించి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని.. ఫిట్‌గా లేకపోతే ఓకే కానీ.. కావాలని పక్కనబెడితే మాత్రం ముంబై ఇండియన్స్‌ తప్పు చేసినట్లేనని అభిప్రాయపడ్డారు. కాగా మ్యాచ్‌కు ముందు సూర్యకుమార్‌ యాదవ్‌ జట్టులో కచ్చితంగా ఉంటాడని అంతా అనుకున్నారు కానీ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఆడలేదు. దీనిపై ముంబై ఇండియన్స్‌ వివరణ ఇచ్చింది.'' వాస్తవానికి సూర్యకుమార్‌ రాజస్తాన్‌తో మ్యాచ్‌ ఆడాల్సింది. కానీ అతను ఫిట్‌గా లేకపోవడంతో వార్మప్‌ సెషన్‌కు దూరంగా ఉన్నాడు. దీంతో అతను ఫిట్‌గా లేడనే కారణంతో రాజస్తాన్‌తో మ్యాచ్‌కు దూరంగా ఉంచామని'' బౌలింగ్‌ కోచ్‌ జహీర్‌ ఖాన్‌ వెల్లడించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement