KKR
-
ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు హ్యాట్రిక్ ఓటమి
-
IPL 2025: కేకేఆర్‌తో మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్‌కు భారీ షాక్..?
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా కేకేఆర్‌తో ఇవాళ (ఏప్రిల్ 2) జరుగబోయే మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్ తగిలినట్లు తెలుస్తుంది. ఆ జట్టు నయా సిక్స్ హిట్టింగ్ మెషీన్ అనికేత్ వర్మ నిన్న ప్రాక్టీస్ సందర్భంగా గాయపడ్డాడని సమాచారం. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా.. ఓ బౌలర్ వేసిన బంతి అనికేత్ కాలి బొటన వేలుకు బలంగా తాకిందని తెలుస్తుంది. నొప్పితో విలవిలలాడిపోయిన అనికేత్ పిచ్‌పై కుప్పకూలాడని ప్రచారం జరుగుతుంది. ప్రాక్టీస్ సాగుతుండగా అనికేత్ మైదానాన్ని వీడుతున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. అనికేత్ గాయం విషయమై సన్‌రైజర్స్ యాజమాన్యం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.కాగా, ప్రస్తుత సీజన్‌తోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన 23 ఏళ్ల అనికేత్.. తొలి మ్యాచ్ నుంచే మెప్పిస్తూ వచ్చాడు. ఐపీఎల్ కెరీర్లో ఎదుర్కొన్న తొలి బంతినే (రాజస్థాన్ రాయల్స్‌పై) సిక్సర్‌గా మలిచిన అనికేత్.. అతి తక్కువ వ్యవధిలోనే భారీ హిట్టర్‌గా పేరు గడించాడు. తన రెండో మ్యాచ్‌లో లక్నోపై 5 భారీ సిక్సర్లు బాదిన అనికేత్.. ఆతర్వాత ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మరింత చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో సహచర బ్యాటర్లంతా విఫలం కాగా.. అనికేత్ ఒంటరి పోరాటం చేసి మెరుపు అర్ద సెంచరీ (41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 74 పరుగులు) చేశాడు. 3 మ్యాచ్‌ల్లోనే 12 భారీ సిక్సర్లు బాదిన అనికేత్ నేడు కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌కు దూరమైతే సన్‌రైజర్స్‌కు ఇబ్బందులు తప్పవు.కాగా, ఈ సీజన్లో అంతంతమాత్రంగా కనిపిస్తున్న సన్‌రైజర్స్, కేకేఆర్ గత సీజన్ ఫైనల్లో చివరిసారిగా తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో కేకేఆర్ సన్‌రైజర్స్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. ఐపీఎల్లో సన్‌రైజర్స్, కేకేఆర్ ఇప్పటివరకు 28 మ్యాచ్‌ల్లో తలపడగా.. కేకేఆర్ 18, సన్‌రైజర్స్ 9 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఓ మ్యాచ్ టైగా ముగిసింది.ఈ సీజన్లో ఇరు జట్లు ఇప్పటివరకు తలో మూడు మ్యాచ్‌లు ఆడి ఒక్కో మ్యాచ్‌లో మాత్రమే గెలుపొందాయి. సన్‌రైజర్స్ తమ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి.. ఆతర్వాత వరుసగా లక్నో, ఢిల్లీ క్యాపిటల్స్ చేతుల్లో ఓడింది. కేకేఆర్ విషయానికొస్తే.. డిఫెండింగ్ ఛాంపియన్ హెదాలో బరిలోకి దిగిన ఈ జట్టు సీజన్ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో చిత్తై, ఆతర్వాతి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై గెలుపొందింది. చివరిగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ మరో ఓటమిని మూటగట్టుకుంది.ఈ సీజన్లో సన్‌రైజర్స్ కేకేఆర్ కంటే పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. భారీ హైప్ కారణంగా అంచనాలను అందుకోలేకపోతుంది. కేకేఆర్ విషయానికొస్తే.. ఈ జట్టులో స్టార్ ఆటగాళ్లు ఉన్నా ఫామ్ లేమితో సతమతమవుతున్నారు. -
IPL 2025: కేకేఆర్ చెత్త రికార్డులు
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మార్చి 31) వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ ముంబై ఇండియన్స్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ ఓటమితో కేకేఆర్ పలు చెత్త రికార్డులు మూటగట్టుకుంది. ఐపీఎల్లో ఓ జట్టు (ముంబై ఇండియన్స్) చేతిలో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న జట్టుగా తమ పేరిటే ఉన్న చెత్త రికార్డును మరింత మెరుగుపర్చుకుంది. తాజా ఓటమితో ముంబై ఇండియన్స్ చేతిలో కేకేఆర్ పరాజయాల సంఖ్య 24కు చేరింది. ఐపీఎల్లో ఏ జట్టూ ఓ జట్టు చేతిలో ఇన్ని మ్యాచ్‌లు ఓడిపోలేదు. కేకేఆర్ తర్వాత ఈ చెత్త రికార్డు ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ పేరిట ఉంది. ఆర్సీబీ సీఎస్కే చేతిలో.. పంజాబ్ కేకేఆర్ చేతిలో తలో 21 మ్యాచ్‌లు ఓడిపోయాయి.ఐపీఎల్లో ఓ జట్టు చేతిలో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న జట్లు..కేకేఆర్- 24 ముంబై ఇండియన్స్ చేతిలోఆర్సీబీ- 21 సీఎస్కే చేతిలోపంజాబ్- 21 కేకేఆర్ చేతిలోసీఎస్కే- 20 ముంబై ఇండియన్స్ చేతిలోఆర్సీబీ- 20 కేకేఆర్ చేతిలోనిన్నటి ఓటమితో కేకేఆర్ మరో చెత్త రికార్డు కూడా తమ ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్లో ఓ వేదికపై ఓ జట్టు చేతిలో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న జట్టుగా నిలిచింది. కేకేఆర్ వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ చేతిలో అత్యధికంగా 10 పరాజయాలు ఎదుర్కొంది. ఓ వేదికపై ఓ జట్టు చేతిలో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న జట్ల జాబితాలో పంజాబ్, ఆర్సీబీ, ఢిల్లీ కేకేఆర్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.ఐపీఎల్లో ఓ వేదికపై ఓ జట్టు చేతిలో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న జట్లు..కేకేఆర్- 10 వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ చేతిలోపంజాబ్-9 ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ చేతిలోఆర్సీబీ- 8 వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ చేతిలోఆర్సీబీ- 8 చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్ చేతిలోఆర్సీబీ- 8 చెపాక్ స్టేడియంలో సీఎస్కే చేతిలోఢిల్లీ- 8 ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ చేతిలోమ్యాచ్ విషయానికొస్తే.. ముంబై ఇండియన్స్ చేతిలో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయం ఎదుర్కొంది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. అరంగేట్రం పేసర్ అశ్వనీ కుమార్ (3-0-24-4) చెలరేగడంతో కేకేఆర్‌ను 116 పరుగులకే కుప్పకూల్చింది. కేకేఆర్‌ను మట్టికరిపించడంలో ముంబై బౌలర్లు దీపక్ చాహర్ (2-0-19-2), బౌల్ట్ (4-0-23-1), హార్దిక్ పాండ్యా (2-0-10-1), విజ్ఞేశ్ పుతుర్ (2-0-21-1), సాంట్నర్ (3.2-0-17-1) తలో చేయి వేశారు.కేకేఆర్ ఇన్నింగ్స్‌లో రఘువంశీ (26) టాప్ స్కోరర్ కాగా.. రమణ్‌దీప్ (22), మనీశ్ పాండే (19), రింకూ సింగ్ (17), రహానే (11) రెండంకెల స్కోర్లు చేశారు. డికాక్ (1), సునీల్ నరైన్ (0), వెంకటేశ్ అయ్యర్ (3), రసెల్ (5) దారుణంగా విఫలమయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్.. ర్యాన్ రికెల్టన్ (41 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), సూర్యకుమార్ (9 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటడంతో 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. కేకేఆర్ బౌలర్లలో ఆండ్రీ రసెల్‌కు 2 వికెట్లు దక్కాయి. ఈ సీజన్లో రెండు వరుస పరాజయాల తర్వాత ముంబై ఇండియన్స్‌కు లభించిన తొలి విజయం ఇది. కేకేఆర్ విషయానికొస్తే.. ఈ జట్టుకు ఈ సీజన్లో ఇది రెండో పరాజయం. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో ఓడిన ఈ జట్టు.. ఆతర్వాతి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించి, తాజాగా ముంబై ఇండియన్స్ చేతిలో ఓడింది. -
MI VS KKR: అతడు అద్భుతం.. క్రెడిట్ వాళ్లకే.. రసెల్ వికెట్ కీలకం: హార్దిక్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. నిన్న (మార్చి 31) సొంత మైదానంలో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో సీఎస్కే, గుజరాత్ చేతుల్లో ఘోరంగా ఓడిన ఎంఐ.. కేకేఆర్‌తో మ్యాచ్‌లో అనూహ్యంగా పుంజుకుని సంతృప్తి పొందే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబై గెలుపులో అరంగేట్రం పేసర్ అశ్వనీ కుమార్ కీలకపాత్ర పోషించాడు. అశ్వనీ 3 ఓవర్లలో 24 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అశ్వనీతో పాటు దీపక్ చాహర్ (2-0-19-2), బౌల్ట్ (4-0-23-1), హార్దిక్ పాండ్యా (2-0-10-1), విజ్ఞేశ్ పుతుర్ (2-0-21-1), సాంట్నర్ (3.2-0-17-1) కూడా రాణించడంతో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ముంబై కేకేఆర్‌ను 116 పరుగులకే కుప్పకూల్చింది.కేకేఆర్ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రాణించలేకపోయారు. రఘువంశీ చేసిన 26 పరుగులే (16 బంతుల్లో) అత్యధికం. ఆఖర్లో రమణ్‌దీప్ (12 బంతుల్లో 22) బ్యాట్ ఝులిపించడంతో కేకేఆర్ అతి కష్టం మీద 100 పరుగుల మార్కును దాటింది. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో రఘువంశీ, రమణ్‌దీప్‌తో పాటు మనీశ్ పాండే (19), రింకూ సింగ్ (17), రహానే (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. గత మ్యాచ్‌లో (రాజస్థాన్) సత్తా చాటిన డికాక్ ఈ మ్యాచ్‌లో తేలిపోయాడు. సునీల్ నరైన్ డకౌటయ్యాడు. కోట్టు పెట్టి కొన్న వెంకటేశ్ అయ్యర్ (3) తుస్సుమనిపించాడు. విధ్వంసకర వీరుడు రసెల్ (11 బంతుల్లో 5) విఫలమయ్యాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆడుతూపాడుతూ విజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన ర్యాన్ రికెల్టన్ (41 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఈ మ్యాచ్‌లో సత్తా చాటాడు. సూర్యకుమార్ (9 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తన సహజ శైలిలో విధ్వంసం సృష్టించాడు. రోహిత్ శర్మ (12 బంతుల్లో 13) పేలవ ప్రదర్శన కొనసాగగా.. విల్ జాక్స్ (17 బంతుల్లో 16) నిరాశపరిచాడు. ముంబై 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కేకేఆర్ బౌలర్లలో ఆండ్రీ రసెల్‌కు 2 వికెట్లు దక్కాయి.మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఈ గెలుపు సంతృప్తికరంగా ఉంది. హోం గ్రౌండ్లో గెలవడం మరింత ప్రత్యేకం. సమిష్టిగా రాణించాం. ప్రతి ఒక్కరు గెలుపులో భాగమయ్యారు. వికెట్ మేము ఊహించిన దానికంటే ఎక్కువగానే మాకు అనుకూలించింది. అశ్వనీ కూమార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పిచ్‌ను పరిశీలించాక అశ్వనీ తన సహజ శైలిలో బౌలింగ్ చేసినా సత్ఫలితాలు వస్తాయని అనుకున్నాము. అదే జరిగింది. అశ్వనీ లాంటి ఆణిముత్యాన్ని వెలికి తీసినందుకు మా స్కౌట్స్‌ను అభినంధించాలి. ముంబై ఇండియన్స్ స్కౌట్స్ దేశం నలుమూలలా తిరిగి విజ్ఞేశ్ పుతుర్, అశ్వనీ కుమార్ లాంటి టాలెంటెడ్ కిడ్స్ను ఎంపిక చేశారు. ప్రాక్టీస్ సమయంలోనే అశ్వనీలోని టాలెంట్‌ను గమనించాము. అతని బౌలింగ్‌లో ప్రత్యేకమైన లేట్ స్వింగ్ ఉంది. పైగా అతను లెఫ్ట్ హ్యాండర్. అశ్వనీ తీసిన రసెల్ వికెట్ చాలా కీలకం. అతడు డికాక్ క్యాచ్‌ను అందుకున్న తీరు కూడా అద్భుతం. ఓ ఫాస్ట్ బౌలర్ అంత ఎత్తుకు ఎగిరి క్యాచ్ పట్టడం ఆషామాషీ కాదు. ముందు చెప్పినట్లు, సమిష్టిగా రాణించడం శుభసూచకం. -
MI VS KKR: సమిష్టి వైఫల్యం.. రహానే ఆవేదన
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన కేకేఆర్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో స్థాయికి తగ్గట్టుగా ఆడటం లేదు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట ఓటమిపాలైంది. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో చావుదెబ్బ తిన్న ఆ జట్టు.. ఆతర్వాతి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ఏకపక్ష విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. తాజాగా నిన్న (మార్చి 31) ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొని సీజన్లో రెండో ఓటమిని మూటగట్టుకుంది.ఈ మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైంది. ముంబై ఇండియన్స్ అరంగేట్రం పేసర్ అశ్వనీ కుమార్ (3-0-24-4) ధాటికి 116 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రాణించలేదు. అంగ్క్రిష్ రఘువంశీ చేసిన 26 పరుగులే అత్యధికం. ఆఖర్లో రమణ్‌దీప్ సింగ్ (12 బంతుల్లో 22; ఫోర్, 2 సిక్సర్లు) బ్యాట్ ఝులిపించకపోయుంటే 100 పరుగులు కూడా వచ్చేవి కాదు. రఘువంశీ, రమణ్‌దీప్‌తో పాటు మనీశ్ పాండే (19), రింకూ సింగ్ (17), రహానే (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. డికాక్ (1), నరైన్ (0), వెంకటేశ్ అయ్యర్ (3), ఆండ్రీ రసెల్ (5) దారుణంగా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో అశ్వనీ కుమార్‌తో పాటు దీపక్ చాహర్ (2-0-19-2), బౌల్ట్ (4-0-23-1), హార్దిక్ పాండ్యా (2-0-10-1), విజ్ఞేశ్ పుతుర్ (2-0-21-1), సాంట్నర్ (3.2-0-17-1) కూడా సత్తా చాటారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనుకు దిగిన ముంబై ఇండియన్స్ సునాయాసంగా విజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన ర్యాన్ రికెల్టన్ (41 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఈ మ్యాచ్‌లో సత్తా చాటాడు. సూర్యకుమార్ (9 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తన సహజ శైలిలో విధ్వంసం సృష్టించాడు. రోహిత్ శర్మ (12 బంతుల్లో 13) పేలవ ప్రదర్శన కొనసాగగా.. విల్ జాక్స్ (17 బంతుల్లో 16) నిరాశపరిచాడు. మొత్తంగా ముంబై 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కేకేఆర్ బౌలర్లలో ఆండ్రీ రసెల్‌కు 2 వికెట్లు దక్కాయి.మ్యాచ్ అనంతరం లూజింగ్ కెప్టెన్ అజింక్య రహానే ఇలా అన్నాడు. సమిష్టిగా బ్యాటింగ్‌లో విఫలమయ్యాం. టాస్‌లో చెప్పినట్లుగానే ఈ వికెట్ బ్యాటింగ్ చేయడానికి బాగుంది. 180-190 పరుగులు చేసుంటే మంచి స్కోర్ అయ్యుండేది. వికెట్‌పై మంచి బౌన్స్ కూడా ఉంది. కొన్నిసార్లు బౌన్స్‌ను, పేస్‌ను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఈ ఆట నుండి చాలా వేగంగా నేర్చుకోవాలి. బంతితో కూడా పెద్దగా రాణించలేకపోయాము. బౌలర్లు శక్తి మేరకు ప్రయత్నించారు కానీ, బోర్డుపై ఓ మోస్తరు స్కోరైనా లేదు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాము. పవర్‌ప్లేలో నాలుగు వికెట్లు కోల్పోయాక కోలుకోవడం కష్టం. మంచి భాగస్వామ్యాలు కొనసాగుండాల్సింది. చివరి వరకు ఓ బ్యాటర్ క్రీజ్‌లో ఉండటం అవసరం. -
IPL 2025: రూ. 23.75 కోట్లు దండగ.. ఇంత దానికి కెప్టెన్సీ కూడా కావాలట..!
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా నిన్న (మార్చి 31) కేకేఆర్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్లో ముంబైకి ఇది తొలి విజయం. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అరంగేట్రం పేసర్ అశ్వనీ కుమార్ అద్భుత ప్రదర్శన చేశాడు. 3 ఓవర్లలో 24 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. అశ్వనీ విజృంభణకు తోడు దీపక్ చాహర్ (2-0-19-2), బౌల్ట్ (4-0-23-1), హార్దిక్ పాండ్యా (2-0-10-1), విజ్ఞేశ్ పుతుర్ (2-0-21-1), సాంట్నర్ (3.2-0-17-1) కూడా రాణించడంతో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ముంబై కేకేఆర్‌ను 116 పరుగులకే కుప్పకూల్చింది. కేకేఆర్ బ్యాటర్లు అశ్వనీ కుమార్ సహా మిగతా ముంబై బౌలర్లను ఎదుర్కొనేందుకు ఆపసోపాలు పడ్డారు. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. రఘువంశీ చేసిన 26 పరుగులే (16 బంతుల్లో) అత్యధికం. ఆఖర్లో రమణ్‌దీప్ (12 బంతుల్లో 22) బ్యాట్ ఝులిపించడంతో కేకేఆర్ అతి కష్టం మీద 100 పరుగుల మార్కును దాటింది. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో రఘువంశీ, రమణ్‌దీప్‌తో పాటు మనీశ్ పాండే (19), రింకూ సింగ్ (17), రహానే (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. గత మ్యాచ్‌లో (రాజస్థాన్) సత్తా చాటిన డికాక్ ఈ మ్యాచ్‌లో తేలిపోయాడు. సునీల్ నరైన్ డకౌటయ్యాడు. కోట్టు పెట్టి కొన్న వెంకటేశ్ అయ్యర్ (3) తుస్సుమనిపించాడు. విధ్వంసకర వీరుడు రసెల్ (11 బంతుల్లో 5) విఫలమయ్యాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. ఆడుతూపాడుతూ విజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన ర్యాన్ రికెల్టన్ (41 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఈ మ్యాచ్‌లో సత్తా చాటాడు. సూర్యకుమార్ (9 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తన సహజ శైలిలో విధ్వంసం సృష్టించాడు. రోహిత్ శర్మ (12 బంతుల్లో 13) పేలవ ప్రదర్శన కొనసాగగా.. విల్ జాక్స్ (17 బంతుల్లో 16) నిరాశపరిచాడు. ముంబై 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కేకేఆర్ బౌలర్లలో ఆండ్రీ రసెల్‌కు 2 వికెట్లు దక్కాయి.కాగా, ఈ మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైన కేకేఆర్ బ్యాటర్లపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రూ. 23.75 కోట్ల భారీ మొత్తం పెట్టి కొన్న వైస్ కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్‌ను కేకేఆర్ అభిమానులే టార్గెట్ చేస్తున్నారు. ఫ్రాంచైజీ నమ్మకాన్ని వమ్ము చేశాడని కామెంట్లు చేస్తున్నారు. భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేయడంతో వైస్ కెప్టెన్సీ అప్పగిస్తే ఇదేనా నువ్వు చేసేదంటూ మండిపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో9 బంతులు ఎదుర్కొన్న అయ్యర్ కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనూ అయ్యర్ విఫలమయ్యాడు. ఆర్సీబీపై కేవలం 6 పరుగులు (7 బంతుల్లో) మాత్రమే చేశాడు. ఆల్‌రౌండర్‌గా పని కొనస్తాడనుకుంటే అస్సలు బౌలింగే చేయడం లేదు. పైగా ఈ సీజన్‌కు ముందు కెప్టెన్సీ కూడా కావాలని మారాని చేశాడు. చెత్త ప్రదర్శనలతో అయ్యర్ ప్రస్తుతం కేకేఆర్ అభిమానులకు టార్గెట్‌గా మారాడు. నీ కంటే కొత్తగా వచ్చిన కుర్రాళ్లు అనికేత్ వర్మ (సన్‌రైజర్స్), విప్రాజ్ నిగమ్ (ఢిల్లీ) చాలా మేలని కామెంట్లు చేస్తున్నారు. నీపై పెట్టిన పెట్టుబడి దండగ అని అంటున్నారు. ఇంత దానికి కెప్టెన్సీ కూడా కావాలా అని ప్రశ్నిస్తున్నారు. పనిలో పనిగా రింకూ సింగ్, ఆండ్రీ రసెల్‌ను కూడా ఏకి పారేస్తున్నారు. వీరిపై పెట్టిన పెట్టుబడి కూడా బూడిదలో పోసిన పన్నీరే అని అంటున్నారు. ఈ సీజన్‌కు ముందు రింకూను 13 కోట్లకు, రసెల్‌ను 12 కోట్లకు కేకేఆర్ రీటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. అయ్యర్ ఐపీఎల్ చరిత్రలోనే నాలుగో కాస్ట్లీ ప్లేయర్ అన్న విషయం కూడా తెలిసిందే. మొత్తంగా తొలి 3 మ్యాచ్‌ల్లో రెండింట పరాజయాలు ఎదుర్కోవడంతో కేకేఆర్ అభిమానులు డిఫెండింగ్ ఛాంపియన్స్ అని చెప్పుకునేందుకు కూడా సిగ్గు పడుతున్నారు. -
రూ. 1,460 కోట్ల షేర్లను అమ్మేసిన కేకేఆర్
న్యూఢిల్లీ: ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా కంపెనీ ప్రమోటర్, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ కేకేఆర్ తాజాగా జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్‌లో 5.8 శాతం వాటా విక్రయించింది. బల్క్‌డీల్ గణాంకాల ప్రకారం వీటి విలువ రూ. 1,460 కోట్లు. అనుబంధ సంస్థ టౌ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఒక్కో షేరుకి రూ. 1,625 సగటు ధరలో 89.83 లక్షలకుపైగా షేర్లను అమ్మివేసింది.ఈ లావాదేవీ తదుపరి కేకేఆర్ వాటా 53.66 శాతం నుంచి 47.88 శాతానికి క్షీణించింది. కొటక్ మహీంద్రా ఎంఎఫ్ రూ. 200 కోట్లు వెచ్చించి 0.8 శాతం వాటాకు సమానమైన 12.3 లక్షల షేర్లు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో జేబీ కెమికల్స్ షేరు ఎన్ఎస్ఈలో 6.2% పతనమై రూ. 1,604 వద్ద ముగిసింది. -
ఐపీఎల్-2025 షెడ్యూల్లో మార్పు
ఐపీఎల్ 2025 షెడ్యూల్లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఏప్రిల్ 6న (ఆదివారం) ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ ఏప్రిల్ 8కి వాయిదా పడింది. ఏప్రిల్ 8న (మంగళవారం) ఈ మ్యాచ్ అదే వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) కోల్‌కతా పోలీసుల విజ్ఞప్తి మేరకు బీసీసీఐ షెడ్యూల్‌ను సవరించింది. ఏప్రిల్ 6న శ్రీ రామ నవమి కావడంతో కోల్‌కతాలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అదే రోజు మ్యాచ్ జరుగనుండటంతో కోల్‌కతా పోలీసులకు మ్యాచ్ భద్రతా ఏర్పాట్లు చేయడం కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ తేదీని వాయిదా వేయాలని క్యాబ్, కోల్‌కతా పోలిసులు బీసీసీఐని కోరారు. వారి అభ్యర్ధన మేరకు బీసీసీఐ షెడ్యూల్‌ను మార్చింది. కేకేఆర్, లక్నో మ్యాచ్ వాయిదా పడిన విషయాన్ని బీసీసీఐ నిన్న అధికారికంగా ప్రకటించింది. ఈ మ్యాచ్ మినహా మిగతా షెడ్యూల్లో ఎలాంటి మార్పులుండవని స్పష్టం చేసింది.ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 6న రెండు మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నాయి. కేకేఆర్, లక్నో మ్యాచ్ మధ్యాహ్నం షెడ్యూలై ఉండగా.. అదే రోజు రాత్రి (7:30) సన్‌రైజర్స్, గుజరాత్ మ్యాచ్ హైదరాబాద్‌లో జరగాల్సి ఉంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం కేకేఆర్, లక్నో మ్యాచ్ వాయిదా పడగా.. గుజరాత్, సన్‌రైజర్స్ మ్యాచ్ యధాతథంగా జరుగనుంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 8న రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం కేకేఆర్, లక్నో మ్యాచ్ జరుగనుండగా.. రాత్రి (7:30) చండీఘడ్‌లో పంజాబ్, సీఎస్కే ఢీకొంటాయి.ఇదిలా ఉంటే, ఐపీఎల్లో ఇవాళ (మార్చి 29) అహ్మదాబాద్ వేదికగా ముంబై, గుజరాత్ తలపడనున్నాయి. ఈ సీజన్లో ఇరు జట్లకు ఇది రెండో మ్యాచ్. ఇరు జట్లు తమతమ తొలి మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొన్నాయి. ముంబై సీఎస్కే చేతిలో.. గుజరాత్ పంజాబ్ చేతిలో భంగపడ్డాయి. నేటి మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో అత్యంత సఫలమైన జట్టుగా ఆర్సీబీ ఉంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. -
Quinton de Kock: వచ్చాడు.. రెండో మ్యాచ్‌లోనే భారీ రికార్డు పట్టాడు..!
కేకేఆర్ తరఫున తన రెండో మ్యాచ్‌లోనే క్వింటన్ డికాక్ ఓ భారీ రికార్డు సాధించాడు. నిన్న (మార్చి 26) రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 బంతుల్లో 97 పరుగులు చేసిన అతడు.. కేకేఆర్ తరఫున విజయవంతమైన ఛేదనల్లో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు మనీశ్ పాండే పేరిట ఉండేది. మనీశ్ 2014 సీజన్ ఫైనల్లో పంజాబ్‌పై 94 పరుగులు చేశాడు.విజయవంతమైన లక్ష్య ఛేదనల్లో కేకేఆర్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్లు97* - క్వింటన్ డికాక్ vs RR, గౌహతి, 202594 - మనీశ్ పాండే vs PBKS, బెంగళూరు, 2014 ఫైనల్93* - క్రిస్ లిన్ vs GL, రాజ్‌కోట్, 201792 - మన్వీందర్ బిస్లా vs CSK, చెన్నై, 201390* - గౌతమ్ గంభీర్ vs SRH, హైదరాబాద్, 2016కాగా, రాయల్స్‌తో జరిగిన నిన్నటి మ్యాచ్‌లో డికాక్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి కేకేఆర్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. కేకేఆర్ బౌలర్లు మొయిన్ అలీ (4-0-23-2), వరుణ్ చక్రవర్తి (4-0-17-2), హర్షిత్ రాణా (4-0-36-2), వైభవ్ అరోరా (4-0-33-2) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాయల్స్ బ్యాటర్లలో ధృవ్ జురెల్ (33) టాప్ స్కోరర్‌గా కాగా.. జైస్వాల్ 29, రియాన్ పరాగ్ 25, సంజూ శాంసన్ 13, జోఫ్రా ఆర్చర్ 16 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో డికాక్ బాధ్యతాయుతంగా ఆడి కేకేఆర్‌ను గెలిపించాడు. 61 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 97 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కెప్టెన్ రహానే (18), రఘువంశీ (22 నాటౌట్) సహకారంతో కేకేఆర్‌ను విజయతీరాలకు చేర్చాడు. కేకేఆర్ మరో 15 బంతులు మిగిలుండగానే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. తద్వారా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో డికాక్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. గత సీజన్లో లక్నోకు ఆడిన డికాక్.. కేకేఆర్ తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లో ప్రభావం చూపనప్పటికీ.. రెండో మ్యాచ్‌లో సత్తా చాటాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు నాలుగు ఫ్రాంచైజీలకు (ఢిల్లీ, ముంబై, లక్నో, ఢిల్లీ) ఆడిన డికాక్.. నాలుగింటి తరఫున ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో నాలుగు ఫ్రాంచైజీల తరఫున ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఏకైక ప్లేయర్ డికాకే. -
RR VS KKR: మొయిన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.. క్రెడిట్ బౌలర్లకే దక్కుతుంది: రహానే
ధనాధన్ బ్యాటింగ్ విన్యాసాలతో తొలి ఐదు రోజులు జోరుగా సాగిన ఐపీఎల్ 2025 ఆరో రోజు చప్పబడింది. గౌహతి వేదికగా కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ మధ్య నిన్న (మార్చి 26) జరిగిన మ్యాచ్ పేలగా సాగింది. ఛేదనలో కేకేఆర్ ఓపెనర్ డికాక్ (61 బంతుల్లో 97 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) భారీ ఇన్నింగ్స్ ఆడినా మ్యాచ్‌లో అంత మజా రాలేదు. మ్యాచ్ ఏకపక్షంగా సాగడంతో అభిమానులు బోర్ ఫీలయ్యారు. మ్యాచ్ ఇంత చప్పగా సాగడానికి పిచ్‌తో పాటు గౌహతిలో వాతావరణం కారణం. పిచ్ నుండి బ్యాటర్లకు పెద్దగా సహకారం లభించలేదు. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం చూపింది. మొత్తంగా రాయల్స్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ సునాయాసంగా ఛేదించింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. కేకేఆర్ బౌలర్లు రెచ్చిపోవడంతో అతి కష్టం మీద 151 పరుగులు చేసింది (9 వికెట్ల నష్టానికి). మొయిన్ అలీ (4-0-23-2), వరుణ్ చక్రవర్తి (4-0-17-2), హర్షిత్ రాణా (4-0-36-2), వైభవ్ అరోరా (4-0-33-2) రాయల్స్ బ్యాటర్లను బాగా కట్టడి చేశారు. స్పిన్నర్లు మొయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి ఆదిలోనే వికెట్లు తీసి రాయల్స్‌పై ఒత్తిడి తెచ్చారు. ఓ దశలో రాయల్స్ కనీసం 120 పరుగులైనా చేస్తుందా అనిపించింది. ఎలాగో ముక్కిమూలిగి చివరికి 150 పరుగుల మార్కును తాకగలిగింది. రాయల్స్ బ్యాటర్లలో ధృవ్ జురెల్ (33) టాప్ స్కోరర్‌గా కాగా.. జైస్వాల్ 29, రియాన్ పరాగ్ 25, సంజూ శాంసన్ 13, జోఫ్రా ఆర్చర్ 16 పరుగులు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో కేకేఆర్ కూడా నిదానంగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. పవర్ ప్లేలో ఆ జట్టు 41 పరుగులు మాత్రమే చేసిన ఓపెనర్‌గా వచ్చిన మొయిన్ అలీ (12 బంతుల్లో 5) వికెట్ కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ డికాక్ బాధ్యతాయుతంగా ఆడి, కెప్టెన్ రహానే (18), రఘువంశీ (22 నాటౌట్) సహకారంతో కేకేఆర్‌ను విజయతీరాలకు చేర్చాడు. కేకేఆర్ మరో 15 బంతులు మిగిలుండగానే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుని 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో (కేకేఆర్ బ్యాటింగ్ చేస్తుండగా) మంచు ప్రభావం కారణంగా రాయల్స్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఆ జట్టు తరఫున హసరంగ ఒక్కడే వికెట్ (రహానే) తీయగలిగాడు. మొయిన్ అలీ రనౌటయ్యాడు.మ్యాచ్ అనంతరం విన్నింగ్ కెప్టెన్ అజింక్య రహానే మాట్లాడుతూ ఇలా అన్నాడు. తొలి ఆరు ఓవర్లలో మేము బాగా బౌలింగ్ చేసాము. మిడిల్ ఓవర్లు కూడా కీలకమైనవే. స్పిన్నర్లు పరిస్థితులను నియంత్రించిన విధానం బాగుంది. మొయిన్ తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అతను చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఆటగాళ్లు నిర్భయంగా ఆడాలని కోరుకునే ఫార్మాట్ ఇది. వారికి స్వేచ్ఛ ఇవ్వాలనుకుంటున్నాము.క్రెడిట్ మా బౌలింగ్ యూనిట్‌కు దక్కుతుంది. వారు ప్రతి బంతికి వికెట్ తీయాలనే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మొయిన్. మొయిన్ ఓ నాణ్యమైన ఆల్‌రౌండర్. గతంలో కూడా అతను ఓపెనింగ్ చేశాడు. బ్యాట్‌తో అతను ఆశించిన సఫలత సాధించలేకపోయినా.. బంతితో రాణించిన విధానం పట్ల సంతోషంగా ఉంది. ప్రతి మ్యాచ్‌లో ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాగా, డిఫెండింగ్ ఛాంపియన్ అయిన కేకేఆర్ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో భంగపడ్డ విషయం తెలిసిందే. కేకేఆర్ నెక్స్ట్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఢీకొటుంది. ఈ మ్యాచ్ మార్చి 31న వాంఖడేలో జరుగనుంది. -
KKR VS RCB: అప్పుడే మ్యాచ్ చేజారింది.. మంచు కూడా వారికి కలిసొచ్చింది: రహానే
ఆర్సీబీతో జరిగిన సీజన్ ఓపెనర్‌లో (IPL 2025) డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ ఓటమి చవి చూసింది. సొంత మైదానంలో (ఈడెన్ గార్డెన్స్) జరిగిన మ్యాచ్ అయినా కేకేఆర్‌కు పరాభవం తప్పలేదు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. నరైన్ (26 బంతుల్లో 44; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), రహానే (31 బంతుల్లో 56; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో భారీ స్కోర్ చేసేలా కనిపించింది. అయితే 10 ఓవర్ తర్వాత సీన్ ఒక్కసారిగా మారిపోయింది. మూడు బంతుల వ్యవధిలో నరైన్, రహానే ఔటయ్యారు. దీంతో పరుగులు రావడం చాలా కష్టమైంది. ఈ దశలో ఆర్సీబీ స్పిన్నర్లు రెచ్చిపోయారు. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు క్రమం తప్పకుండా వికెట్లు తీశారు. ఫలితంగా 200 దాటుతుందనుకున్న కేకేఆర్ స్కోర్ 174 పరుగులకే పరిమితమైంది. ఛేదనలో ఆర్సీబీకి ఫిల్ సాల్ట్ (31 బంతుల్లో 56; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లి (36 బంతుల్లో 59 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్నందించారు. వీరిద్దరూ పవర్ ప్లేలో 80 పరుగులు చేసి కేకేఆర్ చేతిలో నుంచి మ్యాచ్‌ను అప్పుడే లాగేసుకున్నారు. సాల్ట్, కోహ్లితో పాటు పాటిదార్ (16 బంతుల్లో 34; 5 ఫోర్లు, సిక్స్) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఆర్సీబీ మరో 22 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. ఆర్సీబీ గెలుపులో బౌలర్లు ప్రధాన పాత్ర పోషించారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కృనాల్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. హాజిల్‌వుడ్ సామర్థ్యం మేరకు రాణించి 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. యశ్ దయాల్ (3-0-25-1) పర్వాలేదనిపించాడు. సుయాశ్ శర్మ, రసిక్ సలామ్ తలో వికెట్ తీసినా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.ఓటమి అనంతరం కేకేఆర్ కెప్టెన్ రహానే ఇలా అన్నాడు. 13వ ఓవర్ వరకు మంచి స్కోర్ సాధిస్తామని అనుకున్నాను. కానీ ఆ దశలో వికెట్లు కోల్పోవడంతో తామనుకున్నది జరగలేదు. వరుస క్రమాల్లో వికెట్లు కోల్పోవడం తమ జోరుకు అడ్డుకట్ట వేసింది. నా తర్వాత (ఇన్నింగ్స్‌లో) వచ్చిన బ్యాటర్లు వారి శక్తి మేరకు ప్రయత్నించినప్పటికీ వర్కౌట్ కాలేదు. నేను, వెంకీ (అయ్యర్) బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 200-210 పరుగులు సాధించవచ్చని చర్చించుకున్నాం. కానీ వరుస వికెట్లు తమ జోరును నీరుగార్చాయి. పవర్ ప్లేలో సాల్ట్, కోహ్లి అద్భుతంగా ఆడారు. అప్పుడే మ్యాచ్ మా నుంచి చేజారింది. మంచు కూడా వారి గెలుపుకు సహకరించింది. 200 పైబడిన స్కోర్ చేసుంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఓవరాల్‌గా క్రెడిట్ ఆర్సీబీ ఆటగాళ్లకు దక్కుతుంది. కీలక దశలో తమను కట్టడి చేయడంతో పాటు పవర్ ప్లేలో వారి బ్యాటింగ్ అద్భుతంగా ఉండింది. ఈ మ్యాచ్ గురించి ఇంకా డిస్కస్ చేయాలని అనుకోవడం లేదు. కొన్ని అంశాల్లో మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు. కాగా, కేకేఆర్ కెప్టెన్‌గా రహానేకు ఇది తొలి మ్యాచ్. తొలి మ్యాచ్‌లోనే ఓటమితో రహానే కాసింత నిరాశకు లోనైనట్లు కనిపించాడు. వ్యక్తిగతంగా అతను రాణించినా కేకేఆర్‌కు అది వర్కౌట్ కాలేదు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ బౌలింగ్ చాలా బలహీనంగా కనిపించింది. ఆర్సీబీ బ్యాటర్ల ముందు వారు తేలిపోయారు. ముఖ్యంగా వారి జట్టులో ఒక్క అనుభవజ్ఞుడైన పేసర్ కూడా లేడు. ఈ లోటు కొట్టొచ్చినట్లు కనిపించింది. గత సీజన్లో కేకేఆర్ విజయాల్లో పేసర్లు ప్రధాన పాత్ర పోషించారు. కానీ ఈ సీజన్లో ఆ జట్టు పేసర్లను కాకుండా స్పిన్నర్లనే ఎక్కువ నమ్ముకుంది. మరి స్పిన్నర్లు కేకేఆర్‌ను టైటిల్ నిలబెట్టుకునేలా చేస్తారో లేదో వేచి చూడాలి.కాగా, ఈ సీజన్లో కేకేఆర్ తమ తదుపరి మ్యాచ్‌ను మార్చి 26న ఆడుతుంది. గౌహతి వేదికగా నాడు జరిగే మ్యాచ్‌లో కేకేఆర్ రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొంటుంది. -
24 ఏళ్లకే ఐపీఎల్ వేలంలో.. ఈ బ్యూటీ ముందు కావ్య కూడా దిగదుడుపే!
క్రికెట్ ప్రేమికులందరూ ఎదురు చూస్తున్న.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరగనుంది. ఐపీఎల్ కేవలం క్రికెట్ అభిమానులను మాత్రమే కాకుండా.. అన్ని రంగలవారిని ఆకర్షిస్తోంది. ఆటకు అందం తోడైతే.. ఆ కిక్కే వేరు. ఐపీఎల్ అంటే ప్రీతి జింటా, కావ్య మారన్ పేర్లు మాత్రమే కాదు.. ఇప్పుడు 'జాహ్నవి మెహతా' (Jahnavi Mehta) పేరు కూడా ఎక్కువగా వినిపిస్తోంది. ఇంతకీ ఈమె ఎవరు?, ఈమె నెట్‌వర్త్ ఎంత? అనే వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఎవరీ జాహ్నవి మెహతా?జాహ్నవి మెహతా తల్లి ప్రముఖ నటి 'జూహి చావ్లా', తండ్రి ఫేమస్ బిజినెస్ మ్యాన్ 'జయ్ మెహతా'. అయితే 24 ఏళ్ల వయసులోనే జాహ్నవి ఐపీఎల్ వేలంపాటలతో సహా ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొంటూ సుపరిచితురాలుగా మారింది. ముఖ్యంగా ఈమె తన తండ్రి సహ యాజమాన్యంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీలో ఎక్కువగా పాల్గొంటోంది. 2025 వేలానికి హాజరై, జట్టుతో తన సంబంధాన్ని.. కేకేఆర్ కార్యకలాపాల నిర్వహణలో ఆమె పాత్రను మరింత పటిష్టం చేసుకుంది.క్రికెట్ అంటే కేవలం వ్యాపారం మాత్రమే కాదు, జాహ్నవికి ఇష్టం కూడా. ఈ కారణంగానే ఈమె కేకేఆర్ జట్టును ఫాలో అవుతూ వచ్చింది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీలో భాగస్వామిగా ఉన్న షారుఖ్ ఖాన్ పిల్లలు సుహాన్ ఖాన్, ఆర్యన్ ఖాన్ ఇప్పటికి కూడా కేకేఆర్ జట్టు బాధ్యతలలోకి నేరుగా ప్రవేశించలేదు. కానీ జాహ్నవి మాత్రం తన తెలివితేటలతో.. కేకేఆర్ జట్టుకు సంబంధించిన కీలక వ్యవహారాలను చూసుకుంటోంది.నెట్‌వర్త్ ఎంతంటే?జాహ్నవి స్కూల్ చదువు ఇంగ్లండ్‌లోనే అక్కడి చాటర్ హౌస్ స్కూల్లో సాగింది. అంతకుముందు ముంబైలోని ధీరూబాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివింది. కొలంబియా యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి జాహ్నవి మెహతా.. వేలకోట్ల సామ్రాజ్యానికి వారసురాలు. ఈమె ఆస్తి ఏకంగా రూ.4,000 కోట్ల కంటే ఎక్కువ అని తెలుస్తోంది. ఈమె తండ్రి జయ్ మెహతా.. తన మామ నాంజీ కాళిదాస్ మెహతా స్థాపించిన బహుళజాతి సమ్మేళన సంస్థ అయిన మెహతా గ్రూప్ చైర్మన్. ఈ సంస్థ ప్యాకేజింగ్, హార్టికల్చర్, సిమెంట్, నిర్మాణ సామగ్రి వంటి విభిన్న రంగాల కలయిక.మెహతా గ్రూప్ ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా.. కెనడా, ఉగాండా, కెన్యా, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలలో కూడా విస్తరించి ఉంది. ఈ కంపెనీ గత కొంత కాలంగా గణనీయమైన అభివృద్ధి చెందుతూనే ఉంది. జూహి చావ్లా ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలైన హీరోయిన్.ఇదీ చదవండి: వారానికి 70 గంటల పని: మొదటిసారి స్పందించిన సుధామూర్తి -
KKR Vs RCB: కోల్‌కతాలో వర్షం.. కేకేఆర్, ఆర్సీబీ మధ్య రేపటి మ్యాచ్ జరిగేనా..?
ఐపీఎల్ 2025 సీజన్ తొలి మ్యాచ్‌కు వరుణుడు అడ్డు తగిలేలా ఉన్నాడు. కేకేఆర్, ఆర్సీబీ మధ్య రేపు (మార్చి 22) జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యే అవకాశముందని తెలుస్తుంది. రేపు మ్యాచ్ జరిగే సమయానికి (రాత్రి 7:30 గంటలకు) వర్షం పడే అవకాశాలు 90 శాతం ఉన్నాయని వాతావరణ నివేదికలు ఇదివరకే స్పష్టం చేశాయి. దీన్ని నిజం చేస్తూ ఇవాల్టి నుంచే వర్షం మొదలైంది. NO RAIN pleaseeee!!!!pic.twitter.com/YgfkvBSfx0— CricTracker (@Cricketracker) March 21, 2025ఇవాళ రాత్రి 8 గంటల ప్రాంతంలో కోల్‌కతాలోని ఈడెన్ గార్డన్స్ మైదానంలో వర్షం కురుస్తూ ఉండింది. ఇవాల్టి పరిస్థితి చూసి రేపటి మ్యాచ్ జరిగేనా అని క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మ్యాచ్ సమయానికి వర్షం తగ్గిపోవాలని దేవుడిని వేడుకుంటున్నారు. ఐపీఎల్ కోసం క్రికెట్ అభిమానులు చాలాకాలంగా కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సీజన్ ఆరంభ మ్యాచ్ రద్దైతే వారి బాధ వర్ణణాతీతం.మరోవైపు రేపటి మ్యాచ్‌కు ముందు ఈడెన్‌గార్డెన్స్‌లో ఐపీఎల్-18వ సీజన్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఈ ఓపెనింగ్ సెర్మనీ దాదాపుగా రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.ఇదిలా ఉంటే, డిఫెండింగ్ ఛాంపియన్ అయిన కేకేఆర్ సొంత మైదానంలో జరిగే తొలి మ్యాచ్ విజయం సాధించి సీజన్‌ను ఘనంగా ప్రారంభించాలని ప్లాన్ చేసింది. అయితే వారి ఆశలు వర్షార్పణం అయ్యేలా కనిపిస్తున్నాయి. ఈ సీజన్లో కేకేఆర్ కొత్త కెప్టెన్ ఆజింక్య రహానే సారథ్యంలో బరిలోకి దిగనుంది. గత సీజన్లో కేకేఆర్‌కు టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్‌కు వెళ్లాడు. ఆర్సీబీ విషయానికొస్తే.. ఈ జట్టు ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా 'ఈ సాలా కప్ నమ్మదే' అనుకుంటూ ఉంది. అయితే వీరి ఆశలకు వర్షం ఆదిలోనే బ్రేకులు వేసేలా ఉంది. ఈ సీజన్లో ఆర్సీబీ కూడా కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగుతుంది. రజత్ పాటిదార్ ఆర్సీబీ నూతన నాయకుడిగా నియమితుడయ్యాడు.ఆర్సీబీ జట్టు..రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దేవ్‌దత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, స్వస్తిక్ చికారా, కృనాల్ పాండ్యా, మనోజ్ భాండగే, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్, మోహిత్ రతీ, ఫిలిప్ సాల్ట్, జితేశ్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, రసిఖ్ సలాం ధార్, సుయాశ్ శర్మ, యశ్ దయాల్, నువాన్ తుషార, అభినందన్ సింగ్కేకేఆర్ జట్టు..అజింక్య రహానే (కెప్టెన్), మనీశ్ పాండే, రింకూ సింగ్, రోవ్‌మన్ పావెల్, అంగ్క్రిష్ రఘువంశీ, అనుకుల్ రాయ్, రమన్‌దీప్ సింగ్, వెంకటేశ్ అయ్యర్, మొయిన్ అలీ, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, క్వింటన్ డికాక్, రహ్మానుల్లా గుర్బాజ్, లవ్నిత్ సిసోడియా, వరుణ్ చక్రవర్తి, మయాంక్ మార్కండే, వైభవ్ అరోరార, హర్షిత్ రాణా, అన్రిచ్ నోర్జే, చేతన్ సకారియా, స్పెన్సర్ జాన్సన్ -
IPL 2025: కేకేఆర్‌కు బిగ్ షాక్.. స్టార్ పేసర్‌కు గాయం
ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు (కేకేఆర్) భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ సీజన్ మొత్తనికి దూరమ్యాడు. దీంతో అతనికి రీ ప్లేస్‌మెంట్‌గా 27 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్ చేతన్ సకారియాను ఎంపిక చేసుకుంది కేకేఆర్ మేనేజ్మెంట్. మాలిక్‌ను కేకేఆర్ ఈ సీజన్ మెగా వేలంలో రూ. 75 లక్షలకు దక్కించుకుంది. మాలిక్ కేకేఆర్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే వైదొలిగాడు. జమ్మూ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్‌గా ప్రసిద్ది చెందిన మాలిక్ 2021లో సన్‌రైజర్స్ తరఫున అరంగేట్రం చేసి గత సీజన్ వరకు అదే జట్టుకు ఆడాడు. మూడు సీజన్లలో అద్బుతమైన ప్రదర్శనలు చేసిన మాలిక్.. ఎస్ఆర్హెచ్ తరఫున 26 మ్యాచ్‌లు ఆడి 29 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనల కారణంగా మాలిక్ టీమిండియాలో కూడా చోటు దక్కించుకున్నాడు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన మాలిక్ భారత్ తరఫున 10 వన్డేలు, 8 టీ20లు ఆడి 24 వికెట్లు తీశాడు. సకారియా విషయానికొస్తే.. గుజరాత్లో పుట్టి దేశవాలీ క్రికెట్లో సౌరాష్ట్రకు ఆడే సకారియా గత సీజన్లో కేకేఆర్‌తో పాటే ఉన్నాడు. అయితే ఆ సీజన్లో అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. 2021లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన సకారియా ఆతర్వాత రెండు సీజన్ల పాటు (2022, 2023) రాజస్థాన్ రాయల్స్‌కు ఆడాడు. సకారియా తన ఐపీఎల్ కెరీర్లో 19 మ్యాచ్‌లు ఆడి 8.43 ఎకానమీతో 20 వికెట్లు తీశాడు. ఐపీఎల్ ప్రదర్శనల కారణంగా సకారియా భారత జట్టుకు ఆడే అవకాశం కూడా దక్కించుకున్నాడు. 2021లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సకారియా ఓ వన్డే, 2 టీ20లు ఆడి 3 వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా 46 టీ20లు ఆడిన సకారియా 65 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం కేకేఆర్ సకారియాను రూ. 75 లక్షల బేస్ ధరకు దక్కించుకుంది.ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2025లో కేకేఆర్ ప్రయాణం సీజన్ ఆరంభ మ్యాచ్‌తోనే మొదలవుతుంది. మార్చి 22న జరిగే మ్యాచ్‌లో కేకేఆర్ ఆర్సీబీని ఢీకొంటుంది. ఈ సీజన్లో కేకేఆర్‌కు కొత్త కెప్టెన్ వచ్చాడు. గత సీజన్లో టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్‌ను వెళ్లడంతో కేకేఆర్ మేనేజ్మెంట్ అజింక్య రహానేను నూతన కెప్టెన్‌గా ఎంపిక చేసుకుంది. రహానేకు డిప్యూటీగా (వైస్ కెప్టెన్) వెంకటేశ్ అయ్యర్ ఎంపికయ్యాడు.2025 ఐపీఎల్ సీజన్ కోసం కేకేఆర్ జట్టు..అజింక్య రహానే (కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్ (వైస్ కెప్టెన్), మనీశ్ పాండే, రింకూ సింగ్, రోవ్‌మన్ పావెల్, అంగ్క్రిష్ రఘువంశీ, అనుకూల్ రాయ్, మొయిన్ అలీ, రమన్‌దీప్ సింగ్, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, క్వింటన్ డికాక్, లవ్నిత్ సిసోడియా, రహ్మానుల్లా గుర్బాజ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, అన్రిచ్ నోర్జే, ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండే, హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్ -
IPL 2025: విధ్వంసం సృష్టించిన రింకూ సింగ్
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు కేకేఆర్ స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ ఫామ్‌లోకి వచ్చాడు. నిన్న (మార్చి 15) జరిగిన కేకేఆర్ ఇన్ట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో రింకూ 33 బంతులు ఎదుర్కొని 77 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా అతను ప్రాతినిథ్యం వహించిన టీమ్ పర్పుల్ టీమ్ గోల్డ్‌పై విజయం సాధించింది.ఐపీఎల్ ప్రారంభానికి మరి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండటంతో అన్ని ఫ్రాంచైజీలు ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాయి. ఇంట్రా స్క్కాడ్ మ్యాచ్‌లు ఆడుతూ బిజీగా గడుపుతున్నాయి. ఈ క్రమంలో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ కూడా ఇన్ట్రా స్క్వాడ్ మ్యాచ్‌లు ఆడుతుంది. నిన్న జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ రెండు టీమ్‌లుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. టీమ్ పర్పుల్‌కు అజింక్య రహానే.. టీమ్ గోల్డ్‌కు వెంకటేశ్ అయ్యర్ సారథ్యం వహించారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ గోల్డ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (61) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటాడు. లవ్నిత్ సిసోడియా 46 పరుగులతో రాణించాడు.అనంతరం 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమ్ పర్పుల్.. రింకూ సింగ్ చెలరేగడంతో 15.5 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. ప్రాక్టీస్ మ్యాచ్ కావడంతో విజయం సాధించాక కూడా మ్యాచ్‌ను కొనసాగించారు. రెండో లక్ష్యంగా టీమ్ పర్పుల్‌కు 250 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ లక్ష్యాన్ని కూడా టీమ్ పర్పుల్ మరో 13 బంతులు మిగిలుండగానే ఛేదించింది. మరో లక్ష్యంగా టీమ్ పర్పుల్‌కు 280 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే ఈసారి టీమ్ పర్పుల్ 280 పరుగుల లక్ష్యానికి 2 పరుగుల దూరంలో నిలిచిపోయింది. నిర్ణీత ఓవర్లలో టీమ్ పర్పుల్ 5 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. టీమ్ పర్పుల్ ఇన్నింగ్స్‌లో రింకూ సింగ్‌తో పాటు ఆండ్రీ రసెల్ (64 నాటౌట్), క్వింటన్ డికాక్ (52) చెలరేగిపోయారు.ఇదిలా ఉంటే, ఐపీఎల్-2025 సీజన్లో కేకేఆర్ జర్నీ లీగ్ ఆరంభ రోజున (మార్చి 22) ఆర్సీబీతో జరిగే మ్యాచ్‌తో మొదలవుతుంది. ఈ మ్యాచ్ కేకేఆర్ హెం గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది. గత సీజన్ ఫైనల్లో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని కేకేఆర్ సన్‌నైజర్స్ హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించి, తమ మూడో ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. గత సీజన్ తర్వాత శ్రేయస్ అయ్యర్ కేకేఆర్‌ను విడిచిపెట్టాడు. మెగా వేలంలో శ్రేయస్‌ను పంజాబ్ కొనుగోలు చేసింది. శ్రేయస్‌ను ఆ జట్టు కెప్టెన్‌గా కూడా ఎంపిక చేసింది. శ్రేయస్ వీడటంతో కేకేఆర్‌కు కెప్టెన్ ఎంపిక అనివార్యమైంది. మెగా వేలంలో బేస్ ధర రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేసిన అజింక్య రహానేను కేకేఆర్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అతనికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) వెంకటేశ్ అయ్యర్‌ను నియమించింది. తొలుత వెంకటేశ్ అయ్యర్‌నే కేకేఆర్ కెప్టెన్‌గా ఎంపిక చేస్తారని ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో రహానే ఎంట్రీ ఇచ్చి కెప్టెన్సీని ఎగరేసుకుపోయాడు. మెగా వేలంలో రహానేను కేకేఆర్ తొలుత పట్టించుకోలేదు. అమ్ముడుపోని ఆటగాళ్ల రౌండ్లో రహానేను కేకేఆర్ దక్కించుకుంది.2025 ఐపీఎల్ సీజన్ కోసం కేకేఆర్ జట్టు..అజింక్య రహానే (కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్ (వైస్ కెప్టెన్), మనీశ్ పాండే, రింకూ సింగ్, రోవ్‌మన్ పావెల్, అంగ్క్రిష్ రఘువంశీ, అనుకూల్ రాయ్, మొయిన్ అలీ, రమన్‌దీప్ సింగ్, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, క్వింటన్ డికాక్, లవ్నిత్ సిసోడియా, రహ్మానుల్లా గుర్బాజ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, అన్రిచ్ నోర్జే, ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండే, హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్ -
అందుకే అయ్యర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయలేదు.. కేకేఆర్ సీఈవో వివరణ
ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఏకంగా 23.75 కోట్లు పెట్టి కొనుకున్న వెంకటేశ్ అయ్యర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయకపోవడంపై కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ వివరణ ఇచ్చాడు. అయ్యర్ ఇంకా పరిణితి సాధించాల్సి ఉందని అన్నాడు. అయ్యర్ కెప్టెన్ మెటీరియలే అయినప్పటికీ.. అత్యున్నత బాధ్యతలు చేపట్టేందుకు అతనికి ఇంకా సమయం ఉందని తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్ కోసం కేకేఆర్ వెంకటేశ్ అయ్యర్‌ను కాదని అజింక్య రహానేను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. రహానేను కేకేఆర్ కేవలం రూ. 1.5 కోట్ల బేస్ ధరకు సొంతం చేసుకుంది. అందులోనూ ఓసారి అమ్ముడుపోకుండా, రెండోసారి వేలానికి వచ్చినప్పుడు దక్కించుకుంది. రహానేను కేకేఆర్ చివరి నిమిషంలో ప్లాన్ చేసుకుంది. అయినా కెప్టెన్సీని కట్టబెట్టింది. రహానే గతంలో ఓసారి కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 2022 సీజన్లో 7 మ్యాచ్‌లు ఆడాడు. 2024 సీజన్ టైటిల్ విన్నింగ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నిష్క్రమణ తర్వాత కేకేఆర్‌కు కెప్టెన్ ఎంపిక అనివార్యమైంది. తొలుత కెప్టెన్సీ రేసులో వెంకటేశ్ అయ్యర్ పేరు బలంగా వినిపించింది. ఈ విషయంపై అయ్యర్ బహిరంగంగా తన ఇష్టాన్ని వ్యక్తం చేశాడు. అంతిమంగా అయ్యర్‌ను రహానే డిప్యూటీగా (వైస్ కెప్టెన్) ఎంపిక చేశాడు. అయ్యర్.. రహానే అండర్లో కెప్టెన్సీ మెళకువలు నేర్చుకోవడంతో పాటు అనుభవం గడిస్తాడని కేకేఆర్ యాజమాన్యం భావిస్తుంది. అయ్యర్‌ను కేకేఆర్ ఫ్యూచర్ కెప్టెన్‌గా అనుకుంటుంది.మెగా వేలం తర్వాత కేకేఆర్ యాజమాన్యం వెంకటేశ్ అయ్యర్‌ను కెప్టెన్ చేయకపోవడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. అయితే రహానేను కెప్టెన్‌గా చేయడంతో కామ్ అయిపోయారు. అయ్యర్ 2021 నుంచి ఫ్రాంచైజీకి నమ్మకస్తుడిగా ఉండటంతో పాటు ఫ్రాంచైజీలో ప్రతి ఒక్కరితో మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతను కెప్టెన్ కావడం ఖాయమని అంతా భావించారు. అయితే కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ చివరి నిమిషంలో రహానేను తెరపైకి తెచ్చాడు. అనుభవం, ఒత్తిడిలో ప్రశాంతంగా వ్యవహరించగలిగే తత్వం రహానే ఎంపికకు ప్రధాన కారణాలని వెంకీ మైసూర్ చెప్పుకొచ్చాడు. జట్టును సమన్వయం చేసుకోవడం, మీడియాను అడ్రెస్ చేయడం, ఆఫ్ ద ఫీల్డ్ సంక్లిష్టతలను మేనేజ్ చేయడం లాంటి ఛాలెంజింగ్ విధులు నిర్వహించాలంటే రహానే లాంటి నాయకుడు తమకు అవసరమని మైసూర్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ లాంటి టోర్నీల్లో కెప్టెన్సీ అంటే కేవలం మైదానంలో తీసుకునే నిర్ణయాలు మాత్రమే కాదు, అనుభవంతో వచ్చే చాలా విషయాలు ఉంటాయని తెలిపాడు. అయ్యర్‌కు ఇవన్నీ వంటబట్టేందుకు సమయం పడుతుందని, అంతవరకు అతను రహానే అండర్లో ఈ విషయాలన్నీ నేర్చుకుంటాడని చెప్పుకొచ్చాడు.36 ఏళ్ల రహానే 2008లో లీగ్ ప్రారంభమైనప్పటి నుండి 17 సీజన్లలో వివిధ జట్లకు ప్రాతినిత్యం వహించాడు. 185 ఐపీఎల్ మ్యాచ్‌లు, 195 అంతర్జాతీయ ప్రదర్శనలు, టీమిండియా తరపున, దేశీయ క్రికెట్లో ముంబై తరపున, ఐపీఎల్లో వివిధ ఫ్రాంచైజీల తరపున కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించడం వంటి అంశాలు కేకేఆర్ కెప్టెన్‌గా ఎంపిక కావడానికి రహానేకు ఉన్న యోగ్యతలని తెలిపాడు. ఆటగాడిగా కూడా రహానే పట్ల మైసూర్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ఐపీఎల్-2025లో అతను చెలరేగుతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. -
కేకేఆర్‌కు గుడ్ న్యూస్.. అరివీర భయంకరమైన ఫామ్‌లో రహానే
ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు కేకేఆర్‌కు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు వెటరన్ ఆటగాడు అజింక్య రహానే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. తాజాగా బరోడాతో జరిగిన సెమీఫైనల్లో రెండు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఈ టోర్నీలో రహానే గత ఆరు మ్యాచ్‌ల్లో ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు.మహారాష్ట్రతో జరిగిన గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లో రహానే పరుగుల ప్రవాహం మొదలైంది. ఆ మ్యాచ్‌లో అతను 34 బంతుల్లో 52 పరుగుల చేశాడు. ఆతర్వాత కేరళతో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లో 68 పరుగులు చేశాడు. అనంతరం సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 బంతుల్లో 22 పరుగులు చేశాడు.రహానే విశ్వరూపం ఆంధ్రతో జరిగిన చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్‌తో మొదలైంది. ఈ మ్యాచ్‌లో రహానే 53 బంతుల్లో 95 పరుగులు చేశాడు. అనంతరం విదర్భతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 45 బంతుల్లో 84 పరుగులు చేశాడు. తాజాగా బరోడాతో జరిగిన సెమీస్‌లో 57 బంతుల్లో 98 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.ప్రస్తుత సీజన్లో (సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ) రహానే లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో రహానే 8 మ్యాచ్‌లు ఆడి 172 స్ట్రయిక్ రేట్‌తో 366 పరుగులు చేశాడు. బరోడాతో జరిగిన సెమీస్‌లో రహానే రఫ్ఫాడించడంతో ముంబై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఫైనల్‌కు చేరింది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. శాశ్వత్ రావత్ (33), కృనాల్ పాండ్యా (30), శివాలిక్ శర్మ (26 నాటౌట్), అథీత్ సేథ్ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. హార్దిక్ పాండ్యా 5 పరుగులకే ఔటై నిరాశపరిచాడు.159 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. రహానే మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో 17.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. రహానేకు జతగా శ్రేయస్ అయ్యర్ (46) కూడా కాసేపు మెరుపు మెరిపించాడు. ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు ఢిల్లీ, మధ్యప్రదేశ్ మధ్య రెండో సెమీఫైనల్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు డిసెంబర్ 15న జరిగే అంతిమ పోరులో ముంబైతో తలపడనుంది. కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో అజింక్య రహానేను కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు రూ.1.5 కోట్ల బేస్ ధరకు సొంతం చేసుకుంది. -
డాక్టర్ కానున్న కేకేఆర్ స్టార్ ప్లేయర్
కేకేఆర్ ప్రామిసింగ్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ త్వరలోనే డాక్టర్ కానున్నాడు. 2018లో ఎంబీఏ పూర్తి చేసిన అయ్యర్.. త్వరలోనే ఫైనాన్స్‌లో పీహెచ్డీ పూర్తి చేసి డాక్టర్ వెంకటేశ్ అయ్యర్‌గా పిలిపించుకుంటానంటున్నాడు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో అయ్యర్ ఈ విషయాన్ని వెల్లడించాడు.ఇంటర్వ్యూ సందర్భంగా అయ్యర్ మాట్లాడుతూ.. ఓ క్రికెటర్ 60 సంవత్సరాల వరకు క్రికెట్ ఆడలేడు. అయితే విద్య మాత్రం చనిపోయేంతవరకూ మనతోనే ఉంటుంది. బాగా చదువుకుంటే మైదానంలోనూ, నిజ జీవితంలోనూ సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. యువ క్రికెటర్లు చదువుకు కూడా సమ ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తానని అన్నాడు.కాగా, వెంకటేశ్ అయ్యర్‌కు ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత బెంగళూరులోని ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అయితే అయ్యర్ క్రికెట్ కోసం ఆ ఉద్యోగాన్ని తిరస్కరించాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో వెంకటేశ్ అయ్యర్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.23.75 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.కెప్టెన్సీ రేసులో అయ్యర్ఐపీఎల్ 2024లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడంలో వెంకటేశ్ అయ్యర్ కీలకపాత్ర పోషించాడు. అయినా మెగా వేలానికి ముందు కేకేఆర్ అతన్ని రిలీజ్ చేసింది. అయితే మెగా వేలంలో కేకేఆర్ ఊహించని విధంగా అయ్యర్‌పై భారీ మొత్తం వెచ్చింది తిరిగి సొంతం చేసుకుంది. శ్రేయస్ అయ్యర్ కేకేఆర్‌ను వీడటంతో ప్రస్తుతం ఆ ఫ్రాంచైజీ కెప్టెన్ పోస్ట్ ఖాళీగా ఉంది. వచ్చే సీజన్ కోసం కేకేఆర్ కెప్టెన్సీ రేసులో వెంకటేశ్ అయ్యర్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయ్యర్ నాలుగు సీజన్ల పాటు కేకేఆర్‌తో ఉన్నాడు.మరోవైపు కేకేఆర్ కెప్టెన్సీ కోసం అయ్యర్‌తో పాటు అజింక్య రహానే కూడా పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. మెగా వేలంలో కేకేఆర్ రహానేను 1.5 కోట్లకు సొంతం చేసుకుంది. కెప్టెన్సీ కట్టబెట్టేందుకే కేకేఆర్ యాజమాన్యం రహానే తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రహానేకు కెప్టెన్‌గా మంచి ట్రాక్ రికార్డు ఉంది. 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రహానే టీమిండియాను విజయవంతంగా ముందుండి నడిపించాడు. దేశవాలీ క్రికెట్లోనూ రహానే ముంబై జట్టును విజయవంతంగా ముందుండి నడిపిస్తున్నాడు. -
కేకేఆర్ ఆటగాడి విధ్వంసం.. ధనాధన్ వీరుల జట్టు ఓటమి
అబుదాబీ టీ10 లీగ్‌లో కేకేఆర్ ఆటగాడు రహ్మానుల్లా గుర్బాజ్ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో యూపీ నవాబ్స్కు నాయకత్వం వహిస్తున్న గుర్బాజ్ (ఆఫ్ఘనిస్తాన్).. డెక్కన్ గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 21 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. ఫలితంగా యూపీ నవాబ్స్.. విధ్వంసకర వీరులతో నిండిన గ్లాడియేటర్స్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గ్లాడియేటర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ధనాధన్ వీరులు టామ్ కొహ్లెర్ కాడ్మోర్ (22), రిలీ రొస్సో (10), నికోలస్ పూరన్ (8), జోస్ బట్లర్ (30), మార్కస్ స్టోయినిస్ (0), డేవిడ్ వీస్ (29), ఆజమ్ ఖాన్ (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. నవాబ్స్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 2 ఓవర్లలో కేవలం 6 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. బినుర ఫెర్నాండో 2 ఓవర్లలో 18 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. తైమాల్ మిల్స్ 2, అఖిలేశ్ ఓ వికెట్ దక్కించుకున్నారు.113 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నవాబ్స్ 8.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (52), ఆవిష్క ఫెర్నాండో (34) నవాబ్స్ విజయానికి గట్టి పునాది వేశారు. ఆండ్రీ ఫ్లెచర్ 7, డేవిడ్ మలాన్ 6, ఓడియన్ స్మిత్ 8 పరుగులు చేశారు. గ్లాడియేటర్స్ బౌలర్లలో రిచర్డ్ గ్లీసన్, స్టోయినిస్, ఇబ్రార్ అహ్మద్‌లకు తలో వికెట్ దక్కింది. ప్రస్తుత ఎడిషన్‌లో నవాబ్స్కు ఇది రెండో విజయం. గ్లాడియేటర్స్‌కు తొలి ఓటమి. కాగా, రెండు రోజుల కిందట జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో కేకేఆర్ ఫ్రాంచైజీ గుర్బాజ్‌ను 2 కోట్ల బేస్ ధరకు తిరిగి సొంతం చేసుకుంది. -
కేకేఆర్ ఖరీదైన ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ అందమైన భార్య (ఫోటోలు)
-
IPL 2025: కేకేఆర్ విడిచిపెట్టింది.. సెంచరీలతో విరుచుకుపడ్డారు..!
ఐపీఎల్ ఫ్రాంచైజీలు అక్టోబర్ 31న తాము రీటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. ఈ జాబితాలో చాలామంది స్టార్ ఆటగాళ్ల పేర్లు మిస్ అయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన కేకేఆర్ రింకూ సింగ్ (రూ. 13 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ. 12 కోట్లు), సునీల్ నరైన్ (రూ. 12 కోట్లు), ఆండ్రీ రసెల్ (రూ. 12 కోట్లు), హర్షిత్ రాణా (రూ. 4 కోట్లు), రమన్‌దీప్ సింగ్‌ను (రూ. 4 కోట్లు) అట్టిపెట్టుకుని.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సహా మిగతా ఆటగాళ్లనంతా వేలానికి వదిలేసింది.కేకేఆర్ రిటైన్ చేసుకున్న జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో మిచెల్ స్టార్క్, వెంకటేశ్ అయ్యర్ లాంటి ఆటగాళ్లు మనసు నొచ్చుకున్నారు. వెంకటేశ్ అయ్యర్ తన మనసులోని మాటను సోషల్‌మీడియాలో షేర్ చేసుకున్నాడు. కేకేఆర్ వదిలిపెట్టిన తర్వాత జరుగుతున్న తొలి రంజీ మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్ తన ప్రతాపాన్ని చూపాడు. రంజీల్లో మధ్యప్రదేశ్‌కు ఆడే వెంకటేశ్ అయ్యర్.. బీహార్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 113 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 118 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.కేకేఆర్ తనను వదిలేసిందన్న కోపమో ఏమో కానీ ఈ మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్ చాలా పట్టుదలగా ఆడి సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో వెంకటేశ్ అయ్యర్ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు కూడా సవాలు విసిరాడు. తానెంత విలువైన ఆటగాడినో అన్న విషయాన్ని వెంకటేశ్ అయ్యర్ ఫ్రాంచైజీలకు తెలియజేశాడు.మరోవైపు కేకేఆర్ వదిలేసిన మరో అయ్యర్ కూడా ఇవాళ శతకొట్టాడు. కేకేఆర్ మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. ఒడిషాతో జరుగుతున్న మ్యాచ్‌లో 164 బంతుల్లో 18 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 152 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ప్రస్తుత రంజీ సీజన్లో శ్రేయస్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం. తాజా ప్రదర్శనల నేపథ్యంలో ఐపీఎల్ 2025 మెగా వేలంలో శ్రేయస్‌కు మాంచి గిరాకీ ఏర్పడే అవకాశం ఉంది. -
IPL 2025: శ్రేయస్‌తో కేకేఆర్ కటీఫ్..?
ఐపీఎల్-2025 సీజన్ కోసం ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాల సమర్పణకు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. అక్టోబర్ 31లోగా ఫ్రాంచైజీలన్నీ తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల వివరాలను సమర్పించాలి. అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటికే తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్లపై ఓ క్లారిటీ కలిగి ఉన్నాయి.ఒక్కో ఫ్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. ఇందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లకు అవకాశం ఉంటుంది. రిటైన్ చేసుకునే క్యాప్డ్ ప్లేయర్లకు ఛాయిస్ ప్రకారం వరుసగా 18, 14, 11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. రిటైన్ చేసుకునే అన్క్యాప్డ్ ప్లేయర్‌కు 4 కోట్లు పారితోషికం చెల్లించాల్సి ఉంటుంది. ఐపీఎల్-2025 వేలం నవంబర్ 25 లేదా 26 తేదీల్లో రియాద్‌లో జరగవచ్చు.శ్రేయస్‌తో కేకేఆర్ కటీఫ్..?కేకేఆర్ విషయానికొస్తే.. ఈ ఫ్రాంచైజీ కూడా తమ రిటెన్షన్ జాబితాను సిద్దం చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే కేకేఆర్ ఈసారి కెప్టెన్ పేరు లేకుండానే ముందుకు సాగనున్నట్లు సమాచారం. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో కేకేఆర్ గత సీజన్ టైటిల్ గెలిచినప్పటికీ.. ఈసారి అతన్ని రిటైన్ చేసుకునేందుకు ఫ్రాంచైజీ యాజమాన్యం ఆసక్తి కనబర్చడం లేదని తెలుస్తుంది. రిటెన్షన్ జాబితా సమర్పణకు మరికొద్ది గంటలు సమయమే ఉన్నా ఇప్పటికీ ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ శ్రేయస్‌ను సంప్రదించలేదట. దీన్ని బట్టి చూస్తే కేకేఆర్ శ్రేయస్‌కు కటీఫ్ చెప్పడం ఖాయమని తెలుస్తుంది.ఇదిలా ఉంటే, శ్రేయస్ కోసం సొంత ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చనప్పటికీ.. మిగతా ఫ్రాంచైజీలు ఎగబడుతున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ శ్రేయస్ వేలానికి వస్తే ఇతన్ని దక్కించుకోవడం కోసం మూడు, నాలుగు ఫ్రాంచైజీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయట. కెప్టెన్‌గా శ్రేయస్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉండటంతో ఇతన్ని కెప్టెన్‌గా చేసేందుకు పలు ఫ్రాంచైజీలు ప్రణాళికలు సిద్దం చేసుకున్నాయని సమాచారం.కేకేఆర్ రిటైన్ చేసుకునే అవకాశం ఉన్న ఆటగాళ్లు..సునీల్ నరైన్ఆండ్రీ రసెల్ఫిలిప్ సాల్ట్రింకూ సింగ్ -
కన్నీటిపర్యంతమైన బ్రావో
విండీస్ దిగ్గజం డ్వేన్ బ్రావో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కరీబియన్ ప్రీమియర్ లీగ్-2024లో సెప్టెంబర్ 24న సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ బ్రావో కెరీర్లో చివరి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బ్రావో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. మ్యాచ్ అనంతరం బ్రావో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఉబికి వస్తున్న బాధను ఆపుకోలేక కన్నీటిపర్యంతమయ్యాడు. బ్రావో కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. Champion Dwayne Bravo announces his retirement from all formats of cricket.Know more: https://t.co/ljuWjTsGQS— CricTracker (@Cricketracker) September 27, 20242021లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన బ్రావో.. వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్ గెలిచిన రెండు సందర్భాల్లో (2012, 2016) ఆ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. బ్రావో పొట్టి క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. బ్రావో తన టీ20 కెరీర్లో 582 మ్యాచ్‌లు ఆడి 631 వికెట్లు పడగొట్టాడు. బ్రావో తాజాగా ఐపీఎల్లో కేకేఆర్ ఫ్రాంచైజీ మెంటార్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ 2025 నుంచి బ్రావో కేకేఆర్ మెంటార్‌గా వ్యవహరిస్తాడు. కాగా, 40 ఏళ్ల బ్రావో 2004లో తన అంతర్జాతీయ కెరీర్ మొదలుపెట్టాడు. నాటి నుంచి 2021 వరకు అతను విండీస్ జాతీయ జట్టుకు సేవలందించాడు. ఈ మధ్యలో 40 టెస్ట్‌లు, 164 వన్డేలు, 91 టీ20లు ఆడాడు. బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన బ్రావో తన అంతర్జాతీయ కెరీర్లో 6300 పైచిలుకు పరుగులు సాధించి, 363 వికెట్లు పడగొట్టాడు. బ్రావో 2008 నుంచి 2022 వరకు వివిధ ఫ్రాంచైజీల తరఫున ఐపీఎల్లో ఆడాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో బ్రావో 161 మ్యాచ్‌లు ఆడి 1560 పరుగులు చేసి 183 వికెట్లు తీశాడు. చదవండి: భారత్‌తో టెస్ట్ మ్యాచ్.. బంగ్లాదేశ్ వీరాభిమానిపై దాడి.. ఆసుపత్రికి తరలింపు -
IPL: కేకేఆర్ మెంటార్‌గా రాహుల్ ద్రవిడ్..?
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారైన నేపథ్యంలో ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్‌రైడర్స్ కొత్త మెంటార్ అన్వేషణలో పడింది. తమ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించాలని కేకేఆర్ టీమిండియా తాజా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను కోరినట్లు తెలుస్తుంది. ఇందుకు ద్రవిడ్ సైతం సుముఖత వ్యక్తం చేశాడని సమాచారం. ఒకవేళ ఈ డీల్ కుదిరితే ద్రవిడ్ వచ్చే సీజన్ (2025) నుంచి కేకేఆర్ మెంటార్‌గా వ్యవహరిస్తాడు.మరోవైపు టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు అధికారికంగా ప్రకటించడమే తరువాయి. హెడ్ కోచ్ పదవి విషయంలో గంభీర్-బీసీసీఐ మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని సమాచారం. గంభీర్ తన సహాయ సిబ్బందిని ఎంచుకునే విషయంలోనూ బీసీసీఐ పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు తెలుస్తుంది. గంభీర్ సక్సెస్ఫుల్ బ్యాటర్ కావడంతో తనే బ్యాటింగ్ కోచ్‌గా కూడా వ్యవహరించే అవకాశం ఉంది. గంభీర్ తనకు ఇష్టం వచ్చిన వారికి బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లుగా ఎంచుకోవచ్చు.టీమిండియా ఫీల్డింగ్ కోచ్ రేసులో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, దిగ్గజ ఫీల్డర్ జాంటీ రోడ్స్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. బౌలింగ్ కోచ్‌గా ఎవరుంటారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. మరో రెండు రోజుల్లో టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపడితే కేకేఆర్ మెంటార్షిప్ను వదులుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ద్రవిడ్ కేకేఆర్ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. కాగా, టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 వరల్డ్‌కప్ 2024తో ముగిసిన విషయం తెలిసిందే. -
IPL 2024: కేకేఆర్ స్టార్ పేసర్‌కు గ్రాండ్ వెల్కమ్
ఐపీఎల్ 2024 సీజన్ టైటిల్ గెలిచాక సొంత పట్టణం అంబాలకు (హర్యానా) విచ్చేసిన కేకేఆర్ స్టార్ పేసర్ వైభవ్ అరోరాకు ఘన స్వాగతం లభించింది. వైభవ్‌ను అతని సన్నిహితులు, అభిమానులు, అంబాల వాసులు డప్పు వాయిద్యాల మధ్య పూల మాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వైభవ్‌తో ఫోటోలు దిగేందుకు జనాలు ఎగబడ్డారు. అనంతరం వైభవ్ ఓపెన్ టాప్ జీపులో ర్యాలీగా వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. ఐపీఎల్ 2024 సీజన్ ముగిసి వారం రోజులు పూర్తయినా జనాలు ఇంకా అదే మూడ్‌లో ఉన్నారు. 27 ఏళ్ల వైభవ్ ఈ ఐపీఎల్ సీజన్లో అద్భుతమైన ప్రదర్శనలతో చెలరేగాడు. వైభవ్ ఈ సీజన్లో 10 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసి కేకేఆర్ విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. Vaibhav Arora gets a hero's welcome to his hometown after IPL win. 🏆pic.twitter.com/PhWOMk76Y6— Mufaddal Vohra (@mufaddal_vohra) June 1, 2024రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన వైభవ్.. సహచరుడు హర్షిత్ రాణా, మిచెల్ స్టార్క్‌లతో కలిసి కేకేఆర్ పేస్ అటాక్‌ను లీడ్ చేశాడు. లోయర్ ఆర్డర్లో ఉపయోగకర బ్యాటర్ కూడా అయిన వైభవ్‌ను కేకేఆర్ ఈ సీజన్ వేలంలో 60 లక్షలకు సొంతం చేసుకుంది. వైభవ్ ఇప్పటివరకు 21 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు పడగొట్టాడు. వైభవ్ దేశవాలీ క్రికెట్లో హిమాచల్ ప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తాడు. 2021లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన వైభవ్ ఆ సీజన్లో కేకేఆర్‌కు ఆడి ఆతర్వాతి సీజన్లో (2022) పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ సీజన్లో వైభవ్ తిరిగి కేకేఆర్ పంచన చేరాడు. ఈ సీజన్లో వైభవ్‌కు చాలా పాపులారిటీ వచ్చింది. సన్‌రైజర్స్‌తో జరిగిన ఫైనల్లో వైభవ్ 3 ఓవర్లలో 24 పరుగులిచ్చి అత్యంత కీలకమైన ట్రవిస్ హెడ్ వికెట్ తీశాడు. ఈ సీజన్ ప్రదర్శనల కారణంగా కేకేఆర్ తదుపరి సీజన్లోనూ ఇతన్ని రీటెయిన్ చేసుకునే అవకాశం ఉంది. -
IPL 2024: ఫైనల్లో ఎస్ఆర్హెచ్ చిత్తు.. చాంపియన్‌గా కేకేఆర్
-
సన్‌రైజర్స్ యజమానిని, కంటతడిపెట్టించిన కేకేఆర్..
-
IPL 2024: ఓ పక్క స్టార్క్.. మరోపక్క అయ్యర్..!
ఐపీఎల్ 2024 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఛాంపియన్‌గా అవతరించింది. నిన్న జరిగిన ఫైనల్లో ఈ జట్టు సన్‌రైజర్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, మూడో ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అంతిమ సమరంలో మిచెల్ స్టార్క్ (3-0-14-2), వెంకటేశ్ అయ్యర్ (26 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆరెంజ్ ఆర్మీని చెడుగుడు ఆడుకున్నారు. వీరికి రసెల్ (2.3-0-19-3), హర్షిత్ రాణా (4-1-24-2), సునీల్ నరైన్ (4-0-16-1), వరుణ్ చక్రవర్తి (2-0-9-1), రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా తోడవ్వడంతో కేకేఆర్ సునాయాస విజయం సాధించింది.క్వాలిఫయర్ మ్యాచ్‌లోనూ వీరిద్దరే.. నిన్నటి ఫైనల్లో సన్‌రైజర్స్‌ను డామేజ్ చేసిన స్టార్క్, వెంకటేశ్ అయ్యర్లు ఇదే సన్‌రైజర్స్‌ను క్వాలిఫయర్-1లోనూ ముప్పుతిప్పలు పెట్టారు. నాటి మ్యాచ్‌లోనూ స్టార్క్ అద్భుతమైన గణాంకాలు (4-0-34-3) నమోదు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకు ఎంపిక కాగా.. వెంకటేశ్ అయ్యర్ సైతం ఫైనల్లోలానే మెరుపు ఇన్నింగ్స్‌తో (28 బంతుల్లో 51 నాటౌట్) విరుచుకుపడ్డాడు. ఈ ఇద్దరు పోటీపడి మరీ సన్‌రైజర్స్‌పై దండయాత్ర చేసి వారికి టైటిల్ దక్కకుండా చేశారు.సీజన్ ఆరంభ మ్యాచ్‌ల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన స్టార్క్ కీలకమైన ప్లే ఆఫ్స్‌లో ఫామ్‌లోని వచ్చి కేకేఆర్ పాలిట గెలుపు గుర్రంగా మారగా.. వెంకటేశ్ అయ్యర్ సీజన్ స్టార్టింగ్ నుంచి ఓ మోస్తరు ప్రదర్శనలతో అలరించాడు. ప్లే ఆఫ్స్‌లో తిరుగులేని అయ్యర్.. నిన్నటి ఫైనల్‌తో వెంకటేశ్ అయ్యర్ ప్లే ఆఫ్స్ హీరో అని మరోసారి నిరూపించుకున్నాడు. అయ్యర్‌కు ప్లే ఆఫ్స్‌లో ఇది వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ (55, 50, 51*, 52*). ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఘనత మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనాకు దక్కుతుంది. రైనా ప్లే ఆఫ్స్‌లో ఏడు 50కి పైగా స్కోర్లు సాధించాడు.ఫైనల్స్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మిచెల్ స్టార్క్ ధాటికి 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో కమిన్స్ (24) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మెరుపు వీరులు అభిషేక్ శర్మ (2), ట్రివిస్ హెడ్ (0) దారుణంగా విఫలమయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్.. వెంకటేశ్ అయ్యర్ అజేయమైన మెరుపు అర్దశతకంతో విరుచుకుపడటంతో కేవలం 10.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకమైన ఇన్నింగ్స్ ఆడగా.. భీకర ఫామ్‌లో ఉన్న సునీల్ నరైన్ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్, షాబాజ్ అహ్మద్‌లకు తలో వికెట్ దక్కింది. -
ఐపీఎల్ 2024 ప్రైజ్ మనీ ఎవరికి ఎన్ని కోట్లు ?
-
KKR Wins IPL ‘హ్యాపీ నా పప్పా’: అటు పెద్దోడు, ఇటు చిన్నోడు : తండ్రీ కూతుళ్ల ఎమోషనల్ వీడియో
ఐపీఎల్-2024 టైటిల్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు చేజిక్కించుకుంది. 10 ఏళ్ల తర్వాత ట్రోఫీని గెల్చుకోడంతో కేకేఆర్ కో-ఫౌండర్ షారుఖ్ ఖాన్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సందర్భంగా మైదానంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన విజువల్స్నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి.An emotional moment between #ShahRukhKhan and #SuhanaKhan after marvelous victory of #KKRpic.twitter.com/yO6nBBgvo1— Suhana Khan (@SuhanaKhanClub) May 26, 2024ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన షారుఖ్ ప్యామిలీ, పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టైటిల్‌ను అందుకున్న ఆనంద క్షణాల్లో మునిగి తేలాయి. ఈ సందర్భంగా షారుఖ్ ముద్దుల తనయ సుహానా ఖాన్ పరుగున వచ్చి ‘‘మీరు సంతోషంగా ఉన్నారా’’అడిగింది. దీంతో సూపర్ స్టార్ ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఈ తండ్రీ- కూతుళ్ల ఆనంద క్షణాలు అటు ఫ్యాన్స్‌ను, ఇటు నెటిజనులు సంతోషంలో ముంచేశాయి.Suhana asking Shah “Are you happy” and the way AbRam and Aryan came to hug their papa @iamsrk … I can’t help my tears 😭💜pic.twitter.com/VjCxU5Nwsz— Samina ✨ (@SRKsSamina_) May 26, 2024ఆ తరువాత కాసేపటికే షారుఖ్ చిన్న కుమారుడు అబ్రామ్, తండ్రీ-కూతురు ద్వయం పరస్వరం గట్టిగా కౌగిలించుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఇంతలోనే పెద్ద కుమారుడు ఆర్యన్, హగ్గింగ్ ఫెస్ట్‌లో చేరి పోవడం విశేషం. అంతేకాదు చివరి పరుగుతో వెంకేటేష్ అయ్యర్ విజయాన్ని అందించడంతో బాలీవుడ్ రొమాన్స్ కింగ్ తన భార్య గౌరీ నుదిటిపై ముద్దు పెట్టుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. దీంతో ,ఇద్దరూ ఆనంద క్షణాల్లో మునిగి తేలిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. కాగా ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కేకేఆర్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ జట్టు కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కోల్‌కతా ఈ టార్గెట్‌ను కేవలం 10.3 ఓవర్లలోనే ముగించి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. వెంకటేష్ అయ్యర్ విన్నింగ్ షాట్‌తో 2012, 2014 తర్వాత ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది. దీంతో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత అత్యధిక సార్లు ట్రోఫీని గెలిచిన జట్టుగా కోల్‌కతా నిలిచింది. దీంతో షారుఖ్ ఖాన్ ఎమోషనల్ అయ్యాడు. -
IPL 2024: 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు
కేకేఆర్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ ఎవరికీ సాధ్యంకాని అత్యంత అరుదైన ఘనతను సాధించాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మూడు సార్లు అత్యంత విలువైన ఆటగాడి అవార్డు (MVP) అందుకున్న ఏకైక ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 2012.. తన డెబ్యూ సీజన్లో తొలిసారి ఈ అవార్డు అందుకున్న నరైన్.. 2018 సీజన్లో.. తాజాగా 2024 సీజన్లో అత్యంత విలువైన ఆటగాడి అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్లో 14 మ్యాచ్‌ల్లో 488 పరుగులు చేసి 17 వికెట్లు పడగొట్టిన నరైన్.. 2018 సీజన్లో 357 పరుగులు, 17 వికెట్లు.. 2012 సీజన్లో 24 వికెట్లు పడగొట్టాడు.ఈ సీజన్లో మెంటార్ గంభీర్ చొరవతో ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన నరైన్.. సుడిగాలి ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డాడు. ఈ సీజన్లో నరైన్ బ్యాట్ నుంచి సెంచరీ, 3 అర్దసెంచరీలు జాలువారాయి. సీజన్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నరైన్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో నరైన్ బౌలింగ్‌లోనూ సత్తా చాటాడు. 14 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసి సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 11వ స్థానంలో నిలిచాడు.ఇదిలా ఉంటే, కేకేఆర్ ఐపీఎల్లో తమ మూడో టైటిల్‌ను సొంతం చేసుకుంది. నిన్న (మే 26) జరిగిన 2024 సీజన్ ఫైనల్లో ఈ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి పదేళ్ల తర్వాత మరోసారి ఛాంపియన్‌గా అవతరించింది.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మిచెల్ స్టార్క్ (3-0-14-2, 2 క్యాచ్‌లు) ధాటికి 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో కమిన్స్ (24) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మెరుపు వీరులు అభిషేక్ శర్మ (2), ట్రివిస్ హెడ్ (0) దారుణంగా విఫలమయ్యారు. కమిన్స్ కాకుండా మార్క్రమ్ (20), నితీశ్ రెడ్డి (13), క్లాసెన్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కేకేఆర్ బౌలర్లలో స్టార్క్‌తో పాటు రసెల్ (2.3-0-19-3), హర్షిత్ రాణా (4-1-24-2), సునీల్ నరైన్ (4-0-16-1), వరుణ్ చక్రవర్తి (2-0-9-1) ఇరగదీశారు. వైభవ్ అరోరా ఓ వికెట్ పడగొట్టాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్.. వెంకటేశ్ అయ్యర్ అజేయమైన మెరుపు అర్దశతకంతో (26 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో కేవలం 10.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకమైన ఇన్నింగ్స్ ఆడగా.. భీకర ఫామ్‌లో ఉన్న సునీల్ నరైన్ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. వెంకటేశ్ అయ్యర్‌తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6) అజేయంగా నిలిచి కేకేఆర్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్, షాబాజ్ అహ్మద్‌లకు తలో వికెట్ దక్కింది. -
IPL 2024: కేకేఆర్ వెనుక 'గంభీరం'
ఐపీఎల్ 2024 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజేతగా ఆవిర్భవించింది. నిన్న (మే 26) జరిగిన ఫైనల్లో ఈ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి మూడోసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఈ సీజన్లో ఆధ్యాంతం అద్భుత విజయాలు సాధించిన కేకేఆర్ ఫైనల్ మ్యాచ్‌లోనూ అన్ని రంగాల్లో సత్తా చాటి పదేళ్ల తర్వాత మరోసారి ఐపీఎల్ కిరీటాన్ని సొంతం చేసుకుంది.Shreyas Iyer handed the Trophy to Rinku Singh for celebration.- The Leader. 👌 pic.twitter.com/V8Pb55ZPQX— Johns. (@CricCrazyJohns) May 26, 2024ఆటగాళ్లతో సమానమైపాత్ర..ఈ సీజన్లో కేకేఆర్ విజయాల్లో ఆటగాళ్ల పాత్ర ఎంత ఉందో జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ పాత్ర కూడా అంతే ఉంది. ఈ సీజన్‌తోనే కేకేఆర్ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టిన గంభీర్.. ఆ జట్టు సాధించిన ప్రతి విజయంలోనూ తనదైన ముద్ర వేశాడు.Third most successful IPL franchise in league history - KKR. pic.twitter.com/bYnKkbujXi— Johns. (@CricCrazyJohns) May 26, 2024పేరుకు తగ్గట్టుగానే గంభీరంగా..ఆన్ ఫీల్డ్ అయినా.. ఆఫ్ ద ఫీల్డ్ అయినా గంభీరంగా కనిపించే గంభీర్ పేరుకు తగ్గట్టుగానే కేకేఆర్ విజయాల్లో గంభీరమైన పాత్ర పోషించాడు. గంభీర్ తనకు మాత్రమే సాధ్యమైన సాహసోపేతమైన నిర్ణయాలతో కేకేఆర్‌ను గెలుపుబాట పట్టించాడు. గంభీర్ ఆధ్వర్యంలో కేకేఆర్ ఈ సీజన్లో కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడింది. Gautam Gambhir with IPL Trophy. ❤️ pic.twitter.com/LI2HLwEpiH— Johns. (@CricCrazyJohns) May 26, 2024నరైన్ సక్సెస్ వెనుక కూడా గంభీరుడే..సునీల్ నరైన్‌కు ఓపెనర్‌గా ప్రమోషన్ ఇచ్చి సత్ఫలితాలు రాబట్టిన ఘనత గంభీర్‌దే. అలాగే ఫైనల్స్ హీరో మిచెల్ స్టార్క్‌ను దక్కించుకోవడంలోనూ గంభీరే ప్రధానపాత్ర పోషించాడని అంతా అంటారు. యువ పేసర్లు హర్షిత్ రాణా, వైభవ్ అరోరాలను ప్రోత్సాహించడంలోనూ.. వెటరన్ ఆండ్రీ రసెల్‌ను వెనకేసుకురావడంలోనూ గంభీర్‌దే ప్రధానమైన పాత్ర. SUNIL NARINE - The MVP of IPL 2024. Greatest of KKR...!!!!! pic.twitter.com/1IBdxl1qRk— Johns. (@CricCrazyJohns) May 26, 2024శ్రేయస్‌ను వెన్నుతట్టి.. వెంకటేశ్‌పై విశ్వాసముంచి..శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్‌లపై విశ్వాసముంచి వారి నుంచి సత్ఫలితాలు రాబట్టిన ఘనత కూడా గంభీర్‌కే దక్కుతుంది. రింకూ సింగ్, రమన్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి లాంటి లోకల్ టాలెంట్లకు కూడా గంభీర్ అండగా నిలిచాడు. ఇలా ఏరకంగా చూసుకున్నా కేకేఆర్‌కు పూర్వవైభవం దక్కడంలో గంభీర్ పాత్ర ప్రధానమైందనడంలో ఎలాంటి సందేహాం లేదు.KKR players taking Gautam Gambhir in their shoulders. 👌 pic.twitter.com/XspysKKbiM— Johns. (@CricCrazyJohns) May 26, 2024సొంత అభిమానులచే ఛీత్కారాలు ఎదుర్కొన్న స్థాయి నుంచి..గడిచిన ఆరు సీజన్లలో పేలవ ప్రదర్శనతో సొంత అభిమానల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొన్న కేకేఆర్.. గంభీర్ రాకతో ఒక్కసారిగా నూతనోత్సాహాన్ని అందుకుని టైటిల్ ఎగరేసుకుపోయింది.షారుఖ్ పట్టుబట్టి మరీ..కేకేఆర్ సహ యజమాని షారుఖ్ ఖాన్ ఈ సీజన్ కోసం గంభీర్‌ను పట్టుబట్టి మరీ ఒప్పించి లక్నో సూపర్ జెయింట్స్ నుంచి పిలిపించుకున్నాడు. మెంటార్‌గా గంభీర్‌కు కేకేఆర్ కొత్తేమో కానీ ఆటగాడిగా, కెప్టెన్‌గా గంభీర్ కేకేఆర్ అభిమానులకు సుపరిచితుడు. ఈ సీజన్లో మెంటార్‌గా కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపిన గంభీర్.. 2012, 2014 సీజన్లలో కెప్టెన్‌గా కేకేఆర్‌కు టైటిల్స్ అందించాడు. Gautam Gambhir & King of Indian Cinema Shah Rukh Khan with IPL Trophy 💜- The Frame for KKR legacy. pic.twitter.com/pfrFw9prKe— Johns. (@CricCrazyJohns) May 27, 2024కేకేఆర్ కెప్టెన్‌గా గంభీర్ ప్రస్తానం దీనితోనే ఆగిపోలేదు. గంభీర్ నేతృత్వంలో కేకేఆర్ 2016, 2017 సీజన్లలోనే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. దీనికి ముందు 2011 సీజన్లోనూ గంభీర్ సారథ్యంలో కేకేఆర్ ప్లే ఆఫ్స్‌కు చేరింది. కేకేఆర్ కెప్టెన్‌గా ఏడు సీజన్ల పాటు కొనసాగిన గంభీర్ ఈ జట్టును రెండుసార్లు ఛాంపియన్‌గా.. మూడు సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు.. రెండు సీజన్లలో (2013, 2015) లీగ్ దశ వరకు విజయవంతంగా నడిపించాడు. తాజాగా మెంటార్‌గా బాధ్యతలు చేపట్టి తన ఆధ్వర్యంలో మూడోసారి కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. Shah Rukh Khan kissing Gautam Gambhir 💜- SRK brings back Gambhir again and he has written a great comeback story. pic.twitter.com/gcAjm1S2Bh— Johns. (@CricCrazyJohns) May 26, 2024షారుఖ్ విశ్వాసాన్ని నిలుపుకున్నాడు..కేకేఆర్ బాస్ షారుఖ్‌కు తనపై అపార విశ్వాసమున్నట్లు గంభీరే స్వయంగా పలు సందర్భాల్లో చెప్పాడు. ఈ నమ్మకాన్ని నిలుపుకుంటూ గంభీర్ పదేళ్ల తర్వాత తిరిగొచ్చి కేకేఆర్‌కు టైటిల్‌ను అందించాడు. తాజాగా కేకేఆర్ టైటిల్ గెలిచిన అనంతరం షారుఖ్ ఖాన్ గంభీర్ నుదిటిపై ముద్దు పెట్టుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. దీనికి సంబంధించిన చిత్రాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. -
కేకేఆర్ విజయంతో బెంగాల్లో సంబరాలు మిన్నంటాయి: సీఎం మమత
కోల్కత్తా: ఐపీఎల్-17(2024)లో విజేతగా నిలిచిన కోల్కత్తా నైట్‌రైడర్ జట్టును పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభినందించారు. ఈ ఐపీఎల్ సీజన్లో రికార్డులు బద్దలు కొట్టినందుకు ప్లేయర్స్‌కు వ్యక్తిగతంగా అభినందనలు తెలిపారు.కాగా, మమతా బెనర్జీ ట్విట్టర్ వేదికగా..‘కోల్‌కతా నైట్ రైడర్స్ విజయంతో బెంగాల్ అంతటా సంబరాలు మిన్నంటాయి. ఈ ఐపీఎల్ సీజన్లో రికార్డు బద్దలు కొట్టినందుకు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, ఫ్రాంచైజీని వ్యక్తిగతంగా అభినందించాలనుకుంటున్నాను. రాబోయే సంవత్సరాల్లో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. Kolkata Knight Riders' win has brought about an air of celebration all across Bengal.I would like to personally congratulate the players, the support staff and the franchise for their record breaking performance in this season of the IPL.Wishing for more such enchanting…— Mamata Banerjee (@MamataOfficial) May 26, 2024 ఇక, ఐపీఎల్-17 సీజన్లో కేకేఆర్ అద్భుత ఆటతీరును కనబరిచింది. సీజన్ ప్రారంభం నాటి నుంచి దూకుడుగా ఆడుతూ టేబుట్ టాపర్‌గా నిలిచింది. చివరగా ఫైనల్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసి 114 లక్ష్యాన్ని కేవలం పదో ఓవర్లోనే పూర్తి చేసింది. కాగా, ఈ సీజన్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా కేకేఆర్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ నిలిచాడు. ICYMI! That special run to glory 💫💜Recap the #Final on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #KKRvSRH | #TheFinalCall pic.twitter.com/qUDfUFHpka— IndianPremierLeague (@IPL) May 26, 2024 📽️ 𝗥𝗔𝗪 𝗥𝗘𝗔𝗖𝗧𝗜𝗢𝗡𝗦Moments of pure joy, happiness, jubilation, and happy tears 🥹 What it feels to win the #TATAIPL Final 💜Scorecard ▶️ https://t.co/lCK6AJCdH9#KKRvSRH | #Final | #TheFinalCall | @KKRiders pic.twitter.com/987TCaksZz— IndianPremierLeague (@IPL) May 26, 2024 -
IPL 2024 Final: కేకేఆర్‌కు అచ్చొచ్చిన 'M'
ఐపీఎల్ 2024 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజేతగా ఆవిర్భవించింది. నిన్న (మే 26) జరిగిన ఫైనల్లో ఈ జట్టు సన్‌రైజర్స్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి మూడోసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.అంతిమ సమరంలో మిచెల్ స్టార్క్ అద్భుతంగా రాణించి కేకేఆర్‌ను పదేళ్ల తర్వాత మరోసారి ఛాంపియన్‌గా నిలబెట్టాడు. ఫైనల్లో స్టార్క్ 3 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు, రెండు క్యాచ్‌లు పట్టాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.ఐపీఎల్ చరిత్రలో నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒకటి కంటే ఎక్కువ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా స్టార్క్ చరిత్ర సృష్టించాడు. స్టార్క్ సన్‌రైజర్స్‌తోనే జరిగిన తొలి క్వాలిఫయర్లోనూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా (4-0-34-3) నిలిచాడు.సీజన్ ఆరంభంలో దారుణంగా విఫలమైన స్టార్క్ అత్యంత కీలకమైన నాకౌట్ మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించి కేకేఆర్‌కు పదేళ్ల తర్వాత మరోసారి టైటిల్‌ను అందించాడు. ఓవరాల్‌గా చూస్తే ఈ సీజన్లో స్టార్క్ సన్‌రైజర్స్ పాలిట విలన్‌గా దాపురించాడు.మరోసారి కలిసొచ్చిన 'M'ఇదిలా ఉంటే, ఐపీఎల్ ఫైనల్స్‌లో కేకేఆర్‌కు 'M' అక్షరం మరోసారి కలిసొచ్చింది. కేకేఆర్ ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన మూడు సందర్భాల్లో ఈ అక్షరంతో పేరు మొదలయ్యే ఆటగాళ్లే ఆ జట్టు పాలిట గెలుపు గుర్రాలయ్యారు. MMM2012లో మన్విందర్ బిస్లా, 2014లో మనీశ్ పాండే, తాజాగా మిచెల్ స్టార్క్ ఫైనల్స్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌లుగా నిలిచి కేకేఆర్‌కు టైటిల్స్ అందించారు. దీన్ని బట్టి చూస్తే ఐపీఎల్ ఫైనల్స్‌లో కేకేఆర్‌కు M అక్షరం సెంటిమెంట్ బాగా అచ్చొచ్చిందని స్పష్టమవుతుంది.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ మిచెల్ స్టార్క్ ధాటికి 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో కెప్టెన్ కమిన్స్ (24) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మెరుపు వీరులు, ఓపెనర్లు అభిషేక్ శర్మ (2), ట్రివిస్ హెడ్ (0) సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరిగారు. కమిన్స్ కాకుండా మార్క్రమ్ (20), నితీశ్ రెడ్డి (13), క్లాసెన్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కేకేఆర్ బౌలర్లలో స్టార్క్‌తో పాటు రసెల్ (2.3-0-19-3), హర్షిత్ రాణా (4-1-24-2), సునీల్ నరైన్ (4-0-16-1), వరుణ్ చక్రవర్తి (2-0-9-1) ఇరగదీశారు. వైభవ్ అరోరా ఓ వికెట్ పడగొట్టాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్.. వెంకటేశ్ అయ్యర్ అజేయమైన మెరుపు అర్దశతకంతో (26 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో కేవలం 10.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకమైన ఇన్నింగ్స్ ఆడగా.. భీకర ఫామ్‌లో ఉన్న సునీల్ నరైన్ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. వెంకటేశ్ అయ్యర్‌తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6) అజేయంగా నిలిచి కేకేఆర్‌కు పదేళ్ల తర్వాత మరో టైటిల్‌ను అందించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్, షాబాజ్ అహ్మద్‌లకు తలో వికెట్ దక్కింది. సిరీస్ ఆధ్యాంతం బ్యాట్‌తో (14 మ్యాచ్‌ల్లో 488 పరుగులు), బంతితో (17 వికెట్లు) మాయ చేసిన సునీల్ నరైన్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. -
IPL 2024 Final: సన్‌రైజర్స్‌కు గుండెకోత.. చరిత్ర సృష్టించిన స్టార్క్
చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా నిన్న (మే 26) జరిగిన ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజేతగా ఆవిర్భవించింది. తుది సమరంలో కేకేఆర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి మూడోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో సన్‌రైజర్స్ తమ ప్రధాన బలమైన బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. నమ్మకాన్ని వమ్ము చేయని స్టార్క్కేకేఆర్ పేసర్, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు మిచెల్ స్టార్క్ తనపై యాజమాన్యం పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా తనకు లభించిన ధరకు న్యాయం చేశాడు. అంతిమ సమరంలో స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేసి సన్‌రైజర్స్‌కు గుండెకోత మిగిల్చాడు. అతను 3 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు, రెండు క్యాచ్‌లు పట్టాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో తొలి ఆటగాడుఐపీఎల్ చరిత్రలో నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒకటి కంటే ఎక్కువ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా స్టార్క్ చరిత్ర సృష్టించాడు. స్టార్క్ సన్‌రైజర్స్‌తోనే జరిగిన తొలి క్వాలిఫయర్లోనూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా (4-0-34-3) నిలిచాడు. సీజన్ ఆరంభంలో దారుణంగా విఫలమైన స్టార్క్ అత్యంత కీలకమైన నాకౌట్ మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించి కేకేఆర్‌కు పదేళ్ల తర్వాత మరోసారి టైటిల్‌ను అందించాడు. ఓవరాల్‌గా చూస్తే ఈ సీజన్లో స్టార్క్ సన్‌రైజర్స్ పాలిట విలన్లా దాపురించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి అత్యుత్సాహంగా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లైనా కూడా ఆడకుండానే (18.3 ఓవర్లు) 113 పరుగులకు చాపచుట్టేసింది. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో కెప్టెన్ కమిన్స్ (24) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మెరుపు వీరులు, ఓపెనర్లు అభిషేక్ శర్మ (2), ట్రివిస్ హెడ్ (0) దారుణంగా నిరాశపరిచారు. కమిన్స్ కాకుండా మార్క్రమ్ (20), నితీశ్ రెడ్డి (13), క్లాసెన్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కేకేఆర్ బౌలర్లలో స్టార్క్‌తో పాటు రసెల్ (2.3-0-19-3), హర్షిత్ రాణా (4-1-24-2), సునీల్ నరైన్ (4-0-16-1), వరుణ్ చక్రవర్తి (2-0-9-1) ఇరగదీశారు. వైభవ్ అరోరా ఓ వికెట్ పడగొట్టాడు.The winning by Celebration by Kolkata Knight Riders after winning the third IPL title. 🏆 pic.twitter.com/OgQBi87Kzt— Johns. (@CricCrazyJohns) May 26, 2024ఆడుతూ పాడుతూ..అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్.. వెంకటేశ్ అయ్యర్ అజేయమైన మెరుపు అర్దశతకంతో (26 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో కేవలం 10.3 ఓవర్లలోనే ఆడుతూ పాడుతూ విజయతీరాలకు చేరింది. రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకమైన ఇన్నింగ్స్ ఆడగా.. భీకర ఫామ్‌లో ఉన్న సునీల్ నరైన్ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. వెంకటేశ్ అయ్యర్‌తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6) అజేయంగా నిలిచి కేకేఆర్‌కు పదేళ్ల తర్వాత మరో టైటిల్‌ను అందించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్, షాబాజ్ అహ్మద్‌లకు తలో వికెట్ దక్కింది. గత సీజన్లో టేబుల్ చివర్లో ఉండిన సన్‌రైజర్స్ ఈ సీజన్లో రన్నరప్‌గా నిలవడం ఆ జట్టు అభిమానులకు ఊరట కలిగించే అంశం. సిరీస్ ఆధ్యాంతం బ్యాట్‌తో (14 మ్యాచ్‌ల్లో 488 పరుగులు) ఇరగదీసి, బంతితో (17 వికెట్లు) మాయ చేసిన సునీల్ నరైన్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. -
IPL 2024 Final: వార్న్, రోహిత్, హార్దిక్ సరసన కమిన్స్ చేరేనా..?
ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్ ఇవాళ (మే 26) రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా కేకేఆర్.. సన్‌రైజర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో పలు ఆసక్తికర అంశాలు తెరపైకి వస్తున్నాయి. అందులో తొలి సీజన్లోనే టైటిల్ కైవసం చేసుకున్న కెప్టెన్ల విషయం అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. కేవలం ముగ్గురు మాత్రమే..16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకే కేవలం ముగ్గురు కెప్టెన్లు మాత్రమే తొలి సీజన్లోనే టైటిల్ గెలిచారు. తొట్ట తొలి సీజన్లో (2008) షేన్ వార్న్ (రాజస్థాన్ రాయల్స్), 2013 సీజన్లో రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్), 2022 సీజన్లో హార్దిక్ పాండ్యా (గుజరాత్ టైటాన్స్) ఐపీఎల్ టైటిల్ గెలిచారు. ప్రస్తుత సీజన్ ఫైనల్లో తలపడుతున్న పాట్ కమిన్స్ కూడా కెప్టెన్ ఇదే తొలి సీజన్ కావడంతో అతనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కెప్టెన్‌గా పాట్ ట్రాక్ రికార్డు చూస్తే వార్న్, రోహిత్, హార్దిక్ సరసన చేరడం ఖాయంగా కనిపిస్తుంది. మరి నేటి ఫైనల్లో కమిన్స్ ఏం చేస్తాడో వేచి చూడాలి. కేవలం బ్యాటింగ్‌ను నమ్ముకున్న సన్‌రైజర్స్.. అన్ని విభాగాల్లో సత్తా చాటుతున్న కేకేఆర్‌ను ఏమేరకు నిలువరిస్తుందో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. అలా చూస్తే కేకేఆర్‌దే టైటిల్..గత ఆరు సీజన్లలో క్వాలిఫయర్-1లో గెలిచిన జట్టే టైటిల్ గెలుస్తుంది. ఈ సెంటిమెంట్‌నే కేకేఆర్ కొనసాగిస్తుందో లేక సన్‌రైజర్స్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తుందో చూడాలి. ఈ ఏడాది సన్‌రైజర్స్ మరో టైటిల్ గెలుస్తుందా..?మరోవైపు సన్‌రైజర్స్‌కు ఈ ఏడాది బాగా కలిసొచ్చినట్లు కనిపిస్తుంది. ఈ ఫ్రాంచైజీ ఈ ఏడాది సౌతాఫ్రికా టీ20 లీగ్ గెలిచి అదే జోరును ఐపీఎల్‌లోనూ కొనసాగిస్తుంది. ఫైనల్లో హాట్ ఫేవరెట్ కేకేఆరే అయినప్పటికీ.. కమిన్స్ కెప్టెన్సీ సామర్థ్యం, బ్యాటర్ల విధ్వంసంపై ఆరెంజ్ ఆర్మీ అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఎస్ఆర్హెచ్ అభిమానులు అంచనాలు నిజమైతే ఐపీఎల్ టైటిల్ గెలిచిన నాలుగో ఆసీస్ ఆటగాడిగా కమిన్స్ రికార్డు బుక్కుల్లోకెక్కుతాడు. కేకేఆర్‌కు చెపాక్ స్పెషల్..మరోవైపు చెపాక్ మైదానంతో కేకేఆర్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. 12 ఏళ్ల క్రితం కేకేఆర్ ఇక్కడే తమ తొలి ఐపీఎల్ టైటిల్ నెగ్గింది. కేకేఆర్ చెపాక్ సెంటిమెంట్ కూడా తమకు వర్కౌట్ అవుతుందని అశిస్తుంది. ఈ సీజన్లో సన్‌రైజర్స్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం తమనే వరించడంపై కూడా కేకేఆర్ ధీమాగా ఉంది. ఫైనల్లో మరోసారి ఎస్ఆర్హెచ్ను మట్టికరిపించి ఈ సీజన్లో హ్యాట్రిక్ విక్టరీ నమోదు చేస్తామని కేకేఆర్ ధీమాగా ఉంది. -
IPL 2024 KKR vs SRH: ఐపీఎల్ విన్నర్లు, రన్నరప్స్ వీరే..!
ఐపీఎల్ 2024 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. కేకేఆర్, సన్‌రైజర్స్ మధ్య నేడు (మే 26) జరుగబోయే ఫైనల్‌తో ఐపీఎల్ 17వ సీజన్ విజేత ఎవరో తేలిపోనుంది. ఈ సీజన్ గత సీజన్లకు భిన్నంగా సాగింది. బ్యాటింగ్‌కు సంబంధించి ఆల్‌టైమ్ రికార్డులు బద్దలుకావడంతో పాటు పలు సంచలన బౌలింగ్ ప్రదర్శనలు నమోదయ్యాయి. చెరి ఐదసార్లు ఛాంపియన్లైన ముంబై, సీఎస్కే ఈ సీజన్లో ప్లే ఆఫ్స్‌కు కూడా చేరకుండానే నిష్క్రమించాయి. దిగ్గజ కెప్టెన్లు రోహిత్, ధోని లేకుండా జరుగుతున్న ఐదో ఐపీఎల్ ఫైనల్ ఇది.ఐపీఎల్ 2024 ఫైనల్ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన 16 సీజన్లలో విజేతలు, రన్నరప్లపై ఓ లుక్కేద్దాం. ఇప్పటివరకు జరిగిన 16 ఫైనల్స్‌లో సీఎస్కే (2010, 2011, 2018, 2021, 2023), ముంబై (2013, 2015, 2017, 2019, 2020) చెరి ఐదుసార్లు టైటిల్ కైవసం చేసుకోగా.. కేకేఆర్ రెండు (2012, 2014), సన్‌రైజర్స్ (2016), రాజస్థాన్ రాయల్స్ (2008), గుజరాత్ టైటాన్స్ (2022), డెక్కన్ ఛార్జర్స్ (2009) తలో సారి టైటిల్ నెగ్గాయి. అత్యధికసార్లు రన్నరప్‌గా నిలిచిన ఘనత సీఎస్కేకు దక్కింది. సీఎస్కే ఐదుసార్లు (2008, 2012, 2013, 2015, 2019) ఫైనల్లో ఓటమిపాలైంది.ఆతర్వాత ఆర్సీబీ మూడు సార్లు (2009, 2011, 2016).. ముంబై ఇండియన్స్ (2010), కేకేఆర్ (2021), సన్‌రైజర్స్ (2018), రాజస్థాన్ రాయల్స్ (2022), గుజరాత్ టైటాన్స్ (2023), పంజాబ్ కింగ్స్ (2014), ఢిల్లీ క్యాపిటల్స్ (2020), రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ (2017) తలో సారి రన్నరప్‌గా నిలిచాయి.సీజన్ల వారీగా విజేతలు, రన్నరప్స్..2008- రాజస్థాన్ రాయల్స్ (విజేత), సీఎస్కే (రన్నరప్)2009- డెక్కన్ ఛార్జర్స్ (విజేత), ఆర్సీబీ (రన్నరప్)2010- సీఎస్కే (విజేత), ముంబై ఇండియన్స్ (రన్నరప్)2011- సీఎస్కే (విజేత), ఆర్సీబీ (రన్నరప్)2012- కేకేఆర్ (విజేత), సీఎస్కే (రన్నరప్)2013- ముంబై (విజేత), సీఎస్కే (రన్నరప్)2014- కేకేఆర్ (విజేత), పంజాబ్ (రన్నరప్)2015- ముంబై (విజేత), సీఎస్కే (రన్నరప్)2016- సన్‌రైజర్స్ (విజేత), ఆర్సీబీ (రన్నరప్)2017- ముంబై (విజేత), పూణే (రన్నరప్)2018- సీఎస్కే (విజేత), సన్‌రైజర్స్ (రన్నరప్)2019- ముంబై (విజేత), సీఎస్కే (రన్నరప్)2020- ముంబై (విజేత), ఢిల్లీ (రన్నరప్)2021- సీఎస్కే (విజేత), కేకేఆర్ (రన్నరప్)2022- గుజరాత్ (విజేత), రాజస్థాన్ (రన్నరప్)2023- సీఎస్కే (విజేత), గుజరాత్ (రన్నరప్) -
IPL 2024 ఫైనల్ జోరుగా బెట్టింగ్..
-
ఫైనల్లో తలపడనున్న SRH, KKR జట్లు
-
SRH Vs KKR IPL 2024 Final: జై జై రైజర్స్
ఐపీఎల్– 2024లో తుది సమరానికి రంగం సిద్ధమైంది. 65 రోజులు, 73 మ్యాచ్‌ల తర్వాత ఐపీఎల్–17 విజేతను తేల్చే మ్యాచ్‌కు ఆదివారం చెన్నై వేదికవుతోంది. హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్‌కు ఆనందాన్ని పంచుతూ ఫైనల్ చేరిన సన్‌రైజర్స్ టీమ్ ఆఖరి పంచ్ ఇవ్వాలని పట్టుదలగా ఉంది. తొలి క్వాలిఫయర్‌లో తమను దెబ్బ తీసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇప్పుడు మళ్లీ ప్రత్యర్థి రూపంలో ఎదురుగా ఉంది. గత మ్యాచ్‌కు ప్రతీకారం తీర్చుకుంటూ రైజర్స్ చెలరేగితే రెండోసారి లీగ్ చాంపియన్‌గా సగర్వంగా నిలవవచ్చు. 2016లో ఆఖరిసారిగా టైటిల్ సాధించిన హైదరాబాద్ 2018లో ఫైనల్ చేరి తుది మెట్టుపై తడబడింది. 2012, 2014లలో ఐపీఎల్ గెలుచుకున్న కోల్‌కతా ఇప్పుడు మూడోసారి ట్రోఫీపై గురి పెట్టింది. మ్యాచ్ చెన్నైలో జరుగుతుండడంతో మన నగర అభిమానుల మనసంతా అక్కడే ఉందనేది వాస్తవం. హైదరాబాద్ గెలిస్తే సారథిగా మన నగరానికి టైటిల్ అందించిన మూడో ఆస్ట్రేలియన్‌గా కమిన్స్ నిలుస్తాడు. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ ఫైనల్ ఆదివారం చెన్నైలో జరుగుతున్నప్పటికీ మన నగరంలోనే జరుగుతున్నంత కోలాహలం నెలకొంది. దీని కోసం నగరంలోని రెస్టారెంట్లు లైవ్ స్క్రీనింగ్ ప్రత్యేక వంటకాల ద్వారా ఈ మెగా ఈవెంట్‌కు సిద్ధమవుతున్నాయి. పలు పబ్స్, లాంజ్‌లు.. క్రికెట్ థీమ్ అలంకరణతో ఆకట్టుకుంటున్నాయి. మన సొంత జట్టు ఫైనల్‌కు చేరడంతో మరింత ఆసక్తికరంగా మారిన ఈ మ్యాచ్ నగరవాసులను ఉర్రూతలూగించనుంది. దీంతో ఎంట్రీ ఫీజు కనీసం రూ.500 నుంచి ప్రారంభించి ఆపై ధరలో విభిన్న రకాల ఆకర్షణలతో క్రికెట్ అభిమానుల్ని లైవ్ ఏర్పాట్లతో ఆహా్వనిస్తున్నారు. గచ్చిబౌలిలోని ముస్టాంగ్ టెర్రస్ లాంజ్‌లో ఏకంగా 3 స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఎయిర్‌లైవ్‌లో 2 స్క్రీన్స్, మాదాపూర్‌లోని రష్ స్పోర్ట్స్ బార్ అండ్ బౌలింగ్ సెంటర్లో పెద్ద స్క్రీన్, కార్ఖానాలోని ద బార్ నెక్ట్స్ డోర్లో 2 బిగ్ స్క్రీన్స్‌తోపాటు చిన్నపాటి టీవీలు కూడా పూర్తిగా ఐపీఎల్ సందడికి సిద్ధమయ్యాయి. నగరంలోని పబ్స్, బార్స్, రెస్టారెంట్స్‌తో పాటు సికింద్రాబాద్ క్లబ్, జింఖానా క్లబ్, ఫిలింనగర్ క్లబ్.. వంటి సంపన్నులకు చెందిన క్లబ్స్ కూడా ప్రత్యేక ఏర్పాట్లతో సభ్యులను ఆహా్వనిస్తున్నాయి. మాల్స్, మలీ్టఫ్లెక్స్లూ, కెఫెలు సైతం స్క్రీన్స్ ఏర్పాటులో పోటీ పడుతున్నాయి. పలు గేటెడ్ కమ్యూనిటీల్లోనూ ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేశారు. -
Qualifier 1: సన్‌రైజర్స్ విఫలం.. ఫైనల్ చేరిన కేకేఆర్
-
అదరగొట్టిన అయ్యర్ బ్రదర్స్.. ఫైనల్లో KKR
-
KKR vs RR: రాయల్స్ జట్టును ముంచేసిన వర్షం
-
ముంబై ని ఓడించి play offs లోకి కేకేఆర్
-
ముంబై ని ఓడించి play offs లోకి కేకేఆర్
-
ముంబై గెలిస్తే.. కేకేఆర్ కేకే! ప్లే ఆఫ్స్ బెర్తు కన్ఫామ్!?
-
IPL 2024: కేకేఆర్ బృందానికి చేదు అనుభవం
కేకేఆర్ బృందానికి చేదు అనుభవం ఎదురైంది. ఎల్ఎస్జీతో మ్యాచ్ ముగించుకుని కోల్‌కతాకు బయల్దేరిన వీరికి ప్రతికూల వాతావరణ పరిస్థితులు తీవ్ర ఇబ్బందులు కలిగించాయి.Travel update: KKR's charter flight from Lucknow to Kolkata diverted to Guwahati due to bad weather ⛈️Flight currently standing at the Guwahati Airport tarmac. More updates soon pic.twitter.com/XFPTHgM2FJ— KolkataKnightRiders (@KKRiders) May 6, 2024రెండు సార్లు వీరు ప్రయాణిస్తున్న చార్టర్ విమానం దారి మళ్లింపునకు గురైంది. నిన్న సాయంత్రం నుంచి కేకేఆర్ బృందం గాల్లో అటూ ఇటూ చక్కర్లు కొడుతుంది. పలు ట్విస్ట్‌ల అనంతరం ఇవాళ (మే 7) తెల్లవారుజామున కేకేఆర్ టీమ్ వారణాసిలో ల్యాండైంది.Update at 1:20 AM: Flight diverted to Varanasi after another failed attempt at landing in Kolkata due to bad weather. Current status: At the Lal Bahadur Shastri International airport tarmac— KolkataKnightRiders (@KKRiders) May 6, 2024పూర్తి వివరాల్లోకి వెళితే.. కేకేఆర్ టీమ్ మే 5న ఎల్ఎస్జీతో మ్యాచ్ ముగించుకుని నిన్న (మే 6) సాయంత్రం 5:45కు లక్నో నుంచి కోల్‌కతాకు బయల్దేరింది. వీరు రాత్రి 7:25 గంటలకంతా కోల్‌కతాలో ల్యాండ్ కావాల్సి ఉండింది.అయితే నిన్న సాయంత్రం నుంచి కోల్‌కతాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కేకేఆర్ బృందం సేఫ్‌గా ల్యాండింగ్ కావడానికి కుదర్లేదు. రాత్రి 8:45 వరకు వీరు గాల్లోనే చక్కర్లు కొట్టారు. 8:46కు వీరి విమానం గౌహతికి డైవర్ట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. 9:30 ఆ మధ్యలో వీరు గౌహతిలో ల్యాండ్ అయ్యారు.ఎయిర్‌పోర్ట్‌లోనే ఉన్న కేకేఆర్ బృందానికి రాత్రి 9:43 గంటలకు మరో మెసేజ్ వచ్చింది. కోల్‌కతాలో ల్యాండ్ అవ్వడానికి క్లియరెన్స్ వచ్చింది. రాత్రి 11 గంటల్లోపు అక్కడ ల్యాండవుతామన్నది ఆ మెసేజ్ సారాంశం.అయితే కేకేఆర్ బృందానికి ఈసారి కూడా చుక్కెదురైంది. కోల్‌కతాలో మరోసారి వాతావరణం అనుకూలించకపోవడంతో అక్కడ ల్యాండింగ్ కుదర్లేదు. దీంతో వీరు గాల్లోనే యూ టర్న్ తీసుకుని ఇవాళ తెల్లవారుజామున వారణాసికి చేరుకున్నారు. ఉదయం 3 గంటల ప్రాంతలో కేకేఆర్ టీమ్ వారణాసిలోని తాజ్ హోటల్లో దిగినట్లు కేకేఆర్ యాజమాన్యం ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఇవాళ (మే 8) మధ్యాహ్నం 1:15 గంటలకు వీరు మరోసారి కోల్‌కతాలో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నిస్తారు. మరి ఈసారైనా విజయవంతంగా ల్యాండ్ అవుతారో లేదో వేచి చూడాలి.ఇదిలా ఉంటే, కేకేఆర్ టీమ్ మొన్న లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 98 పరుగుల తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఈ సీజన్లో ఈ జట్టు ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మే 11న ముంబైతో.. 13న గుజరాత్.. 19న రాజస్థాన్ రాయల్స్‌తో తలపడాల్సి ఉంది. కేకేఆర్ టీమ్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్‌పై కర్చీఫ్ వేసుకుని కూర్చుంది. ఈ జట్టుతో పాటు రాయల్స్‌కు కూడా ప్లే ఆఫ్స్‌కు క్లియరెన్స్ సాధించింది. -
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. నంబర్ వన్‌గా..
-
ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
ఐపీఎల్ చరిత్రలోనే అత్యద్భుతమైన క్యాచ్‌కు నిన్నటి (మే 5) కేకేఆర్-లక్నో మ్యాచ్ వేదికైంది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఆటగాడు రమన్‌దీప్ సింగ్ నమ్మశక్యంకాని రీతిలో అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అర్శిన్ కులకర్ణి ఆడిన షాట్ బ్యాట్ ఎడ్జ్ తీసుకుని గాల్లో చాలాసేపు ప్రయాణించగా.. ఈ క్యాచ్‌ను అందుకునేందుకు రమన్‌దీప్ సింగ్ పెద్ద విన్యాసమే చేశాడు. తాను ఫీల్డింగ్ చేసే డైరెక్షన్ నుంచి వెనక్కు పరిగెడుతూ అద్భుతమైన డైవింగ్ క్యాచ్ పట్టాడు. నమ్మశక్యం కాని ఈ విన్యాసానికి ప్రతి ఒక్కరు ముగ్దులైపోయారు. బ్యాటర్ అర్శిన్ చాలాసేపు ఈ విషయాన్ని నమ్మలేకపోయాడు. క్యాచ్ అనంతరం రమన్‌దీప్‌ను సహచరులు అభినందనలతో ముంచెత్తారు. బౌలర్ స్టార్క్, పక్కనే ఫీల్డింగ్ చేస్తున్న రసెల్ రమన్‌దీప్‌పై ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తుంది.RAMANDEEP SINGH WITH ONE OF THE GREATEST CATCHES OF IPL HISTORY. 🤯🔥pic.twitter.com/xFiqHssmzV— Mufaddal Vohra (@mufaddal_vohra) May 5, 2024 ఈ మ్యాచ్‌లో రమన్‌దీప్ బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు. ఇన్నింగ్స్ ఆఖర్లో వచ్చి సుడిగాలి ఇన్నింగ్స్ (6 బంతుల్లో 25 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) ఆడి ఆకట్టుకున్నాడు. రమన్‌దీప్‌తో పాటు సునీల్ నరైన్ (39 బంతుల్లో 81; 6 ఫోర్లు, 7 సిక్సర్లు; 4-0-22-1), హర్షిత్ రాణా (3.1-0-24-3), వరుణ్ చక్రవర్తి (3-0-30-3), రసెల్ (2-0-17-2) చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో కేకేఆర్ లక్నోను 98 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ గెలుపుతో కేకేఆర్ పాయింట్ల పట్టికలో రాజస్థాన్‌ను కిందకు నెట్టి అగ్రస్థానానికి ఎగబాకింది.కేకేఆర్ ఇన్నింగ్స్‌లో నరైన్, రమన్‌దీప్‌లతో పాటు ఫిలిప్ సాల్ట్ (14 బంతుల్లో 32; 5 ఫోర్లు, సిక్స్), రఘువంశీ (32), శ్రేయస్ అయ్యర్ (23) రాణించారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 3, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, యుద్వీర్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లక్నో.. కేకేఆర్ బౌలర్ల ధాటికి 16.1 ఓవర్లలో 137 పరుగులకే చాపచుట్టేసింది. లక్నో ఇన్నింగ్స్‌లో స్టోయినిస్ (36) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
KKR vs LSG: విజయం ఎవరిని వరిస్తుంది?
-
ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
ఐపీఎల్లో ఇవాళ డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లో పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్.. రాత్రి మ్యాచ్‌లో లక్నో, కేకేఆర్ తలపడనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌కు ధర్మశాల మైదానం వేదిక కానుండగా.. రాత్రి మ్యాచ్ లక్నో హోం గ్రౌండ్ అటల్ బిహారీ స్టేడియంలో జరుగనుంది.పంజాబ్, సీఎస్కే మ్యాచ్ విషయానికొస్తే.. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే సీఎస్కే ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. చెన్నై ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌తో కలిపి చెన్నై మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇతర జట్లతో పోటీ లేకుండా ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే చెన్నై ఇకపై ఆడబోయే అన్ని మ్యాచ్‌ల్లో గెలవాల్సి ఉంటుంది. చెన్నై మే 10న గుజరాత్, 12న రాజస్థాన్ రాయల్స్, 18న ఆర్సీబీతో తలపడాల్సి ఉంది.పంజాబ్ విషయానికొస్తే.. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి, ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. పంజాబ్ ఈ మ్యాచ్‌తో పాటు తదుపరి ఆడబోయే మూడు మ్యాచ్‌ల్లో గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుందని చెప్పలేని పరిస్థితి ఉంది. టెక్నికల్‌గా పంజాబ్ ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నప్పటికీ అనధికారికంగా కష్టమే అని చెప్పాలి. తదుపరి మ్యాచ్‌ల్లో పంజాబ్.. ఆర్సీబీ (మే 9), రాజస్థాన్ రాయల్స్ (మే 15), సన్‌రైజర్స్ (మే 19) జట్లను ఢీకొట్టాల్సి ఉంది.హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు 29 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. సీఎస్కే 15, పంజాబ్ 14 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ఇరు జట్లు ఇదే సీజన్లో చివరిసారిగా తలపడ్డాయి. మే 1న జరిగిన ఆ మ్యాచ్‌లో పంజాబ్ సీఎస్కే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.తుది జట్లు (అంచనా)..పంజాబ్: జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రన్ సింగ్, రిలీ రోసోవ్, సామ్ కర్రన్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్‌కీపర్), శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబాడ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్. [ఇంపాక్ట్ ప్లేయర్: అర్ష్‌దీప్ సింగ్].సీఎస్కే: అజింక్య రహానే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, సమీర్ రిజ్వీ, శార్దూల్ ఠాకూర్, రిచర్డ్ గ్లీసన్, తుషార్ దేశ్‌పాండే. [ఇంపాక్ట్ సబ్: మతీష పతిరణ]లక్నో-కేకేఆర్ మ్యాచ్ విషచయానికొస్తే.. ఇరు జట్లు ప్లే ఆఫ్స్ రేసులో దూసుకుపోతున్నాయి. కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఏడింట గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. లక్నో 10లో 6 మ్యాచ్‌లు గెలిచి మూడో స్థానంలో కొనసాగుతుంది. కేకేఆర్ తదుపరి ఆడబోయే నాలుగు మ్యాచ్‌ల్లో మరో రెండు మ్యాచ్‌లు గెలిచినా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించనుండగా.. లక్నో నాలుగులో కనీసం మూడు మ్యాచ్‌లైనా గెలిస్తే ఫ్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది. లక్నో నాలుగులో మూడింట గెలిస్తే ఇతర జట్ల జయాపజయాలతో పని లేకుండా సేఫ్‌గా ఫైనల్ ఫోర్కు చేరుకుంటుంది.కేకేఆర్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్ (మే 11), గుజరాత్ (మే 13), రాజస్థాన్ రాయల్స్‌తో (మే 19) తలపడాల్సి ఉండగా.. లక్నో సన్‌రైజర్స్ (మే 8), ఢిల్లీ (మే 14), ముంబై ఇండియన్స్ (మే 17) జట్లను ఢీకొట్టాల్సి ఉంది. హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. లక్నోపై కేకేఆర్ స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించినట్లు తెలుస్తుంది. ఇరు జట్లు ఇప్పటివరకు 4 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. కేకేఆర్ 3, లక్నో ఒక మ్యాచ్‌లో గెలుపొందాయి. ఇరు జట్ల మధ్య చివరసారిగా జరిగిన మ్యాచ్‌లో కూడా కేకేఆరే పైచేయి సాధించింది. ఏప్రిల్ 14న జరిగిన ఆ మ్యాచ్‌లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో లక్నోను చిత్తు చేసింది.తుది జట్లు (అంచనా)..లక్నో: కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్‌కీపర్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్కేకేఆర్: ఫిలిప్ సాల్ట్ (వికెట్‌కీపర్), సునీల్ నరైన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి -
ముంబైని ముంచేసిన కేకేఆర్
-
కేకేఆర్‌ను ఢీకొట్టనున్న ముంబై
-
Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
-
Anchor Sreemukhi: ఉప్పల్ స్టేడియంలో యాంకర్ శ్రీముఖి సందడి (ఫోటోలు)
-
IPL 2024: కేకేఆర్ స్టార్ ప్లేయర్‌కు భారీ షాక్.. జరిమానాతో పాటు నిషేధం
కేకేఆర్ స్టార్ బౌలర్ హర్షిత్ రాణాకు భారీ షాక్ తగిలింది. నిన్న (ఏప్రిల్ 29) ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా కోడ్ ఉల్లంఘనకు పాల్పడినందుకుగాను అతని మ్యాచ్ ఫీజ్‌లో 100 శాతం కోత విధించబడింది. ప్రస్తుత సీజన్లో రాణా రెండోసారి కోడ్ ఉల్లంఘనకు పాల్పడటంతో అతనిపై ఓ మ్యాచ్ నిషేధం కూడా పడింది. ఢిల్లీతో మ్యాచ్ సందర్భంగా ఆ జట్టు బ్యాటర్ అభిషేక్ పోరెల్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు రాణాపై కఠిన చర్యలు తీసుకున్నారు. అభిషేక్ ఔటైన తర్వాత రాణా శృతిమించిన సంబురాలు (అభిషేక్‌ను డగౌట్ వైపు వెళ్లాలని కోపంగా ఆదేశించాడు) చేసుకుని తగిన మూల్యం చెల్లించుకున్నాడు. రాణా కొద్ది రోజుల కిందట కూడా ఇలాగే ప్రవర్తించి జరిమానాను ఎదుర్కొన్నాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్‌ను ఔట్ చేశాక ఓవరాక్షన్ (ఫ్లయింగ్ కిస్ ఇస్తూ కోపంగా చూశాడు) చేశాడు. అందుకు మ్యాచ్ ఫీజ్‌లో 60 శాతం జరిమానాను ఎదుర్కొన్నాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో రాణా అతి చేసినా బౌలింగ్‌లో ఆట్టున్నాడు. 4 ఓవర్లలో 28 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఢిల్లీపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేయగా.. కేకేఆర్ 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి, ఈ సీజన్లో ఆరో విజయాన్ని నమోదు చేసింది. ఫిలిప్ సాల్ట్ (68) మెరుపు ఇన్నింగ్స్ ఆడి కేకేఆర్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. అంతకుముందు కేకేఆర్ బౌలర్లు చెలరేగడంతో ఢిల్లీ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. కుల్దీప్ యాదవ్ (35 నాటౌట్) ఆ జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. హర్షిత్ రాణా, వైభవ్ అరోరా తలో 2 వికెట్లు, స్టార్క్, నరైన్ చెరో వికెట్ పడగొట్టారు. -
ఐపీఎల్లో నేటి (Apr 29) మ్యాచ్.. కేకేఆర్‌ను ఢీకొట్టనున్న ఢిల్లీ
ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 29) జరుగబోయే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కేకేఆర్‌ను ఢీకొట్టనుంది. కేకేఆర్ హోం గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్‌లో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ సీజన్లో కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. ఇప్పుడిప్పుడే విజయాల బాటపట్టిన ఢిల్లీ 10 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో ఆరో స్థానంలో నిలిచింది. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 32 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. కేకేఆర్ 17, ఢిల్లీ 15 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. కేకేఆర్ గత మ్యాచ్‌లో అతి భారీ స్కోర్ (261/6) చేసి కూడా పంజాబ్ చేతిలో భంగపడగా.. ఢిల్లీ తమ చివరి మ్యాచ్‌ల్లో నాలుగింట గెలిచి కేకేఆర్ కంటే ఎక్కువ ఉత్సాహంగా ఉంది. ఇరు జట్లు ఇదే సీజన్లో తలపడిన సందర్భంలో కేకేఆర్ ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోర్ నమోదు చేసింది. ఏప్రిల్3న విశాఖ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ 166 పరుగులకే కుప్పకూలి 106 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో విధ్వంసకర ఆటగాడు, ఢిల్లీ ఓపెనర్ జేక్ ఫ్రేసర్‌పై అందరి కళ్లు ఉన్నాయి. ఫ్రేసర్ ముంబైతో ఆడిన గత మ్యాచ్‌లో మ్యాడ్ మ్యాన్‌లా రెచ్చిపోయి 27 బంతుల్లో 84 పరుగులు చేశాడు.తుది జట్లు (అంచనా)..కోల్‌కతా నైట్ రైడర్స్: సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, దుష్మంత చమీర, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా (ఇంపాక్ట్ ప్లేయర్)ఢిల్లీ: జేక్ ఫ్రేసర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, కుమార్ కుషాగ్రా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్ట్జే, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, రసిఖ్ సలాం (ఇంపాక్ట్ ప్లేయర్) -
సాహో పంజాబ్.. ఈడెన్ గార్డెన్స్‌లో పరుగుల వరద
-
IPL 2024: వరుసగా ఓడిపోతున్నా పంజాబ్ బౌలర్లను మించిన తోపులు లేరు..!
