
Courtesy: IPL Twitter
KL Rahul Stunning Catch.. ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. ఇషాన్ పోరెల్ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్ తొలి బంతిని శాంసన్ ఫ్లిక్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్ ఎడ్జ్‌ను తాకి కీపర్‌కు దూరంగా టాప్‌ఎడ్జ్‌లో వెళ్లింది. అయితే రాహుల్ మాత్రం ఏ పొరపాటు చేయకుండా సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో సంజూ 4 పరుగులకే పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ప్రస్తుతం 7.1 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 68/2. క్రీజ్‌లో యశస్వీ జైస్వాల్ (17 బంతుల్లో 26; 3 ఫోర్లు, సిక్స్), లియామ్ లివింగ్‌స్టోన్ ఉన్నారు.