
Courtesy: IPL twitter
Riyan parag Super Throw Virat Kohli Runout.. ఆర్‌సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ సూపర్ త్రోతో మెరిశాడు. దీంతో పరాగ్ దెబ్బకు ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి అనూహ్యంగా రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. క్రిస్ మోరిస్ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో ఐదో బంతిని కోహ్లి స్వేర్ లెగ్ దిశగా ఆడాడు. అయితే అక్కడే ఉన్న రియాన్ పరాగ్ అద్భుతంగా డైవ్ చేసి బంతిని ఆపాడు. అప్పటికే కోహ్లి కదలాల వద్దా అన్న సంశయంలోనే క్రీజు దాటి ముందుకు వచ్చేశాడు.
చదవండి: IPL 2021: అర్జున్ టెండూల్కర్‌కు గాయం.. అతని స్థానంలో
అప్పటికే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న భరత్ సగం క్రీజు దాటేయడంతో కోహ్లి చేసేదేంలేక పరిగెత్తాడు. అప్పటికే పరాగ్ బంతిని నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు విసరడం.. నేరుగా వికెట్లను తగలడంతో కోహ్లి క్లియర్ రనౌట్ అయ్యాడు. కోహ్లికి సంబంధించిన రనౌట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆర్‌సీబీ 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ 17, భరత్ 24 పరుగులు చేసింది.
చదవండి: Virender Sehwag: మిస్టర్ మోర్గాన్.. లార్డ్స్ బయట ధర్నా చేయాల్సింది
— Cricsphere (@Cricsphere) September 29, 2021