బ్యాటర్ల హవా కొనసాగుతున్న ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పంజాబ్ బౌలర్లు ఎవరికీ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు (41 మ్యాచ్‌లు) జరిగిన మ్యాచ్‌ల్లో పంజాబ్ ఒక్కటే ఒక్కసారి కూడా ప్రత్యర్దిని 200 పరుగులు చేయనీయలేదు. ఈ సీజన్లో పంజాబ్ బౌలింగ్ యావరేజ్ 24.94గా ఉంది. ఏ జట్టుకు ఈ సీజన్లో ఇంత తక్కువ బౌలింగ్ సగటు లేదు. పంజాబ్ తర్వాత కేకేఆర్‌కు అత్యల్ప బౌలింగ్ సగటు (25.47) ఉంది. పంజాబ్ ఈ సీజన్లో అత్యధికంగా 199 పరుగులు ప్రత్యర్దికి సమర్పించుకుంది. ఇలా రెండు సందర్భాల్లో జరిగింది. ఇదిలా ఉంటే, పంజాబ్ ఇవాళ (ఏప్రిల్ 26) పటిష్టమైన కేకేఆర్‌ను వారి సొంత మైదానంలో ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ పంజాబ్‌కు చాలా కీలకంగా పరిగణించబడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే పంజాబ్ ప్లే ఆఫ్స్ లెక్కల్లో ఉంటుంది. లేకపోతే మరో సీజన్లో ఈ జట్టు టైటిల్ లేకుండా రిక్త హస్తాలతో వైదొలగాల్సి ఉంటుంది. పంజాబ్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. మరోవైపు కేకేఆర్ ఏడింట ఐదు మ్యాచ్‌లు గెలిచి రెండో స్థానంలో ఉంది. ఈ సీజన్లో కేకేఆర్ అంచనాలకు తగ్గట్టు రాణిస్తూ మూడో టైటిల్ దిశగా అడుగులు వేస్తుంది.ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. పంజాబ్‌పై కేకేఆర్‌కు స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శిస్తూ వచ్చింది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 32 మ్యాచ్‌ల్లో తలపడగా.. కేకేఆర్ 21, పంజాబ్ 11 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.తుది జట్లు..కోల్‌కతా నైట్ రైడర్స్: ఫిలిప్ సాల్ట్ (వికెట్‌కీపర్), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, దుష్మంత చమీర, వరుణ్ చకరవర్తి, హర్షిత్ రాణాపంజాబ్ కింగ్స్: జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రన్(కెప్టెన్), రిలీ రోసోవ్, జితేష్ శర్మ(వికెట్‌కీపర్), శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్ -
IPL 2024: కేకేఆర్‌ను ఢీకొట్టనున్న పంజాబ్.. స్టార్క్ ఔట్, ధవన్ ఇన్..?
ఐపీఎల్ 2024 సీజన్లో ఇవాళ (ఏప్రిల్ 26) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్.. టేబుల్ సెకెండ్ టాపర్ అయిన కేకేఆర్‌ను వారి సొంత మైదానమైన ఈడెన్ గార్డెన్స్‌లో ఢీకొట్టనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ పంజాబ్‌కు చాలా కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే పంజాబ్ ప్లే ఆఫ్స్ లెక్కల్లో ఉంటుంది.లేకపోతే మరో సీజన్లో టైటిల్ లేకుండా రిక్త హస్తాలతో వైదొలగాల్సి ఉంటుంది. పంజాబ్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. మరోవైపు కేకేఆర్ ఏడింట ఐదు మ్యాచ్‌లు గెలిచి రెండో స్థానంలో ఉంది. ఈ సీజన్లో కేకేఆర్ అంచనాలకు తగ్గట్టు రాణిస్తూ మూడో టైటిల్ దిశగా అడుగులు వేస్తుంది.హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. పంజాబ్‌పై కేకేఆర్ స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శిస్తూ వచ్చింది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 32 మ్యాచ్‌ల్లో తలపడగా.. కేకేఆర్ 21, పంజాబ్ 11 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.బలాబలాల విషయానికొస్తే.. పంజాబ్‌తో పోలిస్తే కేకేఆర్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పెట్టి సొంతం చేసుకున్న మిచెల్ స్టార్క్ మినహా కేకేఆర్‌కు పెద్ద సమస్యలేమీ లేవు. స్టార్క్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో తేలిపోయాడు. వికెట్లు తీయకపోగా.. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. నరైన్, రసెల్‌తో పాటు కుర్ర బౌలర్లు రాణిస్తుండటంతో స్టార్క్ వైఫల్యాలు హైలైట్ కావడం లేదు.పంజాబ్‌తో నేటి మ్యాచ్‌లో స్టార్క్ పక్కకు కూర్చోవాల్సి రావచ్చు. అతను ఆర్సీబీ గత మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు (వేలికి). స్టార్క్ గత రెండు రోజులుగా ప్రాక్టీస్ సెషన్స్‌లోనూ కనబడలేదు. దీన్ని బట్టి చూస్తే.. పంజాబ్‌తో మ్యాచ్‌లో అతను ఆడకపోవచ్చని తెలుస్తుంది.పంజాబ్ విషయానికొస్తే.. ఈ జట్టు మిడిలార్డర్ బ్యాటర్లు శశాంక్ సింగ్, అశుతోష్ శర్మపై అందరి చూపు ఉంది. ఈ సీజన్లో ఈ ఇద్దరు అద్భుతమైన పోరాటాలతో పంజాబ్ ఆడిన ప్రతి మ్యాచ్‌ను రక్తి కట్టించారు. వీరిద్దరి నుంచి అభిమానులు మరోసారి సంచలన ఇన్నింగ్స్‌లు ఆశిస్తున్నారు. వీరిద్దరు మినహా ఈ సీజన్లో పంజాబ్‌కు చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ లేవు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధవన్ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్‌లకు దూరంగా శిఖర్ తాజాగా జరిగిన ప్రాక్టీస్ సెషన్స్‌లో యాక్టివ్‌గా కనిపించాడు. దీన్ని బట్టి అతని రీఎంట్రీ ఖాయమని తేలిపోయింది. నేటి మ్యాచ్‌లో స్టార్క్ ఆడకపోతే అతడి స్థానంలో దుష్మంత చమీర ఆడే అవకాశం ఉంది. తుది జట్లు (అంచనా)..కేకేఆర్: ఫిల్ సాల్ట్ (వికెట్‌కీపర్), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్/దుష్మంత చమీర, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ. [ఇంపాక్ట్ ప్లేయర్: వెంకటేష్ అయ్యర్]పంజాబ్: శిఖర్ ధవన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రన్ సింగ్, సామ్ కర్రన్, జితేష్ శర్మ (వికెట్‌కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబాడ, హర్షల్ పటేల్. [ఇంపాక్ట్ ప్లేయర్: అర్ష్‌దీప్ సింగ్] -
టీ20 వరల్డ్‌కప్‌లో రీఎంట్రీపై విండీస్ వీరుడి స్పందన ఇదే..!
విండీస్ వెటరన్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ టీ20 వరల్డ్‌కప్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇస్తాడని గతకొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై నరైన్ తాజాగా స్పందించాడు. అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి రావడం అసాధ్యమని స్పష్టం చేశాడు. రీఎంట్రీకి డోర్లు మూసుకుపోయాయని అన్నాడు. ఇటీవలికాలంలో తన ప్రదర్శనలు సంతృప్తినిచ్చాయని తెలిపాడు. టీ20 వరల్డ్‌కప్ ఆడాలనే అభిమానుల ప్రతిపాదనను గౌరవిస్తానని అన్నాడు. అయితే అందుకు ఓకే మాత్రం చెప్పలేనని వివరించాడు. వరల్డ్‌కప్ ఆడే విండీస్ జట్టుకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని.. విండీస్ వీరులు మరో టైటిల్‌కు అర్హులేనంటూ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. నరైన్ టీ20 వరల్డ్‌కప్‌లో ఆడటంపై బహిరంగ ప్రకటన చేయడంతో విండీస్ క్రికెట్ బోర్డు ఓ అంచనాకు వచ్చింది. నరైన్‌ను టీ20 వరల్డ్‌కప్‌లో ఆడాలని ఒప్పించేందుకు తాను గతకొంతకాలంగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నానని విండీస్ టీ20 జట్టు కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, నరైన్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో బంతితో పాటు బ్యాట్‌తోనూ అదరగొడుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నరైన్ మెరపు శతకంతో (56 బంతుల్లో 109) విరుచుకుపడ్డాడు. ఈ సీజన్లో నరైన్ 7 మ్యాచ్‌ల్లో సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 286 పరుగులు చేశాడు. 9 వికెట్లు కూడా పడగొట్టాడు. ఈ సీజన్లో కేకేఆర్ సాధించిన విజయాల్లో నరైన్ అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించాడు. నరైన్ ఈ సీజన్లోనే రెండు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. నరైన్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్నప్పటి నుంచి అతని ఫేట్ మారిపోయింది. ఓపెనర్‌గా అతను స్వేచ్ఛగా షాట్లు ఆడుతూ భారీ స్కోర్లు చేస్తున్నాడు. నరైన్‌ను ఓపెనర్‌గా పంపడం కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్ ప్రతిపాదన. గతంలోనూ గంభీర్ నరైన్‌ను ఓపెనర్‌గా పంపి సత్ఫలితాలు సాధించాడు. 35 ఏళ్ల నరైన్ 2019లో చివరిసారిగా వెస్టిండీస్‌కు ఆడాడు. అతను 2023లో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. తాజా బ్యాటింగ్ ఫామ్ నేపథ్యంలో నరైన్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ కోసం చాలామంది వెటరన్ క్రికెటర్లు రిటైర్మెంట్ నిర్ణయాలను వెనక్కు తీసుకున్నారు. పాక్ ఆటగాళ్లు ఇమాద్ వసీం, మొహహ్మద్ ఆమిర్ టీ20 వరల్డ్‌కప్ కోసం యూ టర్న్ తీసుకున్నారు. -
IPL 2024 KKR Vs RCB: ఫేవరేట్ కేకేఆర్
-
ఐపీఎల్‌కు 17 ఏళ్లు.. తొలి మ్యాచ్ ఆడిన వాళ్లు ఇప్పుడు ఎంత మంది ఉన్నారు..?
క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు నేటితో 16 ఏళ్లు పూర్తయ్యాయి. ఇవాళ (ఏప్రిల్ 18) క్యాష్ రిచ్ లీగ్ 17వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఐపీఎల్ మేనేజ్మెంట్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసి గతాన్ని గుర్తు చేసుకుంది. మీ ఫేవరెట్ ఐపీఎల్ జ్ఞాపకాన్ని కూడా షేర్ చేసుకోండని క్యాప్షన్ జోడించింది. దీంతో చాలామంది ఐపీఎల్ అభిమానులు తమ తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. IPL's poster on Completed "17 Years of IPL". - The Biggest Cricket Event...!!!! ⭐ pic.twitter.com/oXgkvRf0dP — CricketMAN2 (@ImTanujSingh) April 18, 2024 ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ ఓ ఆసక్తికర ప్రశ్నను సంధించాడు. ఐపీఎల్ అరంగేట్రం మ్యాచ్‌లో ఆడిన వారు ప్రస్తుతం ఎంత మంది ఇప్పటికీ ఆడుతున్నారని అడిగాడు. దీనికి చాలామంది తమకు తెలిసిన సమాధానాలు చెప్పారు. సమాధానం రివీల్ చేయకముందు మీకు తెలిసిన సమాధాన్ని మీరు కూడా షేర్ చేయండి. 17 YEARS OF THE IPL...!!! 💥 The greatest league in the world started on this day in 2008. 🇮🇳 pic.twitter.com/BPApcjBkOL — Mufaddal Vohra (@mufaddal_vohra) April 18, 2024 సమాధానం విషయానికొస్తే.. ఐపీఎల్ తొలి మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, కేకేఆర్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ తరఫున ఆడిన వృద్దిమాన్ సాహా, ఇషాంత్ శర్మ ప్రస్తుతం గుజరాత్, ఢిల్లీ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీకి ఆడిన విరాట్ కోహ్లి ఇప్పుడు కూడా అదే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ తొలి మ్యాచ్ ఆడిన ఈ ముగ్గురు మాత్రమే ఐపీఎల్లో ఇంకా కొనసాగుతున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన మరో విషయం ఏంటంటే.. ఐపీఎల్ చరిత్రలో విరాట్ ఒక్కడే నాటి నుంచి నేటి వరకు ఒకే జట్టుకు ఆడుతూ ఎవరికీ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకున్నాడు. నాటి మ్యాచ్ విషయానికొస్తే.. బ్రెండన్ మెక్కల్లమ్ శివాలెత్తిపోవడంతో (73 బంతుల్లో 158; 10 ఫోర్లు, 13 సిక్సర్లు) కేకేఆర్ 140 పరుగల భారీ తేడాతో ఆర్సీబీపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత ఓవరల్లో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో మెక్కల్లమ్ ఒక్కడే సింహ భాగం స్కోర్ చేశాడు. సౌరవ్ గంగూలీ 10, రికీ పాంటింగ్ 20, డేవిడ్ హస్సీ 12, మొహమ్మద్ హఫీజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు.ఆర్సీబీ బౌలర్లలో జహీర్ ఖాన్, ఆష్లే నోఫ్కే, జాక్ కలిస్ తలో వికెట్ పడగొట్టారు. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. ఆశోక్ దిండా (3-0-9-2), ఇషాంత్ శర్మ (3-0-7-1), అజిత్ అగార్కర్ (4-0-25-3), సౌరవ్ గంగూలీ (4-0-21-2), లక్ష్మీ రతన్ శుక్లా (1.1-0-12-1) ధాటికి 15.1 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్కరు (ప్రవీణ్ కుమార్ (18 నాటౌట్)) రెండంకెల స్కోర్ చేశారు. ద్రవిడ్ 2, వసీం జాఫర్ 6, విరాట్ కోహ్లి 1, జాక్ కలిస్ 8, కెమరూన్ వైట్ 6, మార్క్ బౌచర్ 7, బాసిల్ థంపి 0, నోఫ్కే 9, జహీర్ ఖాన్ 3, సునీల్ జోషి 3 పరుగులు చేసి ఔటయ్యారు. వికెట్ కీపర్‌గా వృద్దిమాన్ సాహా కలిస్ క్యాచ్ అందుకున్నాడు. -
రోలర్ కోస్టర్: ఆఖరి బంతికి కేకేఆర్‌పై రాజస్తాన్ గెలుపు
-
T20 WC: బతిమిలాడుతున్నా వినడం లేదు.. ఇక వాళ్లదే భారం!
ఐపీఎల్ 2024.. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో చేసిన పరుగులు 276.. పడగొట్టిన వికెట్లు ఏడు(7/165).. కోల్‌కతా నైట్ రైడర్స్ స్పిన్ ఆల్‌రౌండర్ సునిల్ నరైన్ నమోదు చేసిన గణాంకాలివి. రాజస్తాన్ రాయల్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో 35 ఏళ్ల ఈ వెస్టిండీస్ ఆటగాడు కుర్రాళ్ల కళ్లు చెదిరే రీతిలో అద్బుతమైన షాట్లతో అలరించాడు. మొత్తంగా 56 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 109 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా ఇరగదీస్తున్నాడు విధ్వంసకర శతకంతో విరుచుకుపడి తన ఆటలో పస తగ్గలేదని మరోసారి నిరూపించాడు. కేకేఆర్‌కు దొరికిన విలువైన ఆస్తి అంటూ నీరాజనాలు అందుకుంటున్నాడు ఈ లెఫ్టాండ్ బ్యాటర్. 𝐍𝐚𝐫𝐢𝐧𝐞, naam toh suna hi hoga 😉 He scores his maiden 💯 in T20s at the iconic Eden Gardens 🏟️#KKRvRR #TATAIPL #IPLonJioCinema #SunilNarine | @KKRiders pic.twitter.com/TKFSFsc3Lp — JioCinema (@JioCinema) April 16, 2024 కేవలం పరుగుల తీయడానికే పరిమితం కాని ఈ రైటార్మ్ స్పిన్నర్.. రెండు వికెట్లు పడగొట్టాడు. అలాగే ఓ క్యాచ్ కూడా అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్ మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో పాటు క్యాచ్, వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. 12 నెలలుగా ప్రయత్నిస్తూనే ఉన్నా ఇక ఈ వెటరన్ ఆల్‌రౌండర్ ప్రతిభకు వెస్టిండీస్ కెప్టెన్, రాజస్తాన్ రాయల్స్ హిట్టర్ రోవ్‌మన్ పావెల్ కూడా ఫిదా అయ్యాడు. నరైన్‌ను ఎలాగైనా ఒప్పించి ఈసారి వరల్డ్‌కప్‌లో ఆడించే ప్రయత్నం చేస్తామంటున్నాడు. కేకేఆర్‌పై రాజస్తాన్ విజయంలో తన వంతు పాత్ర పోషించిన పావెల్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘గత 12 నెలలుగా నేను నరైన్ చెవిలో జోరీగలా మొత్తుకుంటూనే ఉన్నాను. రిటైర్మెంట్ వెనక్కి తీసుకోమని అడుగుతున్నాను. కానీ అతడు ఏదో దాస్తున్నాడు. ఎవరితోనూ తన మనసులోని భావాలు పంచుకోవడం లేదు. ఈ విషయం గురించి ఇప్పటికే కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్‌లతో చర్చించాను.ప్రపంచకప్ జట్టు ఎంపిక కంటే ముందే వీళ్లు అతడి మనసులో ఏముందో కనిపెట్టగలరనే అనుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు. విండీస్‌లో ఈసారి వరల్డ్‌కప్ జూన్ 1 నుంచి వెస్టిండీస్- అమెరికా వేదికగా మొదలుకానున్న టీ20 ప్రపంచకప్-2024లో సునిల్ నరైన్ ఆడించడమే తన లక్ష్యమని రోవ్‌మన్ పావెల్ ఈ సందర్భంగా ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో చెప్పుకొచ్చాడు. ఇక కేకేఆర్‌తో మ్యాచ్‌లో పావెల్ 13 బంతుల్లో 26 పరుగులు చేసి నరైన్ బౌలింగ్‌లో బౌల్డ్ కావడం విశేషం. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో 29 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న నరైన్.. మరో 20 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. 2023లో రిటైర్ అయిన నరైన్ 2012, 2014 టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో వెస్టిండీస్ తరఫున బరిలోకి దిగిన సునిల్ నరైన్.. 2019 నుంచి జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో.. 2023లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే ఫ్రాంఛైజీ క్రికెట్లో మాత్రం ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. చదవండి: #T20WorldCup2024: రోహిత్‌తో ద్రవిడ్, అగార్కర్ చర్చలు.. హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
KKR Vs RR: ఐపీఎల్లో ఇవాళ మరో బిగ్ ఫైట్.. పరుగుల వరద ఖాయం..!
ఐపీఎల్ 2024 సీజన్లో ఇవాళ (ఏప్రిల్ 16) మరో బిగ్ ఫైట్ జరుగనుంది. పటిష్టమైన, పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న రాజస్థాన్, కేకేఆర్ జట్లు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కత్తులు దూసుకోనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటర్లకు అనుకూలించనుండటంతో నేటి మ్యాచ్‌లో బ్యాటర్లు చెలరేగే అవకాశం ఉందని అంచనా. ఈ సీజన్లో ఆరు మ్యాచ్‌లో ఐదింట గెలిచిన రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఐదింట నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన కేకేఆర్ రెండో స్థానంలో ఉంది. హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్లు గతంలో 27 సార్లు ఎదురెదురుపడగా కేకేఆర్ 14, రాయల్స్ 13 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ఈ రెండు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది. ఈడెన్ గార్డెన్స్ విషయానికొస్తే.. ఈ మైదానంలో రాయల్స్‌పై కేకేఆర్‌దే పైచేయిగా ఉంది. ఇక్కడ ఇరు జట్లు 9 మ్యాచ్‌ల్లో తలపడగా.. కేకేఆర్ 6, రాయల్స్ 3 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ప్రస్తుత సీజన్లో ఇరు జట్ల బలాబలాలపై లుక్కేస్తే.. రెండు జట్లు అన్ని విభాగాల్లో సమతూకంగా కనిపిస్తున్నాయి. ఇరు జట్లలో ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని అంచనా వేయడానికి వీల్లేదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అంత పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇరు జట్లు. కేకేఆర్ బ్యాటింగ్‌లో ఫిలిప్ సాల్ట్, సునీల్ నరైన్, రఘువంశీ, శ్రేయస్ అయ్యర్, రింకూ సింగ్, రసెల్ లాంటి విధ్వంసకర వీరులు ఉండగా.. రాయల్స్ బ్యాటింగ్ లైనప్‌లో యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, హెట్‌మైర్, రోవ్‌మన్ పావెల్ లాంటి మెరుపు వీరులు ఉన్నారు. బౌలింగ్ విభాగం విషయానికొస్తే.. కేకేఆర్‌లో స్టార్క్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా లాంటి స్టార్ పేసర్లు ఉండగా.. రాయల్స్‌లో ట్రెంట్ బౌల్ట్, చహల్, అశ్విన్ లాంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమతూకంగా ఉండటంతో నేటి మ్యాచ్‌లో పైచేయి ఎవరిదని చెప్పడం చాలా కష్టం. -
కేకేఆర్ చేతిలో లక్నో చిత్తు
-
IPL 2024 KKR VS LSG: కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన రమణ్‌దీప్ సింగ్
లక్నో సూపర్ జెయింట్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 14) జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ ఆటగాడు రమణ్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో దీపక్ హుడా (8) కొట్టిన షాట్‌ను రమణ్‌దీప్ డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. Ramandeep Singh. 🦅pic.twitter.com/3mhPdFNAJc — Mufaddal Vohra (@mufaddal_vohra) April 14, 2024 కాగా, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఆచితూచి ఇన్నింగ్స్ ప్రారంభించిన లక్నో 13 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. డికాక్ (10), కేఎల్ రాహుల్ (39), దీపక్ హుడా (8), స్టోయినిస్ (10) ఔట్ కాగా.. బదోని (27), పూరన్ (2) క్రీజ్‌లో ఉన్నారు. స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రసెల్ తలో వికెట్ పడగొట్టారు. ప్రస్తుత సీజన్లో లక్నో హ్యాట్రిక్ విజయాలు సాధించి (5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో కేకేఆర్ రెండో స్థానంలో ఉంది. హ్యాట్రిక్ విజయాల అనంతరం కేకేఆర్, లక్నో ఇటీవలే ఓ ఓటమిని ఎదుర్కొన్నాయి. కేకేఆర్ తమ చివరి మ్యాచ్‌లో సీఎస్కే చేతిలో ఓడగా.. లక్నో తాజాగా ఢిల్లీ చేతిలో పరాభవం ఎదుర్కొంది. హెడ్ టు హెడ్ ఫైట్ల విషయానికొస్తే.. ఈ ఇరు జట్లు ఇప్పటివరకు 3 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. మూడు సందర్భాల్లో లక్నోనే విజయం వరించింది. -
IPL 2024, KKR VS LSG Updates: సాల్ట్ ఊచకోత.. లక్నోపై కేకేఆర్ విజయం
సాల్ట్ ఊచకోత.. లక్నోపై కేకేఆర్ విజయం ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్ మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో కేకేఆర్ విజయం సాధించింది. 162 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్.. కేవలం రెండు వికెట్లు కోల్పోయి 15.4 ఓవర్లలో చేధించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్ విధ్వంసం సృష్టించాడు. 47 బంతులు ఎదుర్కొన్న సాల్ట్.. 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 89 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 38 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. లక్నో బౌలర్లలో మొహ్షిన్ ఖాన్ ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు. 12 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 113/2 12 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ రెండు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. క్రీజులో సాల్ట్(57), శ్రేయస్ అయ్యర్(25) పరుగులతో ఉన్నారు. 8 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 80/2 8 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా 2 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్(11), ఫిల్ సాల్ట్(42) పరుగులతో ఉన్నారు. కేకేఆర్ రెండో వికెట్ డౌన్.. 44 పరుగుల వద్ద కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన రఘువంశీ.. మోహ్షిన్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు కోల్‌కతా స్కోర్: 58/2. క్రీజులో ఫిల్ సాల్ట్(30), శ్రేయస్ అయ్యర్(5) పరుగులతో ఉన్నారు. కేకేఆర్ తొలి వికెట్ డౌన్.. నరైన్ ఔట్ 22 పరుగుల వద్ద కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన సునీల్ నరైన్.. మోహ్షిన్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 3 ఓవర్లకు కోల్‌కతా స్కోర్: 42/1. క్రీజులో ఫిల్ సాల్ట్(19), రఘు వంశీ(7) పరుగులతో ఉన్నారు. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన లక్నో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఆఖర్లో పూరన్ (45 నాటౌట్) బ్యాట్‌ను ఝులిపించడంతో లక్నో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. రాహుల్ (39), బదోని (29) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. డికాక్ (10), స్టోయినిస్ (10), దీపక్ హుడా (8) తక్కువ స్కోర్‌కే ఔటయ్యారు. స్టార్క్ 3 వికెట్లతో చెలరేగగా.. వైభవ్ అరోరా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, రసెల్ తలో వికెట్ తీశారు. ఐదో వికెట్ కోల్పోయిన లక్నో 14.4వ ఓవర్: 111 పరుగుల వద్ద లక్నో ఐదో వికెట్ కోల్పోయింది. సునీల్ నరైన్ బౌలింగ్‌లో రఘువంశీకి క్యాచ్ ఇచ్చి ఆయుశ్ బదోని (29) ఔటయ్యాడు. పూరన్ (10), కృనాల్ పాండ్యా క్రీజ్‌లో ఉన్నారు. డేంజరస్ స్టోయినిస్ ఔట్ 11.4వ ఓవర్: 95 పరుగుల వద్ద లక్నో నాలుగో వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో వికెట్‌కీపర్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి స్టోయినిస్ (10) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన లక్నో.. రాహుల్ ఔట్ 10.2వ ఓవర్: 78 పరుగుల వద్ద లక్నో మూడో వికెట్ కోల్పోయింది. రసెల్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన తర్వాతి బంతికే కేఎల్ రాహుల్ (39) ఔటయ్యాడు. రమన్‌దీప్‌కు క్యాచ్ ఇచ్చి రాహుల్ పెవిలియన్‌కు చేరాడు.బదోని (18), స్టోయినిస్ (8) క్రీజ్‌లో ఉన్నారు. రమణ్‌దీప్ సూపర్ క్యాచ్.. హుడా ఔట్ 4.4వ ఓవర్: 39 పరుగుల వద్ద మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో రమణ్‌దీప్ సింగ్ సూపర్ క్యాచ్ పట్టడంతో దీపక్ హుడా (8) పెవిలియన్‌కు చేరాడు. 5 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 39/2గా ఉంది. రాహుల్ (18), బదోని క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన లక్నో 1.5వ ఓవర్: 19 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్ కోల్పోయింది.వైభవ్ అరోరా బౌలింగ్‌లో సునీల్ నరైన్‌కు క్యాచ్ ఇచ్చి క్వింటన్ డికాక్ (10) ఔటయ్యాడు. రాహుల్‌కు (7) జతగా దీపక్ హుడా క్రీజ్‌లోకి వచ్చాడు. ఐపీఎల్లో ఇవాళ (ఏప్రిల్ 14) రెండు ఆసక్తికర సమరాలు జరుగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో కేకేఆర్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుండగా.. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో సీఎస్కే, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుండగా.. రాత్రి మ్యాచ్ ముంబైలోని వాంఖడేలో జరుగనుంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్.. లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న లక్నో.. 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో కేకేఆర్ రెండో స్థానంలో ఉంది. హ్యాట్రిక్ విజయాల అనంతరం కేకేఆర్ ఇటీవలే ఒక్క ఓటమిని ఎదుర్కొంది. కేకేఆర్ తమ చివరి మ్యాచ్‌లో సీఎస్కే చేతిలో ఓటమిపాలై సీజన్ తొలి ఓటమిని చవిచూసింది. హెడ్ టు హెడ్ ఫైట్ల విషయానికొస్తే.. ఈ ఇరు జట్లు ఇప్పటివరకు 3 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. మూడు సందర్భాల్లో లక్నోనే విజయం వరించింది. తుది జట్లు.. లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్‌కీపర్), దీపక్ హుడా, ఆయుష్ బదోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహిసిన్ ఖాన్, షమార్ జోసఫ్, యశ్ ఠాకూర్ లక్నో సూపర్ జెయింట్స్ ఇంపాక్ట్ సబ్స్: అర్షద్ ఖాన్, ప్రేరక్ మన్కడ్, ఎం సిద్ధార్థ్, అమిత్ మిశ్రా, కె గౌతమ్ కోల్‌కతా నైట్ రైడర్స్: ఫిలిప్ సాల్ట్(వికెట్‌కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి కోల్‌కతా నైట్ రైడర్స్ సబ్‌లు: సుయాష్ శర్మ, అనుకుల్ రాయ్, మనీష్ పాండే, రహ్మానుల్లా గుర్బాజ్, రింకూ సింగ్ -
ఐపీఎల్లో నేడు రెండు బిగ్ ఫైట్స్
ఐపీఎల్లో ఇవాళ (ఏప్రిల్ 14) రెండు ఆసక్తికర సమరాలు జరుగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో కేకేఆర్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుండగా.. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో సీఎస్కే, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుండగా.. రాత్రి మ్యాచ్ ముంబైలోని వాంఖడేలో జరుగనుంది. మధ్యాహ్నం మ్యాచ్ విషయానికొస్తే.. హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న లక్నో.. పటిష్టమైన కేకేఆర్‌ను వారి సొంత మైదానంలో ఢీకొట్టబోతుంది. ప్రస్తుతం లక్నో 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో కేకేఆర్ రెండో స్థానంలో ఉంది. హ్యాట్రిక్ విజయాల అనంతరం కేకేఆర్ ఇటీవలే ఓ ఓటమిని ఎదుర్కొంది. కేకేఆర్ తమ చివరి మ్యాచ్‌లో సీఎస్కే చేతిలో పరాజయంపాలైంది. హెడ్ టు హెడ్ ఫైట్ల విషయానికొస్తే.. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 3 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. మూడు సందర్భాల్లో లక్నోనే విజయం వరించింది. ముంబై, సీఎస్కే మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌ను అభిమానులు క్రికెట్ ఎల్ క్లాసికోగా (సమవుజ్జీల సమరం) పిలుస్తారు. ప్రస్తుత సీజన్లో ముంబై ఇండియన్స్ రెండు వరుస విజయాలతో ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుండగా.. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రెడీ తమ జైత్రయాత్రను స్టార్ట్ చేసింది. 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో సీఎస్కే పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. ముంబై 5 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతుంది. హెడ్ టు హెడ్ ఫైట్స్ విషయానికొస్తే.. ఇరు జట్లు మధ్య ఇప్పటివరకు 36 మ్యాచ్‌లు జరగగా ముంబై 20, సీఎస్కే 16 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. -
సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో దుమ్ములేపాడు.. 27 ఏళ్ల ఈ క్రికెటర్ ఎవరో తెలుసా?
-
సొంతగడ్డపై చెలరేగిన సీఎస్కే.. కేకేఆర్ చిత్తు
-
ఆ అమ్మాయి కోసం చాలా ఎదురుచూశాను.. శ్రేయస్ అయ్యర్
ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ చేసిన ద గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కలిసి పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో హిట్‌మ్యాన్, శ్రేయస్ అభిమానులకు తెలియని చాలా విషయాలను షేర్ చేసుకున్నారు. కపిల్ శర్మ ప్రశ్నలు అడుగుండగా.. వీరిద్దరు తమదైన శైలిలో సమాధానాలు చెబుతూ నవ్వులు పూయించారు. ఆధ్యాంతం ఉల్లాసభరింతగా సాగిన ఈ షో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఆ అమ్మాయి మెసేజ్ కోసం ఎదురుచూశాను.. స్టేడియంలో మహిళా అభిమానులపై కెమెరామెన్ల ఫోకస్ అనే అంశంపై చర్చ జరుగుతుండగా శ్రేయస్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. నా తొలి ఐపీఎల్ సీజన్లో ఓ అందమైన అమ్మాయిని చూశాను. స్టాండ్స్‌లో కూర్చుకున్న ఆ అమ్మాయివైపు చేయి ఊపుతూ హలో చెప్పాను. ఆ సమయంలో ఫేస్బుక్ చాలా పాపులర్‌గా ఉండేది. అందులో ఆ అమ్మాయి రిప్లై ఇస్తుందేమో అని చాలా ఎదురుచూశానని శ్రేయస్ తన తొలి క్రష్ గురించి చెప్పుకొచ్చాడు. శ్రేయస్ ఈ విషయం గురించి చెప్పగానే షోకు హాజరైన వారంతా ఓకొడుతూ సౌండ్లు చేశారు. ఇదే షోలో శ్రేయస్ మరిన్ని విషయాలు కూడా పంచుకున్నాడు. తన ఆరాధ్య క్రికెటర్ రోహిత్ శర్మ అని, అతను టీమిండియా కెప్టెన్ అయినందుకు ఈ మాట చెప్పడం లేదని అన్నాడు. సహచరులతో రోహిత్ చాలా నాటు స్టయిల్లో మాట్లాడతాడని శ్రేయస్ చెప్పగా.. రోహిత్ కూడా శ్రేయస్‌పై ఇదే కంప్లైంట్ చేశాడు. ఇదిలా ఉంటే రోహిత్, శ్రేయస్ ప్రస్తుతం ఐపీఎల్ 2024తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో రోహిత్ ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ నాలుగు మ్యాచ్‌ల్లో ఒకే ఒక విజయంతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉండగా.. శ్రేయస్ నాయకత్వంలోని కేకేఆర్ 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో రెండో స్థానంలో నిలిచింది. -
IPL 2024: చరిత్రలో ఒకే ఒక్కడు.. రవీంద్ర జడేజా
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఎవరికీ సాధ్యం కాని ఘనతను సీఎస్కే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సాధించాడు. 17 ఏళ్ల క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో 1000 పరుగులు సాధించి, 100 వికెట్లు పడగొట్టి, 100 క్యాచ్‌లు పట్టుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2024లో భాగంగా కేకేఆర్‌తో నిన్న (ఏప్రిల్ 8) జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ క్యాచ్ పట్టడం ద్వారా జడ్డూ క్యాష్ రిచ్ లీగ్‌లో 100 క్యాచ్‌ల మైలురాయిని తాకాడు. 231 మ్యాచ్‌ల ఐపీఎల్ కెరీర్లో జడేజా 2776 పరుగులు చేసి 156 వికెట్లు పడగొట్టాడు. జడ్డూ ఖాతాలో రెండు అర్దసెంచరీలు, ఓ ఐదు వికెట్ల ఘనత ఉంది. కేకేఆర్‌తో మ్యాచ్‌లో శ్రేయస్ క్యాచ్‌తో పాటు ఫిలిప్ సాల్ట్ క్యాచ్ కూడా పట్టుకున్న జడేజా.. బౌలింగ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్‌లో, ఫీల్డింగ్‌లో అద్భుత ప్రదర్శనలకు గాను జడేజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఐపీఎల్లో సీఎస్కే తరఫున జడేజాకు ఇది 15వ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. ఈ అవార్డుతో జడ్డూ సీఎస్కే తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా ధోని సరసన చేరాడు. ఐపీఎల్లో ధోని సైతం సీఎస్కే తరఫున 15 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. కాగా, నిన్నటి మ్యాచ్‌లో కేకేఆర్‌పై సీఎస్కే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. రవీంద్ర జడేజా (4-0-18-3), తుషార్ దేశ్‌పాండే (4-0-33-3), ముస్తాఫిజుర్ (4-0-22-2), తీక్షణ (4-0-28-1) దెబ్బకు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. విధ్వంసకర వీరులున్న కేకేఆర్ ఈ మ్యాచ్‌లో తేలిపోయింది. సాల్ట్ (0), వెంకటేశ్ అయ్యర్ (3), రింకూ సింగ్ (9), రసెల్ (10) తస్సుమనిపించారు. నరైన్ (27), రఘువంశీ (24), శ్రేయస్ అయ్యర్ (34) నామమాత్రపు స్కోర్లు చేశారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్కేను రుతురాజ్ (67 నాటౌట్) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు. రచిన్ రవీంద్ర 15, డారిల్ మిచెల్ 25, శివమ్ దూబే 28 పరుగులు (18 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లు) చేసి ఔట్ కాగా.. ధోని ఒక్క పరుగు చేసి నాటౌట్‌గా మిగిలాడు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా 2 వికెట్లు పడగొట్టగా.. నరైన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో సీఎస్కే మరో రెండు పాయింట్లు ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. సీజన్ తొలి ఓటమిని మూటగట్టుకున్న కేకేఆర్ రెండో స్థానంలో ఉంది. -
IPL 2024: సొంత అభిమానులనే ఆట పట్టించిన జడ్డూ.. వైరల్ వీడియో
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో కేకేఆర్‌తో నిన్న (ఏప్రిల్ 8) జరిగిన మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సీఎస్కే స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సొంత అభిమానులనే ఆటపట్టించాడు. సీఎస్కే లక్ష్యాన్ని ఛేదిస్తుండగా.. జడ్డూ ధోని కంటే ముందే బ్యాటింగ్‌కు దిగుతున్నట్లు ప్రాంక్ చేసి ఫ్యాన్స్‌ను టీజ్ చేశాడు. సీఎస్కే గెలుపు ఖరారైన దశలో శివమ్ దూబే ఔట్ కాగా.. ఆ దశలో ధోని బ్యాటింగ్‌కు దిగాల్సి ఉంది. అయితే జడ్డూ ధోని కంటే ముందే బరిలోకి దిగుతున్నట్లు నటించి అభిమానులను టీజ్ చేశాడు. కొంత దూరం వెళ్లి అభిమానులు కేకలు పెట్టడంతో జడ్డూ తిరిగి వెనక్కు వెళ్లిపోయాడు. అనంతరం ధోని బరిలోకి దిగి జట్టును విజయతీరాలకు చేర్చడంలో భాగమయ్యాడు. జడ్డూ సరదాగా చేసిన ఈ పని నవ్వులు పూయించింది. స్టేడియంలో ఉన్నవారంతా కాసేపు తనివితీరా నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. Ravindra Jadeja teased the Chepauk crowd by coming ahead of MS Dhoni then going back. 🤣 - This is amazing!! ❤️👌 pic.twitter.com/KPp4FewM17 — Mufaddal Vohra (@mufaddal_vohra) April 9, 2024 ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో కేకేఆర్‌పై సీఎస్కే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. రవీంద్ర జడేజా (4-0-18-3), తుషార్ దేశ్‌పాండే (4-0-33-3), ముస్తాఫిజుర్ (4-0-22-2), తీక్షణ (4-0-28-1) దెబ్బకు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. విధ్వంసకర వీరులున్న కేకేఆర్ ఈ మ్యాచ్‌లో తేలిపోయింది. సాల్ట్ (0), వెంకటేశ్ అయ్యర్ (3), రింకూ సింగ్ (9), రసెల్ (10) తస్సుమనిపించారు. నరైన్ (27), రఘువంశీ (24), శ్రేయస్ అయ్యర్ (34) నామమాత్రపు స్కోర్లు చేశారు. We thought it was a Prank by Jadeja but it was a Prank from Thala to Fans. Look How all Teammates enjoying it 😂💛 pic.twitter.com/YrzQbP7WNV — 🎰 (@StanMSD) April 9, 2024 స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్కేను రుతురాజ్ (67 నాటౌట్) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు. రచిన్ రవీంద్ర 15, డారిల్ మిచెల్ 25, శివమ్ దూబే 28 పరుగులు (18 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లు) చేసి ఔట్ కాగా.. ధోని ఒక్క పరుగు చేసి నాటౌట్‌గా మిగిలాడు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా 2 వికెట్లు పడగొట్టగా.. నరైన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
భారీ షాట్లతో విరుచుకుపడ్డ ధోని.. వీడియో వైరల్
ఐపీఎల్-2024లో తొలి రెండు మ్యాచ్‌లలో గెలుపొందిన డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఆ తర్వాత రెండు మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్, హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ చేతిలో పరాజయాలు చవిచూసింది. ఫలితంగా నాలుగు పాయింట్ల వద్ద నిలిచిపోయి పట్టికలో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం నాటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై గెలుపొంది తిరిగి విజయాల బాట పట్టాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం సీఎస్కే ఆటగాళ్లు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులకు కనువిందు చేసే ఓ వీడియోను షేర్ చేసింది చెన్నై ఫ్రాంఛైజీ. ఇందులో మహేంద్ర సింగ్ ధోని సిక్సర్ల వర్షం కురిపించడం చూడవచ్చు. నెట్ ప్రాక్టీస్‌లో భాగంగా బ్యాటింగ్ చేసిన ధోని ఫుల్ జోష్‌లో కనిపించాడు. ఉత్సాహంగా బంతులు ఎదుర్కొంటూ భారీ షాట్లు బాదాడు. ఈ నేపథ్యంలో సొంత మైదానంలో తలా కేకేఆర్ బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయమని అభిమానులు ఫిక్సయిపోతున్నారు. కాగా చెన్నైలోని చెపాక్ వేదికగా సీఎస్కే- కేకేఆర్ మధ్య రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఇక ఇప్పటి వరకు ఇరు జట్లు ఇరవై ఎనిమిదిసార్లు ముఖాముఖి పోటీపడగా.. చెన్నై 18సార్లు గెలుపొందింది. చెపాక్‌లో పదిసార్లు ఎదురుపడగా ఏకంగా ఏడుసార్లు విజయం సాధించింది. ఓవరాల్‌గా కేకేఆర్‌పై చెన్నైదే పైచేయి! తుదిజట్ల అంచనా సీఎస్కే రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), అజింక్య రహానె, శివమ్ దూబే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ/ మిచెల్ శాంట్నర్, ఎంఎస్ ధోని, దీపక్ చహర్, తుషార్ దేశ్ పాండే, మహీష్ తీక్షణ [ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్: ముఖేష్ చౌదరి] కేకేఆర్ సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి [ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్: సుయాష్ శర్మ]. చదవండి: ముఖం మాడ్చుకున్న రోహిత్: పాండ్యాను హత్తుకుంటూనే సీరియస్ 📍Chennai Sound 🔛🎙️ 𝙅𝙪𝙨𝙩 𝙈𝙎 𝘿𝙝𝙤𝙣𝙞 𝙩𝙝𝙞𝙣𝙜𝙨 😎#TATAIPL | #CSKvKKR pic.twitter.com/7CPnrl9Ysa — IndianPremierLeague (@IPL) April 8, 2024 -
భారత కెప్టెన్‌గా అతడి స్థాయిని ఎవరూ అందుకోలేరు: గంభీర్
టీమిండియా దిగ్గజ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనిపై మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ప్రశంసలు కురిపించాడు. భారత జట్టు కెప్టెన్‌గా ధోని సాధించిన ఘనతలను అందుకోవడం ఇక ముందు ఎవరికీ సాధ్యం కాదనడంలో సందేహం లేదన్నాడు. టీమిండియా కెప్టెన్‌గా ఎవరెన్ని విజయాలు సాధించినా ధోని మూడు ఐసీసీ ట్రోఫీల ముందు దిగదుడుపేనని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్-2024లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్)- చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) మధ్య సోమవారం మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో కేకేఆర్ మాజీ కెప్టెన్, ప్రస్తుత మెంటార్ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీఎస్కేతో పోరును తాను ఎల్లప్పుడూ ఆస్వాదిస్తానని పేర్కొన్నాడు. అప్పుడు కెప్టెన్‌గా.. ఇప్పుడు మెంటార్‌గా ఇందులో ఎటువంటి మార్పులేదన్నాడు. సీఎస్కేపై పైచేయి సాధించాలనే పట్టుదలతో ఉన్నామని తెలిపాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); ఇక ధోని గురించి ప్రస్తావనకు రాగా.. ‘‘నేను ఈ మ్యాచ్ గెలవాలనే కోరుకుంటున్నాను. నేనే కాదు.. నా స్థానంలో ధోని ఉన్నా తన జట్టే గెలవాలని కోరుకుంటాడు. స్నేహితులుగా ఒకరిపట్ల ఒకరికి గౌరవం ఉంది. అంతమాత్రాన పోటీ పడటంలో ఎవరూ తగ్గరు కదా!.. ఏదేమైనా టీమిండియా కెప్టెన్‌గా ధోని మాదిరి మరెవరూ విజయవంతం కాలేదన్నది నిజం. మూడు ఐసీసీ ట్రోఫీలు గెలవడం మామూలు విషయం కాదు. కొంతమంది భారత కెప్టెన్లు విదేశాల్లో చారిత్రక విజయాలు సాధించవచ్చు.. మరికొందరు టెస్టు మ్యాచ్‌లలో గెలిపించవచ్చు. అయినా మూడు ఐసీసీ ట్రోఫీల కంటే అవేమీ పెద్దవి కావు’’ అని గంభీర్.. ధోని నాయకత్వ నైపుణ్యాలను కొనియాడాడు. కాగా ధోని కెప్టెన్సీలో టీ20 వరల్డ్‌కప్-2007, వన్డే ప్రపంచకప్-2011 గెలిచిన భారత జట్టులో గంభీర్ సభ్యుడన్న విషయం తెలిసిందే. పొట్టి ఫార్మాట్ ఫైనల్లో 75, వన్డే ఫార్మాట్ ఫైనల్లో 97 పరుగులు చేసి ఈ ట్రోఫీలు గెలవడంలో గంభీర్ కీలక పాత్ర పోషించాడు. అయితే, ఎల్లప్పుడూ ధోనిని ఏదో రకంగా విమర్శించే ఈ కేకేఆర్ మెంటార్ ఈసారి ప్రశంసల వర్షం కురిపించడం విశేషం. కాగా కేకేఆర్ సారథిగా సీఎస్కేతో 11సార్లు పోటీపడ్డ గంభీర్ ఐదుసార్లు గెలిచాడు. 2012 ఫైనల్లో సీఎస్కేను ఓడించి టైటిల్ గెలిచాడు కూడా! View this post on Instagram A post shared by Star Sports India (@starsportsindia) -
IPL 2024, DC VS KKR: కేకేఆర్ తొలిసారి ఇలా..!
