Courtesy: IPL Twitter
ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ముంబై ఇండియన్స్ తరపున 61 పరుగుల కీలక ఇన్నింగ్స్‌తో మెరిసిన తిలక్ వర్మ ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. రాజస్తాన్ బౌలర్లు ఇబ్బంది పెట్టిన వేళ తిలక్ వర్మ మాత్రం యథేచ్చగా బ్యాట్ ఝులిపించాడు. అతని ఇన్నింగ్స్‌పై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురిపిస్తున్న వేళ రాజస్తాన్ బౌలర్.. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నోరు పారేసుకున్నాడు.
విషయంలోకి వెళితే.. అశ్విన్ తొలిసారి బౌలింగ్‌కు వచ్చినప్పుడు అతని బౌలింగ్‌లో ఒక సిక్సర్ బాదాడు. ఆ తర్వాత స్వీప్ షాట్ ఆడి అశ్విన్‌కు తలనొప్పిగా మారాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే రివర్స్ స్వీప్ దశలో కళ్లు చెదిరే సిక్స్ కొట్టాడు. దీంతో తిలక్ వర్మపై కోపంతో రగిలిపోయిన అశ్విన్ వికెట్ దక్కించుకోవాలని అనుకున్నాడు. 14వ ఓవర్‌లో తొలి బంతికి సిక్సర్ బాదిన తిలక్ వర్మను రెండో బంతికే అశ్విన్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో తిలక్ వర్మను కోపంగా చూస్తూ అశ్విన్ నోరు పారేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ జోస్ బట్లర్ అద్బుత సెంచరీతో మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 193 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెటల నష్టానికి 170 పరుగులు చేసి 23 పరుగుల తేడాతో రాజస్తాన్‌కు మ్యాచ్‌ను అప్పగించింది.
చదవండి: Kieron Pollard: జట్టుకు భారంగా మారుతున్నాడా.. సమయం ఆసన్నమైందా!
Tilak Varma: మ్యాచ్ ఓడినా మనసులు గెలుచుకున్న తెలుగు కుర్రాడు
అశ్విన్- తిలక్ వర్మ వీడియో కోసం క్లిక్ చేయండి
6.6
— Live Cricket Master Updater (@MohsinM55415496) April 2, 2022
Ashwin to Tilak Varma, SIX 6⃣ 🎈 runs.#CricketMasterUpdater pic.twitter.com/Nvx2CLnuYi
Comments
Please login to add a commentAdd a comment