హ్యారీ బ్రూక్ (Photo Credit: SRH Twitter)
IPL 2023- Orange Cap Holder Prediction: ‘‘నేనైతే ఆరెంజ్ క్యాప్ అతడికే దక్కుతుంది అనుకుంటున్నా. టోర్నీ ఆసాంతం అత్యుత్తమ ప్రదర్శనతో బెస్ట్ ప్లేయర్ అవుతాడని భావిస్తున్నా. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుస్తాడనే నమ్మకం ఉంది’’ అంటూ ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టీవ్ హార్మిసన్ అన్నాడు. ఇంగ్లండ్ యువ కెరటం, సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు.
24 ఏళ్ల హ్యారీ బ్రూక్.. ఇంగ్లండ్ తరఫున ఇప్పటికే ‘ఆల్ ఫార్మాట్’ ఆటగాడిగా గుర్తింపు సంపాదించాడు. ఇక పొట్టి ఫార్మాట్లో ఇప్పటి వరకు ఆడిన 99 మ్యాచ్‌లలో 148.32 స్ట్రైక్‌రేటుతో 2432 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో గతేడాది డిసెంబరులో జరిగిన మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరబాద్ ఫ్రాంఛైజీ కళ్లు చెదిరే మొత్తానికి బ్రూక్‌ను సొంతం చేసుకుంది.
అతడి కోసం ఇతర ఫ్రాంఛైజీలతో పోటీపడి ఏకంగా 13.25 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దీంతో హ్యారీ బ్రూక్‌పై అంచనాలు కూడా అమాంతం పెరిగిపోయాయి. అతడు జట్టులో ఉండటం వల్ల మిడిలార్డర్‌లో సన్‌రైజర్స్‌కు మంచి ‘బూస్టింగ్’ లభిస్తుంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ వేలంలో అవలంబించిన వ్యూహాల గురించి మాట్లాడుతూ.. ‘‘వేలంలో సన్‌రైజర్స్ ఆచితూచి వ్యవహరించింది. బ్రూక్‌ను కొనుగోలు చేసి మంచి పనిచేసింది.
వాళ్లకు అతడు కీలక బ్యాటర్ కానున్నాడు’’ అని పేర్కొన్నాడు. ఈ క్రమంలో బ్రూక్‌పై ప్రశంసలు కురిపించిన స్టీవ్ హార్మిసన్.. ఐపీఎల్-2023 సీజన్‌లో అతడు అత్యధిక పరుగుల వీరుడిగా నిలుస్తాడని జోస్యం చెప్పాడు. కాగా ఏప్రిల్ 2న హైదరాబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌తో సన్‌రైజర్స్ ఐపీఎల్-2023లో మొదటి మ్యాచ్ ఆడనుంది.
సన్‌రైజర్స్ జట్టు ఇదే
స్వదేశీ ఆటగాళ్లు
►రాహుల్ త్రిపాఠి
►అభిషేక్ శర్మ
►వాషింగ్టన్ సుందర్
►భువనేశ్వర్ కుమార్
►కార్తీక్ త్యాగి
►నటరాజన్
►అబ్దుల్ సమద్
►ఉమ్రాన్ మలిక్
►మయాంక్ అగర్వాల్
►అన్‌మోల్ ప్రీత్ సింగ్
►మయాంక్ మర్కండే
►వివ్రాంత్ శర్మ
►మయాంక్ దాగర్
►సమర్థ్ వ్యాస్
►సన్వీర్
►ఉపేంద్ర సింగ్
►నితీశ్ కుమార్ రెడ్డి.
విదేశీ ఆటగాళ్లు
►ఎయిడెన్ మార్క్‌రమ్ (కెప్టెన్),
►గ్లెన్ ఫిలిప్స్
►మార్కో జాన్సెన్
►ఫజల్ హఖ్ ఫారుఖీ
►హ్యారీ బ్రూక్
►హెన్రిచ్ క్లాసెన్
►ఆదిల్ రషీద్
►అకీల్ హొసీన్.
చదవండి: ICC ODI WC 2023: 'ఆడేది మెగాటోర్నీ అలా కుదరదు'.. ప్లాన్ బెడిసికొట్టిందా?
Virat Kohli: 'ముందుచూపు తక్కువ.. కొన్న కార్లను అమ్మేసుకున్నా’
𝗛𝗔MME𝗥𝗥𝗬NG 🔨#OrangeFireIdhi #OrangeArmy #IPL2023 pic.twitter.com/MKJGNYE13E
— SunRisers Hyderabad (@SunRisers) March 25, 2023
Comments
Please login to add a commentAdd a comment