17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతా నైట్‌రైడర్స్ తొలిసారి సీజన్ తొలి మూడు మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించి రికార్డుల్లోకెక్కింది. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌పై బంపర్ విక్టరీతో కేకేఆర్ ఈ ఘనత సాధించింది. గతంలో ఏ సీజన్లోనూ కేకేఆర్ సీజన్ తొలి మూడు మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించలేదు. ప్రస్తుత సీజన్లో కేకేఆర్ హ్యాట్రిక్ విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కేకేఆర్.. సన్‌రైజర్స్, ఆర్సీబీ, ఢిల్లీపై వరుస విజయాలు సాధించి అజేయ జట్టుగా కొనసాగుతుంది. ఈ సీజన్లో సన్‌రైజర్స్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో 4 పరుగుల స్వల్ప తేడాతో బయటపడిన కేకేఆర్.. ఆతర్వాత ఆర్సీబీ (7 వికెట్ల తేడాతో), ఢిల్లీపై (106 పరుగుల తేడాతో) ఘన విజయాలు సాధించింది. ఈ సీజన్లో అన్ని విభాగాల్లో అత్యంత పటిష్టంగా కనిపిస్తున్న కేకేఆర్.. ఆర్సీబీ, ఢిల్లీలను వారి సొంత మైదానాల్లో ఓడించి శభాష్ అనిపించుకుంది. ప్రస్తుత సీజన్లో కేకేఆర్.. శ్రేయస్ అయ్యర్ సారధ్యంలో, గంభీర్ మెంటార్షిప్లో, చంద్రకాంత్ పండిట్ శిక్షణలో టైటిల్ రేసులో దూసుకుపోతుంది. ఐపీఎల్ అరంగేట్రం నుంచి కొనసాగుతున్న కేకేఆర్.. రెండు సార్లు (2012, 2014) ఛాంపియన్‌గా, ఓ సారి రన్నరప్‌గా (2021) నిలిచింది. గౌతమ్ గంభీర్ (ప్రస్తుత మెంటార్) కేకేఆర్‌ను రెండుసార్లు ఛాంపియన్‌గా నిలబెట్టాడు. 2021 సీజన్లో కేకేఆర్ రన్నరప్‌గా నిలిచినప్పుడు ఆ జట్టుకు ఇయాన్ మోర్గాన్ నాయకత్వం వహించాడు. కేకేఆర్ ఛాంపియన్స్ లీగ్‌లోనూ ఓసారి రన్నరప్‌గా (2014) నిలిచింది. కాగా, ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సునీల్ నరైన్ (39 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్సర్లు), రఘువంశీ (27 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (19 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (11 బంతుల్లో 18; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (8 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల చేసింది. ఐపీఎల్ ఇది రెండో అతి భారీ స్కోర్. ఇదే సీజన్లో ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ చేసిన స్కోర్ (277/3) ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌గా ఉంది. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. 17.2 ఓవర్లలో 166 పరుగులకే చాపచుట్టేసి, 106 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రిషబ్ పంత్ (55), ట్రిస్టన్ స్టబ్స్ (54) ఓటమి ఖరారైన దశలో బ్యాట్‌ను ఝులిపించారు. వీరిద్దరు మినహా ఢిల్లీ ఆటగాళ్లంతా చేతులెత్తేశారు. వార్నర్ (18), పృథ్వీ షా (10) రెండంకెంల స్కోర్లు చేయగా.. మార్ష్, పోరెల్, అక్షర్ డకౌట్లయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌల్ చేసి చెరి 3 వికెట్లు పడగొట్టారు. స్టార్క్ 2, రసెల్, నరైన్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
IPL 2024 DC VS KKR: రసెల్ రికార్డును సమం చేసిన నరైన్
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (ఏప్రిల్ 3) జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సునీల్ నరైన్ (39 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి కేకేఆర్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఫలితంగా అతనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. నరైన్ కేకేఆర్ తరఫున ఈ అవార్డు అందుకోవడం ఇది 14వసారి. కేకేఆర్ తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న రికార్డు ఆండ్రీ రసెల్ (14) పేరిట ఉండగా.. నిన్నటి మ్యాచ్‌తో నరైన్ రసెల్ రికార్డును సమం చేశాడు. రసెల్, నరైన్ ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో 10, 11 స్థానాల్లో ఉన్నారు. ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల రికార్డు ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. ఏబీడి ఢిల్లీ డేర్‌డెవిల్స్, ఆర్సీబీ తరఫున 25 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. ఏబీడీ తర్వాత క్రిస్ గేల్ (22), రోహిత్ శర్మ (19), డేవిడ్ వార్నర్ (18), ఎంఎస్ ధోని (17), విరాట్ కోహ్లి (17), షేన్ వాట్సన్ (16), యూసఫ్ పఠాన్ (16) అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. రసెల్, నరైన్‌తో సమానంగా సురేశ్ రైనా, కీరన్ పోలార్డ్ కూడా 14 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్నారు. కాగా, ఢిల్లీతో మ్యాచ్‌లో నరైన్‌తో పాటు యువ ఆటగాడు రఘువంశీ (27 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (19 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (11 బంతుల్లో 18; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (8 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) రెచ్చిపోవడంతో కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో భారీ స్కోర్. ఇదే సీజన్లో ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ చేసిన స్కోర్ (277/3) ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌గా ఉంది. 273 పరుగుల భారీ లక్ష్యాన్నిఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. 17.2 ఓవర్లలో 166 పరుగులకే చాపచుట్టేసి, ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. రిషబ్ పంత్ (55), ట్రిస్టన్ స్టబ్స్ (54) ఓటమి ఖరారైన దశలో బ్యాట్‌ను ఝులిపించారు. వీరిద్దరు మినహా ఢిల్లీ ఆటగాళ్లంతా చేతులెత్తేశారు. వార్నర్ (18), పృథ్వీ షా (10) రెండంకెంల స్కోర్లు చేయగా.. మార్ష్, పోరెల్, అక్షర్ డకౌట్లయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌల్ చేసి చెరి 3 వికెట్లు పడగొట్టారు. స్టార్క్ 2, రసెల్, నరైన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ గెలుపుతో కేకేఆర్ హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లగా.. ఢిల్లీ తాజా ఓటమితో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి పడిపోయింది. -
కళ్లు చెదిరే యార్కర్.. అభినందించకుండా ఉండలేకపోయిన బ్యాటర్
ఢిల్లీ క్యాపిటల్స్ వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ కళ్లు చెదిరే యార్కర్‌ను సంధించాడు. కేకేఆర్‌తో ఇవాళ (ఏప్రిల్ 3) జరుగుతున్న మ్యాచ్‌లో ఇషాంత్ సూపర్ డెలివరీని బౌల్ చేశాడు. ఇషాంత్ యార్కర్ దెబ్బకు బ్యాటర్ ఆండ్రీ రసెల్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. సెకెన్ల వ్యవధిలో బంతి వికెట్లను గిరాటు వేయడంతో రసెల్ నిర్ఘాంతపోయాడు. ఇషాంత్ యార్కర్‌కు సమాధానం చెప్పలేని రసెల్ బంతిని అడ్డుకునే క్రమంలో బొక్కబోర్లా పడ్డాడు. ఈ బంతిని సంధించినందుకుగాను రసెల్ ఇషాంత్‌ను అభినందించకుండా ఉండలేకపోయాడు. కిందపడి లేవగానే చప్పట్లతో అభినందించాడు. ఇషాంత్ సూపర్ యార్కర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. ISHANT SHARMA WITH A BALL OF IPL 2024...!!! 🤯 pic.twitter.com/9O015ZzlwZ — Mufaddal Vohra (@mufaddal_vohra) April 3, 2024 ఇషాంత్ రసెల్‌ను ఔట్ చేసిన సందర్భం కూడా చాలా కీలకమైంది. ఆఖరి ఓవర్ తొలి బంతికి.. అప్పటికే రసెల్ (19 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) శివాలెత్తిపోయి ఉన్నాడు. ఆ సమయంలో ఇషాంత్ అద్భుతమైన యార్కర్‌తో రసెల్‌ను బోల్తా కొట్టించాడు. ఆ బంతికి రసెల్ ఔట్ కాకపోయి ఉండివుంటే, కేకేఆర్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ స్కోర్ నమోదు చేసి ఉండేది. లేటు వయసులో ఇషాంత్ ప్రదర్శనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ మ్యాచ్‌లో అతను ధారాళంగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సునీల్ నరైన్ (39 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్సర్లు), రఘువంశీ (27 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్, శ్రేయస్ అయ్యర్ (11 బంతుల్లో 18; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (8 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో భారీ స్కోర్. ఇదే సీజన్లో ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ చేసిన స్కోర్ (277/3) ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌గా ఉంది. ఓ సీజన్లో 250పైగా స్కోర్లు రెండు సార్లు నమోదు కావడం 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇదే మొదటిసారి. -
IPL 2024 DC VS KKR: ఐపీఎల్ చరిత్రలో రెండో భారీ స్కోర్
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 3) జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లు వీరంగం సృష్టించారు. టాపార్డర్ బ్యాటర్లు పోటాపోటీపడి విధ్వంసం సృష్టించారు. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలోనే రెండో అతి భారీ స్కోర్ నమోదైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సునీల్ నరైన్ (39 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్సర్లు), రఘువంశీ (27 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (19 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (11 బంతుల్లో 18; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (8 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల చేసింది. ఐపీఎల్లో ఇది రెండో అతి భారీ స్కోర్. ఇదే సీజన్లో ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ చేసిన స్కోర్ (277/3) ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌గా ఉంది. ఓ సీజన్లో 250పైగా స్కోర్లు రెండు సార్లు నమోదు కావడం 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇదే మొదటిసారి. ఐపీఎల్ చరిత్రలో టాప్-5 అత్యధిక స్కోర్లు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ (277/3): 2024 సీజన్లో ముంబై ఇండియన్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్ (266/6): 2024 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (263/5): 2013 సీజన్లో పూణే వారియర్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ (257/5): 2023 సీజన్లో పంజాబ్ కింగ్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (248/3): 2016 సీజన్లో గుజరాత్ లయన్స్‌పై -
విధ్వంసం సృష్టించిన కేకేఆర్ యువ బ్యాటర్.. శుభ్‌మన్ గిల్ తర్వాత..!
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 3) జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ యువ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ విధ్వంసం సృష్టించాడు. కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా కేకేఆర్ తరఫున శుభ్‌మన్ గిల్ తర్వాత అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. శుభ్‌మన్ 18 ఏళ్ల 237 రోజుల వయసులో (2018 సీజన్) సీఎస్కేపై హాఫ్ సెంచరీ చేయగా.. రఘువంశీ 18 ఏళ్ల 303 రోజుల వయసులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై అర్దసెంచరీ సాధించాడు. రఘువంశీకి ఐపీఎల్లో ఇది తొలి ఇన్నింగ్స్ కావడం విశేషం. Innovative! Maiden IPL Fifty for Angkrish Raghuvanshi ✨ Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #DCvKKR pic.twitter.com/72oQQZIDbd — IndianPremierLeague (@IPL) April 3, 2024 ఈ ఇన్నింగ్స్‌కు ముందు అతను ఓ మ్యాచ్ ఆడినా అందులో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కేకేఆర్ తరఫున అరంగేట్రం ఇన్నింగ్స్‌లో ఆరో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగానూ రఘువంశీ రికార్డుల్లోకెక్కాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 27 బంతులు ఎదుర్కొన్న రఘువంశీ 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో రఘువంశీతో పాటు సునీల్ నరైన్ సైతం విధ్వంసం సృష్టించాడు. నరైన్ కేవలం 39 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 85 పరుగులు చేశాడు. వీరిద్దరి ఊచకోత ధాటికి ఢిల్లీ బౌలర్లు వణికిపోయారు. వీరిద్దరు ఔటయ్యాక రసెల్ భారీ షాట్లు ఆడటం మొదలుపెట్టాడు. రసెల్ 15 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 38 పరుగులు చేసి క్రీజ్‌లో కొనసాగుతున్నాడు. అతనికి జతగా శ్రేయస్ అయ్యర్ (12) ఉన్నాడు. నరైన్, రఘువంశీ, రసెల్ ధాటికి కేకేఆర్ 16వ ఓవర్లోనే 200 పరుగుల మార్కును దాటింది. ఐపీఎల్ చరిత్రలో ఇది మూడో వేగవంతమై 200. 17 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 224/3గా ఉంది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఐదో ఓవర్లో ఫిలిప్ సాల్ట్ (18) ఔటయ్యాడు. నోర్జే బౌలింగ్‌లో ట్రిస్టన్ స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి సాల్ట్ పెవిలియన్‌కు చేరాడు. కాగా, ప్రస్తుత సీజన్లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న కేకేఆర్ మరో విజయం సాధించే దిశగా అడుగులు వేస్తుంది. అండర్-19 వరల్డ్‌కప్ హీరో.. 18 ఏళ్ల రఘువంశీ భారత అండర్-19 జట్టు వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. 2022 వరల్డ్‌కప్ ఎడిషన్‌లో రఘువంశీ భారత్ తరఫున లీడింగ్ రన్‌స్కోరర్‌గా ఉన్నాడు. -
IPL 2024, DC VS KKR: సునీల్ నరైన్ ఊచకోత
ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 3) జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ ఓపెనర్ సునీల్ నరైన్ శివాలెత్తిపోయాడు. కేవలం 21 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. నరైన్ విధ్వంసం ధాటికి కేకేఆర్ 9 ఓవర్లలో వికెట్ నష్టానికి 126 పరుగులు చేసింది. నరైన్‌కు జతగా యువ ఆటగాడు రఘువంశీ (14 బంతుల్లో 31; 4 ఫోర్లు, సిక్స్) క్రీజ్‌లో ఉన్నాడు. రఘువంశీ కూడా చెలరేగి ఆడుతున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత కూడా నరైన్ దూకుడు కొనసాగుతుంది. Sunil Narine is in some form! 🔥 pic.twitter.com/326qICPqWl — Mufaddal Vohra (@mufaddal_vohra) April 3, 2024 నరైన్ 28 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 68 పరుగులతో అజేయంగా కొనసాగుతున్నాడు. నరైన్ ఇషాంత్ శర్మ, రసిక్ సలామ్ అక్షర్ పటేల్‌లకు చుక్కలు చూపించాడు. ఇషాంత్ వేసిన నాలుగో ఓవర్లో మూడు సిక్సర్లు సహా 26 పరుగులు పిండుకున్న నరైన్.. రసిర్ వేసిన 6వ ఓవర్లో మూడు ఫోర్ల సాయంతో 18, అక్షర్ వేసిన 8వ ఓవర్లో 2 సిక్సర్ల సాయంతో 19 పరుగులు రాబట్టాడు. THE DESTRUCTION OF SUNIL NARINE...!!!!- He smashed 6,6,4,0,6,4 in an over against Ishant Sharma..!!! 🔥 pic.twitter.com/i9vkivM2NH— CricketMAN2 (@ImTanujSingh) April 3, 2024 ఈ మ్యాచ్‌లో కేకేఆర్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఐదో ఓవర్లో ఫిలిప్ సాల్ట్ (18) ఔటయ్యాడు. నోర్జే బౌలింగ్‌లో ట్రిస్టన్ స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి సాల్ట్ పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుత సీజన్లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న కేకేఆర్ మరో విజయం సాధించే దిశగా అడుగులు వేస్తుంది. -
IPL 2024: కోట్లు పెట్టినా పేలని పేస్ గన్.. 20 లక్షలకే పేట్రేగిపోతున్న యువ సంచలనం
ఐపీఎల్ 2024 వేలంలో అత్యధిక ధర (24.75 కోట్లతో కేకేఆర్ సొంతం చేసుకుంది) పలికి, లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కిన ఆసీస్ పేస్ గన్ మిచెల్ స్టార్క్.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పేలవ ప్రదర్శనలతో నిరాశపరుస్తున్నాడు. భారీ అంచనాల నడుమ ఈ సీజన్ బరిలోకి దిగిన స్టార్క్ ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయకుండా ఏకంగా 100 పరుగులు సమర్పించుకున్నాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 4 ఓవర్లలో 53 పరుగులిచ్చిన స్టార్క్.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌల్ చేసి 47 పరుగులు సమర్పించుకున్నాడు. జట్టులోని కుర్ర బౌలర్లు సత్తా చాటుతుంటే కోట్లు కుమ్మరించి కొనుక్కున స్టార్క్ తేలిపోతుండటంతో కేకేఆర్ యాజమాన్యం అసంతృప్తిగా ఉంది. స్టార్క్‌తో పాటు కేకేఆర్ బౌలింగ్ అటాక్‌ను ప్రారంభిస్తున్న 22 ఏళ్ల యువ పేసర్ హర్షిత్ రాణా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్లు, ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్లు తీసి ఔరా అనిపిస్తే.. స్టార్క్ మాత్రం తనపై పెట్టిన డబ్బుకు కనీస న్యాయం కూడా చేయలేక ఉసూరుమనిపిస్తున్నాడు. స్టార్క్‌పై పెట్టిన పెట్టుబడిలో కనీసం ఒకటో వంతు (20 లక్షలు) కూడా లభించని రాణా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంటే.. స్టార్క్ మాత్రం కోట్లు జేబులో వేసుకుని దిక్కులు చూస్తున్నాడు. మరో పక్క తన సహచరుడు, సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ తనపై పెట్టుకున్న అంచనాలకు న్యాయం చేస్తుంటే స్టార్క్ మాత్రం కేకేఆర్ అభిమానులకు, యాజమాన్యానికి గుండు సున్నా చూపిస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో కేకేఆర్ ఎలాగోలా గెలిచింది కాబట్టి సరిపోయింది. లేకుంటే స్టార్క్‌పై విమర్శల పర్వం మొదలయ్యేది. ఇప్పటికైనా స్టార్క్ మొద్దు నిద్రను వీడి రాణించాలని కేకేఆర్ అభిమానులు కోరుకుంటున్నారు. కాగా, ప్రస్తుత సీజన్లో కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. కేకేఆర్.. ఏప్రిల్ 3న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. నేటి మ్యాచ్‌ల విషయానికొస్తే.. ఇవాళ డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లో గుజరాత్ తమ సొంత మైదానంలో సన్‌రైజర్స్‌ను ఎదుర్కోనుండగా.. విశాఖలో జరిగే రాత్రి మ్యాచ్‌లో ఢిల్లీ, సీఎస్కే జట్లు తలడనున్నాయి. -
Virat Kohli-Gambhir: కలిసిపోయిన గంభీర్, కోహ్లి.. హగ్ చేసుకుని మరి! వీడియో వైరల్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మధ్య గత కొంత కాలంగా వైరం నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు వారిద్దరూ కలిసిపోయారు. అవును మీరు విన్నది నిజమే. ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, కేకేఆర్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ స్ట్రాటజిక్ టైమ్‌లో గౌతం గంభీర్, కోహ్లి ఇద్దరూ ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకుంటూ హగ్ చేసుకున్నారు. దీంతో వారిద్దరి మధ్య 11 ఏళ్లగా కొనసాగుతున్న వైరానికి తెరపడింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు తమ అభిమాన క్రికెటర్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. క్రికెట్ జెంటిల్మెన్ గేమ్ అని, ఎప్పుడు మీ ఇద్దరూ ఇలానే కలిసి ఉండాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో కోహ్లి ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తుండగా.. గౌతం గంభీర్ కేకేఆర్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా తొలిసారిగా 2013 ఐపీఎల్ సీజన్లో కేకేఆర్- ఆర్సీబీ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత 2015 ఐపీఎల్ సీజన్లో మళ్లీ విరాట్, గౌతీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ మ్యాచ్‌లో కేకేఆర్‌పై ఆర్సీబీ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. దీన్ని తట్టుకోలేకపోయిన గౌతమ్ గంభీర్, డగౌట్లో కూర్చీని తన్ని, ఫైన్ కూడా కట్టాడు. అనంతరం 2023 ఐపీఎల్ సీజన్లో మరోసారి విరాట్ , గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నవీన్ ఉల్ హాక్-కోహ్లి మధ్య గొడవ జరగగా.. అందులో గంభీర్ జోస్యం చేసుకోవడంతో ఆ గొడవ మరింత తీవ్రమైంది. అయితే మళ్లీ ఏడాది తర్వాత ఇద్దరూ ఒకే మైదానంలో ఉండడంతో అందరి కళ్లు ఈ మ్యాచ్‌పైనే ఉన్ను. కానీ అందరి ఊహలను తలకిందులు చేస్తూ ఇద్దరూ మంచి మిత్రులయ్యారు. They hugged 😭😭😭 Gautam gambhir said sorry to king kohli for everything he spoke against him. I think the only controversy which will last this season is Hardik vs Rohit 😂#RCBvsKKR #IPL2024 #ViratKohli #GautamGambhir Maxwell pic.twitter.com/G0pZpGsOOb — RanaJi🏹 (@RanaTells) March 29, 2024 -
IPL 2024 RCB VS KKR: చరిత్ర సృష్టించనున్న సునీల్ నరైన్
ఐపీఎల్ 2024లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (మార్చి 29) జరుగబోయే మ్యాచ్‌తో కేకేఆర్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ చరిత్ర సృష్టించనున్నాడు. ఈ మ్యాచ్‌తో నరైన్ టీ20ల్లో 500 మ్యాచ్‌ల మైలురాయిని తాకబోతున్నాడు. ప్రపంచ క్రికెట్లో కేవలం ముగ్గురు మాత్రమే నరైన్‌కు ముందు ఈ మైలురాయిని తాకారు. వీరిలో కీరన్ పోలార్డ్ అందరికంటే ఎక్కువగా 660 మ్యాచ్‌లు ఆడగా.. డ్వేన్ బ్రావో 573, షోయబ్ మాలిక్ 542 మ్యాచ్‌లు ఆడారు. టీ20ల్లో అత్యంత అరుదైన క్లబ్లో చేరబోతున్న నరైన్.. ఈ ఫార్మాట్లో ఇప్పటివరకు 499 మ్యాచ్‌లు ఆడి 536 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో 3736 పరుగులు చేశాడు. 2011లో టీ20 ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చిన నరైన్ చాలా రికార్డుల్లో భాగంగా ఉన్నాడు. టీ20ల్లో అత్యధిక మెయిడిన్లు (30) వేసిన బౌలర్‌గా.. టీ20ల్లో మూడో అత్యధిక వికెట్ టేకర్‌గా (536).. కనీసం 2000 బంతులు బౌల్ చేసిన వారిలో రెండో అత్యధిక ఎకానమీ రేట్ (6.10) కలిగిన బౌలర్‌గా.. పవర్ ప్లేల్లో నాలుగో అత్యుత్తమ స్ట్రయిక్‌రేట్ (155.05) కలిగిన బ్యాటర్‌గా.. టీ20ల్లో అత్యధిక టైటిళ్లలో (10) భాగమైన నాలుగో ఆటగాడిగా పలు రికార్డుల్లో తన పేరును లిఖించుకున్నాడు. మ్యాచ్ విషయానికొస్తే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు గెలుపు కోసం కొదమ సింహాల్లా పోరాడనున్నాయి. కేకేఆర్ తమ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను మట్టికరిపించి జోష్‌లో ఉండగా.. ఆర్సీబీ తమ చివరి మ్యాచ్‌లో (రెండోది) పంజాబ్ కింగ్స్‌కు షాకిచ్చి నూతనోత్సాహంతో ఉరకలేస్తుంది. -
IPL 2024 RCB VS KKR: సెంటిమెంట్ కొనసాగేనా..!
ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (మార్చి 29) మరో క్లాసీ మ్యాచ్ జరుగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు గెలుపు కోసం కొదమ సింహాల్లా పోరాడే అవకాశం ఉంది. కేకేఆర్ తమ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను మట్టికరిపించి జోష్‌లో ఉంటే.. ఆర్సీబీ తమ చివరి మ్యాచ్‌లో (రెండోది) పంజాబ్ కింగ్స్‌కు షాకిచ్చి నూతనోత్సాహంతో ఉరకలేస్తుంది. ఇవాల్టి మ్యాచ్‌కు ముందు ఓ సెంటిమెంట్ అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు జరిగిన తొమ్మిది మ్యాచ్‌ల్లో హోం గ్రౌండ్లో ఆడిన జట్లే విజయాలు సాధించాయి. చెన్నైలో జరిగిన తొలి మ్యాచ్‌లో సీఎస్కే (ఆర్సీబీపై విజయం), చంఢీఘడ్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో పంజాబ్ (ఢిల్లీ క్యాపిటల్స్‌పై), కోల్‌కతాలో జరిగిన మూడో మ్యాచ్‌లో కేకేఆర్ (సన్‌రైజర్స్‌పై), జైపూర్‌లో జరిగిన నాలుగో మ్యాచ్‌లో రాజస్థాన్ (లక్నోపై), అహ్మదాబాద్‌లో ముంబైపై గుజరాత్, బెంగళూరులో పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ, చెన్నైలో గుజరాత్‌పై సీఎస్కే, హైదరాబాద్‌లో ముంబైపై సన్‌రైజర్స్, జైపూర్‌లో నిన్న జరిగిన తొమ్మిదో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాజస్థాన్ రాయల్స్ విజయాలు సాధించాయి. ఈ నేపథ్యంలో ఆర్సీబీ హోం గ్రౌండ్లో విజయం సాధించి సెంటిమెంట్ కొనసాగిస్తుందా.. లేక కేకేఆర్‌కు దాసోహమై సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. గత రికార్డులను పరిశీలిస్తే.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య ఇప్పటివరకు 32 మ్యాచ్‌లు జరగగా కేకేఆర్ 18, ఆర్సీబీ 14 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. బలాబలాల విషయానికొస్తే.. ఇరు జట్లు బ్యాటింగ్‌లో సమతూకంగా కనిపిస్తున్నప్పటికీ.. కేకేఆర్‌కు బ్యాటింగ్ డెప్త్ కాస్త ఎక్కువేనని చెప్పాలి. ఆ జట్టులో ఎనిమిదో నంబర్ వరకు బ్యాటింగ్ చేసే వాళ్లు ఉన్నారు. ఆర్సీబీ విషయానికొస్తే పరిస్థితి అలా లేదు. విరాట్, డుప్లెసిస్, మ్యాక్సీ ఔటైతే ఆ జట్టు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. బౌలింగ్‌లోనూ ఆర్సీబీతో పోలిస్తే కేకేఆర్ మెరుగ్గానే ఉందని చెప్పాలి. ఐపీఎల్ కాస్ట్లీ ప్లేయర్ మిచెల్ స్టార్క్ నాయకత్వంలో కేకేఆర్ బౌలింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తుంది. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో హర్షిత్ రాణా ఇరగదీశాడు. రసెల్ బ్యాట్‌తో పాటు బంతితోనూ చెలరేగాడు. నరైన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. స్టార్క్, వరుణ్ చక్రవర్తి ధారాళంగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ పరిస్థితి రిపీట్ కాదని అనిపిస్తుంది. ఆర్సీబీ విషయానికొస్తే.. ముందుగా ఈ జట్టులో చెప్పుకోదగ్గ బౌలర్ లేడు. కేవలం బ్యాటింగ్‌పైనే ఆ జట్టు ఆధార పడింది. సిరాజ్, అల్జరీ జోసఫ్, యశ్ దయాల్, గ్రీన్ లాంటి పేసర్లు ఉన్నా వారి నుంచి గొప్ప ప్రదర్శనలు ఆశించలేని పరిస్థితి ఉంది. స్పిన్నర్లు కర్ణ్ శర్మ, మయాంక్ డాగర్, మ్యాక్సీ అడపాదడపా రాణిస్తుంటారు. మొత్తంగా చూస్తే.. ఆర్సీబీ కంటే కేకేఆర్కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. -
IPL 2024: పాపం కావ్య మారన్.. క్షణాల్లో ముఖం మారిపోయింది..!
ఐపీఎల్ 2024లో భాగంగా కోల్‌కతా వేదికగా కేకేఆర్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్ చివరి బంతి వరకు హోరాహోరీగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. ఫిలిప్ సాల్ట్ (40 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రసెల్ (25 బంతుల్లో 64 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగా.. ఛేదనలో హెన్రిచ్ క్లాసెన్ (29 బంతుల్లో 63; 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించినప్పటికీ సన్‌రైజర్స్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. Day 1 of asking @JioCinema why we can't have #KavyaMaran on a separate hero cam feed during the live stream on #SRH matchday!? pic.twitter.com/QkzCPdvMkR — Saurav Shrivastava 🇮🇳 (@SaySaurav) March 23, 2024 చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా.. హర్షిత్ రాణా (4-0-33-3) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి సన్‌రైజర్స్ గెలుపును అడ్డుకున్నాడు. అప్పటికే శివాలెత్తిపోయిన క్లాసెన్ వికెట్‌తో పాటు షాబాజ్ అహ్మద్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆఖరి ఓవర్ తొలి బంతికే క్లాసెన్ సిక్సర్ బాదినప్పటికీ.. సన్‌రైజర్స్ మిగిలిన ఐదు బంతుల్లో 7 పరుగులు చేయలేక ఓటమిపాలైంది. క్లాసెన్ సిక్సర్ బాదాక (19.1వ ఓవర్) వీఐపీ స్టాండ్స్‌లో ఉన్న సన్‌రైజర్స్ యజమాని కావ్య మారన్ ఆనందంతో గంతులేసింది. Kavya Maran's reactions in 20th over. 19.1. 19.5. pic.twitter.com/oybUIk9LhL — CricketMAN2 (@ImTanujSingh) March 23, 2024 అయితే ఈ సంతోషం ఆమెకు ఎంతో సేపు నిలబడలేదు. 20వ ఓవర్ ఐదో బంతికి క్లాసెన్ ఔట్ కావడంతో కావ్య ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటిదాకా నవ్వుతూ జాలీగా కనిపించిన ఆమె ఒక్కసారిగా ఢీలా పడిపోయింది. సుయాష్ శర్మ అద్భుతమైన క్యాచ్ (క్లాసెన్) పట్టి కావ్య ముఖంలో చిరునవ్వును మాయం చేశాడు. నాలుగు బంతుల వ్యవధిలో కావ్య ముఖంలో వచ్చిన మార్పులకు సంబంధించిన ఫోటోలను ఓ నెటిజన్ నెట్టింట షేర్ చేయగా అవి వైరలవుతున్నాయి. -
IPL 2024: రసెల్ సిక్సర్ల సునామీ.. గేల్ రికార్డు బద్దలు
ఐపీఎల్ 2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ విధ్వంసకర ఆటగాడు ఆండ్రీ రసెల్ ఓ భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సిక్సర్ల సునామీ (25 బంతుల్లో 64 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) సృష్టించిన రసెల్.. ఐపీఎల్లో అత్యంత వేగంగా 200 సిక్సర్లను (1322 బంతుల్లో) పూర్తి చేసుకున్న ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రసెల్‌కు ముందు ఈ రికార్డు క్రిస్ గేల్ (1811 బంతుల్లో) పేరిట ఉండేది. రసెల్, గేల్ తర్వాత అత్యంత వేగంగా 200 సిక్సర్లు పూర్తి చేసిన ఘనత కీరన్ పోలార్డ్‌కు (2055) దక్కింది. ఈ జాబితాలో టాప్-3 ఆటగాళ్లు విండీస్ వీరులే కావడం విశేషం. ఈ మ్యాచ్‌తో సిక్సర్ల సంఖ్యను 202కు పెంచుకున్న రసెల్.. క్యాష్ రిచ్ లీగ్‌లో 200 సిక్సర్ల మైలురాయిని తాకిన తొమ్మిదో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. రసెల్‌కు ముందు గేల్ (357), రోహిత్ శర్మ (257), ఏబీ డివిలియర్స్ (251), ధోని (239), విరాట్ కోహ్లి (235), వార్నర్ (228), పోలార్డ్ (223), రైనా (203) ఈ మార్కును తాకిన వారిలో ఉన్నారు. కాగా, సన్‌రైజర్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 4 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో రసెల్ బ్యాటింగ్ విన్యాసాలకు హర్షిత్ రాణా అద్భుతమైన బౌలింగ్ (4-0-33-3) తోడు కావడంతో కేకేఆర్ చిరస్మరణీయ విజయం సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌కు చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా.. రాణా అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చాడు. అలాగే కీలకమైన క్లాసెన్ వికెట్‌తో పాటు షాబాజ్ అహ్మద్ వికెట్లు పడగొట్టి కేకేఆర్‌ను గెలిపించాడు. ఆఖరి ఓవర్ తొలి బంతికే క్లాసెన్ సిక్సర్ బాదినప్పటికీ.. సన్‌రైజర్స్ మిగిలిన ఐదు బంతుల్లో 7 పరుగులు చేయలేక ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సాల్ట్ (54), రసెల్ (64) అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగా.. ఛేదనలో క్లాసెన్ (63; 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించినప్పటికీ సన్‌రైజర్స్ గెలవలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 204 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. సన్‌రైజర్స్ ఈ మ్యాచ్ చేజార్చుకున్నప్పటికీ.. క్లాసెన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అభిమానుల మనసుల్ని దోచుకున్నాడు. -
IPL 2024 ఓవరాక్షన్‌కు తగిన మూల్యం చెల్లించుకున్న హర్షిత్ రాణా
కేకేఆర్ పేస్ సంచలనం హర్షిత్ రాణా తాను చేసిన ఓవరాక్షన్‌కు తగిన మూల్యం చెల్లించుకున్నాడు. సన్‌రైజర్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన రాణా.. మయాంక్ అగర్వాల్‌ను ఔట్ చేసిన అనంతరం కోపంగా ఫ్లయింగ్ కిస్ ఇస్తూ సెండాఫ్ ఇచ్చాడు. A flying kiss by Harshit Rana to Mayank Agarwal as a send off.pic.twitter.com/LVkQYKmisZ — Mufaddal Vohra (@mufaddal_vohra) March 23, 2024 ఈ అతి చేష్ఠలను తీవ్రంగా పరిగణించిన మ్యాచ్ రిఫరీ మను నయ్యర్ రాణా మ్యాచ్ ఫీజ్‌లో 60 శాతం కోత విధించాడు. ఇదే మ్యాచ్‌లో రాణా హెన్రిచ్ క్లాసెన్ పట్ల కూడా దురుసుగా ప్రవర్తించాడు. ఈ రెండింటినీ పరిగణలోకి తీసుకున్న రిఫరీ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆర్టికల్ 2.5 నిబంధన ఉల్లంఘన కింద జరిమానా విధించాడు. Harshit Rana fined 60% of his match fees for giving Mayank Agarwal a send off. pic.twitter.com/kTXDBOXUtB — Mufaddal Vohra (@mufaddal_vohra) March 24, 2024 కాగా, నిన్నటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గెలుపుకు చివరి ఓవర్లో 13 పరుగులు కావాల్సి ఉండగా రాణా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. షాబాజ్ అహ్మద్‌తో పాటు అప్పటికే శివాలెత్తిపోయిన ఉన్న క్లాసెన్‌ను ఔట్ చేసి కేకేఆర్‌ను గెలిపించాడు. ఓవర్ తొలి బంతికే క్లాసెన్ సిక్సర్ బాదినప్పటికీ.. సన్‌రైజర్స్ మిగిలిన ఐదు బంతుల్లో 7 పరుగులు చేయలేక ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన రాణా 33 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. HARSHIT RANA, THE HERO OF KKR. SRH needed 13 in 6 balls - 6 on the first ball then 1,W,1,W,0 to win it for KKR. 🤯 pic.twitter.com/oXlzpAEJLV — Mufaddal Vohra (@mufaddal_vohra) March 23, 2024 ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సాల్ట్ (54; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రసెల్ (64; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగా.. ఛేదనలో క్లాసెన్ (63; 8 సిక్సర్లు) చెలరేగినప్పటికీ సన్‌రైజర్స్ 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సన్‌రైజర్స్ ఈ మ్యాచ్ చేజార్చుకున్నప్పటికీ.. క్లాసెన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అభిమానుల మనసుల్ని దోచుకున్నాడు. -
KKR Vs SRH: శభాష్ సుయాష్.. సన్‌రైజర్స్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు..!
ఐపీఎల్ 2024 సీజన్లో ప్రారంభమైన రెండో రోజు అదిరిపోయే మ్యాచ్‌ను అందించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య నిన్న (రాత్రి 7:30 గంటలకు) జరిగిన మ్యాచ్ ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగింది. భారీ లక్ష్య ఛేదనలో ఆఖరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సి ఉండగా.. హెన్రిచ్ క్లాసెన్ తొలి బంతికే సిక్సర్ బాది సన్‌రైజర్స్ శిబిరంలో గెలుపుపై ధీమా పెంచగా.. కేకేఆర్ ఆటగాళ్లు హర్షిత్ రాణా, సుయాష్ శర్మ ఆ ఆనందాన్ని వారికి ఎంతో సేపు నిలబడనీయలేదు. చివరి ఓవర్ బౌలింగ్ చేసిన రాణా వైవిధ్యమైన బంతులు సంధించి సన్‌రైజర్స్ గెలుపుకు అడ్డుకోగా.. సుయాష్ శర్మ కీలక దశలో (2 బంతుల్లో 5 పరుగులు) మెరుపు క్యాచ్ (క్లాసెన్) పట్టి ఆరెంజ్ ఆర్మీ చేతుల్లో నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు. ONE OF THE GREATEST CATCHES IN IPL HISTORY...!!! - Take a bow, Suyash Sharma. 🫡pic.twitter.com/CAq18gb8EO — Johns. (@CricCrazyJohns) March 23, 2024 సుయాష్ ఆ క్యాచ్ మిస్ చేసి ఉంటే బౌండరీ లభించి సన్‌రైజర్స్ సునాయాసంగా మ్యాచ్ గెలిచేది. ఒకవేళ ఆ క్యాచ్ డ్రాప్ అయ్యి, పరుగు రాకపోయినా అప్పటికే శివాలెత్తి ఉన్న క్లాసెన్ ఆఖరి బంతికి సిక్సర్ బాది సన్‌రైజర్స్‌ను గెలిపించేవాడు. సుయాష్ అందుకున్న ఈ అద్భుతమైన రన్నింగ్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. క్యాచెస్ విన్ మ్యాచెస్ అని ఇందుకే అంటారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సాల్ట్ (54), రసెల్ (64) అర్దసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఆఖర్లో రసెల్ 7 సిక్సర్లు, 3 బౌండరీలతో విరుచుకుపడి కేకేఆర్ 200 పరుగుల మార్కును దాటేందుకు దోహదపడ్డాడు. చివర్లో రమన్‌దీప్ సింగ్ (35; ఫోర్, 4 సిక్సర్లు), రింకూ సింగ్ (23; 3 ఫోర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. సన్‌రైజర్స్ బౌలర్లలో నటరాజన్ 3 వికెట్లు పడగొట్టగా.. మయాంక్ మార్కండే 2, కమిన్స్ ఓ వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. ఆదిలో తడబడినప్పటికీ గెలుపు అంచుల వరకు వచ్చి ఓటమిపాలైంది. క్లాసెన్ మెరుపు ఇన్నింగ్స్‌తో (29 బంతుల్లో 63; 8 సిక్సర్లు) మ్యాచ్ రూపురేఖల్నే మార్చేశాడు. అయితే గెలుపుకు 5 పరుగులు కావాల్సిన తరుణంలో అతడు ఔట్ కావడంతో మ్యాచ్ ఒక్కసారిగా కేకేఆర్పైపు మలుపు తిరిగింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసి లక్ష్యానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సన్‌రైజర్స్ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (32), అభిషేక్ శర్మ (32) ఓ మోస్తరు స్కోర్లతో శుభారంభాన్ని అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి జిడ్డు బ్యాటింగ్‌తో (20 బంతుల్లో 20) సన్‌రైజర్స్ ఓటమికి పరోక్ష కారకుడయ్యాడు. సన్‌రైజర్స్ ఈ మ్యాచ్ చేజార్చుకున్నప్పటికీ.. క్లాసెన్ తమ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అభిమానుల మనసుల్ని దోచుకున్నాడు. -
ఉత్కంఠ పోరులో SRHపై KKR విజయం..
