IPL 2022: Mumbai Indians Player Suryakumar Yadav Ruled Out Due to Left Forearm Muscle Injury - Sakshi
Sakshi News home page

IPL 2022: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌.. స్టార్‌ ఆటగాడు దూరం..!

Published Mon, May 9 2022 7:33 PM | Last Updated on Tue, May 10 2022 10:28 AM

Suryakumar Yadav ruled out with forearm muscle injury  - Sakshi

Courtesy: IPL Twitter

Suryakumar Yadav ruled out IPL 2022: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ గాయం కారణంగా ఐపీఎల్‌-2022 సీజన్‌ నుంచి తప్పుకున్నాడు. మే 6న గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యాదవ్‌ ఎడమ చేయి కండరానికి గాయమైంది. దీంతో ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు సూర్యకుమార్‌ దూరమయ్యాడు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీ అధికారికంగా వెల్లడించింది.

"సూర్యకుమార్ యాదవ్ ఎడమ చేయి కండరానికి గాయమైంది. దీంతో ఈ సీజన్‌లో మిగితా మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. బీసీసీఐ వైద్య బృందం అతడిని కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని" సూచించారు అని ముంబై ఫ్రాంచైజీ పేర్కొంది. ఇక ఈ ఏడాది సీజన్‌లో ఆరంభ మ్యాచ్‌లకు గాయం కారణంగా సూర్యకుమార్‌ దూరమయ్యాడు. ఆ తరువాత ఏంట్రీ ఇచ్చిన సూర్యకుమార్‌ ఆద్భుతంగా రాణించాడు. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్‌ 303 పరుగులు సాధించాడు.

చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ కేకేఆర్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement