Suryakumar Yadav Needs 35 More Runs To Complete 2000 Runs For MI In IPL - Sakshi
Sakshi News home page

IPL 2022-Suryakumar Yadav: అరుదైన రికార్డుకు చేరువ‌లో సూర్యకుమార్ యాద‌వ్‌..

Published Sun, Apr 24 2022 6:45 PM | Last Updated on Sun, Apr 24 2022 7:11 PM

PC: IPL.com - Sakshi

ఐపీఎల్‌-2022లో భాగంగా ఆదివారం వాంఖ‌డే వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో ముంబై ఇండియ‌న్స్ తల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఆట‌గాడు సూర్యకుమార్ యాద‌వ్ అరుదైన రికార్డుకు చేరువ‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో సూర్య  మ‌రో 35 ప‌రుగులు సాధిస్తే.. ఐపీఎల్‌లో 2000 ప‌రుగులు చేసిన ఐదో ముంబై ఆట‌గాడిగా నిలుస్తాడు. అంత‌కు ముందు ఈ ఘ‌న‌త సాధించిన జాబితాలో రోహిత్ శ‌ర్మ‌, కిరాన్ పొలార్డ్‌, అంబ‌టి రాయుడు, స‌చిన్ టెండూల్కర్ ఉన్నారు.

ఇక ప్ర‌స్తుత సీజ‌న్‌లో ముంబై ఇండియన్స్ ఓటముల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన 7 మ్యాచ్‌ల్లోనూ ఓట‌మి చెంది పాయింట్ల పట్టిక‌లో అఖ‌రి స్థానంలో నిలిచింది. కాగా త‌మ హోం గ్రౌండ్ అయిన వాంఖ‌డేలో ల‌క్నోపై విజ‌యం సాధించి బోణి కొట్టాల‌ని ముంబై భావిస్తోంది.

చ‌ద‌వండి: IPL 2022: 'అతడు యార్క‌ర్ల కింగ్‌.. ఆస్ట్రేలియా విమానం ఎక్క‌నున్నాడు'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement