
సాల్ట్ ఊచకోత.. లక్నోపై కేకేఆర్ విజయం
ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్ మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో కేకేఆర్ విజయం సాధించింది. 162 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్.. కేవలం రెండు వికెట్లు కోల్పోయి 15.4 ఓవర్లలో చేధించింది.
కేకేఆర్ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్ విధ్వంసం సృష్టించాడు. 47 బంతులు ఎదుర్కొన్న సాల్ట్.. 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 89 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 38 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. లక్నో బౌలర్లలో మొహ్షిన్ ఖాన్ ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు.
12 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 113/2
12 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ రెండు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. క్రీజులో సాల్ట్(57), శ్రేయస్ అయ్యర్(25) పరుగులతో ఉన్నారు.
8 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 80/2
8 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా 2 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్(11), ఫిల్ సాల్ట్(42) పరుగులతో ఉన్నారు.
కేకేఆర్ రెండో వికెట్ డౌన్..
44 పరుగుల వద్ద కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన రఘువంశీ.. మోహ్షిన్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు కోల్‌కతా స్కోర్: 58/2. క్రీజులో ఫిల్ సాల్ట్(30), శ్రేయస్ అయ్యర్(5) పరుగులతో ఉన్నారు.
కేకేఆర్ తొలి వికెట్ డౌన్.. నరైన్ ఔట్
22 పరుగుల వద్ద కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన సునీల్ నరైన్.. మోహ్షిన్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 3 ఓవర్లకు కోల్‌కతా స్కోర్: 42/1. క్రీజులో ఫిల్ సాల్ట్(19), రఘు వంశీ(7) పరుగులతో ఉన్నారు.
నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన లక్నో
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఆఖర్లో పూరన్ (45 నాటౌట్) బ్యాట్‌ను ఝులిపించడంతో లక్నో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. రాహుల్ (39), బదోని (29) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. డికాక్ (10), స్టోయినిస్ (10), దీపక్ హుడా (8) తక్కువ స్కోర్‌కే ఔటయ్యారు. స్టార్క్ 3 వికెట్లతో చెలరేగగా.. వైభవ్ అరోరా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, రసెల్ తలో వికెట్ తీశారు.
ఐదో వికెట్ కోల్పోయిన లక్నో
14.4వ ఓవర్: 111 పరుగుల వద్ద లక్నో ఐదో వికెట్ కోల్పోయింది. సునీల్ నరైన్ బౌలింగ్‌లో రఘువంశీకి క్యాచ్ ఇచ్చి ఆయుశ్ బదోని (29) ఔటయ్యాడు. పూరన్ (10), కృనాల్ పాండ్యా క్రీజ్‌లో ఉన్నారు.
డేంజరస్ స్టోయినిస్ ఔట్
11.4వ ఓవర్: 95 పరుగుల వద్ద లక్నో నాలుగో వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో వికెట్‌కీపర్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి స్టోయినిస్ (10) ఔటయ్యాడు.
మూడో వికెట్ కోల్పోయిన లక్నో.. రాహుల్ ఔట్
10.2వ ఓవర్: 78 పరుగుల వద్ద లక్నో మూడో వికెట్ కోల్పోయింది. రసెల్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన తర్వాతి బంతికే కేఎల్ రాహుల్ (39) ఔటయ్యాడు. రమన్‌దీప్‌కు క్యాచ్ ఇచ్చి రాహుల్ పెవిలియన్‌కు చేరాడు.బదోని (18), స్టోయినిస్ (8) క్రీజ్‌లో ఉన్నారు.
రమణ్‌దీప్ సూపర్ క్యాచ్.. హుడా ఔట్
4.4వ ఓవర్: 39 పరుగుల వద్ద మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో రమణ్‌దీప్ సింగ్ సూపర్ క్యాచ్ పట్టడంతో దీపక్ హుడా (8) పెవిలియన్‌కు చేరాడు. 5 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 39/2గా ఉంది. రాహుల్ (18), బదోని క్రీజ్‌లో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన లక్నో
1.5వ ఓవర్: 19 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్ కోల్పోయింది.వైభవ్ అరోరా బౌలింగ్‌లో సునీల్ నరైన్‌కు క్యాచ్ ఇచ్చి క్వింటన్ డికాక్ (10) ఔటయ్యాడు. రాహుల్‌కు (7) జతగా దీపక్ హుడా క్రీజ్‌లోకి వచ్చాడు.
ఐపీఎల్‌లో ఇవాళ (ఏప్రిల్ 14) రెండు ఆసక్తికర సమరాలు జరుగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో కేకేఆర్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుండగా.. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో సీఎస్‌కే, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుండగా.. రాత్రి మ్యాచ్ ముంబైలోని వాంఖడేలో జరుగనుంది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్..
లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న లక్నో.. 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో కేకేఆర్ రెండో స్థానంలో ఉంది. హ్యాట్రిక్ విజయాల అనంతరం కేకేఆర్ ఇటీవలే ఒక్క ఓటమిని ఎదుర్కొంది. కేకేఆర్ తమ చివరి మ్యాచ్‌లో సీఎస్‌కే చేతిలో ఓటమిపాలై సీజన్ తొలి ఓటమిని చవిచూసింది. హెడ్ టు హెడ్ ఫైట్‌ల విషయానికొస్తే.. ఈ ఇరు జట్లు ఇప్పటివరకు 3 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. మూడు సందర్భాల్లో లక్నోనే విజయం వరించింది.
తుది జట్లు..
లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్‌కీపర్), దీపక్ హుడా, ఆయుష్ బదోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహిసిన్ ఖాన్, షమార్ జోసఫ్, యశ్ ఠాకూర్
లక్నో సూపర్ జెయింట్స్ ఇంపాక్ట్ సబ్స్: అర్షద్ ఖాన్, ప్రేరక్ మన్కడ్, ఎం సిద్ధార్థ్, అమిత్ మిశ్రా, కె గౌతమ్
కోల్‌కతా నైట్ రైడర్స్: ఫిలిప్ సాల్ట్(వికెట్‌కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి
కోల్‌కతా నైట్ రైడర్స్ సబ్‌లు: సుయాష్ శర్మ, అనుకుల్ రాయ్, మనీష్ పాండే, రహ్మానుల్లా గుర్బాజ్, రింకూ సింగ్