
Courtesy: IPL Twitter
ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ గాయం కారణంగా ఐపీఎల్-2022 నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మిగిలిన రెండు మ్యాచ్‌లకు అతడి స్థానంలో ఉత్తరాఖండ్ మీడియం-పేసర్ ఆకాష్ మధ్వల్‌ను ముంబై భర్తీ చేసింది. ఉత్తరాఖండ్‌కు చెందిన ఈ యువ ఆటగాడు 2019లో దేశీవాళీ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఆకాష్ మధ్వల్‌కు బ్యాట్ అండ్ బాల్‌తో రాణించే సత్తా ఉంది.
ఇప్పటి వరకు 15 టీ20 మ్యాచ్‌లు ఆడిన మధ్వల్ 15 వికెట్లు పడగొట్టాడు. అతడిని రూ.20 లక్షలకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. ఇక ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబై ఇండియన్స్ అఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. ముంబై తమ తదుపరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మే17 న తలపడనుంది.