Courtesy: IPL Twitter
ముంబై ఇండియన్స్, కేకేఆర్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. క్యాచ్‌ను సులువుగా అందుకోవాల్సిన కీపర్‌ను కాదని తానే అందుకోవాలన్న తాపత్రయం రహానేను కంగుతినిపించింది. విషయంలోకి వెళితే.. ముంబై ఇన్నింగ్స్ 13వ ఓవర్ ఉమేశ్ యాదవ్ వేశాడు. క్రీజులో తిలక్‌వర్మ ఉన్నాడు. తొలి రెండు బంతులు సింగిల్స్ వచ్చాయి. మూడో బంతిని తిలక్ వర్మ గాల్లోకి లేపాడు. అయితే కీపర్ సామ్ బిల్లింగ్స్‌కు క్యాచ్ తీసుకునే అవకాశం వచ్చింది.
అయితే బ్యాక్‌వర్డ్ పాయింట్ నుంచి రహానే వేగంగా పరిగెత్తుకొచ్చి మధ్యలో దూరాడు. బిల్లింగ్స్ రాకముందే రహానే అక్కడికి చేరుకొని క్యాచ్ అందుకునే ప్రయత్నంలో జారవిడిచాడు. దీంతో తిలక్ వర్మ బతికిపోయాడు. మిస్ కమ్యునికేషన్ వల్ల అటు రహానే, బిల్లింగ్స్ ఇద్దరు క్యాచ్‌ను వదిలేశారు. ఇది చూసిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్.. ''రహానే నువ్వెందుకు మధ్యలో వచ్చావయ్యా'' అన్నట్లుగా కోపంతో ఒక లుక్ ఇచ్చాడు. సింపుల్ క్యాచ్‌ను నేలపాలు చేసిన రహానేను చూసి నవ్వాలా ఏడ్వాలా అన్నది కేకేఆర్ ఆటగాళ్లకు అర్థంకాలేదు. అలా 2 పరుగుల వద్ద ఔట్ నుంచి తప్పించుకున్న తిలక్ వర్మ ఆ తర్వాత మరో 36 పరుగులు సాధించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: Dewlad Brevis: అనుభవలేమి 'జూనియర్ ఏబీ' కొంపముంచింది
— Sam (@sam1998011) April 6, 2022
Comments
Please login to add a commentAdd a comment