జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-12వ సీజన్‌లో భాగంగా కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ అజింక్యా రహానే ముందుగా కింగ్స్ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. రెండేళ్ల నిషేధం తర్వాత గతేడాది పునరాగమనం చేసిన రాజస్తాన్ భారీ అంచనాల నడుమ బరిలోకి దిగింది. కాగా, గత ఐపీఎల్‌లో లీగ్ దశలో నాల్గో స్థానంలో నిలిచి నాకౌట్‌కు చేరుకున్న రాజస్తాన్.. కోల్‌కతాతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లోఓటమి పాలైంది. దాంతో రెండోసారి టైటిల్ సాధించాలనుకున్న రాజస్తాన్ ఆశలు నెరవేరలేదు.
ఇక కింగ్స్ పంజాబ్ కథ వేరు. 2018 ఐపీఎల్‌లో భాగంగా ఆరంభంలో అదరగొట్టిన కింగ్స్ పంజాబ్.. ఆపై వరుస వైఫల్యాలు చవిచూసింది. వరుసగా ఐదు మ్యాచ్‌లో ఓటమి చెందడంతో ఆ జట్టు ఏడో స్థానానికే పరిమితం కావాల్సి వచ‍్చింది. కాగా, ఈసారి 13 మంది కొత్త ఆటగాళ్లతో ఐపీఎల్‌కు సిద్ధమైన కింగ్స్ పంజాబ్ గతేడాది చేసిన పొరపాట్లకు తావివ్వకుండా చూసుకోవాలని భావిస్తోంది. మొత్తంగా 23 ఆటగాళ్లతో కూడిన కింగ్స్ పంజాబ్‌కు బ్యాటింగ్ ప్రధాన బలం. క్రిస్ గేల్-కేఎల్ రాహుల్ వంటి స్టార్ ఓపెనర్లతో పాటు కరుణ్ నాయర్, మయాంక్ అగర్వాల్, సర్పరాజ్ ఖాన్ వంటి హిట‍్టర్లు వారి సొంతం. మరొకవైపు ఈ ఏడాది స్టీవ్ స్మిత్ రాజస్తాన్ రాయల్స్‌తో కలవడంతో ఆ జట్టులో సమతుల్యత పెరిగింది.
తుది జట్లు
రాజస్తాన్ రాయల్స్: అజింక్యా రహానే(కెప్టెన్), జోస్ బట్లర్, స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్, బెన్ స్టోక్స్, రాహుల్ త్రిపాఠి, కృష్ణప్ప గౌతమ్, శ్రేయస్ గోపాల్, జోఫ్రా ఆర్చర్, ఉనాద్కత్, ధావల్ కులకర్ణి
కింగ్స్ పంజాబ్: రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), క్రిస్ గేల్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, సర్ఫరాజ్ ఖాన్, నికోలస్ పురాన్, మన్‌దీప్ సింగ్, కుర్రాన్, మహ్మద్ షమీ, ముజిబ్ ఉర్ రహ్మన్, అంకిత్ రాజ్‌పుత్
Comments
Please login to add a commentAdd a comment