Courtesy: IPL Twitter
సూర్యకుమార్ యాదవ్.. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ బ్యాటింగ్‌కు వెన్నుముకగా మారాడు. సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నప్పటికి.. ఆ తర్వాత జట్టులోకి వచ్చిన సూర్య తన పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నాడు. అయితే ముంబై ఇండియన్స్ మాత్రం సీజన్‌లో ఇంతవరకు బోణీ కొట్టలేదు. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ పరాజయాలు ఎదురుకావడంతో ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. ముంబై ఇండియన్స్ తన తర్వాతి మ్యాచ్‌ను సీఎస్‌కేతో ఆడనుంది.
ఇక సూర్యకుమార్‌ను ముంబై ఇండియన్స్ సహా క్రికెట్ ఫ్యాన్స్.. 'ఎస్కేవై' అని ముద్దుగా పిలుచుకుంటారు. అయితే సూర్యకు ఎస్కేవై అని పేరు పెట్టింది ఎవరో తెలుసా.. టీమిండియా మాజీ క్రికెటర్, కేకేఆర్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్.ఈ విషయాన్ని సూర్యకుమార్ స్వయంగా వెల్లడించాడు. బ్రేక్‌ఫాస్ట్ విత్ చాంపియన్స్ యూట్యూబ్ షోలో సూర్యకుమార్ పాల్గోన్నాడు.
''2014లో కేకేఆర్‌తో మ్యాచ్ సందర్భంగా కోల్‌కతా వెళ్లాను. ఆరోజు మ్యాచ్‌లో గౌతీ భయ్యా ..''ఎస్కేవై'' అని రెండు మూడుసార్లు గట్టిగా పిలిచాడు. ఎవర్ని పిలుస్తున్నాడో అని నేను పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత గంభీర్ దగ్గరికి వచ్చి.. నేను పిలిచేది నిన్నే.. నీ పేరు మొత్తంలో ముందు అక్షరాలు గుర్తుతెచ్చుకో. సూర్యకుమార్ యాదవ్‌లో మూడు అక్షరాలు ఎస్కేవై.. అవును కదా నా పేరే అని నవ్వుకున్నాడు. నిన్ను అంత పెద్ద పేరుతో పిలవాలంటే కష్టంగా ఉంది.. అందుకే షార్ట్‌గా ఎస్కేవై అని పిలిచాను'' అని గౌతీ భయ్యా చెప్పాడు. అలా నా పేరు షార్ట్‌ఫామ్‌లో ''ఎస్కేవై''గా మారిపోయింది.''అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక 2012 నుంచి ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్న సూర్యకుమార్ ఇంతవరకు ఐపీఎల్‌లో 119 మ్యాచ్‌లాడి 2541 పరుగులు సాధించాడు. అతని ఖాతాలో 15 హాఫ్ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోరు 82గా ఉంది.
చదవండి: ‘అమ్మ చెప్పింది.. శ్రేయస్ అయ్యర్ నన్ను పెళ్లి చేసుకుంటావా?’
Comments
Please login to add a commentAdd a comment