
కోహ్లి, రహానే
బెంగళూరు : ఐపీఎల్-11 సీజన్‌లో భాగంగా ఇక్కడ రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఫీల్డింగ్ వైపే మొగ్గు చూపాడు. చేజింగ్‌లో భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ముందుగా బౌలింగ్ ఎంచుకున్నట్లు కోహ్లీ తెలిపాడు. ఇక ఆర్సీబీ జట్టులోకి సర్ఫరాజ్ ఖాన్ స్థానంలో పవన్ నేగి రాగా.. రాజస్థాన్ జట్టులో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ఈ సీజన్‌లో ఇరు జట్లు ఒక్కో మ్యాచ్ గెలిచాయి. ఇక ఆర్సీబీ ఆటగాడు, హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు మళ్లీ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఎలాగైన ఈ మ్యాచ్‌ను గెలిచి తమ విజయయాత్రను కొనసాగించాలని కోహ్లిసేన భావిస్తుండగా.. సొంత గడ్డపై ఆర్సీబీని ఒడగొట్టాలని రాజస్తాన్ ఉవ్విళ్లురుతోంది. ప్రతి సీజన్‌లో పర్యావరణంపై అవగాహన కల్పించడం కోసం ఆర్సీబీ గ్రీన్ జెర్సీలో ఓ మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో నేటి మ్యాచ్‌లో ఆకుపచ్చని జెర్సీలతో బరిలోకి దిగింది.
తుదిజట్లు
ఆర్సీబీ : క్వింటన్ డికాక్, బ్రెండన్ మెక్‌కల్లమ్, విరాట్ కోహ్లి (కెప్టెన్), ఏబీ డివిలియర్స్, పవన్‌నేగి, మన్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుంధర్, క్రిస్ వోక్స్, కుల్వంత్, ఉమేశ్ యాదవ్, చహల్
రాజస్తాన్ రాయల్స్: అజింక్యా రహానే(కెప్టెన్), శ్రేయాస్ గోపాల్, రాహుల్ త్రిపాఠి, జయదేవ్ ఉనాద్కట్, బెన్ స్టోక్స్, సంజూ శాంసన్, బెన్ లాప్లిన్, జోస్ బట్లర్, ధావల్ కులకర్ణి, క్రిష్ణప్పన్ గౌతమ్, డి'ఆర్సీ షార్ట్
Comments
Please login to add a commentAdd a comment