-
IPL 2024: కేకేఆర్ క్యాంప్‌లో జోష్ నింపుతున్న మిచెల్ స్టార్క్
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు మిచెల్ స్టార్క్ కోల్‌కతా నైట్‌రైడర్స్ క్యాంప్‌లో కొత్త జోష్ నింపుతున్నాడు. ఐపీఎల్ 2024 ప్రారంభానికి మరి కొద్ది గంటల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో అన్ని జట్లతో పాటు కేకేఆర్ కూడా ప్రాక్టీస ముమ్మరం చేసింది. కేకేఆర్ విషయానికొస్తే.. స్టార్క్ ఆ జట్టుకు తరుపుముక్కగా పరిగణించబడుతున్నాడు. ప్రాక్టీస్ సెషన్స్‌లో స్టార్క్ పేట్రేగిపోతున్నాడు. Mitchell Starc in Purple😍pic.twitter.com/yBDau2M436 — CricTracker (@Cricketracker) March 20, 2024 నిప్పులు చెరిగే బంతుల సంధిస్తూ సహచరులను తెగ ఇబ్బంది పెడుతున్నాడు. తాజాగా స్టార్క్ సహచర ఆటగాడిని ఎల్బీడబ్ల్యూ చేసే వీడియో ఒకటి నెట్టింట వైరలవుతుంది. ఇందులో స్టార్క్ మెరుపు వేగంతో బంతిని సంధిస్తూ కనిపించాడు. సహజంగానే మెరుపు వీరుడిగా పేరున్న స్టార్క్ ఇంత భారీ మొత్తం తనపై పెట్టుబడి పెట్టడంతో ఇంకాస్త విజృంభించే అవకాశం ఉంది. Pure cinema! 🤌 pic.twitter.com/u1vR0Wvq2r — KolkataKnightRiders (@KKRiders) March 19, 2024 కేకేఆర్ యాజమాన్యం స్టార్క్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. గంభీర్ మెంటార్షిప్లో కేకేఆర్ కొత్త రక్తంతో ఉరకేలుస్తుంది. ఈసారి ఎలాగైనా మూడో ఐపీఎల్ టైటిల్ సాధించాలని ఆ జట్టు యాజమాన్యం కంకణం కట్టుకు కూర్చుంది. ఐపీఎల్ 2024 వేలంలో కేకేఆర్ స్టార్క్‌ను 24.75 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. All about the 𝐊𝐧𝐢𝐠𝐡𝐭 kind of hustle! 🔥 pic.twitter.com/9aJNIpJUtN — KolkataKnightRiders (@KKRiders) March 20, 2024 ఇదిలా ఉంటే, ఐపీఎల్ 17వ ఎడిషన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా జరిగే సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్.. ఆర్సీబీతో తలపడుతుంది. కేకేఆర్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడనుంది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో కేకేఆర్.. ఆరెంజ్ ఆర్మీను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. తొలి విడదలో ప్రకటించిన షెడ్యూల్ వరకు కేకేఆర్ మార్చి 29, ఏప్రిల్ 3న మరో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. 29న జరిగే తొలి మ్యాచ్‌లో ఆర్సీబీతో (బెంగళూరు), 2న జరిగే మరో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో (విశాఖ) కేకేఆర్ తలపడనుంది. Chalo shuru karte hai! 🗓 pic.twitter.com/i2l0M9dP8x — KolkataKnightRiders (@KKRiders) February 22, 2024 కోల్‌కతా నైట్ రైడర్స్ పూర్తి జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, రింకూ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్, ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, అనుకూల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, కేఎస్ భరత్, చేతన్ సకారియా, మిచెల్ స్టార్క్, అంగ్క్రిష్ రఘువంశీ, రమణదీప్ సింగ్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, ముజీబ్ ఉర్ రెహమాన్, దుష్మంత చమీరా, సాకిబ్ హుస్సేన్. గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్ళు: జాసన్ రాయ్, గుస్ అట్కిన్సన్. -
IPL 2024: షెడ్యూల్, వేదికలు, పది జట్లు.. పూర్తి వివరాలు
అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా క్రికెట్ సమరానికి సమయం ఆసన్నమైంది. చెపాక్ వేదికగా మార్చి 22న ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ మొదలుకానుంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోరుతో 2024 సీజన్‌కు తెరలేవనుంది. ఇక దేశంలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తొలి 17 రోజులకు సంబంధించిన షెడ్యూల్ మాత్రమే విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 21 మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఇప్పటికే తెలిపారు. ఈ నేపథ్యంలో ఏ రోజు ఏ మ్యాచ్?.. వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం, జట్లు తదితర వివరాలు తెలుసుకుందాం! ఐపీఎల్-2024 తొలి దఫా షెడ్యూల్లో 21 మ్యాచ్‌లు.. ఏయే వేదికల్లో అంటే! ►మార్చి 22- చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే- CSK) వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ- RCB)- చెన్నై ►మార్చి 23- పంజాబ్ కింగ్స్(పీబీకేఎస్- PBKS)వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ- DC)- మొహాలీ(మధ్యాహ్నం) ►మార్చి 23- కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్)- కోల్‌కతా(రాత్రి) ►మార్చి 24- రాజస్తాన్ రాయల్స్(ఆర్ఆర్) వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్(ఎల్ఎస్జీ)- జైపూర్(మధ్యాహ్నం) ►మార్చి 24- గుజరాత్ టైటాన్స్(జీటీ-GT) వర్సెస్ ముంబై ఇండియన్స్(ఎంఐ- MI)- అహ్మదాబాద్(రాత్రి) ►మార్చి 25- ఆర్సీబీ- పంజాబ్ కింగ్స్- బెంగళూరు ►మార్చి 26- సీఎస్కే- గుజరాత్ టైటాన్స్- చెన్నై ►మార్చి 27- సన్‌రైజర్స్- ముంబై- హైదరాబాద్ ►మార్చి 28- రాజస్తాన్- ఢిల్లీ- జైపూర్ ►మార్చి 29- ఆర్సీబీ- కేకేఆర్- బెంగళూరు ►మార్చి 30- లక్నో- పంజాబ్- లక్నోలో ►మార్చి 31- గుజరాత్- సన్‌రైజర్స్- అహ్మదాబాద్(మధ్యాహ్నం) ►మార్చి 31- ఢిల్లీ- సీఎస్కే- వైజాగ్ ►ఏప్రిల్ 1- ముంబై- రాజస్తాన్- ముంబై ►ఏప్రిల్ 2- ఆర్సీబీ- లక్నో- బెంగళూరు ►ఏప్రిల్ 3- ఢిల్లీ- కేకేఆర్- వైజాగ్ ►ఏప్రిల్ 4- గుజరాత్- పంజాబ్- అహ్మదాబాద్ ►ఏప్రిల్ 5- సన్‌రైజర్స్- సీఎస్కే- హైదరాబాద్ ►ఏప్రిల్ 6- రాజస్తాన్- ఆర్సీబీ- జైపూర్ ►ఏప్రిల్ 7- ముంబై- ఢిల్లీ- ముంబై ►ఏప్రిల్ 7- లక్నో- గుజరాత్- లక్నో. నోట్: మార్చి 23, 24, 31, ఏప్రిల్7న డబుల్ హెడర్ మ్యాచ్‌లు.. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లు 3.30కి, రాత్రి జరిగే మ్యాచ్‌లు 7.30కి ఆరంభమవుతాయి. స్టార్ స్పోర్ట్స్(టెలివిజన్), జియో సినిమా(డిజిటల్)లో ప్రత్యక్ష ప్రసారం. ఐపీఎల్-2024 తొలి దఫా మ్యాచ్‌లు జరిగే వేదికలు చెన్నై, మొహాలి, కోల్‌కతా, జైపూర్, అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, లక్నో, వైజాగ్, ముంబై. తొలి దఫా షెడ్యూల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు వైజాగ్ హోం గ్రౌండ్‌గా ఉంటుంది. IPL 2024లో పాల్గొనే పది జట్ల వివరాలు చెన్నై సూపర్ కింగ్స్: ఎంఎస్ ధోని (కెప్టెన్), మొయిన్ అలీ, దీపక్ చహర్, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, అజింక్య రహానే, షేక్ రషీద్, మిచెల్ సాంట్నర్, సిమర్జీత్ సింగ్, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహీశ్ తీక్షణ, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, ముస్తాఫిజుర్ రెహమాన్, అవనీష్ రావు అరవెల్లి. ►గాయపడిన ఆటగాళ్ళు: డెవాన్ కాన్వే, మతీష పతిరణ. ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, నంబూరి తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్ , ల్యూక్ వుడ్, రొమారియో షెపర్డ్, గెరాల్డ్ కోయెట్జీ, శ్రేయాస్ గోపాల్, నువాన్ తుషార, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, మొహమ్మద్ నబీ, శివాలిక్ శర్మ. ►గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్లు: జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, దిల్షాన్ మధుశాంక. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్వెల్, విరాట్ కోహ్లి, రజత్ పాటీదార్, అనూజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయి, విల్ జాక్స్, మహిపాల్ లామ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్‌కుమార్ వైశాక్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కరాన్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్. కోల్‌కతా నైట్ రైడర్స్ శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, రింకూ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్, ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, అనుకూల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, కేఎస్ భరత్, చేతన్ సకారియా, మిచెల్ స్టార్క్, అంగ్క్రిష్ రఘువంశీ, రమణదీప్ సింగ్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, ముజీబ్ ఉర్ రెహమాన్, దుష్మంత చమీరా, సాకిబ్ హుస్సేన్. ►గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్ళు: జాసన్ రాయ్, గుస్ అట్కిన్సన్. గుజరాత్ టైటాన్స్ శుభమన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, బి. సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, నూర్ అహ్మద్, సాయి కిషోర్, రషీద్ ఖాన్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఉమేష్ యాదవ్, షారుక్ ఖాన్, సుశాంత్ మిశ్రా, కార్తీక్ త్యాగి, మానవ్ సుతార్, స్పెన్సర్ జాన్సన్. ►గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్లు: మహ్మద్ షమీ, రాబిన్ మింజ్. లక్నో సూపర్ జెయింట్స్ కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, షమర్ జోసెఫ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, కె. గౌతం, శివమ్ మావి, అర్షిన్ కులకర్ణి, ఎం. సిద్ధార్థ్, ఆష్టన్ టర్నర్, డేవిడ్ విల్లీ, మొమ్మద్. అర్షద్ ఖాన్. ►గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్ళు: మార్క్ వుడ్. రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మెయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డొనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యజువేంద్ర చహల్, ఆడం జంపా, ఆవేష్ ఖాన్, రోవ్‌మన్ పావెల్, శుభమ్ దూబే, టామ్ కోహ్లర్-కాడ్మోర్, అబిద్ ముస్తాక్, నండ్రే బర్గర్. ►గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్లు: ప్రసిద్ధ్ కృష్ణ. ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్ (కెప్టెన్), ప్రవీణ్ దూబే, డేవిడ్ వార్నర్, విక్కీ ఓస్త్వాల్, పృథ్వీ షా, అన్రిచ్ నోర్జే, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, లలిత్ యాదవ్, ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్, ఇషాంత్ శర్మ, యష్ ధుల్, ముఖేష్ కుమార్, ట్రిస్టన్ స్టబ్స్, రికీ భుయ్, కుమార్ కుషాగ్రా, రసిఖ్ దార్, ఝే రిచర్డ్సన్, సుమిత్ కుమార్, షాయ్ హోప్, స్వస్తిక్ చికార. ►గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్లు: హ్యారీ బ్రూక్, లుంగి ఎన్గిడి. పంజాబ్ కింగ్స్ శిఖర్ ధావన్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, ప్రభ్సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, సికందర్ రజా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ తైడే, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కరాన్, కగిసో రబడ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్, హర్‌ప్రీత్ భట్యా , విద్వత్ కవేరప్ప, శివమ్ సింగ్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి, రిలీ రోసౌవ్. సన్‌రైజర్స్ హైదరాబాద్ పాట్ కమిన్స్(కెప్టెన్), అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రమ్, మార్కో జాన్సెన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, టి. నటరాజన్, అన్మోల్ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీష్ కుమార్ రెడ్డి, ఫజల్హక్ ఫరూకీ, షాబాజ్ అహ్మద్, ట్రావిస్ హెడ్, వనిందు హసరంగా, జయదేవ్ ఉనాద్కట్, ఆకాష్ సింగ్, ఝాతావేద్ సుబ్రమణ్యన్. చదవండి: SRH: రెండుసార్లు చాంపియన్‌గా నిలబెడితే ఇలా చేస్తారా? షాకయ్యా -
39 మ్యాచ్‌ల చిన్న కెరీర్లో ఆరో శతకం సాధించిన కేకేఆర్ బ్యాటర్
ఆఫ్ఘనిస్తాన్ యువ ఓపెనర్, ఆ జట్టు వికెట్‌కీపర్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్భాజ్ తన వన్డే కెరీర్లో దూసుకుపోతున్నాడు. ఐపీఎల్లో కేకేఆర్‌కు ఆడుతున్న ఈ 22 ఏళ్ల విధ్వంసకర బ్యాటర్.. తన 39 మ్యాచ్‌ల కెరీర్లో ఆరో శతకం సాధించాడు. ఇంత స్వల్ప కెరీర్లో ఇన్ని సెంచరీలు సాధించడమంటే ఆషామాషీ విషయం కాదు. గుర్బాజ్ కెరీర్లో ఈ ఆరు శతకాలతో పాటు నాలుగు అర్దశతకాలు కూడా ఉన్నాయి. pic.twitter.com/J3sHi6z0OD— CricTracker (@Cricketracker) March 7, 2024 మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా షార్జా వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో గుర్బాజ్ మెరుపు సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో 117 బంతులు ఎదుర్కొన్న గుర్బాజ్ 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 121 పరుగులు చేశాడు. గుర్బాజ్‌తో పాటు మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (60), వెటరన్ మొహ్మద్ నబీ (40), కెప్టెన్ షాహిది (50 నాటౌట్) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో థియో వాన్ వోర్కోమ్ 3 వికెట్లు పడగొట్టగా.. హ్యూమ్, క్రెయిగ్ యంగ్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌కు ముందు ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో వారికంటే పటిష్టమైన ఆఫ్ఘనిస్తాన్‌కు పరాభవం ఎదురైంది. ఆ మ్యాచ్‌లో ఐర్లాండ్ 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌ను మట్టికరిపించింది. -
IPL 2024: కేకేఆర్‌లోకి శ్రీలంక ఫాస్ట్ బౌలర్.. ఇంగ్లండ్ ఆటగాడి స్థానంలో..!
ఐపీఎల్ 2024 సీజన్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ శ్రీలంక స్పీడ్‌స్టర్ దుష్మంత చమీరాను జట్టులోకి తీసుకుంది. గాయపడిన ఇంగ్లండ్ బౌలర్ గస్ అట్కిన్సన్కు ప్రత్యామ్నాయంగా చమీరాను ఎంపిక చేసుకున్నట్లు కేకేఆర్ మేనేజ్మెంట్ వెల్లడించింది. చమీరా రూ. 50 లక్షల రిజర్వ్ ప్రైజ్‌తో కేకేఆర్‌తో జతకట్టనున్నాడు. చమీరా 2018, 2021, 2022 సీజన్లలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్ కెరీర్లో మొత్తం 12 మ్యాచ్‌లు ఆడిన చమీరా 9 వికెట్లు పడగొట్టాడు. చమీరా అంతర్జాతీయ కెరీర్ విషయానికొస్తే.. ఈ 32 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ శ్రీలంక తరఫున 12 టెస్ట్‌లు, 52 వన్డేలు, 55 టీ20లు ఆడి ఓవరాల్‌గా 143 వికెట్లు పడగొట్టాడు. చమీరా ఇటీవల స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో లంక జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ప్రస్తుతం చమీరాకు వన్డే ఫార్మాట్లో మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. గట్కిన్సన్ విషయానికొస్తే.. ఈ ఇంగ్లండ్ పేసర్‌ను 2024 సీజన్ వేలంలో కేకేఆర్ యాజమాన్యం బేస్ ధర కోటి రూపాయలకు దక్కించుకుంది. ఐపీఎల్ 2024 కోసం కేకేఆర్ జట్టు.. శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్),నితీష్ రాణా, రింకూ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్, జేసన్ రాయ్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, అనుకూల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, కేఎస్ భరత్, చేతన్ సకారియ , అంగ్క్రిష్ రఘువంశీ, రమణదీప్ సింగ్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, ముజీబ్ ఉర్ రెహమాన్, దుష్మంత చమీరా (గుస్ అట్కిన్సన్ రీప్లేస్మెంట్), సాకిబ్ హుస్సేన్ -
ట్రిపుల్ సెంచరీతో విరుచుకుపడిన కేకేఆర్ ప్లేయర్
రంజీ ట్రోఫీ 2024 సీజన్లో మరో ట్రిపుల్ సెంచరీ నమోదైంది. తొలుత అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఆటగాడు తన్మయ్ అగర్వాల్ ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీతో విరుచుకుపడగా.. తాజాగా చండీఘడ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తమిళనాడు ఓపెనర్, కేకేఆర్ ఆటగాడు ఎన్ జగదీశన్ త్రిశతకంతో (321) కదం తొక్కాడు. జగదీశన్‌కు తోడు ప్రదోశ్ పాల్ (105), బాబా ఇంద్రజిత్ (123) శతకాలతో రాణించడంతో తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 610 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అంతకుముందు బౌలింగ్‌లోనూ తమిళనాడు బౌలర్లు రెచ్చిపోయారు. సాయికిషోర్ (3/31), వారియర్ (3/28), అజిత్ రామ్ (2/6), కుల్దీప్ సేన్ (1/34) ధాటికి చండీఘడ్ తొలి ఇన్నింగ్స్‌లో 111 పరుగులకే కుప్పకూలింది. చండీఘడ్ ఇన్నింగ్స్‌లో కునాల్ మహాజన్ (28) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్ పేలవ ప్రదర్శనతో ఓటమిని ఖరారు చేసుకున్న చండీఘడ్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ చెత్తగా ఆడుతుంది. మూడో రోజు తొలి సెషన్ సమయానికి ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది. ఆ జట్టు తమిళనాడు తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 462 పరుగులు వెనుకంజలో ఉంది. సాయికిషోర్ (2/15) చండీఘడ్ను మరోసారి దెబ్బకొట్టాడు. మయాంక్ సిద్దూ (4), కునాల్ మహాజన్ (3) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, జగదీశన్ ఐపీఎల్లో గత సీజన్ వరకు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడాడు. 2024 సీజన్ వేలంలో జగదీశన్‌ను కేకేఆర్ సొంతం చేసుకుంది. -
నవీన్ సహా ఆ ఇద్దరిపై రెండేళ్ల నిషేధం.. ఐపీఎల్ జట్లకు ఎదురుదెబ్బ
Afghanistan Cricket Board (ACB) Impose Ban: స్టార్ బౌలర్లు నవీన్ ఉల్ హక్, ఫజల్హక్ ఫారూకీ, ముజీబ్ ఉర్ రహ్మమాన్లకు ఊహించని షాకిచ్చింది అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు. విదేశీ లీగ్‌లలో రెండేళ్ల పాటు ఆడకూడకుండా నిషేధం విధించింది. అంతేగాకుండా.. ఈ ముగ్గురి సెంట్రల్ కాంట్రాక్టుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. నవీన్, ఫారూకీ, ముజీబ్.. జాతీయ జట్టును కాదని ఫ్రాంఛైజీ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్న కారణంగా ఈ మేరకు ఏసీబీ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని లోతుగా పరిశీలించేందుకు విచారణ కమిటీని కూడా నియమించింది. ఒకవేళ జాతీయ జట్టు ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా వ్యవహరించారని తేలితే నవీన్, ఫారూకీ, ముజీబ్ సెంట్రల్ కాంట్రాక్టులను ఏడాది పాటు రద్దు చేసేందుకు సిద్ధమైనట్లు ఏసీబీ తెలిపింది. ఐపీఎల్ జట్లకు ఎదురుదెబ్బ అఫ్గన్ బోర్డు నిర్ణయం కారణంగా ఐపీఎల్ ఫ్రాంఛైజీలు కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. కాగా ఐపీఎల్-2024 మినీ వేలంలో భాగంగా రైటార్మ్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహ్మాన్‌ను కేకేఆర్.. రూ. 2 కోట్ల కనీస ధరకు అతడిని కొనుగోలు చేసింది. మరోవైపు.. ఐపీఎల్-2023 సందర్భంగా రూ. 50 లక్షలకు పేసర్ నవీన్ ఉల్ హక్‌ను సొంతం చేసుకున్న లక్నో.. 2024 వేలానికి ముందు అతడిని రిటైన్ చేసుకుంది. 2023 సీజన్లో నవీన్.. మొత్తంగా 11 వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. ఇక సీమర్ ఫజల్హక్ ఫారూకీని ఎస్ఆర్హెచ్ రూ. 50 లక్షలు వెచ్చించి రిటైన్ చేసుకుంది. పదహారో ఎడిషన్‌లో అతడు ఏడు మ్యాచ్‌లు ఆడి ఆరు వికెట్లు కూల్చాడు. దేశానికి ఆడే ఉద్దేశం లేదా? వేటు తప్పదు సౌతాఫ్రికా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్, న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ వంటి చాలా మంది క్రికెటర్లు దేశానికి కాదని ఫ్రాంఛైజీ క్రికెట్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా అఫ్గన్ బౌలర్లు నవీన్, ఫారూఖీ, ముజీబ్ కూడా ఈ జాబితాలో చేరాలని భావించారు. ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు కఠిన చర్యలకు ఉపక్రమించింది. ‘‘ముగ్గురు జాతీయ క్రికెటర్ల సెంట్రల్ కాంట్రాక్టులు, విదేశీ లీగ్‌లలో ఆడే విషయంపై ఏసీబీ నిబంధనలు విధించాలని నిర్ణయించింది. నో ఆబ్జక్షన్ లెటర్ ఇచ్చేదే లేదు వచ్చే ఏడాది వారికి సెంట్రల్ కాంట్రాక్టులు ఇవ్వాలా లేదా అన్నది తర్వాత నిర్ణయిస్తాం. ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫజల్హక్ ఫారూకీ, నవీన్ ఉల్ హక్ మురీద్ వార్షిక కాంట్రాక్టులు వదులుకుని ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. వరల్డ్‌కప్-2023లో మెరుగైన ప్రదర్శన అయితే, విదేశీ లీగ్‌లలో ఆడేందుకు నిరభ్యంతర పత్రం ఇచ్చేందుకు బోర్డు నిరాకరిస్తోంది. ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడకుండా రెండేళ్ల పాటు వాళ్లపై నిషేధం విధిస్తున్నాం’’ అని అఫ్గన్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో అండర్‌డాగ్‌గా బరిలోకి దిగిన అఫ్గనిస్తాన్ అంచనాలకు మించి రాణించింది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, పాకిస్తాన్ వంటి పటిష్ట జట్లను మట్టికరిపించి సంచలన విజయాలు నమోదు చేసి ఒకానొక సందర్భంలో సెమీస్ రేసులోనూ నిలిచింది. ఇలాంటి తరుణంలో అంతర్జాతీయ క్రికెట్లో తమదైన ముద్ర వేస్తున్న సమయంలో కీలక ఆటగాళ్లు ఇలా ఫ్రాంఛైజీ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఏసీబీ తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. చదవండి: Rohit Sharma On His T20 Career: నాకూ ఆడాలనే ఉంది.. టీ20 కెరీర్‌పై రోహిత్ శర్మ క్లారిటీ! -
IPL 2024: స్టార్క్ వేయబోయే ఒక్కో బంతి విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
వచ్చే సీజన్లో ఐపీఎల్ ఆల్‌టైమ్ హైయ్యెస్ట్ పెయిడ్ ప్లేయర్ మిచెల్ స్టార్క్ వేయబోయే ఒక్కో బంతి విలువ 7 లక్షలకు పైమాటే ఉంటుంది. ఖచ్చితంగా చెప్పాలంటే 2024 సీజన్లో స్టార్క్ వేయబోయే ఒక్కో బంతి విలువ 7 లక్షల 36 వేల 607 రూపాయలు. లీగ్ క్రికెట్ చరిత్రలోనే ఇది కనీవినీ ఎరుగని మొత్తం. ఏ బౌలర్ కలలోనూ ఇంత మొత్తాన్ని ఊహించి ఉండడు. అయితే స్టార్క్‌కు ఇంత మొత్తం లభించాలంటే అతన్ని కొనుగోలు చేసిన కేకేఆర్ ప్లే ఆఫ్స్‌కు ముందే నిష్క్రమించాల్సి ఉంటుంది. ఒకవేళ కేకేఆర్ ప్లే ఆఫ్స్ దశ దాటి ఫైనల్స్‌కు చేరితే స్టార్క్‌కు లభించే మొత్తంలో కోత పడుతుంది. వచ్చే సీజన్లో కేకేఆర్ ఫైనల్స్‌కు చేరే క్రమంలో దాదాపుగా 16 మ్యాచ్‌లు ఆడాల్సి వస్తుంది. స్టార్క్ 16 మ్యాచ్‌లు ఆడాల్సి వస్తే ఒక్కో బంతికి లభించే మొత్తం 6.44 లక్షలకు తగ్గిపోతుంది. కాగా, దుబాయ్‌లోని కోకోకోలా ఎరినాలో ఇవాళ (డిసెంబర్ 19) జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు మిచెల్ స్టార్క్‌ను 24 కోట్ల 75 లక్షల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఓ ఆటగాడికి లభించే అత్యధిక ధర ఇదే. స్టార్క్‌కు ఇంత భారీ ధర దక్కక ముందు అతని సహచరుడు, ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్‌కు కూడా ఇంచుమించు ఈ స్థాయి ధరనే లభించింది. కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ వేలానికి ముందు వరకు ఐపీఎల్ ఆల్‌టైమ్ అత్యధిర ధర 18.5 కోట్లుగా ఉండింది. గత సీజన్లో పంజాబ్ కింగ్స్ ఇంగ్లండ్ ఆటగాడు సామ్ కర్రన్‌ను ఈ రికార్డు ధరకు కొనుగోలు చేసింది. -
మిస్టరీ స్పిన్నర్ మాయాజాలం.. 69 పరుగులకే కుప్పకూలిన ప్రత్యర్ధి
విజయ్ హజారే ట్రోఫీ 2023లో తమిళనాడు బౌలర్, ఐపీఎల్ మిస్టరీ స్పిన్నర్ (కోల్‌కతా నైట్‌రైడర్స్) వరుణ్ చక్రవర్తి చెలరేగిపోయాడు. నాగాలాండ్‌తో ఇవాళ (డిసెంబర్ 5) జరుగుతున్న మ్యాచ్‌లో అతను ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. వరుణ్ స్పిన్ మాయాజాలం ధాటికి నాగాలాండ్ 19.4 ఓవర్లలో 69 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో ఐదు ఓవర్లు వేసిన వరుణ్.. 3 మెయిడిన్లు వేసి కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. Varun Chakravarthy took 5 wickets for 9 runs against Nagaland...!!!! - he has taken 14 wickets from just 6 games in Vijay Hazare 2023. pic.twitter.com/Ex5PI2XRpB — Johns. (@CricCrazyJohns) December 5, 2023 ప్రస్తుత సీజన్లో మంచి ఫామ్‌లో ఉన్న వరుణ్.. ఇప్పటివరకు జరిగిన 6 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి టోర్నీ లీడింగ్ వికెట్‌టేకర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. వరుణ్‌తో పాటు రవిశ్రీనివాసన్ సాయి కిషోర్ (5.4-0-21-3), సందీప్ వారియర్ (6-1-21-1), టి నటరాజన్ (3-0-15-1) కూడా రాణించడంతో నాగాలాండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఆ జట్టులో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సుమిత్ కుమార్ 20, జాషువ ఒజుకుమ్ 13 పరుగులు చేశారు. ఎక్స్‌ట్రాల రూపంలో లభించిన పరుగులు (15) నాగాలండ్ ఇన్నింగ్స్‌లో రెండో అత్యధిక స్కోర్ కావడం విశేషం. గ్రూప్-ఈలో ఇప్పటికే ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఐదు పరాజయాలు ఎదుర్కొన్న నాగాలాండ్ మరో ఓటమి దిశగా సాగుతుంది. -
రింకూ సింగ్ విధ్వంసం.. 33 బంతుల్లో 6 సిక్సర్ల సాయంతో..!
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో టీమిండియా యువ చిచ్చరపిడుగు రింకూ సింగ్ విధ్వంసం సృష్టించాడు. పంజాబ్‌తో ఇవాళ (నవంబర్ 2) జరుగుతున్న క్వార్టర్‌ఫైనల్-1లో రింకూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లో4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 77 పరుగులు చేశాడు. రింకూ విధ్వంసం ధాటికి పంజాబ్ ఆఖరి రెండు ఓవర్లలో 39 పరుగులు సమర్పించుకుంది. ఆఖరి ఓవర్లో రింకూ టీమిండియా సహచరుడు అర్షదీప్ సింగ్‌ను టార్గెట్ చేశాడు. ఈ ఓవర్లో రింకూ 3 సిక్సర్ల సాయంతో 23 పరుగులు పిండుకున్నాడు. రింకూ విధ్వంసం ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తర్‌ప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. రింకూతో పాటు సమీర్ రిజ్వి (29 బంతుల్లో 42 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) రాణించాడు. యూపీ ఇన్నింగ్స్‌లో గోస్వామి (16), కరణ్ శర్మ (14), నితీశ్ రాణా (17) తక్కువ స్కోర్లకే ఔటైనా సమీర్ అండతో రింకూ చెలరేగిపోయాడు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో సిద్దార్థ్ కౌల్, హర్‌ప్రీత్ బ్రార్ తలో వికెట్ పడగొట్టగా.. నితీశ్ రాణా రనౌటయ్యాడు. అనంతరం 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ 12 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. అన్మోల్ప్రీత్ సింగ్ (42 నాటౌట్), నేహల్ వధేరా (21 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో అభిషేక్ శర్మ (12), ప్రభసిమ్రన్ సింగ్ (0), మన్దీప్ సింగ్ (1) నిరాశపరచగా.. అన్మోల్ప్రీత్, నేహల్ జట్టును గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. యూపీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ పొదుపుగా (2 ఓవర్లలో 3 పరుగులు) బౌలింగ్ చేయడంతో పాటు 2 వికెట్లు పడగొట్టాడు. మోహిసిన్ ఖాన్‌కు మరో వికెట్ దక్కింది. -
SMAT 2023: అరంగేట్రంలోనే ఐదు వికెట్లతో చెలరేగిన కేకేఆర్ బౌలర్
కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్ సుయాశ్ శర్మ.. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ 2023లో ఢిల్లీ తరఫున తన అరంగేట్రం మ్యాచ్‌లోనే చెలరేగిపోయాడు. మధ్యప్రదేశ్‌తో ఇవాళ (అక్టోబర్ 17) జరుగుతున్న మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన సుయాశ్.. కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో సుయాశ్తో పాటు ఇషాంత్ శర్మ (4-0-29-2), హర్షిత్ రాణా (4-0-22-2) కూడా రాణించడంతో ఢిల్లీ టీమ్ మధ్యప్రదేశ్‌ను 115 పరుగులకు (9 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. ఈ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. ఒక్కరు కూడా పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. సుయాశ్.. మధ్యప్రదేశ్ పతనాన్ని శాసించాడు. గుర్తింపు కలిగిన ఆటగాళ్లు వెంకటేశ్ అయ్యర్ (2), రజత్ పాటిదార్ (7) నిరాశపర్చగా.. శుభమ్ శర్మ (10), సాగర్ సోలంకి (13), రాకేశ్ ఠాకూర్ (15), రాహుల్ బాథమ్ (32), అర్షద్ ఖాన్ (12) రెండంకెల స్కోర్లు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ విజయం దిశగా సాగుతుంది. ఆ జట్టు 14 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. ప్రియాంశ్ ఆర్య (22), అనూజ్ రావత్ (23), యశ్ ధుల్ (0) ఔట్ కాగా.. అయుశ్ బదోని (20), హిమ్మత్ సింగ్ (9) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, ఢిల్లీ బౌలర్ సుయాశ్ శర్మ ఈ ఏడాది ఐపీఎల్‌తో క్యాష్ రిచ్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో 11 మ్యాచ్‌లు ఆడిన సుయాశ్ 8.23 సగటున 10 వికెట్లు పడగొట్టాడు. -
రిలయన్స్ రిటైల్‌లో పెట్టుబడులు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ కేకేఆర్ దాదాపు రూ. 2,070 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఇందుకుగాను కేకేఆర్‌కు 1,71,58,752 ఈక్విటీ షేర్లను జారీ చేసినట్లు రిలయన్స్ రిటైల్ వెల్లడించింది. దీంతో రిలయన్స్ రిటైల్‌లో కేకేఆర్ వాటా 1.17 శాతం నుంచి 1.42 శాతానికి బలపడింది. ఈ నెల మొదట్లో అనుబంధ రిటైల్ సంస్థలో కేకేఆర్ ఇన్వెస్ట్ చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) పేర్కొన్న సంగతి తెలిసిందే. 1976లో ఏర్పాటైన కేకేఆర్ 2023 జూన్‌కల్లా 519 బిలియన్ డాలర్ల విలువైన నిర్వహణలోని ఆస్తులను కలిగి ఉంది. కాగా.. ఈ నెల మొదట్లోనే ఆర్ఐఎల్ ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ(క్యూఐఏ) నుంచి రూ. 8,278 కోట్ల పెట్టుబడులను అందుకుంది. తద్వారా రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో 1 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఇక 2020లో వివిధ గ్లోబల్ పీఈ సంస్థలకు 10.09 శాతం వాటాను విక్రయించడం ద్వారా రూ. 47,265 కోట్లను సమకూర్చుకోవడం ప్రస్తావించదగ్గ విషయం! -
రిలయన్స్ ఇషా అంబానీ మరో భారీ డీల్: కేకేఆర్ పెట్టుబడులు
KKR invests Reliance Retail రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పూర్తి-యాజమాన్య అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ భారీ పెట్టుబడులను సాధించింది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ అమెరికాకు,చెందిన KKR, రిలయన్స్‌రీటైల్ వాటాను1.42 శాతానికి పెంచుకోనుంది. ఇందుకుగాను రిలయన్స్ రీటైల్లో రూ. 2,070 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీంతో రిలయన్స్ రీటైల్ ప్రీ-మనీ ఈక్విటీ విలువ రూ. 8.36 లక్షల కోట్లకు చేరిందని కంపెనీ సోమవారం ప్రకటించింది. దీంతో ఈక్విటీ విలువ పరంగా దేశంలోని మొదటి నాలుగు కంపెనీలలో ఒకటిగా నిలిచింది. గత నెలలో ముఖేష్ అంబానీ రిటైల్ సామ్రాజ్యంలో ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడితరువాత ఈ ఒప్పందం జరిగడం విశేషం. న్యూయార్క్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ప్రైవేట్ ఈక్విటీ సంస్థ KKR రిలయన్స్ రిటైల్‌లో 2020లో ఆర్ఆర్విఎల్లో 1.28 శాతం వాటాల కొనుగోలు ద్వారా రూ. 5,550 కోట్ల పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుత కొనుగోలుతో మొత్తం ఈక్విటీ వాటా పూర్తిగా పలచన ప్రాతిపదికన 1.42శాతానికి పెరిగింది. 2020లో వివిధ గ్లోబల్ ఇన్వెస్టర్ల నుండి మొత్తం రూ. 47,265 కోట్ల నిధుల సమీకరించింది. దీంతో పాటు KKR రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టెలికాం యూనిట్ అయిన జియో ప్లాట్‌ఫారమ్‌ల లిమిటెడ్‌లో కూడా పెట్టుబడిదారుగా ఉంది. (జీ20 సమ్మిట్: దాదాపు రూ. 400కోట్లు నష్టం, వ్యాపారుల ఆందోళన) 1976లో స్థాపించబడిన, KKR జూన్ 30, 2023 నాటికి సుమారు 519 బిలియన్ల డాలర్లు ఆస్తులను కలిగి ఉంది. కేకేర్ ఫాలోఅన్ పెట్టుబడులపై రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా ముఖేష్ అంబానీ, ఇటు రిలయన్స్‌తో భాగస్వామ్యంపై KKR సహ-CEO జో బే ఈ డీల్‌పై సంతోషం ప్రకటించారు. భారతదేశంలో నిజమైన కార్పొరేట్ లీడర్, ఇన్నోవేటర్. ఈ బృందంతో భాగస్వామ్యాన్ని కొనసాగించే అవకాశం లభించడం సంతోషమని కెకెఆర్లోని ఆసియా పసిఫిక్ ప్రైవేట్ ఈక్విటీ హెడ్ గౌరవ్ ట్రెహాన్ పేర్కొన్నారు. (విమానంలో వెర్రి వేషాలు, నిద్ర నటించిన మహిళ ఏం చేసిందంటే?) -
కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా సంచలన నిర్ణయం
టీమిండియా క్రికెటర్, ఐపీఎల్-2023లో కేకేఆర్ ఫ్రాంచైజీ కెప్టెన్ (తాత్కాలిక), దేశవాలీ క్రికెట్లో ఢిల్లీ క్రికెట్ జట్టు కీలక సభ్యుడైన 29 ఏళ్ల నితీశ్ రాణా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన సొంత రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అయిన ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ అసోసియేషన్‌తో (DDCA) దశాబ్దకాలానికి పైగా ఉన్న అనుబంధాన్ని తెంచుకున్నాడు. తదుపరి దేశవాలీ సీజన్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (UPCA)తో జతకట్టేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు అతనికి ఇవాళ (ఆగస్ట్ 21) DDCA నుంచి NOC కూడా లభించింది. దీంతో రాణాకు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌తో అధికారికంగా అనుబంధం తెగిపోయినట్లైంది. త్వరలో ప్రారంభంకానున్న UPT20 Leagueతో రాణా యూపీ క్రికెట్ అసోసియేషన్‌తో జతకట్టనున్నాడు. ఈ లీగ్ ఇనాగురల్ సీజన్లో రాణా నోయిడా సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. Onto the next chapter. https://t.co/Zz1VyZKysA — Nitish Rana (@NitishRana_27) August 20, 2023 టీమిండియా తరఫున ఓ వన్డే, 2 టీ20లు ఆడిన రాణా.. 2011లో ఢిల్లీ తరఫున అరంగేట్రం చేసి 40కి పైగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 50కి పైగా లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 100కి పైగా టీ20లు ఆడాడు. రాణా తన దేశవాలీ కెరీర్లో మొత్తంగా 9 సెంచరీలు, 46 అర్ధసెంచరీలు సాధించాడు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌తో బంధం తెంచుకున్న తర్వాత రాణా ఉద్వేగంతో ఓ ట్వీట్ చేశాడు. ఆన్ టు ద నెక్స్ట్ చాప్టర్ అని క్యాప్షన్ జోడిండి DDCAతో ఉండిన అనుబంధాన్ని నెమరువేసుకున్నాడు. ఈ ట్వీట్లో అతను DDCAలో తనకు సహకరించిన ప్లేయర్స్, నాన్ ప్లేయర్స్ అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. కాగా, రాణా గత ఐపీఎల్ సీజన్లో శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీలో కేకేఆర్‌కు సారధిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. -
తీరు మార్చుకోని నైట్‌రైడర్స్.. కొనసాగుతున్న పేలవ ప్రదర్శన.. ఐపీఎల్లో కాస్త నయం..!
ఫ్రాంచైజీ క్రికెట్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ అనుబంధ జట్ల పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. గతేడాది కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో (సీపీఎల్) మొదలైన నైట్‌రైడర్స్ వైఫల్యాల పరంపర.. అమెరికా వేదికగా ప్రస్తుతం జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్లోనూ (ఎంఎల్సీ) కంటిన్యూ అవుతుంది. 2022 సీపీఎల్‌ను ఆఖరి స్థానంతో ముగించిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్.. ఆతర్వాత జరిగిన ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లోనూ (ఐఎల్టీ20) చివరాఖరి స్థానంలోనే (అబుదాబీ నైట్‌రైడర్స్) నిలిచింది. అనంతరం జరిగిన ఐపీఎల్-2023లో కాస్త పర్వాలేదనిపించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (7వ స్థానం).. ప్రస్తుతం జరుగుతున్న ఎంఎల్‌సీలో మరోసారి తమకెంతో అచ్చొచ్చిన ఆఖరి స్థానంలో (లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్) నిలిచి, లీగ్ దశలోనే పోటీ నుంచి నిష్క్రమించింది. సునీల్ నరైన్ సారధ్యంలో ఎంఎల్‌సీలో మొత్తం 5 మ్యాచ్‌లు ఆడిన నైట్‌రైడర్స్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, టేబుల్ టాపర్ సియాటిల్ ఆర్కాస్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కూడా నైట్‌రైడర్స్ అతికష్టం మీద నెగ్గింది. రిలీ రొస్సో (38 బంతుల్లో 78 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నైట్‌రైడర్స్ ఈ మ్యాచ్‌లో గెలవగలిగింది. 6 జట్లు పాల్గొన్న ఎంఎల్సీ-2023 సీజన్‌ను ఆఖరి స్థానంతో ముగించింది. కాగా, నైట్‌రైడర్స్ గ్రూప్ ఆఫ్ ఫ్రాంచైజెస్ను బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, నటి జూహి చావ్లా, వ్యాపారవేత్త జై మెహతా, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జట్టు నిండా విధ్వంసకర ఆటగాళ్లే, అయినా..! లీగ్ క్రికెట్లో నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీల ప్రస్తానాన్ని గమనిస్తే, అన్ని జట్లలో ప్రపంచంలోని విధ్వంసకర ఆటగాళ్లు మెజారిటీ శాతం ఉన్నారు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ దగ్గర నుంచి ప్రస్తుతం జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ వరకు అన్ని నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీల్లో భారీ హిట్టర్లు ఉన్నారు. సీపీఎల్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌లో కీరన్ పోలార్డ్, మార్టిన్ గప్తిల్, సునీల్ నరైన్, నికోలస్ పూరన్, డ్వేన్ బ్రేవో, రిలీ రొస్సో, ఆండ్రీ రసెల్ ఉండగా.. ఐపీఎల్లో నితీశ్ రాణా, రింకూ సింగ్, జేసన్ రాయ్, వెంకటేశ్ అయ్యర్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, రహ్మానుల్లా గుర్భాజ్, జాన్సన్ చార్లెస్, శార్దూల్ ఠాకూర్ తదితరులు ఉన్నారు. ఇంటర్నేషనల్ టీ20 లీగ్ విషయానికొస్తే.. ఈ జట్టులో సునీల్ నరైన్, కొలిన్ ఇంగ్రామ్, బ్రాండన్ కింగ్, ఆండ్రీ రసెల్ లాంటి హార్డ్ హిట్టర్లు ఉండగా.. మేజర్ లీగ్ క్రికెట్లో జేసన్ రాయ్, రిలీ రొస్సో, మార్టిన్ గప్తిల్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ తదితరులు నైట్‌రైడర్స్ జట్టులో ఉన్నారు. ప్రతి నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీలో ఈ స్థాయిలో మ్యాచ్ విన్నర్లు ఉన్నప్పటికీ ఈ ఫ్రాంచైజీ ఏ లీగ్‌లోనూ ఛాంపియన్ కాలేకపోతుంది. కనీసం టాప్ జట్లలో ఒకటిగా కూడా నిలువలేకపోతుంది. ఐపీఎల్లో రెండుసార్లు విజేతగా నిలిచిన నైట్‌రైడర్స్ ఆ తర్వాత ఏ లీగ్‌లోనూ ఆ స్థాయిలో రాణించలేకపోతుంది. దీంతో నైట్‌రైడర్స్ ఫ్యాన్స్ తెగ హర్టై పోతున్నారు. మరో పక్క ఇదే ఫ్రాంచైజీ క్రికెట్లో సూపర్ కింగ్స్ జట్లు మాత్రం దూసుకుపోతున్నాయి. ఈ లీగ్‌లో అయినా ఆ జట్టు మినిమం గ్యారెంటీగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న ఎంఎల్‌సీలోనూ ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. -
తేలిపోయిన వెంకటేశ్ అయ్యర్.. రెచ్చిపోయిన రింకూ సింగ్
దేశవాలీ వన్డే టోర్నీ దియోదర్ ట్రోఫీ-2023 ఇవాల్టి (జులై 24) నుంచి ప్రారంభమైంది. టోర్నీలో భాగంగా ఇవాళ జరిగిన తొలి మ్యాచ్‌లో ఈస్ట్ జోన్-సెంట్రల్ జోన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తేలిపోయిన వెంకటేశ్ అయ్యర్.. రెచ్చిపోయిన రింకూ సింగ్ తొలుత బ్యాటింగ్ చేసిన సెంట్రల్ జోన్ నిర్ణీత 50 ఓవర్లు ఆడి 207 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్ (8) సహా టాపార్డర్ అంతా విఫలం కాగా.. శివమ్ చౌదరీ (22), కర్ణ శర్మ (32) సహకారంతో రింకూ సింగ్ (63 బంతుల్లో 54; ఫోర్, 2 సిక్సర్లు) జట్టును ఆదుకున్నాడు. కష్ట సమయంలో బరిలోకి దిగిన రింకూ సింగ్.. శివమ్ చౌదరీ, కర్ణ శర్మలతో చెరో 50 ప్లస్ భాగస్వామ్యాలు నెలకొల్పి స్కోర్ 200 దాటేలా చేశాడు. అనంతరం ఆరో వికెట్‌గా రింకూ వెనుదిరగడంతో సెంట్రల్ జోన్ పతనం ఆరంభమైంది. ఆ జట్టు మరో 31 పరుగులు జోడించి ఆఖరి 4 వికెట్లు కోల్పోయింది. ఈస్ట్ జోన్ బౌలర్లలో మురసింగ్, ఆకాశ్ దీప్, షాబాజ్ అహ్మద్ తలో 3 వికెట్లు పడగొట్టగా... ఉత్కర్ష్ సింగ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. రాణించిన ఉత్కర్ష్ సింగ్.. ఈస్ట్ జోన్ సునాయాస విజయం అనంతరం 208 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఈస్ట్ జోన్.. అభిమన్యు ఈశ్వరన్ (38), ఉత్కర్ష్ సింగ్ (89), సుభ్రాన్షు్ సేనాపతి (33 నాటౌట్) రాణించడంతో 46.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా గెలుపొందింది. సెంట్రల్ జోన్ బౌలర్లలో కర్ణ్ శర్మ 3 వికెట్లు పడగొట్టగా.. అదిత్య సర్వటే ఓ వికెట్ దక్కించుకున్నాడు. కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2023లో సత్తా చాటిన (కేకేఆర్ తరఫున 14 మ్యాచ్‌ల్లో 59.25 సగటున 149.52 స్ట్రయిక్‌రేట్‌తో 474 పరుగులు) రింకూ సింగ్.. ఆసియా క్రీడల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే ఛాన్స్ కొట్టేసిన విషయం తెలిసిందే. గత ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు బాదిన రింకూ రాత్రికిరాత్రి హీరో అయిపోయాడు. అదే ఫామ్‌ను రింకూ ప్రస్తుతం దేశవాలీ టోర్నీల్లోనూ కొనసాగిస్తున్నాడు. -
శివాలెత్తిన రొస్సో.. నైట్ రైడర్స్ ఖాతాలో తొలి విజయం
మేజర్ లీగ్ క్రికెట్ సీజన్ 2023లో లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్ తొలి విజయం నమోదు చేసింది. నిన్న (జులై 23) సీయాటిల్ ఆర్కాస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. రిలీ రొస్సో (38 బంతుల్లో 78 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) అజేయమైన మెరుపు హాఫ్ సెంచరీతో విరుచుకుపడి నైట్ రైడర్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. రొస్సోకు ఆండ్రీ రసెల్ (29 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సహకరించాడు. ఫలితంగా నైట్ రైడర్స్.. ఆర్కాస్ నిర్ధేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని 8 వికెట్లు కోల్పోయి మరో 5 బంతులు మిగిలుండగానే ఛేదించింది. One of the innings of the tournament 👏 Rilee Rossouw wins the Player of the Match award for his impressive 7️⃣8️⃣* (3️⃣8️⃣)#MLC2023 pic.twitter.com/WQhNFWn3UH — Major League Cricket (@MLCricket) July 23, 2023 ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్కాస్.. షెహన్ జయసూర్య (45 బంతుల్లో 60 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ డికాక్ (10) విఫలం కాగా.. నౌమన్ అన్వర్ (32; 5 ఫోర్లు), క్లాసెన్ (13 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించాడు. నైట్ రైడర్స్ బౌలర్లలో ఆడమ్ జంపా 2 వికెట్లు పడగొట్టగా.. స్పెన్సర్ జాన్సన్, ఆండ్రీ రసెల్, వాన్ షాల్విక్, కెప్టెన్ సునీల్ నరైన్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్ రైడర్స్‌కు మంచి ఆరంభం లభించనప్పటికీ.. రొస్సో, రసెల్ ఆ జట్టును గెలిపించారు. 8 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో బరిలోకి దిగిన రొస్సో ఆఖరి వరకు క్రీజ్‌లో నిలబడి నైట్ రైడర్స్‌కు సీజన్ తొలి విజయాన్ని అందించాడు. నైట్ రైడర్స్ ఇన్నింగ్స్‌లో జేసన్ రాయ్ (2), జస్కరన్ మల్హోత్రా (2), గజానంద్ సింగ్ (3),సునీల్ నరైన్ (8) విఫలం కాగా.. సైఫ్ దర్బార్ (10), వాన్ షాల్విక్ (12), ఆడమ్ జంపా (12) రెండంకెల స్కోర్లు చేశారు. ఆర్కాస్ బౌలర్లలో కెమరాన్ గానన్ 3 వికెట్లతో రాణించగా.. ఆండ్రూ టై 2, ఇమాద్ వసీం, కెప్టెన్ వేన్ పార్నెల్, హర్మీత్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు. -
కేకేఆర్‌కు తిరిగిరానున్న గంభీర్?.. ఖుషీలో అభిమానులు
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఐపీఎల్లో లక్నో సూపర్‌జెయింట్స్‌కు మెంటార్‌గా ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాదితో లక్నో సూపర్ జెయింట్స్ కోచ్ ఆండీ ప్లవర్ సహా సిబ్బందితో ఉన్న రెండేళ్ల కాంట్రాక్ట్ ముగియనుంది. కేఎల్ రాహుల్ సారధ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ కొత్త కోచ్‌వైపు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆసీస్ మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్‌ను కోచ్ పదవికి సంప్రదించినట్లు సమాచారం. మెంటార్‌గా ఉన్న గౌతమ్ గంభీర్‌ను కూడా లక్నో కంటిన్యూ చేయాలనుకోవడం లేదు. దీంతో గౌతమ్ గంభీర్‌ను వచ్చే ఐపీఎల్లో కొత్త జట్టుతో చూసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌గా రెండుసార్లు ఐపీఎల్ టైటిల్ అందించిన కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) జట్టుకు బ్యాటింగ్ కోచ్ లేదా మెంటార్‌గా వెళ్లే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న కేకేఆర్ ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. గౌతమ్ గంభీర్ కేకేఆర్‌కు తిరిగి రానున్నాడన్న విషయంలో ఎంత నిజముందో తెలియదు కానీ గంభీర్ సేవలు ఇప్పుడు కేకేఆర్‌కు చాలా అవసరమని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. గంభీర్ తిరిగి వస్తున్నాడన్న విషయాన్ని ఫ్యాన్స్ ట్విటర్ వేదికగా ట్వీట్ల వర్షం కురిపించారు. ఇక గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు రెగ్యులర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. నితీశ్ రానా సారధ్యంలోని కేకేఆర్ జట్టు మోస్తరు ప్రదర్శన మాత్రమే చేసింది. 2021లో రన్నరప్‌గా నిలిచిన కేకేఆర్ రెండు సీజన్లుగా లీగ్ దశకే పరిమితమయింది. ఒకవేళ గౌతమ్ గంభీర్ మెంటార్‌గా వస్తే కేకేఆర్ ఆటతీరు మారిపోయే అవకాశం ఉంది. ఇక శ్రేయాస్ అయ్యర్ కూడా గంభీర్‌తో కలిసి పనిచేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఐపీఎల్ ఆరంభంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడిన గౌతమ్ గంభీర్ ఆ తర్వాత కేకేఆర్ తరపున ఆడాడు. 2011లో రూ.11 కోట్లతో కేకేఆర్‌లో జాయిన్ అయిన మరుసటి ఏడాది అంటే 2012లో చాంపియన్‌గా నిలిపాడు. ఆ తర్వాత 2014లోనూ అతని కెప్టెన్సీలోనే కేకేఆర్ రెండోసారి చాంపియన్‌గా నిలిచింది. దాదాపు ఏడు సంవత్సరాల పాటు కేకేఆర్‌కు కొనసాగిన గౌతమ్ గంభీర్ 2018లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారాడు. ఆ తర్వాత ఆటకు వీడ్కోలు పలికి 2021లో లక్నో సూపర్‌జెయింట్స్‌కు మెంటార్‌గా వచ్చాడు.కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్యాల నేతృత్వంలో, ఆండీ ఫ్లవర్ ఆధ్వర్యంలో ఎల్ఎస్జీ గత రెండు సీజన్లలో ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపించింది. ఈ రెండు సీజన్లలో ఆ జట్టు మూడో స్థానంలో నిలిచింది. The news is true. 🚨🚨 The time has come for Shreyas Iyer and Gautam Gambhir era. 🔥💯#GautamGambhir #ShreyasIyer pic.twitter.com/CCm54h1Iz3 — 🤶 (@hrathod__) July 10, 2023 Sare KKR fans bas yahi chahte hain. GG in KKR. Make it happen #GautamGambhir pic.twitter.com/eLHrGj4TXP — Piyush Prakash (@real_piyush) July 10, 2023 Is it true. Is Gautam Gambhir really coming back home? #GautamGambhir pic.twitter.com/xH5PxsgjW4 — Sandeep kishore 🇮🇳 (@sandeepkishore_) July 10, 2023 Mentor and Batting coach for KKR in 2024 🥹💜#GautamGambhir #EoinMorgan pic.twitter.com/MOQbaqO55A — BAZ fOrEvEr ♥️ (@Baz_42_) July 10, 2023 చదవండి: TNPL 2023: మరో 'రింకూ సింగ్'.. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో సంచలనం -
విండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. రింకూ సింగ్ ఏడి..?
ఐపీఎల్ 2023లో అద్భుత ప్రదర్శన కనబర్చిన కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్‌కు విండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టులో చోటు ఖాయమని మీడియా మొత్తం కోడై కూసిన విషయం తెలిసిందే. అయితే మీడియా కథనాలను కాని, రింకూ సింగ్ ప్రదర్శనను కాని పరిగణలోకి తీసుకోని భారత సెలెక్షన్ కమిటీ అతనికి మొండిచేయి చూపించింది. అతని స్థానంలో మిడిలార్డర్ బ్యాటర్ కోటాలో తిలక్ వర్మకు చోటు కల్పించింది. మరో మిడిలార్డర్ బ్యాటర్‌గా వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు అవకాశం ఇచ్చింది. ఐపీఎల్లో రింకూతో సరిసాటిగా రాణించిన యశస్వి జైస్వాల్‌ని కూడా ఎంపిక చేసింది. If Rinku Singh doesn't play for India, it's Indias Loss!! Keep Going @rinkusingh235 🦁pic.twitter.com/mahZ9pdMAB — KKR Bhakt 🇮🇳 ™ (@KKRSince2011) July 5, 2023 యువకులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తామని ఊదరగొట్టే భారత సెలెక్టర్లు, సీనియర్ల గైర్హాజరీలోనూ రింకూ సింగ్ లాంటి టాలెంటెడ్ ఆటగాడికి చోటు కల్పించకపోవడంపై అభిమానులు మండిపడుతున్నారు. రింకూను.. మరో సంజూ శాంసన్‌లా (అవకాశాలు ఇవ్వకుండా) తయారు చేస్తారంటూ కామెంట్లు చేస్తున్నారు. రింకూ సూపర్ ఫామ్‌లో ఉన్నప్పుడు అవకాశం ఇవ్వలేదంటూ సెలెక్టర్లపై దుమ్మెత్తిపోస్తున్నారు. Rinku Singh is the most loved cricketer at the moment. Everyone is angry about his exclusion. pic.twitter.com/jkqRALYPK1 — R A T N I S H (@LoyalSachinFan) July 5, 2023 పాపం రింకూ.. అంటూ సోషల్‌మీడియా వేదికగా సానుభూతి చూపిస్తున్నారు. రింకూను ఎంపిక చేయకపోవడం టీమిండియాకే నష్టమని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు భారత క్రికెట్లో ఇది సర్వసాధారణమని.. సెలెక్టర్లు టాలెంటెడ్ యువతకు అవకాశాలు ఇస్తే ఆశ్చర్యపోవాలి కాని, ఇలా జరిగితే పెద్ద విశేషమేమి కాదంటున్నారు. రింకూను ఎంపిక చేయకపోవడంపై అతని ఐపీఎల్ జట్టు కేకేఆర్ కూడా స్పందించింది. Justice for Rinku Singh 💔😞#WIvIND #RinkuSingh pic.twitter.com/6GRHR62sGx — Shreyas Aryan (@Ariyen34) July 5, 2023 Knowing BCCI, you might see Rinku Singh getting picked in Tests before the T20I side. — Silly Point (@FarziCricketer) July 5, 2023 రింకూ స్లిప్‌లో క్యాచ్ పడుతున్న ఓ వీడియోను పోస్ట్ చేస్తూ.. నథింగ్ స్లిప్పింగ్ థ్రూ అంటూ కామెంట్ చేసింది. కాగా, 25 ఏళ్ల రింకూ సింగ్ (ఉత్తర్‌ప్రదేశ్) ఇటీవల ముగిసిన ఐపీఎల్లో పలు చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడి తన జట్టును గెలిపించిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో రింకూ 14 మ్యాచ్‌లు ఆడి 59.25 సగటున 149.53 స్ట్రయిక్‌రేట్‌తో 474 పరుగులు సాధించాడు. ఇందులో 4 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇదే సీజన్లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రింకూ ఆడిన ఇన్నింగ్స్ (యశ్ దయాల్వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా 5 సిక్సర్లు) సగటు క్రికెట్ అభిమాని ఎప్పటికీ మరచిపోలేడు. History created by Rinku Singh. What a finish. pic.twitter.com/NDAiGjQVoI — Johns. (@CricCrazyJohns) April 9, 2023 విండీస్‌తో టి20 సిరీస్‌కు భారత జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్. -
శతక్కొట్టిన సీఎస్కే మాజీ ప్లేయర్.. తుస్సుమన్న రింకూ సింగ్
దులీప్ ట్రోఫీ 2023లో ఐపీఎల్ ఆటగాళ్ల నుంచి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఓ మాజీ ఆటగాడు సెంచరీతో కదంతొక్కితే.. మరొకరు అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయారు. సీఎస్కే మాజీ ఆటగాడు, నార్త్ జోన్ ఓపెనర్ ధృవ్ షోరే సెంచరీతో కదంతొక్కగా.. 2023 సీజన్ కేకేఆర్ స్టార్, సెంట్రల్ జోన్ ఆటగాడు రింకూ సింగ్ (38) ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమయ్యాడు. బెంగళూరు: భారత క్రికెట్ దేశవాళీ సీజన్ 2023–2024 దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లతో బుధవారం మొదలైంది. చిన్నస్వామి స్టేడియంలో నార్త్ ఈస్ట్ జోన్‌తో ప్రారంభమైన క్వార్టర్ ఫైనల్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశగా సాగుతోంది. 90 ఓవర్లు ఆడిన నార్త్ జోన్ 6 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. ఓపెనర్ ధ్రువ్ షోరే (211 బంతుల్లో 136; 22 ఫోర్లు) సెంచరీ సాధించాడు. నిశాంత్ సింధు (113 బంతుల్లో 76 బ్యాటింగ్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), పుల్కిత్ నారంగ్ (23 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. సెంట్రల్ జోన్ 182 ఆలౌట్ ఆలూర్‌లో ఈస్ట్ జోన్ జట్టుతో జరుగుతున్న మరో క్వార్టర్ ఫైనల్లో సెంట్రల్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 71.4 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌటైంది. ఐపీఎల్ స్టార్ రింకూ సింగ్ (38; 6 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈస్ట్ జోన్ బౌలర్ మణిశంకర్ మురాసింగ్ 42 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈస్ట్ జోన్ ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 32 పరుగులు సాధించింది. -
ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్‌కు ధోని బహుమతి
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత సారధి మహేంద్రసింగ్ ధోని ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు, ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వికెట్ కీపర్ రహ్మానుల్లా గుర్భాజ్‌కు ఓ బహుమతి పంపాడు. ధోని తాను సంతకం చేసిన సీఎస్కే జెర్సీని గుర్భాజ్‌కు గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ విషయాన్ని గుర్భాజ్ తన ఇన్‌స్టా ఖాతా ద్వారా వెల్లడించాడు. ధోని పంపిన గిఫ్ట్‌ను పట్టుకుని ఫోటోకు పోజిస్తూ.. తాను అడిగిన బహుమతిని పంపినందుకు ధోనికి కృతజ్ఞతలు తెలిపాడు. భారత్ నుంచి ఈ గిఫ్ట్ పంపినందుకు థ్యాంక్స్ మాహీ సర్ అని ఇన్‌స్టా పేజీలో రాసుకొచ్చాడు. కాగా, ఐపీఎల్ 2023లో కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహించిన గుర్భాజ్.. ఆ సీజన్ ప్రారంభానికి ముందు తనకు ధోనితో కలిసి లేక ధోనికి ప్రత్యర్ధిగా ఆడాలని కోరిక ఉందని తెలిపాడు. ఆ సీజన్లోనే గుర్భాజ్ కోరిక తీరింది. గుర్భాజ్ టీమ్ కేకేఆర్.. సీఎస్కేతో ఓ మ్యాచ్ ఆడింది. అయితే ఆ మ్యాచ్‌లో గుర్భాజ్ విఫలమయ్యాడు. 4 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో విఫలమైనా గుర్భాజ్ ఐపీఎల్ 2023 సీజన్ మొత్తంలో ఓ మోస్తరుగా రాణించాడు. ఈ సీజన్లో 11 మ్యాచ్‌లు ఆడిన గుర్భాజ్.. 20.64 సగటున, 133.53 స్ట్రయిక్ రేట్‌తో 227 పరుగులు చేశాడు. గుర్భాజ్ ఈ సీజన్లో వికెట్ల వెనుక కూడా అద్భుతమైన ప్రదర్శనలు చేశాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకుని అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఈ క్యాచ్‌తో జనాలు గుర్భాజ్‌ను ధోనితో పోల్చడం మొదలుపెట్టారు. మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటం, వికెట్ల వెనుక చురుకుగా ఉండటంతో ఆఫ్ఘన్ అభిమానులు గుర్భాజ్‌ను ఆఫ్ఘన్ కా ధోని అని పిలుచుకుంటారు. ఇదిలా ఉంటే, తన అభిమానించే వారికి సంతకం చేసిన జెర్సీ పంపించడం ధోనికి అలవాటే. 2022లో పాక్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్‌కు కూడా ధోని ఇలాగే సైన్డ్ జెర్సీని బహుమతిగా పంపాడు. -
అమెరికాలో మినీ ఐపీఎల్ షెడ్యూల్ విడుదల..!
-
గిల్ దున్నేస్తున్నాడు .. ఇక ఛాంపియన్ CSK
-
IPL కోసం ఇంగ్లాండ్ కాంట్రాక్ట్ వదులుకున్న KKR స్టార్ బ్యాటర్
-
రింకూ సింగ్ పై గౌతమ్ గంభీర్ పోస్టు వైరల్
-
రింకు సింగ్ రాకతో ఫ్యాన్స్ లో జోష్
-
#RinkuSingh: ఎక్కడి నుంచి వస్తోంది ఇంత ధైర్యం!
ఐపీఎల్ 16వ సీజన్లో కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్ నిస్సందేహంగా ఒక సంచలనం. డెత్ ఓవర్లలో అతను చూపిస్తున్న తెగువ బహుశా ఈ మధ్య కాలంలో పెద్దగా చూసింది లేదు. సీజన్ ఆరంభంలో గుజరాత్ టైటాన్స్ బౌలర్ యష్ దయాల్ వేసిన ఆఖరి ఓవర్లో ఐదు బంతుల్లో ఐదు సిక్సర్ల బాది రింకూ సింగ్ హీరో అయిపోయాడు. కేకేఆర్‌కు సంచలన విజయం కట్టబెట్టి డెత్ ఓవర్ల కింగ్ అనిపించుకున్నాడు. తాజాగా శనివారం లీగ్ చివరి అంకంలో లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో దాదాపు కేకేఆర్‌ను గెలిపించినంత పని చేశాడు. 2 ఓవర్లలో కేకేఆర్ విజయానికి 40 పరుగులు అవసరమైన దశలో తనలోని హిట్టర్‌ను మళ్లీ నిద్రలేపాడు రింకూ సింగ్. డెత్ ఓవర్లు అనగానే రింకూ సింగ్‌కు ఎక్కడలేని ధైర్యం వస్తోంది.మాములుగా అయితే డెత్ ఓవర్లలో.. కొండంత లక్ష్యం ఉంటే ఏ బ్యాటర్ అయినా ఒత్తిడిలో పడతాడు. కానీ రింకూ సింగ్ దీనికి పూర్తి రివర్స్‌లా ఉన్నాడు. డెత్ ఓవర్లు అనగానే చాలు పూనకం వచ్చినట్లు చెలరేగిపోతున్నాడు. ఒక్క పరుగుతో కేకేఆర్ ఓడిపోవచ్చు.. కానీ రింకూ సింగ్ తన సంచలన ఇన్నింగ్స్‌తో అభిమానుల మనసులు మరోసారి దోచుకున్నాడు. రింకూ సింగ్ లాంటి నిఖార్సైన ఫినిషర్ అవసరం టీమిండియాకు ఇప్పుడు చాలా ఉంది. ఈ సీజన్లో 14 మ్యాచ్‌లాడిన రింకూ సింగ్ ఫినిషర్‌గా వచ్చి 149 స్ట్రైక్‌రేట్‌తో 374 పరుగులు చేయడం విశేషం. అతని ఖాతాలో నాలుగు అర్థసెంరీలు ఉన్నాయి. తన బ్యాటింగ్‌తో దుమ్మురేపిన రింకూ సింగ్‌ను త్వరలో టీమిండియాలో చూడడం ఖాయంగా కనిపిస్తోంది. Rinku Singh hain inka naam🙌, namumkin nahin inke liye koi kaam 🤩 #KKRvLSG #IPLonJioCinema #TATAIPL #EveryGameMatters | @KKRiders pic.twitter.com/2YbgkciPW5 — JioCinema (@JioCinema) May 20, 2023 The whole LSG team congratulated Rinku Singh. Rinku Singh is the hero! pic.twitter.com/ipvLCF5XZg — Mufaddal Vohra (@mufaddal_vohra) May 20, 2023 చదవండి: ప్లేఆఫ్ ముంగిట ధోని ఫిట్‌నెస్‌పై హస్సీ కీలక వ్యాఖ్యలు -
కేకేఆర్‌పై ఒక్క పరుగు తేడాతో విజయం.. ఫ్లేఆఫ్స్‌కు లక్నో
కేకేఆర్‌తో జరిగిన ఉత్కంఠపోరులో లక్నో సూపర్‌జెయింట్స్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. 177 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. రింకూ సింగ్ 33 బంతుల్లో 67 పరుగులు నాటౌట్ మరోసారి సంచలన ఇన్నింగ్స్‌తో మెరిసినప్పటికి కేకేఆర్‌ను గెలిపించలేకపోయాడు. జేసన్ రాయ్ 45 పరుగులు చేశాడు. యష్ ఠాకూర్, రవి బిష్ణోయి చెరో రెండు వికెట్లు తీయగా.. కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యాలు చెరొక వికెట్ తీశారు. టార్గెట్ 177..120 పరుగుల వద్ద ఐదో వికెట్ డౌన్ లక్నోతో మ్యాచ్‌లో కేకేఆర్ 120 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. ఏడు పరుగులు చేసిన రసెల్ రవి బిష్ణోయి బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 11 ఓవర్లలో కేకేఆర్ 88/3 11 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. గుర్బాజ్ 6, రింకూ సింగ్ 3 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 8 పరుగులు చేసిన నితీశ్ రానా రవి బిష్ణోయి బౌలింగ్‌లో వెనుదిరగ్గా.. జేసన్‌రాయ్(45 పరుగులు) కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 6 ఓవర్లలో కేకేఆర్ 61/1 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఆరు ఓవర్లలో వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. 24 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్ కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. జేసన్‌రాయ్ 36 పరుగులతో ఆడుతున్నాడు. రాణించిన పూరన్.. కేకేఆర్ టార్గెట్ 177 కేకేఆర్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఒక దశలో 73 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో నికోలస్ పూరన్(30 బంతుల్లో 58 పరుగులు), ఆయుష్ బదోని(21 బంతుల్లో 25 పరుగులు) ఆరో వికెట్‌కు 74 పరుగులు జోడించారు. కేకేఆర్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరాలు తలా రెండు వికెట్లు తీయా.. హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి చెరొక వికెట్ తీశారు. 17 ఓవర్లలో లక్నో 133/5 17 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌జెయింట్స్ ఐదు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 44, ఆయుష్ బదోని 14 పరుగులతో ఆడుతున్నారు. 73 పరుగులకే ఐదు వికెట్లు.. కష్టాల్లో లక్నో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ తడబడుతోంది. 73 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 28 పరుగులు చేసిన డికాక్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో రస్సెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మూడో వికెట్ కోల్పోయిన లక్నో.. 8 ఓవర్లలో 58/3 8 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌జెయింట్స్ మూడు వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ 24, కృనాల్ పాండ్యా క్రీజులో ఉన్నారు. ఆరు ఓవర్లలో లక్నో 54/1 ఆరు ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. ప్రేరక్ మన్కడ్ 26, క్వింటన్ డికాక్ 20 పరుగులతో ఆడుతున్నారు. 4 ఓవర్లలో లక్నో సూపర్‌జెయింట్స్ 27/1 4 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌జెయింట్స్ వికెట్ నష్టానికి 27 పరుగుఉల చేసింది. క్వింటన్ డికాక్ 19, ప్రేరక్ మన్కడ్ 4 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు మూడు పరుగులు చేసిన కరణ్ శర్మ హర్షిత్ రానా బౌలింగ్‌లో క్యాచ్ఔట్గా వెనుదిరిగాడు, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్ ఐపీఎల్ 16వ సీజన్లో శనివారం డబుల్ హెడర్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా 68వ మ్యాచ్‌లో కేకేఆర్, లక్నో సూపర్‌జెయింట్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), కరణ్ శర్మ, ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా(కెప్టెన్), ఆయుష్ బదోని, కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి ప్లేఆఫ్ చేరే అవకాశాలు కేకేఆర్‌కు తక్కువగా ఉన్నప్పటికి లక్నోను ఓడిస్తే రేసులో ఉంటుంది.. ఒకవేళ లక్నో గెలిస్తే మాత్రం 17 పాయింట్లతో ప్లేఆఫ్‌కు వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌ను గెలిచిన సీఎస్కే రెండో జట్టుగా ప్లేఆఫ్‌కు క్వాలిఫై అయింది. -
'అరె లొల్లి సల్లగుండ'.. ప్రశ్న అర్థంగాక ధోని ఇబ్బంది
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే మ్యాచ్ ఎక్కడా జరిగినా అభిమానులు పోటెత్తుతున్నారు. ధోని బ్యాటింగ్ కోసమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం ధోని ఆట చూడడం కోసమే అయితే పర్వాలేదు.. కానీ అతను మాట్లాడేటప్పుడు కూడా అదే గోల వినిపిస్తే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. తాజాగా ధోనికి అభిమానుల వల్ల ఇదే ఇబ్బంది ఎదురైంది. ఆదివారం సొంతగ్రౌండ్ చెన్నే వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మ్యాచ్ ఓడిపోయినా సీఎస్కే అభిమానుల్లో జోష్ మాత్రం తగ్గలేదు. పోస్ట్ మ్యాచ్ అనంతరం ఓటమికి కారణాలు చెప్పడానికి ధోని వచ్చాడు. కానీ చెపాక్ స్టేడియం ధోని నామస్మరణతో మార్మోగిపోవడంతో కామెంటేటర్ అడిగిన ప్రశ్న ధోనికి అర్థం కాలేదు. రెండోసారి అడిగినా అదే పరిస్థితి. ఏం అడిగాడో అర్థం కాక ధోని వినిపించలేదు అని సైగ చేశాడు. మూడోసారి ప్రశ్న అడగబోతుండగా.. మరోసారి అభిమానులు గోల చేశారు. అరె మీ లొల్లి సల్లగుండ అనుకున్నాడో ఏమో.. కిందకు వంగిన ధోని కుర్చీలో ఉన్న మానిటర్ దగ్గరికి వెళ్లి సౌండ్ పెంచుకొని ప్రశ్న వినాల్సి వచ్చింది. ఇక ధోని మాట్లాడుతూ.. ఈరోజు మ్యాచ్ మాకు కలిసిరాలేదు. బ్యాటింగ్‌లో విఫలమయ్యాం. పవర్‌ప్లేలో సరిగ్గా పరుగులు చేయలేకపోయాం. ఇక శివమ్ దూబే బ్యాటింగ్‌తో నేను చాలా సంతోషంగా ఉన్నా. అతని నుంచి మేం ఏం ఆశిస్తున్నామో అది చక్కగా నెరవేరుస్తున్నాడు. స్కోరు తక్కువగా ఉంది కాబట్టి బౌలర్లను తప్పుబట్టలేం. ప్లేఆఫ్‌కు వెళతామన్న నమ్మకం ఉంది. అంటూ చెప్పుకొచ్చాడు. -
ఔటైతే బాధపడతారు.. కానీ ఇక్కడ సీన్ రివర్స్
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే ఆడే ప్రతీ మ్యాచ్‌కు అభిమానులు పోటెత్తుతున్నారు. ఎందుకనేది ఈ పాటికే మీకు అర్థమయి ఉండాలి. కేవలం ఎంఎస్ ధోని కోసమే. అలాంటి ధోని బ్యాటింగ్‌కు వచ్చి ఒక్క బంతి ఆడినా చాలు అన్నట్లుగా అభిమానులు తపించిపోతున్నారు. ధోని బ్యాటింగ్ కోసం ఎంతలా ఎదురుచూస్తున్నారన్నది తాజాగా మరోసారి కనిపించింది. ఆదివారం కేకేఆర్‌తో మ్యాచ్ సందర్భంగా తొలి ఇన్నింగ్స్‌లో జడేజా 20 పరుగులు చేసి వైభవ్ అరోరా బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. అప్పటికే సీఎస్కే ఇన్నింగ్స్‌కు కేవలం రెండు బంతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. సాధారణంగా తాము మద్దతిస్తున్న జట్టు బ్యాటర్ ఔట్ అయితే బాధపడడం చూస్తాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. Photo: IPL Twitter జడేజా ఔట్ కాగానే స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. కారణం జడ్డూ ఔట్ అయితేనే ధోని ఎంట్రీ ఇస్తాడు కాబట్టి. ఇక ధోని గ్రౌండ్లోకి అడుగుపెట్టే సమయంలో స్టేడియం మొత్తం ధోని నామసర్మణతో మార్మోగిపోయింది. అయితే ధోని ఒక నోబాల్ సహా ఫ్రీహిట్ వచ్చినప్పటికి రెండు పరుగులు మాత్రమే చేయగలిగాడు. Cue the awesome noise as Thala enters Chepauk 🥳 #CSKvKKR #TATAIPL #IPL2023 #IPLonJioCinema #EveryGameMatters | @ChennaiIPL pic.twitter.com/Z7iB1EihcT — JioCinema (@JioCinema) May 14, 2023 చదవండి: శివమ్ దూబే సిక్సర్ దెబ్బ.. కేకేఆర్ చీర్‌గర్ల్స్ అబ్బ! -
శివమ్ దూబే సిక్సర్ దెబ్బ.. కేకేఆర్ చీర్‌గర్ల్స్ అబ్బ!
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా కేకేఆర్, సీఎస్కే మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సీఎస్కే ఇన్నింగ్స్ సమయంలో శివమ్ దూబే కొట్టిన సిక్సర్ కేకేఆర్ చీర్‌గర్ల్స్‌ను తాకడం ఆసక్తి కలిగించింది. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో సుయాశ్ శర్మ వేసిన ఐదో బంతిని దూబే ఎక్స్ట్రా కవర్స్ మీదుగా భారీ సిక్సర్ కొట్టాడు. అక్కడే కేకేఆర్ చీర్‌గర్ల్స్ కూర్చొని ఉండగా వారి వద్దకే నేరుగా బంతి వెళ్లింది. బంతి వెళ్లి ఒక చీర్గర్ల్కు తాకింది. పాపం బంతి స్పీడుగా వచ్చి తగలడంతో నొప్పితో విలవిల్లాలాడిన చీర్‌గర్ల్ బంతి తగిలిన చోట రాసుకోవడం కనిపించింది. ఆ తర్వాత చీర్‌గర్ల్స్ మధ్య నవ్వులు విరపూశాయి. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Kolkata Knight Riders Cheerleaders are in shock after Shivam Dube hits a six near them😂 📸: Jio Cinema #CSKvKKR #KKRvCSK #IPL2023 #TATAIPL2023 #T20Cricket #CricketNews #Cheerleaders #KKR #KolkataKnightRiders pic.twitter.com/gqnQEDD2Uh — SportsTiger (@The_SportsTiger) May 14, 2023 చదవండి: ధోనిని గుర్తుకుతెచ్చిన అనూజ్ రావత్.. అశ్విన్ డైమండ్ డక్ -
రింకూ, నితీశ్ రానా అర్థసెంచరీలు.. కేకేఆర్ ఘన విజయం
IPL 2023: CSK Vs KKR Match Live Updates: రింకూ సింగ్ ఫిఫ్టీ.. 16 ఓవర్లలో 126/3 కేకేఆర్ సంచలనం రింకూ సింగ్ సూపర్ ఫిఫ్టీతో మెరిశాడు. 39 బంతుల్లో అర్థసెంచరీ సాధించిన రింకూ సింగ్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. సీఎస్కేతో మ్యాచ్‌లో 145 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కేకేఆర్ విజయానికి చేరువైంది. 16 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. కేకేఆర్ విజయానికి 24 బంతుల్లో 19 పరుగులు కావాలి. 11 ఓవర్లలో కేకేఆర్ 75/3 11 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. నితీశ్ రానా 20, రింకూ సింగ్ 29 పరుగులతో ఆడుతున్నారు. 6 ఓవర్లలో కేకేఆర్ 46/3 ఆరు ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. నితీశ్ రానా 9 పరుగులు, రింకూ సింగ్ 12 పరుగులతో ఆడుతున్నారు. 3 ఓవర్లలో కేకేఆర్ 22/2 మూడు ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 22 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 9, నితీశ్ రానా సున్నా పరుగులతో ఆడుతున్నారు. రాణించిన కేకేఆర్ బౌలర్లు.. సీఎస్కే 20 ఓవర్లలో 144/6 కేకేఆర్‌తో మ్యాచ్‌లో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. బౌలర్ల కట్టుదిట్టంగా బంతులు వేయడంతో సీఎస్కే బ్యాటర్లు పరుగులు చేయలేకపోయారు. దీంతో సాధారణ స్కోరుకే పరిమితమైంది. శివమ్ దూబే 34 బంతుల్లో 48 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. కాన్వే 30, జడేజా 20 పరుగులు చేశారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్‌లు చెరో రెండు వికెట్లు తీయగా.. వైభవ్ అరోరా, శార్దూల్ ఠాకూర్లు ఒక్కో వికెట్ తీశారు. 16 ఓవర్లలో సీఎస్కే 99/5 16 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే ఐదు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. శివమ్ దూబే 24, రవీంద్ర జడేజా ఏడు పరుగులతో ఆడుతున్నారు. 72 పరుగులకే ఐదు వికెట్లు.. కష్టాల్లో సీఎస్కే కేకేఆర్‌తో మ్యాచ్‌లో సీఎస్కే తడబడుతోంది. 72 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఒక్క పరుగు మాత్రమే చేసిన మొయిన్ అలీ నరైన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. రహానే(16)ఔట్.. 9 ఓవర్లలో సీఎస్కే 65/2 రహానే(16) రూపంలో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన రహానే జేసన్ రాయ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్కే 9 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. కాన్వే 30, అంబటి రాయుడు 2 పరుగులతో ఆడుతున్నారు. 6 ఓవరల్లో సీఎస్కే వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. కాన్వే 23, రహానే 12 పరుగులతో ఆడుతున్నారు. తొలి వికెట్ కోల్పోయిన సీఎస్కే.. 5 ఓవర్లలో 48/1 17 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో వైభవ్ అరోరాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఐదు ఓవర్లలో వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. రహానే 11, కాన్వే 22 పరుగులతో ఆడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్కే ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ఆదివారం చెన్నై వేదికగా సీఎస్కే, కేకేఆర్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన సీఎస్కే బ్యాటింగ్ ఎంచుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ఎంఎస్ ధోని(వికెట్ కీపర్/కెప్టెన్),రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్‌కీపర్), జాసన్ రాయ్, నితీష్ రాణా(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి Thala wins the toss & elects to bat first in #CSKvKKR!#IPLonJioCinema #TATAIPL #IPL2023 | @ChennaiIPL pic.twitter.com/CRRXnNPPIh — JioCinema (@JioCinema) May 14, 2023 వరుస విజయాలతో సీఎస్కే పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. ఓటములతో డీలా పడిన కేకేఆర్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇరుజట్లు గతంలో 37 సార్లు తలపడగా సీఎస్కే 18 సార్లు, కేకేఆర్ 19 సార్లు మ్యాచ్‌లు నెగ్గాయి. -
అడుగు పడింది.. జైశ్వాల్ జోరులో గమనించలేదు
ఇంగ్లండ్ స్టార్ జో రూట్ రాజస్తాన్ రాయల్స్ తరపున ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ ద్వారా ఐపీఎల్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాకుండా పోయింది. పైగా రాజస్తాన్ రాయల్స్‌కు షాకిచ్చిన ఎస్ఆర్హెచ్ భారీ విజయాన్ని మూటగట్టుకుంది. దీంతో రూట్‌ను మరిచిపోయారు. ఇక గురువారం కేకేఆర్‌తో మ్యాచ్‌లోనూ రూట్ ఆడాడు. వాస్తవానికి రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 14 పరుగులిచ్చాడు. ఇక్కడ విచిత్రమేంటంటే రూట్ బ్యాట్‌తో పరుగులు సాధించి ఐపీఎల్లో తన ఖాతా తెరుస్తాడని అంతా అనుకున్నారు. కానీ బౌలింగ్‌తో తన ఐపీఎల్ కెరీర్‌ను ఆరంభించాడు. ఈసారి కూడా రూట్ ఆడిన విషయం వెలుగులోకి రాలేదు. కారణం యశస్వి జైశ్వాల్ చేసిన శివతాండవం. బ్యాటింగ్‌లో నాలుగో స్థానంలో రూట్ బ్యాటింగ్‌కు రావాల్సి ఉండగా.. జైశ్వాల్, శాంసన్‌లు ఆ అవకాశం ఇవ్వకుండానే మ్యాచ్‌ను ముగించారు. 150 పరుగుల లక్ష్యాన్ని 13.1 ఓవర్లలోనే చేధించి రాజస్తాన్ రాయల్స్‌కు అతిపెద్ద విజయాన్ని అందించారు. ఇక రూట్ బ్యాటింగ్ చూసే అవకాశం రాబోయే మ్యాచ్‌లోనైనా వస్తుందేమోనని అభిమానులు ఆశ పడుతున్నారు. Open your eyes, Joe Root is bowling in the IPL. pic.twitter.com/9L4rEyoJZV — Rajasthan Royals (@rajasthanroyals) May 11, 2023 చదవండి: సిక్సర్ల విషయంలో రోహిత్ అరుదైన రికార్డు -
జైశ్వాల్ సెంచరీ కోసం తపించిన శాంసన్..
ఐపీఎల్ 16వ సీజన్లో గురువారం కేకేఆర్, రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ వన్‌సైడ్‌గా మారిపోయింది. యశస్వి జైశ్వాల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తోడు కెప్టెన్ సంజూ శాంసన్ మెరుపులు తోడవ్వడంతో 150 పరుగుల టార్గెట్‌ను రాజస్తాన్ 13.1 ఓవర్లలోనే చేధించింది. అయితే 13 బంతుల్లోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ మార్క్ సాధించిన జైశ్వాల్ సెంచరీ చేసే అవకాశం లభించింది. చివర్లో కేకేఆర్ బౌలర్ సుయాశ్ శర్మ జైశ్వాల్ సెంచరీ చేయకుండా అడ్డుకోవాలని ప్రయత్నించాడు. అయితే సంజూ శాంసన్ మాత్రం జైశ్వాల్ సెంచరీ కోసం పరితపించాడు. ఈ నేపథ్యంలో ఇన్నింగ్స్ 13వ ఓవర్ ఆఖరి బంతిని సుయాశ్ శర్మ వైడ్ వేయడానికి యత్నించగా.. శాంసన్ వైడ్‌బాల్‌ను గెలికి డాట్‌బాల్‌గా మార్చాడు. అనంతరం జైశ్వాల్వైపు చూస్తూ బ్యాట్‌ను పైకెత్తి.. సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసుకో అన్నట్లుగా సైగ చేశాడు. తోటి ఆటగాడి సెంచరీ కోసం పరితపించిన శాంసన్‌ను అభిమానులు ప్రశంసల్లో ముంచెత్తారు. Sanju Samson indicating Yashasvi Jaiswal to go for the six and complete the hundred. pic.twitter.com/FUgZu7blTD — Mufaddal Vohra (@mufaddal_vohra) May 11, 2023 I don't think suyash sharma did it intentionally But great job from sanju samson 🫡 pic.twitter.com/DDuFtfLSv9 — GouravSays (@Gourav_poddar_) May 11, 2023 చదవండి: బంతుల పరంగా అతిపెద్ద విజయం.. ఐపీఎల్ చరిత్రలో రెండో జట్టుగా -
బంతుల పరంగా అతిపెద్ద విజయం.. ఐపీఎల్ చరిత్రలో రెండో జట్టుగా
ఐపీఎల్ చరిత్రలో రాజస్తాన్ రాయల్స్ అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. గురువారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 150 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 13.1 ఓవర్లలోనే చేధించింది. 41 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను అందుకుంది. ఈ క్రమంలో 150 అంతకన్నా ఎక్కువ టార్గెట్‌ను అత్యంత వేగంగా చేధించిన రెండో జట్టుగా రాజస్తాన్ రాయల్స్ నిలిచింది. తొలి స్థానంలో డెక్కన్ చార్జర్స్ ఉంది. 2008లో ముంబై ఇండియన్స్‌పై 48 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను అందుకుంది. ఇక 2008లోనే ముంబై ఇండియన్స్ సీఎస్కేపై 37 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకొని మూడో స్థానంలో నిలిచింది. ఈ మూడు సందర్భాల్లో రెండుసార్లు సెంచరీలు నమోదు కాగా.. ఒకసారి అర్థసెంచరీ నమోదు కాగా.. ముగ్గురు బ్యాటర్లు నాటౌట్‌గా నిలవడం విశేషం. 2008లో డెక్కన్ చార్జర్స్ ఓపెనర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ 47 బంతుల్లోనే 109 నాటౌట్, 2008లోనే ముంబై ఇండియన్స్ ఓపెనర్ సనత్ జయసూర్య 48 బంతుల్లో 114 పరుగులు నాటౌట్.. తాజాగా యశస్వి జైశ్వాల్ 47 బంతుల్లో 97 నాటౌట్ వీరోచిత ఇన్నింగ్స్‌లు ఆడారు. What an end to the Yashasvi Jaiswal show at Eden Gardens 😍#IPLonJioCinema #KKRvRR #IPL2023 #TATAIPL #HallaBol | @rajasthanroyals @ybj_19 pic.twitter.com/3tQheL4Qm8 — JioCinema (@JioCinema) May 11, 2023 చదవండి: యశస్వి జైశ్వాల్ చరిత్ర.. ఐపీఎల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ -
యశస్వి జైశ్వాల్ విధ్వంసం.. రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం
యశస్వి జైశ్వాల్ శివ తాండవం.. రాజస్తాన్ ఘన విజయం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 13.1 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. యశస్వి జైశ్వాల్(48 బంతుల్లో 98 నాటౌట్, 13 ఫోర్లు, 5 సిక్సర్లు) శివతాండవం ఆడగా.. సంజూ శాంసన్ 29 బంతుల్లో 48 నాటౌట్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్ చరిత్రలో రాజస్తాన్ రాయల్స్‌కు ఇదే అతి పెద్ద విజయం కావడం విశేషం. భారీ విజయం దిశగా రాజస్తాన్ రాయల్స్ ఐపీఎల్ 16వ సీజన్లో కేకేఆర్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ భారీ విజయం దిశగా దూసుకెళుతుంది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 140 పరుగులు చేసింది. జైశ్వాల్ 89, శాంసన్ 48 పరుగలతో ఆడుతున్నారు. రాజస్తాన్ రాయల్స్ టార్గెట్ 150 రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. రాజస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. నితీశ్ రానా 22 పరుగులు చేశాడు. రాజస్తాన్ బౌలర్లలో చహల్ నాలుగు వికెట్లు తీయగా.. బౌల్ట్ రెండు, సందీప్ శర్మ, కెఎం ఆసిఫ్ చెరొక వికెట్ తీశారు. వెంకటేశ్ అయ్యర్(57)ఔట్.. ఐదో వికెట్ కోల్పోయిన కేకేఆర్ రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఫిఫ్టీతో రాణించిన వెంకటేశ్ అయ్యర్(57 పరుగులు) చహల్ బౌలింగ్‌లో వెనుదిరగడంతో కేకేఆర్ 129 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. 14 ఓవర్లలో కేకేఆర్ 110/4 14 ఓవర్లలో కేకేఆర్ నాలుగు వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 45, రింకూ సింగ్ 2 పరుగులతో ఆడుతున్నారు. నితీశ్ రానా(22) ఔట్.. కేకేఆర్ 77/3 22 పరుగులు చేసిన నితీశ్ రానా చహల్ బౌలింగ్‌లో హెట్‌మైర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. 9 ఓవర్లలో కేకేఆర్ 58/2 9 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ రెండు వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. నితీశ్ రానా 17, వెంకటేశ్ అయ్యర్ 11 పరుగులతో ఆడుతున్నారు. తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్ జేసన్ రాయ్(10) రూపంలో కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి హెట్‌మైర్ స్టన్నింగ్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్తాన్ ఐపీఎల్ 16వ సీజన్లో కోల్‌కతా వేదికగా గురువారం 57వ మ్యాచ్‌లో కేకేఆర్, రాజస్తాన్ రాయల్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(వికెట్‌కీపర్/కెప్టెన్), జో రూట్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, KM ఆసిఫ్, యుజువేంద్ర చాహల్ సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో జోరు చూపిన రాజస్తాన్ ఆ తర్వాత వరుస పరాజయాలతో డీలా పడింది. మరోవైపు కేకేఆర్ మాత్రం విజయాలతో మళ్లీ ట్రాక్ ఎక్కినట్లే కనిపిస్తుంది. -
'రింకూ లాంటి ఫినిషర్ ఉండగా.. టెన్షన్ ఎందుకు దండగ'
ఐపీఎల్ 16వ సీజన్లో సోమవారం కేకేఆర్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ మరో థ్రిల్లర్‌ను తలపించింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఆఖరి బంతికి విజయాన్ని అందుకొని ప్లేఆఫ్ చాన్స్‌ను మరింత పటిష్టం చేసుకుంది. అయితే కేకేఆర్ గెలుపులో ముఖ్య పాత్ర ఆండ్రీ రసెల్. కానీ ఆఖరి ఓవర్ ఐదో బంతికి రసెల్ రనౌట్ అవ్వడం కేకేఆర్‌కు బిగ్‌షాక్. కానీ చివరి బంతిని రింకూ సింగ్ బౌండరీ బాది జట్టును గెలిపించాడు. అయితే రసెల్ తాను రనౌట్ అవ్వడంపై బాధపడలేదంట. కేకేఆర్విజయంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. అందుకు కారణం క్రీజులో ఉన్నది రింకూ సింగ్ అని పేర్కొన్నాడు. ''రింకూ సింగ్ స్థానంలో ఏ బ్యాటర్ ఉన్నా నేను చాన్స్ ఇచ్చేవాడిని కాదు.. కానీ రింకూపై నాకున్న నమ్మకం.. నేను రనౌట్ అయినప్పటికి పెద్దగా బాధపడలేదు. ఎందుకంటే రింకూ మ్యాచ్‌ను గెలిపిస్తాడని అప్పటికే ఊహించా. విన్నింగ్ షాట్ కొట్టే చాన్స్ అతనికే రావాలని అనుకున్నా. ఈ సీజన్లో రింకూ సింగ్ లాంటి ఫినిషర్ ఉండగా కేకేఆర్ భయపడనసరం లేదు. ఆఖరి ఓవర్‌కు ముందు రింకూ నన్ను ఒక ప్రశ్న అడిగాడు. ''ఒకవేళ బంతి నీకు పడితే పరుగు తీసేందుకు సిద్ధంగా ఉంటావా'' అని అడిగాడు. దానికి ''నేను కచ్చితంగా'' అని సమాధానం ఇచ్చాను. వాస్తవానికి నేను మ్యాచ్‌ను ఫినిష్ చేద్దామనుకున్నా. కానీ రింకూ లాంటి ఫినిషర్ ఉన్నప్పుడు అతనికే చాన్స్ ఇవ్వాలి. రనౌట్ అయిన ఒక్క క్షణం బాధపడ్డా.. నమ్మకం ఉన్నా ఆఖరి బంతికి రింకూ సింగ్ ఏం చేస్తాడోనని టెన్షన్‌కు లోనయ్యా. కానీ నా నమ్మకాన్ని రింకూ నిలబెట్టాడు'' అని నవ్వుతూ పేర్కొన్నాడు. చదవండి: అతడు అద్బుతంగా రాణిస్తున్నాడు.. టీమిండియా రీ ఎంట్రీ పక్కా! Happiness is mutual, 𝙍𝙪𝙨𝙨𝙚𝙡𝙡 𝙙𝙖 🤗#KKRvPBKS | #AmiKKR | #TATAIPL | @Russell12A pic.twitter.com/bqflnzcw7e— KolkataKnightRiders (@KKRiders) May 9, 2023 Just Rinku doing Rinku things & his happy captain interviewing the best finisher in the side 💜🤗 Presenting Rana & Rinku from the Eden Gardens as they sum up @KKRiders' riveting chase 🔥🔥 - By @28anand Full Interview 🎥🔽 #TATAIPL | #KKRvPBKS https://t.co/hsTzGeCY4b pic.twitter.com/c304XQnylR — IndianPremierLeague (@IPL) May 9, 2023 -
పంజాబ్ పై కోల్‌కతా గెలుపు
-
KKR VS PBKS: విజయానందంలో ఉన్న కేకేఆర్ కెప్టెన్ భారీ షాక్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో నిన్న (మే 8) జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఆఖరి బంతికి విజయం సాధించి, బతుకు జీవుడా అని బయటపడింది. రింకూ సింగ్ ఆఖరి బంతికి బౌండరీ బాదడంతో కేకేఆర్ విజయతీరాలకు చేరింది. ఆఖరి ఓవర్ అర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తుండటంతో తొలుత ఆందోళన చెందిన కేకేఆర్.. రింకూ సింగ్ బౌండరీ బాదడంతో ఊపిరి పీల్చుకుంది. ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచే విజయం దక్కడం, అలాగే చాలాకాలం తర్వాత తిరిగి ఫామ్‌లోకి రావడంతో సంబురాల్లో మునిగి తేలుతున్న కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణాకు ఐపీఎల్ నిబంధన నియమాల ఉల్లంఘన కమిటీ భారీ షాకిచ్చింది. స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గాను అతనికి రూ. 12 లక్షల జరిమానా విధించింది. తొలిసారి ఇలా జరిగినందుకు ఫైన్‌తో సరిపెట్టినట్లు పేర్కొంది. ఈ విషయానికి సంబంధించి ఐపీఎల్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే, కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. శిఖర్ ధవన్ (47 బంతుల్లో 57; 9 ఫోర్లు,సిక్స్), ఆఖర్లో షారుక్ ఖాన్ (8 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగా.. ఛేదనలో జేసన్ రాయ్ (24 బంతుల్లో 38; 8 ఫోర్లు), నితీశ్ రాణా (38 బంతుల్లో 51; ఫోర్, సిక్స్), ఆండ్రీ రసెల్ (23 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రింకూ సింగ్ 10 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో కేకేఆర్ విజయం (20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి) సాధించింది. చదవండి: PBKS VS KKR: మొన్న ఫిలిప్స్.. నిన్న రసెల్ -
నితీశ్ రానా భార్యకు చేదు అనుభవం..
కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రానా భార్య సాచీ మార్వాకు చేదు అనుభవం ఎదురైంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇద్దరు యువకులు బైక్‌పై ఆమె కారును వెంబడించడం కలకలం రేపింది. కారును వెంబడించడమే గాక ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడంతో సాచీ మార్వా వారి ప్రవర్తనతో ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. తన కారును వెంబడిస్తున్న యువకులను ఫోటో తీసి వీడియో రూపంలో బయటపెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని పోలీసులకు చెబితే.. అంతగా పట్టించుకోలేదని.. విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని పేర్కొనడం ఆశ్చర్యం కలిగించిందని సాచీ మార్వా తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. యువకుల ద్వారా తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె షేర్ చేసుకుంది. ''ఢిల్లీలో అది ఒక సాధారణ రోజు. నా పనులు పూర్తి చేసుకొని కారులో ఇంటికి వస్తున్నాను. వీళ్లు (ఫొటోలో ఉన్న యువకులు) యాదృచ్ఛికంగా నా కారును ఢీకొట్టడం మొదలుపెట్టారు.! కారణం లేకుండానే వెంబడించారు. నేను ఈ విషయంపై ఫోన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాను. దీంతో వారు నాకు 'ఇప్పుడు మీరు సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. ఇక దానిని వదిలేయండి! వచ్చేసారి ఆ బైక్ నెంబర్ నోట్ చేసుకోండి' అని అన్నారు. సరే కెప్టెన్. వచ్చేసారి వారి ఫోన్ నంబర్లు తప్పకుండా తీసుకుంటానని చెప్పా'' అని పేర్కొంది. #Watch: 2 men stalk & chase #KKR captain Nitish Rana's wife's car in #Delhi, she shares #video#NitishRana #SaachiMarwah #viral #news #Police Subscribe to our YouTube page: https://t.co/bP10gHsZuP pic.twitter.com/IxYAdGZyrv — UnMuteINDIA (@LetsUnMuteIndia) May 6, 2023 చదవండి: రోహిత్ డకౌట్ వెనుక ధోని మాస్టర్‌మైండ్! -
ఏ స్థానంలో వచ్చినా అంతే.. విసుగెత్తిస్తున్నాడు!
