
Courtesy: IPL Twitter
టి20 క్రికెట్ అంటేనే వేగానికి పెట్టింది పేరు. మూడు గంటల్లో ముగిసే మ్యాచ్‌లో బ్యాట్స్‌మన్ ఫోర్లు, సిక్సర్లు బాదడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. పవర్ హిట్టింగ్ చేసే నేపథ్యంలో బౌలర్లకు, ఫీల్డర్లకు దెబ్బలు తగిలే అవకాశాలుంటాయి. తాజాగా ఐపీఎల్ 2022 సందర్భంగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. రాజస్తాన్ రాయల్స్‌కు చెందిన రియాన్ పరాగ్.. జిమ్మీ నీషమ్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు.
అయితే అనూహ్యంగా బంతి నీషమ్ వైపు దూసుకొచ్చింది. సరైన సమయంలో నీషమ్ కిందకు వంగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే రాజస్తాన్ రాయల్స్‌కు పెద్ద దెబ్బ పడేదే. అయితే ఇదంతా మ్యాచ్‌లో కాకుండా ప్రాక్టీస్ సమయంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోనూ నీషమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ''రియాన్ పరాగ్‌కు బౌలింగ్ చేస్తే నేను క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినట్లే.. ఎందుకంటే కొద్దిలో నాకు ప్రమాదం తప్పింది. అతను కసితో ఉన్నాడు.. తలలు పగలడం ఖాయం'' అంటూ పేర్కొన్నాడు. ఇక రాజస్తాన్ రాయల్స్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడి రెండు గెలిచి.. ఒకదాంట్లో ఓడింది. ఆదివారం(ఏప్రిల్ 10) లక్నో సూపర్ జెయింట్స్‌తో రాజస్తాన్ తలపడనుంది.
చదవండి: IPL 2022: బౌండరీ కొట్టి నిమిషం కాలేదు.. ఇంత మతిమరుపా!
IPL 2022: తెవాటియా సిక్సర్ కొట్టగానే ఎగిరి గంతేసిన అమ్మాయి.. ఇంతకీ ఎవరామె?!
— Prabhat Sharma (@PrabS619) April 9, 2022