
PC: IPL Twitter
ఐపీఎల్ 2022లో భాగంగా ముంబై ఇండియన్స్, కేకేఆర్ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బంతి కనిపించకపోవడంతో ఇషాన్ కిషన్ కాసేపు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. విషయంలోకి వెళితే.. కేకేఆర్ ఇన్నింగ్స్ 9వ ఓవర్ కుమార్ కార్తికేయ వేశాడు. ఓవర్ నాలుగో బంతిని నితీష్ రాణా రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బాటమ్ ఎడ్జ్ అవడంతో అక్కడే రోల్ అయింది. బంతి ఎక్కడ కనిపించకపోవడంతో కీపర్ ఇషాన్ అలాగే నిల్చుండిపోయాడు.
అయితే బంతి అతని కింద నుంచి వెళ్లడం గమనించలేదు. ''అరె ఇషాన్.. బంతి నీ పక్కనే ఉంది'' అంటూ కుమార్ కార్తికేయ పేర్కొన్నాడు. అప్పటికే నితీష్ రాణా సింగిల్ పూర్తి చేశాడు. బంతిని అందుకున్న బుమ్రా ఇషాన్ చూస్తూ ఏమైంది అంటూ నవ్వాడు. ఇషాన్ కూడా ఏంటో ఏం అర్థం కాలేదు అన్నట్లుగా ఒక లుక్ ఇచ్చాడు. దీంతో మైదానంలో ఆటగాళ్ల మధ్య నవ్వులు విరపూశాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (24 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), నితీశ్ రాణా (26 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) టాప్ స్కోరర్లుగా నిలిచింది. ఐపీఎల్‌లో బుమ్రా తన అత్యుత్తమ ప్రదర్శన (5/10) నమోదు చేశాడు. అనంతరం ముంబై 17.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. ఇషాన్ కిషన్ (43 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించాడు.
చదవండి: Venkatesh Iyer: 'అప్పటివరకు బాగానే.. ఇషాన్ చెప్పగానే ఔటయ్యాడు'
Innocent Ishan Kishan 😹 pic.twitter.com/2Hrpjt2IQG
— Boies Pilled Bell⁴⁵👊 (@Im_Perfect45) May 9, 2022