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ వైఫల్యం కొనసాగుతుంది. 13.25 కోట్లు పెట్టినందుకు ఒక్క మ్యాచ్‌లో మాత్రమే సెంచరీతో చెలరేగిన బ్రూక్ ఆ తర్వాత ఒక్క మ్యాచ్‌లోనూ ఆకట్టుకోలేకపోతున్నాడు. ఓపెనర్ నుంచి ఐదో స్థానం వరకు బ్యాటింగ్ వచ్చినా అదే దారుణ ఆటతీరు కనబరుస్తున్నాడు. తాజాగా గురువారం కేకేఆర్‌తో మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ నాలుగో స్థానంలో వచ్చి డకౌట్ అయ్యాడు. అయితే ఇదే కేకేఆర్‌పై ఈ సీజన్లో సెంచరీ మార్క్ అందుకున్న బ్రూక్ ఈసారి మాత్రం పేలవంగా ఔట్ అయ్యాడు. స్పిన్ ఆడడంలో తన బలహీనతను మరోసారి బయటపెట్టాడు. అనుకుల్ రాయ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు మరోసారి దొరికిపోయాడు. అనుకుల్ ఫుల్‌లెంగ్త్ డెలివరీ వేయగా.. బ్రూక్ అడ్డుకునే ప్రయత్నంలో ప్యాడ్లకు తాకింది. దీంతో ఎల్బీగా వెనుదిరిగాడు. ఇక కేకేఆర్‌తో మ్యాచ్‌లో సెంచరీ మినహా బ్రూక్ మిగతా 8 మ్యాచ్‌లు కలిపి 79 బంతులు ఎదుర్కొని 63 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలమయ్యాడు. బ్రూక్ ఆటతీరుపై అభిమానులు మరోసారి ట్రోలింగ్‌కు దిగారు. ''ఏ స్థానంలో వచ్చినా అదే ఆటతీరు.. విసుగెత్తిస్తున్నాడు''.. ''ఆడించింది చాలు.. బెంచ్‌కు పరిమితం చేయడం మేలనుకుంటా'' అని కామెంట్ చేశారు. #HarryBrook feels like he conquered India again after making a 💯 on a flat track and made comments on the Indian fans, now he will get roasted based on his lean patch after that. A huge Kudos to #SRH team management who continue to buy these expensive foreign players who have… pic.twitter.com/N50bbUZbUS — Pichaa Paati (@Pichaa_paati) May 4, 2023 చదవండి: డెత్ ఓవర్లలో 'కింగ్' అనిపించుకుంటున్న రింకూ సింగ్ -
డెత్ ఓవర్లలో 'కింగ్' అనిపించుకుంటున్న రింకూ సింగ్
ఐపీఎల్ 16వ సీజన్లో కేకేఆర్‌కు దొరికిన ఆణిముత్యం రింకూ సింగ్. మూడు సీజన్ల నుంచి అతను కేకేఆర్‌కు ఆడుతున్నప్పటికి ఏ సీజన్లోనూ పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి కేకేఆర్‌ను గెలిపించి ఒక్కసారిగా హీరో అయిపోయాడు. ఆ తర్వాత కూడా అదే టెంపోను కంటిన్యూ చేస్తున్న రింకూ సింగ్ డెత్ ఓవర్లలో కింగ్‌గా మారిపోయాడు. తాజాగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లోనూ స్లోపిచ్‌పై తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. హాఫ్ సెంచరీ మిస్ అయినప్పటికి రింకూ సింగ్ 35 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 46 పరుగులతో సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. అతని బ్యాటింగ్‌తోనే కేకేఆర్ 170 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. Photo: IPL Twitter ఈ క్రమంలోనే రింకూ సింగ్ ఒక రికార్డు అందుకున్నాడు. ఈ సీజన్లో డెత్ ఓవర్లలో(17-20 ఓవర్ల మధ్య) అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రింకూ సింగ్ తొలి స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు డెత్ ఓవర్లలో 197.53 స్ట్రైక్‌రేట్‌తో 161 పరుగులు చేశాడు. రింకూ సింగ్ తర్వాత షిమ్రోన్ హెట్‌మైర్ 200 స్ట్రైక్‌రేట్‌తో 144 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. టిమ్ డేవిడ్ 213.11 స్ట్రైక్‌రేట్‌తో 130 పరుగులతో మూడో స్థానంలో.. ఇక ద్రువ్ జురేల్ 205 స్ట్రైక్‌రేట్‌తో 115 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు. దీంతో పాటు కేకేఆర్ జట్టు మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంది. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో పవర్‌ప్లేలో మూడు వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసిన కేకేఆర్.. మిడిల్ ఓవర్లలో(7-14 ఓవర్లు) 9.75 రన్‌రేట్‌తో 78 పరుగులు చేసి ఒక వికెట్ నష్టపోయింది. ఇక డెత్ ఓవర్లలో(15-20 ఓవర్లు) ఐదు వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది. కాగా మిడిల్ ఓవర్లలో కేకేఆర్ ఈ సీజన్లో 8.9 రన్‌రేట్‌తో 801 పరుగులు చేయడం విశేషం. కేకేఆర్ మినహా ఏ జట్టు మిడిల్ ఓవర్లలో ఇన్ని పరుగులు రాబట్టడంలో విఫలమయ్యాయి. Rinku Singh's rescue innings for KKR: KKR 3/16 & he scored 35(28) KKR 3/92 & he scored 42*(23) KKR 5/142 & he scored 40(15) KKR 3/47 & he scored 46(33) KKR 3/128 & he scored 48*(21) KKR 5/96 & he scored 58*(31) KKR 4/70 & he scored 53*(33) KKR 3/35 & he scored 46(35) pic.twitter.com/urCRHrlDLl — Johns. (@CricCrazyJohns) May 4, 2023 చదవండి: సంచలన క్యాచ్‌తో మెరిసిన ఎస్ఆర్హెచ్ కెప్టెన్ -
IPL 2023: ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ అప్డేట్స్
IPL 2023: SRH Vs KKR Match Live Updates: మార్క్రమ్(41)ఔట్.. ఆరో వికెట్ డౌన్ 41 పరుగులు చేసిన మార్క్రమ్ వైభవ్ అరోరా బౌలింగ్‌లో రింకూ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఎస్ఆర్హెచ్ 145 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. క్లాసెన్(36) ఔట్.. ఎస్ఆర్హెచ్ 134/5 హెన్రిచ్ క్లాసెన్(36) రూపంలో ఎస్ఆర్హెచ్ ఐదో వికెట్ నష్టపోయింది. మార్క్రమ్తో కలిసి ఐదో వికెట్‌కు 50కి పైగా పరుగులు జోడించిన క్లాసెన్ ఠాకూర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి రసెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ ఐదు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. మార్క్రమ్ 39, అబ్దుల్ సమద్ ఐదు పరుగులతో ఆడుతున్నారు. బ్రూక్ డకౌట్.. నాలుగు వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్హెచ్ 172 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ కష్టాల్లో పడింది. హ్యారీ బ్రూక్ డకౌట్‌గా వెనుదిరగడంతో నాలుగో వికెట్ నష్టపోయింది. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 4 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. మార్క్రమ్ 2, క్లాసెన్ ఐదు పరుగులతో ఆడుతున్నారు. టార్గెట్ 172.. 38 పరుగులకు రెండు వికెట్లు డౌన్ 172 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ 5 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి 6, మార్క్రమ్ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు అభిషేక్ శర్మ 9, మయాంక్ అగర్వాల్ 18 పరుగులు చేసి ఔటయ్యారు. Photo Credit : IPL Website ఎస్ఆర్హెచ్ టార్గెట్ 172 ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. రింకూ సింగ్ 46 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ నితీశ్‌రానా 42 పరుగులు చేశాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో మార్కో జాన్సన్, టి. నటరాజన్‌లు చెరో రెండె వికెట్లు తీయగా.. భువనేశ్వర్, కార్తిక్ త్యాగి, మార్క్రమ్, మయాంక్ మార్కండేలు తలా ఒక వికెట్ తీశారు. Photo Credit : IPL Website 16 ఓవరల్లో కేకేఆర్ 137/6 16 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ ఆరు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. రింకూ సింగ్ 29, శార్దూల్ ఠాకూర్ ఆరు పరుగులతో ఆడుతున్నారు. Photo Credit : IPL Website నాలుగో వికెట్ కోల్పోయిన కేకేఆర్ 42 పరుగులు చేసిన నితీశ్ రానా మార్క్రమ్ స్టన్నింగ్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. అతని బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం కేకేఆర్ 12 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. రింకూ సింగ్ 22, రసెల్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website 9 ఓవర్లలో కేకేఆర్ స్కోరు 73/3 9 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. నితీశ్ రానా 24, రింకూ సింగ్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website 35 పరుగులకే మూడు వికెట్లు డౌన్ 35 పరుగుల వద్ద కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన జేసన్ రాయ్ కార్తిక్ త్యాగి బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. Photo Credit : IPL Website 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన కేకేఆర్ ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో కేకేఆర్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మార్కో జాన్సన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టడం విశేషం. Photo Credit : IPL Website టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్ ఐపీఎల్ 16వ సీజన్లో హైదరాబాద్ వేదికగా 47వ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్, కేకేఆర్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్ బ్యాటింగ్ ఎంచుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్, అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, కార్తీక్ త్యాగి, టి నటరాజన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి Nitish Rana calls right at the toss & @KKRiders choose to BAT FIRST tonight🏏 Watch #SRHvKKR, LIVE & FREE on #JioCinema, available on any sim card.#TATAIPL #IPLonJioCinema #IPL2023 pic.twitter.com/A6QyPUh2nt — JioCinema (@JioCinema) May 4, 2023 గత మ్యాచ్‌లో విజయంతో ఎస్ఆర్హెచ్ వరుస ఓటములకు బ్రేక్ వేసింది. ఇక కేకేఆర్ మాత్రం ఒక మ్యాచ్‌లో గెలుపు.. మరో మ్యాచ్‌లో ఓటమి అన్నట్లుగా సాగుతుంది. ఈ సీజన్లో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. హ్యారీ బ్రూక్ సెంచరీ సాధించింది ఈ మ్యాచ్‌లోనే. -
SRHvsKKR : ఉప్పల్ స్టేడియంలో ఆటగాళ్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
-
కేకేఆర్‌ను ఎన్కౌంటర్ చేసిన విజయ్ శంకర్
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ తన హవా కొనసాగిస్తుంది. తాజాగా శనివారం కేకేఆర్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 14 ఓవర్ల వరకు 111 పరుగులు మాత్రమే ఉన్న గుజరాత్ తర్వాత మూడు ఓవర్ల వ్యవధిలోనే మ్యాచ్‌ను గెలవడం విశేషం. ఇదంతా మిల్లర్, విజయ్ శంకర్ల చలవే అని చెప్పొచ్చు. 14వ ఓవర్ వరకు మిల్లర్ 13, విజయ్ శంకర్ ఏడు పరుగులతో ఆడుతున్నారు. అసలు విధ్వంసం 14వ ఓవర్ నుంచే మొదలైంది. ఇద్దరు పోటాపోటీగా సిక్సర్లు బౌండరీలు బాదుతూ వచ్చారు. వీరిద్దరి దెబ్బకు తర్వాతి 3.5 ఓవర్లలో 79 పరుగులు వచ్చాయంటే ఎంత విధ్వంసం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా విజయ్ శంకర్ తన ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌లో హైలెట్‌గా నిలిచాడు. 24 బంతుల్లో 51 పరుగులు నాటౌట్‌గా నిలిచిన విజయ్ శంకర్ ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. వరుణ్ చక్రవర్తి వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో మూడు సిక్సర్లు, ఫోర్‌తో విధ్వంసం సృష్టించిన విజయ్ శంకర్ ఆ తర్వాత నితీశ్‌రానా వేసిన 18వ ఓవర్లో మరో సిక్స్, ఫోర్‌తో విరుచుకుపడి మ్యాచ్‌ను ముగించాడు. మిల్లర్‌ను కూడా తక్కువ చేసి చూడలేం. నిజానికి మిల్లర్ 14వ ఓవర్లో రెండు సిక్సర్లు బాది గుజరాత్‌పై ఒత్తిడి తగ్గించాడు. 18 బంతుల్లో 32 పరుగులు నాటౌట్‌గా నిలిచిన మిల్లర్ ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. మొత్తానికి ఇద్దరు కలిసి తమ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో కేకేఆర్‌ను ఎన్కౌంట్ర్ చేశారని చెప్పొచ్చు. Vijay Shankar's counter-attacking 5️⃣0️⃣ ensures #GujaratTitans keep their perfect away record intact 💯 The defending champions also go 🔝 of the #TATAIPL points table!#KKRvGT #IPLonJioCinema #IPL2023 | @vijayshankar260 pic.twitter.com/uLpd5RYmgW — JioCinema (@JioCinema) April 29, 2023 చదవండి: పీసీబీ ఘనకార్యం.. క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి! అద్భుతాలు అరుదుగా.. చూసి తీరాల్సిందే -
అద్భుతాలు అరుదుగా.. చూసి తీరాల్సిందే
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా కేకేఆర్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో ఒక అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. బహుశా ఇలాంటి అద్భుతాలు అరుదుగా జరుగుతాయేమో. విషయంలోకి వెళితే.. గుజరాత్తోమ్యాచ్లో కేకేఆర్ ఓపెనర్ రహమనుల్లా గుర్బాజ్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అఫ్గానిస్తాన్‌కు చెందిన గుర్బాజ్ 39 బంతుల్లోనే ఏడు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 81 పరుగులు చేసి గుజరాత్‌కు చుక్కలు చూపించాడు. ఒక దశలో దాటిగా ఆడుతున్న గుర్బాజ్‌ను ఔట్ చేయడానికి బౌలర్లు తంటాలు పడ్డారు. అయితే నూర్ అహ్మద్ ఎట్టకేలకు గుర్బాజ్‌ను ఔట్ చేయగలిగాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్ రెండో బంతిని గుర్బాజ్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. అయితే అక్కడే రషీద్ ఖాన్ ఎలాంటి తప్పిదం చేయకుండా క్యాచ్ అందుకున్నాడు. Photo: IPL Twitter అయితే మీరు ఒక విషయం గమనించారో లేదో.. బ్యాటింగ్ ఆడిన రహమనుల్లా గుర్బాజ్, బౌలింగ్ వేసిన నూర్ అహ్మద్, క్యాచ్ పట్టిన రషీద్ ఖాన్.. ముగ్గురు ఒక దేశానికి చెందిన ఆటగాళ్లే కావడం విశేషం. ప్రస్తుతం ఈ ముగ్గురు అఫ్గానిస్తాన్ జట్టులో కీలకపాత్ర పోషిస్తున్నారు. అలా బ్యాటింగ్ ఆడినోడు.. బౌలింగ వేసినోడు.. క్యాచ్ పట్టినోడు ఒకే దేశానికి చెందినవారు కావడం అరుదుగా జరుగుతుంది. తాజాగా ఐపీఎల్ అందుకు వేదిక అయింది. Bowler, batter & fielder - it was an 𝐚𝐥𝐥-𝐀𝐟𝐠𝐡𝐚𝐧 𝐚𝐟𝐟𝐚𝐢𝐫 🇦🇫🇦🇫🇦🇫#KKRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/Ht1guUI9Oy — JioCinema (@JioCinema) April 29, 2023 Gurbaz c Rashid Khan b Noor Ahmad 81(39)#IPL2023 #KKRvGT pic.twitter.com/ZIOtZqGZa9 — Cricbuzz (@cricbuzz) April 29, 2023 Batter from Afghanistan. Bowler from Afghanistan. Catch taken by player from Afghanistan. The IPL has truly come a long way #IPL2023 #KKRvGT — Vishesh Roy (@vroy38) April 29, 2023 చదవండి: Shardul Thakur: మోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్.. ప్రయోగం బెడిసికొట్టింది -
స్వదేశానికి కేకేఆర్ క్రికెటర్.. ఆడింది ఒక్కటే మ్యాచ్!
కేకేఆర్ ఆటగాడు.. స్టార్ క్రికెటర్ లిటన్ దాస్ బంగ్లాదేశ్‌కు వెళ్లిపోయాడు. ఐపీఎల్ 16వ సీజన్లో ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడిన లిటన్ దాస్ కుటుంబ సమస్యల కారణంగా అర్థంతరంగా లీగ్ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని కేకేఆర్ ట్విటర్లో అధికారికంగా ద్రువీకరించింది. ''లిటన్ దాస్ బంగ్లాదేశ్‌కు పయనమయ్యాడు. ఇది మాకు నష్టం కలిగించేది. కానీ కుటుంబంలో మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అతను వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతనికి మా మద్దతు ఎల్లప్పుడు ఉంటుంది. ఈ కష్ట సమయం నుంచి లిటన్ దాస్ తొందరగా బయటపడాలని కోరుకుంటున్నాం'' అంటూ ట్వీట్ చేసింది. ఇక గతేడాది జరిగిన వేలంలో యాక్సిలరేటెడ్ రౌండ్లో కనీస ధర రూ.50 లక్షలకు కేకేఆర్ కొనుగోలు చేసింది. ఈ సీజన్లో ఏప్రిల్ 20న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా లిటన్‌దాస్ ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి ఔటైన ఈ వికెట్ కీపర్ లలిత్ యాదవ్, అక్షర్ పటేల్‌ల స్టంపౌట్ చాన్స్ మిస్ చేసుకున్నాడు. ఇక ఆర్సీబీపై విజయంతో కేకేఆర్ ఈ సీజన్లో నాలుగు వరుస పరాజయాలకు చెక్ పెట్టింది. ప్రస్తుతం ఎనిమిది మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుంది. ఏప్రిల్ 29న ఈడెన్ గార్డెన్ వేదికగా తర్వాతి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఎదుర్కోనుంది. చదవండి: వన్డే క్రికెట్లో పాకిస్తాన్ చరిత్ర.. అయినా టీమిండియా వెనకాలే -
#RCB: మాస్టర్ ప్లాన్.. ఆర్సీబీ పేరుతో అడ్డుపుల్ల!
ఐపీఎల్లో దురదృష్టమైన జట్టుగా పేరు పొందింది ఆర్సీబీ. కప్ అందుకోవడానికి అన్ని అర్హతలు ఉన్నప్పటికి ఆఖరి నిమిషంలో ఒత్తిడికి లోనవ్వడంతో టైటిల్ అందని ద్రాక్షలానే మిగిలిపోతుంది. ప్రతీసారి ఈ సాలా కప్ నమ్దే అంటూ బరిలోకి దిగే ఆర్సీబీ లీగ్ దశ వరకు బాగానే ఆడుతున్నా ప్లేఆఫ్ దశలో మాత్రం చతికిలపడుతూ వస్తోంది. గత మూడు సీజన్లుగా ఇదే తంతు. మూడుసార్లు ఐపీఎల్లో రన్నరప్‌గా నిలిచిన ఆర్సీబీ కనీసం ఈసారైనా టైటిల్ కొట్టాలని కోరుకుందాం. ఈ విషయం పక్కనబెడితే.. బుధవారం కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్‌కు హాజరైన ఒక చిన్నారి చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్సీబీ టైటిల్ కొట్టేవరకు నేను స్కూల్లో జాయిన్ అవను అంటూ ప్లకార్డు ప్రదర్శించడం ఆసక్తి రేపింది. మ్యాచ్ జరుగుతుండగా ఆ చిన్నారి ప్లకార్డు పట్టుకొని అటు ఇటు తిరగడం హైలెట్‌గా నిలిచింది. ఇదంతా ఒక వ్యక్తి వీడియో తీసి ట్విటర్లో షేర్ చేయగా చిన్నారి ట్రెండింగ్‌లో నిలిచింది. ఇది చూసిన అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేశారు. ''వాళ్లు టైటిల్ కొట్టినా.. కొట్టకపోయినా డబ్బులు వస్తాయి.. నువ్వు చదువుకుంటేనే గౌరవం వస్తుంది''.. ''ఈ చిన్నారి కోరిక తీరాలని కోరుకుందాం''.. ''ఆర్సీబీ కప్ గెలిస్తే ఓకే.. ఒకవేళ గెలవకపోతే పరిస్థితి ఏంటో మరి ఆలోచించుకో.. స్కూల్ ఎగ్గొట్టడానికి ఆర్సీబీ పేరుతో మాస్టర్ ప్లాన్ వేశావుగా'' అంటూ పేర్కొన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆర్సీబీ 21 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగులు మాత్రమే చేయగలిగింది. గత మూడు మ్యాచ్‌ల్లో కోహ్లి స్టాండిన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సీజన్లో ఆర్సీబీ 8 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, నాలుగు ఓటములతో ఐదో స్థానంలో ఉంది. చదవండి: ఎవర్రా మీరంతా?.. వదిలేస్తే వంద పరుగులైనా తీస్తారేమో! Dear RCB, please win IPL for your fans ❤ pic.twitter.com/0PHQoyshQe — leisha (@katyxkohli17) April 26, 2023 -
పేపర్ పై అదుర్స్..! గ్రౌండ్ లో తుస్..!!
-
'ఓటమికి అర్హులం.. ఫీల్డింగ్ వైఫల్యం కొంపముంచింది'
ఐపీఎల్ 16వ సీజన్లో కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ 21 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి 54 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మహిపాల్ లామ్రోర్ 34, దినేశ్ కార్తిక్ 22 పరుగులు చేశారు. అంతకముందు కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. జేసన్ రాయ్ 56 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. నితీశ్ రానా 48, వెంకటేశ్అయ్యర్ 27 పరుగులు చేశారు. ఆఖర్లో రింకూ సింగ్(10 బంతుల్లో 18 నాటౌట్), డేవిడ్ వీస్(3 బంతుల్లో 12 నాటౌట్) సిక్సర్లు బాదడంతో కేకేఆర్ 200 మార్క్ అందుకుంది. ఇక మ్యాచ్ ఓటమిపై కోహ్లి స్పందిస్తూ.. ''నిజాయితీగా చెప్పాలంటే చేజేతులా మ్యాచ్‌ను వారికి కోల్పోయాం. మ్యాచ్ ఓడిపోవాలని రాసిపెట్టి ఉంది. మా ఆటలో ఇవాళ చాలా లోపాలు కనిపించాయి. పేలవమైన ఫీల్డింగ్, క్యాచ్‌ల డ్రాప్‌లతో దాదాపు 25 నుంచి 30 పరుగులు అదనంగా సమర్పించుకున్నాం. అదే మా కొంప ముంచింది. అయితే మాకు మంచి ఆరంభం లభించినప్పటికి దానిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాం. ఇక బ్యాటింగ్‌లో మంచి భాగస్వామ్యం కరువైంది. చేజింగ్‌లో అదే ముఖ్యం. కానీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం. సీజన్లో విజయాలు సాధిస్తున్న చోటే ఓటములు వస్తున్నాయి. కానీ ఒత్తిడిని దరిచేరనీయం. రాబోయే మ్యాచ్‌ల్లో విజయాలు సాధించేలా ప్రణాళికలు రూపొందించుకుంటాం'' అని చెప్పుకొచ్చాడు. Virat Kohli said, "we deserved to lose tonight, we weren't professional tonight in the field". pic.twitter.com/hxPqjLl0Cd — Mufaddal Vohra (@mufaddal_vohra) April 26, 2023 చదవండి: ఫినిషర్ పాత్రకు న్యాయం చేయకపోగా పనికిమాలిన రికార్డు -
చెత్త ఫీల్డింగ్‌తో మూడు లైఫ్‌లు.. సిక్సర్లతో రికార్డులకెక్కాడు
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ దారుణ ఫీల్డింగ్ కనబరిచింది. ముఖ్యంగా కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రానా ఆర్సీబీ చెత్త ఫీల్డింగ్ వల్ల మూడుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. తొలుత నితీష్ 12 పరుగుల వద్ద ఉన్నప్పుడు విజయ్‌కుమార్ బౌలింగ్‌లో లాంగాఫ్ దిశగా షాట్ ఆడగా.. సిరాజ్ చేతిలోకి వచ్చిన క్యాచ్‌ను వదిలేశాడు. ఇక రెండోసారి సిరాజ్ బౌలింగ్ఓ ఫైన్‌లెగ్ దిశగా ఆడగా.. అక్కడే ఉన్న ఫీల్డర్ మరోసారి క్యాచ్‌ను జారవిడిచాడు. ఇక ముచ్చటగా మూడోసారి మ్యాక్స్‌వెల్ వదిలేశాడు. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో రానా లాంగాన్ దిశగా ఆడగా.. మ్యాక్స్‌వెల్ కాస్త వేగంగా స్పందించి ఉంటే ఉంటే క్యాచ్ దొరికేది. ఇలా మూడుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న నితీశ్ రానా చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. Photo: IPL Twitter కేకేఆర్ తరపున అత్యధిక సిక్సర్ల రికార్డు సిక్సర్లతో చిన్నస్వామి స్టేడియాన్ని హోరెత్తించాడు. మొత్తంగా 21 బంతుల్లో 4 సిక్సర్లు, మూడు ఫోర్ల సాయంతో 48 పరుగులు చేసి హసరంగా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే నితీశ్ రానా ఒక రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో కేకేఆర్ తరపున అత్యధిక సిక్సర్లు బాదిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లో నితీశ్ రానా కొట్టిన నాలుగు సిక్సర్లతో వంద సిక్సర్ల మార్క్‌ను అందుకున్నాడు. ఈ జాబితాలో ఆండ్రీ రసెల్ 180 సిక్సర్లతో తొలిస్థానంలో ఉండగా.. వంద సిక్సర్లతో నితీశ్ రానా రెండో స్థానంలో, 85 సిక్సర్లతో యూసఫ్ పఠాన్, రాబిన్ ఊతప్పలు సంయుక్తంగా మూడోస్థానంలో ఉన్నారు. Nitish is scoring Run Rana Run 😅@KKRiders' skipper goes 💥 back-to-back 💪#RCBvKKR #TATAIPL #IPLonJioCinema #IPL2023 pic.twitter.com/I3fNVedeSr — JioCinema (@JioCinema) April 26, 2023 చదవండి: #JasonRoy: 4 బంతుల్లో నాలుగు సిక్సర్లు.. షాబాజ్ అహ్మద్‌ను ఉతికారేశాడు -
#JasonRoy: 4 బంతుల్లో నాలుగు సిక్సర్లు.. షాబాజ్ అహ్మద్‌ను ఉతికారేశాడు
ఐపీఎల్ 16వ సీజన్లో కేకేఆర్ ఓపెనర్ జేసన్ రాయ్ వరుసగా రెండో అర్థశతకం సాధించాడు. బుధవారం ఆర్సీబీతో మ్యాచ్‌లో ఆరంభం నుంచే ధాటిగా ఆడిన రాయ్ 22 బంతుల్లోనే అర్థశతకం మార్క్ అందుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఇక ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన షాబాజ్ అహ్మద్‌కు జేసన్ రాయ్ చుక్కలు చూపించాడు. ఆ ఓవర్లో నాలుగు సిక్సర్లు బాదిన రాయ్ 24 పరుగులు పిండుకొని ఉతికారేశాడు. ఇక మ్యాచ్‌లో 29 బంతుల్లో 56 పరుగులు చేసిన జేసన్ రాయ్ విజయ్‌కుమార్ వైశాక్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. Oh boy, this Roy can bat! 👏#RCBvKKR #TATAIPL #IPLonJioCinema #IPL2023 | @JasonRoy20 @KKRiders pic.twitter.com/QVYc2ZuZ2b — JioCinema (@JioCinema) April 26, 2023 చదవండి: Virat Kohli: చరిత్రకెక్కిన కోహ్లి.. 580 రోజుల తర్వాత -
Virat Kohli: చరిత్రకెక్కిన కోహ్లి.. 580 రోజుల తర్వాత
ఐపీఎల్ 16వ సీజన్లో విరాట్ కోహ్లి స్టాండిన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ డుప్లెసిస్ పక్కటెముకల నొప్పితో బాధపడుతున్నాడు. అందువల్ల గత రెండు మ్యాచ్‌లుగా డుప్లెసిస్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. తాజాగా బుధవారం కేకేఆర్‌తో మ్యాచ్‌లోనూ డుప్లెసిస్ మరోసారి ఇంపాక్ట్ ప్లేయర్‌గా పరిమితం కావడంతో కోహ్లి మరోసారి కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అయితే గత రెండు మ్యాచ్‌ల్లో టాస్ ఓడిన కోహ్లి.. ఈసారి మాత్రం నెగ్గాడు. ఈ క్రమంలో ఆర్సీబీ కెప్టెన్‌గా 580 రోజుల తర్వాత టాస్ నెగ్గి చరిత్ర సృష్టించాడు. కోహ్లి ఆఖరిసారి 2021 ఐపీఎల్లో కేకేఆర్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ నెగ్గాడు. ఆ తర్వాత కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకున్న కోహ్లి.. తాజాగా ఐపీఎల్ 2023లో మళ్లీ అదే కేకేఆర్‌తో మ్యాచ్‌లోనే తాత్కాలిక కెప్టెన్‌గా టాస్ నెగ్గడం విశేషం. The Roar for King Kohli is huge 🔥pic.twitter.com/azZZvMdp3j — Johns. (@CricCrazyJohns) April 26, 2023 చదవండి: సెంచరీలతో విధ్వంసం.. పసికూనపై లంక ఓపెనర్ల ప్రతాపం 'ఒక్క ఓవర్ జీవితాన్ని తలకిందులు చేసింది.. త్వరగా కోలుకో' -
IPL 2023 RCB Vs KKR: ఆర్సీబీపై కేకేఆర్ ఘన విజయం
ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 21 పరుగులతో విజయాన్ని అందుకుంది. 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి 54 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మహిపాల్ లామ్రోర్ 34, దినేశ్ కార్తిక్ 22 పరుగులు చేశారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు తీయగా.. సుయాష్ శర్మ, ఆండ్రీ రసెల్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. 16 ఓవర్లలో ఆర్సీబీ 145/6 16 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ ఆరు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. దినేశ్ కార్తిక్ 15, హసరంగా ఐదు పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆర్సీబీ గెలవాలంటే 24 బంతుల్లో 56 పరుగులు చేయాలి. కోహ్లి ఔట్.. ఐదో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ విరాట్ కోహ్లి(54) రసెల్ బౌలింగ్‌లో వెంకటేశ్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఆర్సీబీ 115 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. కోహ్లి ఫిఫ్టీ.. ఆర్సీబీ 106/3 కేకేఆర్‌తో మ్యాచ్‌లో 33 బంతుల్లో కోహ్లి అర్థసెంచరీ మార్క్ అందుకున్నాడు. ప్రస్తుతం ఆర్సీబీ మూడు వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. లామ్రోర్ 28 పరుగులతో కోహ్లికి సహకరిస్తున్నాడు. 8 ఓవర్లలో ఆర్సీబీ 72/3 8 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ మూడు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. కోహ్లి 41, మహిపాల్ లామ్రోర్ ఏడు పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. అంతకముందు షాబాజ్ అహ్మద్, మ్యాక్స్‌వెల్‌లు తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. డుప్లెసిస్(18) ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ 201 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీ డుప్లెసిస్(17) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. Photo Credit : IPL Website రాణించిన జేసన్ రాయ్, నితీశ్ రానా.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే? ఆర్సీబీతో మ్యాచ్‌లో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. జేసన్ రాయ్ 56 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. నితీశ్ రానా 48, వెంకటేశ్అయ్యర్ 27 పరుగులు చేశారు. ఆఖర్లో రింకూ సింగ్(10 బంతుల్లో 18 నాటౌట్), డేవిడ్ వీస్(3 బంతుల్లో 12 నాటౌట్) సిక్సర్లు బాదడంతో కేకేఆర్ 200 మార్క్ అందుకుంది. ఆర్సీబీ బౌలర్లలో హసరంగా, విజయ్ కుమార్ వైశాక్లు చెరో రెండు వికెట్లు తీయగా.. సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు. Photo Credit : IPL Website 14 ఓవర్లలో కేకేఆర్ 126/2 14 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ రెండు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 20, నితీశ్ రానా 18 పరుగులతో ఆడుతున్నారు. Photo Credit : IPL Website జేసన్ రాయ్(56) క్లీన్‌బౌల్డ్.. కేకేఆర్ 105/2 ఆర్సీబీతో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన జేసన్ రాయ్ విజయ్‌కుమార్ వైశాక్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం కేకేఆర్ రెండు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 14, నితీశ్ రానా 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్.. ఆర్సీబీతో మ్యాచ్‌లో కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. విజయ్‌కుమార్ వైశాక్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన జగదీషన్(27 పరుగులు) డేవిడ్ విల్లేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ వికెట్ నష్టానికి 83 పరుగులు చేసింది. రాయ్ 55 పరుగులతో ఆడుతున్నాడు. Photo Credit : IPL Website దంచి కొడుతున్న జేసన్ రాయ్.. కేకేఆర్ 6 ఓవర్లలో 66/0 ఆర్సీబీతో మ్యాచ్‌లో కేకేఆర్ ఓపెనర్ జేసన్ రాయ్ విధ్వంసం సృష్టిస్తున్నాడు. 20 బంతుల్లోనే 48 పరుగులు చేసిన రాయ్ ఖాతాలో 4 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. షాబాజ్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో ఏకంగా నాలుగు సిక్సర్లు బాదాడు. ప్రస్తుతం కేకేఆర్ ఆరు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. Photo Credit : IPL Website టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా బుధవారం 36వ మ్యాచ్‌లో బెంగళూరు వేదికగా ఆర్సీబీ, కేకేఆర్‌లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ ఫీల్డింగ్ ఎంచుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ(కెప్టెన్), షాబాజ్ అహ్మద్, గ్లెన్ మాక్స్వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), సుయాష్ ప్రభుదేసాయి, వనిందు హసరంగా, డేవిడ్ విల్లీ, విజయ్‌కుమార్ వైషాక్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): ఎన్ జగదీసన్ (వికెట్‌కీపర్), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, డేవిడ్ వైస్, వైభవ్ అరోరా, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి The Roar for King Kohli is huge 🔥pic.twitter.com/azZZvMdp3j — Johns. (@CricCrazyJohns) April 26, 2023 కోహ్లి స్టాండిన్ కెప్టెన్‌గా వ్యవహరించిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించిన ఆర్సీబీ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. మరోవైపు కేకేఆర్ వరుస ఓటములతో డీలా పడింది. ఆర్సీబీపై విజయంతో మళ్లీ ట్రాక్ ఎక్కాలని చూస్తోంది. తొలి అంచె పోటీల్లో కేకేఆర్.. ఆర్సీబీపై 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇరుజట్లు ఐపీఎల్లో 31 సార్లు తలపడగా.. ఆర్సీబీ 17 సార్లు గెలుపొందగా.. కేకేఆర్ 14 సార్లు విజయాలు అందుకుంది. -
ఊర్వశి వస్తేనే DCకి ఊపొస్తుందా?
-
అగ్నికి వాయువు తోడయ్యాడు.. పలు రికార్డులు బద్దలు
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే ఆదివారం కేకేఆర్‌తో మ్యాచ్‌లో తమ అత్యధి స్కోరును నమోదు చేసింది. రహానే, శివమ్ దూబేల విధ్వంసానికి తోడు కాన్వే క్లాస్ ఇన్నింగ్స్‌తో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఓవరాల్‌గా సీఎస్కేకు ఐపీఎల్లో ఇది మూడో అత్యధిక స్కోరు కావడం విశేషం. మరి మ్యాచ్‌లో సీఎస్కే ఇంత పెద్ద స్కోరు చేయడానికి ఇద్దరు ముఖ్య కారణం. ఒకరు అజింక్యా రహానే అయితే.. మరొకరు శివమ్ దూబే. అగ్నికి వాయువు తోడైతే ఇక విధ్వంసమే అన్నట్లుగా సాగింది సీఎస్కే ఇన్నింగ్స్. శివవ్ దూబే క్రీజులోకి వచ్చే సమయానికి రహానే 14 బంతుల్లో 19 పరుగులతో ఆడుతున్నాడు. ఈ ఇద్దరు జత కలిశాకా ఇన్నింగ్స్ 12.5 ఓవర్లో శివమ్ దూబే సిక్సర్‌తో మొదలైన విధ్వంసం ఐదు ఓవర్ల పాటు కొనసాగింది. శివమ్ దూబే వాయు వేగంతో పరుగులు సాధించాడు. కేవలం 20 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న శివమ్ దూబే ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే కేకేఆర్‌తో మ్యాచ్‌లో సీఎస్కే పలు రికార్డులు బద్దలు కొట్టింది. అవేంటో ఒకసారి చూసేద్దాం. ► ఐపీఎల్లో సీఎస్కే తరపున అత్యంత వేగంగా ఫిఫ్టీ బాదిన ఆరో ఆటగాడిగా.. ధోని, అంబటి రాయుడులతో కలిసి శివమ్ దూబే సంయుక్తంగా ఉన్నాడు. ► ఇక సీఎస్కేకు ఐపీఎల్లో చరిత్రలో ఇది మూడో అత్యధిక స్కోరు. ఇంతకముందు 2010లో రాజస్తాన్ రాయల్స్‌పై 246/5, 2008లో పంజాబ్ కింగ్స్‌పై 240/5 స్కోర్లు నమోదు చేసింది. తాజాగా ఇదే సీజన్లో ఆర్సీబీపై ఆరు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. ► ఇక కేకేఆర్‌తో మ్యాచ్‌లో రహానే 199.04 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ కొనసాగించడం విశేషం. ఈ సీజన్లో మినిమం వంద పరుగులు చేసే క్రమంలో అత్యధిక స్ట్రైక్‌రేట్ కలిగిన బ్యాటర్‌గా రహానే తొలిస్థానంలో నిలిచి చరిత్ర సృష్టించాడు. ఇంతకముందు శార్దూల్ ఠాకూర్(198.03), గ్లెన్ మ్యాక్స్‌వెల్(188.80), నికోలస్ పూరన్(185.86), సూర్యకుమార్ యాదవ్(168.49) వరుసగా ఉన్నారు. ► ఇక సిక్సర్ల విషయంలో సీఎస్కే సరికొత రికార్డు నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 18 సిక్సర్లు బాదిన సీఎస్కే.. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆరో జట్టుగా సీఎస్కే నిలిచింది. ఇంతకముందు 2013లో ఆర్సీబీ ఒకే ఇన్నింగ్స్‌లో 21 సిక్సర్లు కొట్టింది. 2017లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 సిక్సర్లు కొట్టింది. ఆ తర్వాత ఆర్సీబీ(2016లో 20 సిక్సర్లు), 2020లో రాజస్తాన్ రాయల్ష్ 20 సిక్సర్లు, 2015లో ఆర్సీబీ 18 సిక్సర్లు.. తాజాగా సీఎస్కే కేకేఆర్‌తో మ్యాచ్‌లో 18 సిక్సర్లు బాదింది. -
#AjinkyaRahane: 'కుర్రాళ్లు కూడా దిగదుడుపే.. చెడుగుడు ఆడాడు'
అజింక్యా రహానే.. ఈ పేరు చెప్పగానే ప్రశాంతతకు మారుపేరు.. అని ఎక్కువగా వినిపిస్తుంది. కానీ ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా కేకేఆర్‌తో ఇవాళ ఆడిన మ్యాచ్‌లో రహానే ఆట చూసిన వారెవరైనా తమ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందే. అలా సాగింది రహానే ఆటతీరు. ఏమని చెప్పగలం.. ఎంతని చెప్పగలం.. బంతి పడిందే ఆలస్యం బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. అసలు ఆడుతుంది రహానేనా లేక ఇంకెవరైనా అనే అనుమానం కూడా కలగక మానదు. అంతలా విధ్వంసం చేసి పారేశాడు. చినుకు చినుకు గాలి వానలా మారి తుఫాను విధ్వంసంతో విరుచుకుపడిందన్నట్లుగా రహానే ఇన్నింగ్స్ సాగింది. కేకేఆర్‌తో మ్యాచ్‌లో రహానే మొత్తంగా 29 బంతుల్లో 71 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. అయితే తుఫానుకు ముందు ప్రశాంతత అన్నట్లుగా సీఎస్కే ఇన్నింగ్స్ 13 ఓవర్ ముగిసే సరికి రహానే 14 బంతుల్లో 19 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత నుంచి రహానే విధ్వంసం మొదలైంది. ఓవర్‌కు సిక్సర్ లేదా ఫోర్ అన్నట్లుగా సాగింది అతని ఇన్నింగ్స్. 14 బంతుల్లో 19 పరుగులు చేసిన రహానే.. తాను ఎదుర్కొన్న చివరి 15 బంతుల్లో 60 పరుగులు బాదాడు. దీన్నిబట్లే రహానే విధ్వంసం ఎంతలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. కేవలం రూ.50 లక్షల బేస్ ప్రైస్‌తో దక్కించుకున్న సీఎస్కేకు అతను రెట్టింపు న్యాయం అందిస్తున్నాడు. ఈ ఇన్నింగ్స్‌తో రహానే తన ముందు కుర్రాళ్లు కూడా దిగదిడుపూ అని నిరూపించాడు. 🔥 We are using 'Ridiculous' and 'Rahane' in one sentence... who would have thunk!? 🤯#KKRvCSK #IPLonJioCinema #TATAIPL #IPL2023 | @ajinkyarahane88 pic.twitter.com/zXhhtfIFlv— JioCinema (@JioCinema) April 23, 2023 -
49 పరుగుల తేడాతో సీఎస్కే ఘన విజయం
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే వరుస విజయాలతో దూసుకెళుతుంది. తాజాగా ఆదివారం కేకేఆర్‌తో మ్యాచ్‌లో సీఎస్కే 49 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. 236 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. జేసన్ రాయ్ 26 బంతుల్లో 61 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రింకూ సింగ్ 33 బంతుల్లో 53 నాటౌట్ మినహా మిగతావారు విఫలమయ్యారు. సీఎస్కే బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే, మహీష్ తీక్షణలు చెరో రెండు వికెట్లు తీయగా.. మొయిన్ అలీ, జడేజా, పతిరాణా, ఆకాశ్ సింగ్‌లు తలా ఒక వికెట్ తీశారు. 180 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ డౌన్ 236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఓటమి దిశగా పయనిస్తోంది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తోంది. తాజాగా 4 పరుగులు చేసిన ఉమేశ్ యాదవ్ తీక్షణ బౌలింగ్‌లో కాన్వేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ ఎనిమిది వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. టార్గెట్ 236.. 13 ఓవర్లలో కేకేఆర్ 119/4 13 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ నాలుగు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. రింకూ సింగ్ 20, జేసన్ రాయ్ 51 పరుగులతో ఆడుతున్నారు. 46 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన కేకేఆర్ 235 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 46 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. నితీశ్‌రానా 22, జేసన్ రాయ్ క్రీజులో ఉన్నారు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. అజింక్యా రహానే 29 బంతుల్లో 71 పరుగులతో విధ్వంసం సృష్టించగా.. శివమ్ దూబే 21 బంతుల్లో 50, డెవన్ కాన్వే 40 బంతుల్లో 56, గైక్వాడ్ 35 పరుగులు చేశారు. కెజ్రోలియా 2 వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తి, సుయాశ్ శర్మ చెరొక వికెట్ తీశారు. 19 ఓవర్లలో సీఎస్కే 218/3 19 ఓవర్లలో సీఎస్కే మూడు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అజింక్యా రహానే 71 పరుగులతో ఆడుతున్నాడు. రహానే, దూబే ఫిఫ్టీ.. సీఎస్కే స్కోరు 194/3 సిక్సర్‌తో శివమ్ దూబే 20 బంతుల్లో ఫీఫ్టీ మార్క్ అందుకోగా.. అజింక్యా రహానే 24 బంతుల్లో ఫిఫ్టీ మార్క్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం సీఎస్కే మూడు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. సిక్సర్ల వర్షం కురిపిస్తున్న దూబే.. భారీ స్కోరు దిశగా సీఎస్కే కేకేఆర్‌తో మ్యాచ్‌లో సీఎస్కే బ్యాటర్ శివమ్ దూబే సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. 13 బంతుల్లోనే 38 పరుగులతో దాటిగా ఆడుతున్న దూబే ఖాతాలో నాలుగు సిక్సర్లు ఉన్నాయి. రహానే 37 పరుగులతో అతనికి సహకరిస్తున్నాడు. ప్రస్తుతం సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. 13 ఓవర్లలో సీఎస్కే 123/2 13 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. రహానే 19, శివమ్ దూబే 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు కాన్వే 56 పరుగులు చేసి ఔటయ్యాడు. గైక్వాడ్ (35) ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన సీఎస్కే 35 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్ సుయాశ్ శర్మ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం సీఎస్కే వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది. 7 ఓవర్లలో సీఎస్కే 72/0 ఏడు ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. గైక్వాడ్ 35, కాన్వే 37 పరుగులు చేశాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కేకేఆర్ ఐపీఎల్ 16వ సీజన్ 33వమ్యాచ్లో కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఢీ కొంటున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. వరుస విజయాలతో జోరు మీదున్న ధోనీ సేన మరో విజయంపై కన్నేసింది. మరోవైపు కోల్‌కతా హ్యాట్రిక్ ఓటమి తప్పించుకోవాలని భావిస్తోంది. ఓపెనర్ డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, శివం దూబే సూపర్ ఫామ్‌లో ఉండడం చెన్నైకి కలిసొచ్చే అంశం. కోల్‌కతా విషయానికొస్తే.. వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రానా, రింకూ సింగ్‌పై ఎక్కువగా ఆధారపడుతోంది. ఆ జట్టుకు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, సుయాశ్ శర్మ రూపంలో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. దాంతో, ఇరుజట్ల మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుంది. -
ముందు తిన్నగా ఆడటం నేర్చుకో...తర్వాత ప్రయోగాలు చేద్దువు