IPL 2023: SRH Vs KKR Match Live Updates And Highlights - Sakshi
Sakshi News home page

IPL 2023 SRH Vs KKR : ఎస్‌ఆర్‌హెచ్‌ వర్సెస్‌ కేకేఆర్‌ మ్యాచ్‌ అప్‌డేట్స్‌

Published Thu, May 4 2023 7:15 PM | Last Updated on Thu, May 4 2023 11:00 PM

IPL 2023: SRH Vs KKR Match Live Updates And Highlights - Sakshi

IPL 2023: SRH Vs KKR Match Live Updates:

మార్క్రమ్‌(41)ఔట్‌.. ఆరో వికెట్‌ డౌన్‌
41 పరుగులు చేసిన మార్క్రమ్‌ వైభవ్‌ అరోరా బౌలింగ్‌లో రింకూ సింగ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్‌ 145 పరుగుల వద్ద ఆరో వికెట్‌ కోల్పోయింది.

క్లాసెన్‌(36) ఔట్‌.. ఎస్‌ఆర్‌హెచ్‌ 134/5
హెన్రిచ్‌ క్లాసెన్‌(36) రూపంలో ఎస్‌ఆర్‌హెచ్‌ ఐదో వికెట్‌ నష్టపోయింది. మార్క్రమ్‌తో కలిసి ఐదో వికెట్‌కు 50కి పైగా పరుగులు జోడించిన క్లాసెన్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి రసెల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ ఐదు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. మార్క్రమ్‌ 39, అబ్దుల్‌ సమద్‌ ఐదు పరుగులతో ఆడుతున్నారు.

బ్రూక్‌ డకౌట్‌.. నాలుగు వికెట్లు కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌
172 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ కష్టాల్లో పడింది. హ్యారీ బ్రూక్‌ డకౌట్‌గా వెనుదిరగడంతో నాలుగో వికెట్‌ నష్టపోయింది. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ 4 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. మార్క్రమ్‌ 2, క్లాసెన్‌ ఐదు పరుగులతో ఆడుతున్నారు.

టార్గెట్‌ 172.. 38 పరుగులకు రెండు వికెట్లు డౌన్‌
172 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ 5 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది. రాహుల్‌ త్రిపాఠి 6, మార్క్రమ్‌ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు అభిషేక్‌ శర్మ 9, మయాంక్‌ అగర్వాల్‌ 18 పరుగులు చేసి ఔటయ్యారు.


Photo Credit : IPL Website

ఎస్‌ఆర్‌హెచ్‌ టార్గెట్‌ 172
ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. రింకూ సింగ్‌ 46 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్‌ నితీశ్‌రానా 42 పరుగులు చేశాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో మార్కో జాన్సన్‌, టి. నటరాజన్‌లు చెరో రెండె వికెట్లు తీయగా.. భువనేశ్వర్‌, కార్తిక్‌ త్యాగి, మార్క్రమ్‌, మయాంక్‌ మార్కండేలు తలా ఒక వికెట్‌ తీశారు.


Photo Credit : IPL Website

16 ఓవరల్లో కేకేఆర్‌ 137/6
16 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్‌ ఆరు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. రింకూ సింగ్‌ 29, శార్దూల్‌ ఠాకూర్‌ ఆరు పరుగులతో ఆడుతున్నారు.


Photo Credit : IPL Website

నాలుగో వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌
42 పరుగులు చేసిన నితీశ్‌ రానా మార్క్రమ్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌కు వెనుదిరిగాడు. అతని బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి కాట్‌ అండ్‌ బౌల్డ్‌ అయ్యాడు. ప్రస్తుతం కేకేఆర్‌ 12 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. రింకూ సింగ్‌ 22, రసెల్‌ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు.


Photo Credit : IPL Website

9 ఓవర్లలో కేకేఆర్‌ స్కోరు 73/3
9 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్‌ మూడు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. నితీశ్‌ రానా 24, రింకూ సింగ్‌ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు.


Photo Credit : IPL Website

35 పరుగులకే మూడు వికెట్లు డౌన్‌
35 పరుగుల వద్ద కేకేఆర్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 20 పరుగులు చేసిన జేసన్‌ రాయ్‌ కార్తిక్‌ త్యాగి బౌలింగ్‌లో మయాంక్‌ అగర్వాల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.


Photo Credit : IPL Website

16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన కేకేఆర్‌
ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో కేకేఆర్‌కు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మార్కో జాన్సన్‌ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టడం విశేషం.


​​​​​​​​​​​​​​Photo Credit : IPL Website

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కేకేఆర్‌
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో హైదరాబాద్‌ వేదికగా 47వ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌, కేకేఆర్‌ తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన కేకేఆర్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్‌), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్‌ కీపర్‌), హ్యారీ బ్రూక్, అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, కార్తీక్ త్యాగి, టి నటరాజన్

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్‌ కీపర్‌), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్‌), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి

గత మ్యాచ్‌లో విజయంతో ఎస్‌ఆర్‌హెచ్‌ వరుస ఓటములకు బ్రేక్‌ వేసింది. ఇక కేకేఆర్‌ మాత్రం ఒక మ్యాచ్‌లో గెలుపు.. మరో మ్యాచ్‌లో ఓటమి అన్నట్లుగా సాగుతుంది. ఈ సీజన్‌లో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ విజయం సాధించింది. హ్యారీ బ్రూక్‌ సెంచరీ సాధించింది ఈ మ్యాచ్‌లోనే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement