కేకేఆర్‌తో జరిగిన ఉత్కంఠపోరులో లక్నో సూపర్‌జెయింట్స్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. 177 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.
రింకూ సింగ్ 33 బంతుల్లో 67 పరుగులు నాటౌట్ మరోసారి సంచలన ఇన్నింగ్స్‌తో మెరిసినప్పటికి కేకేఆర్‌ను గెలిపించలేకపోయాడు. జేసన్ రాయ్ 45 పరుగులు చేశాడు. యష్ ఠాకూర్, రవి బిష్ణోయి చెరో రెండు వికెట్లు తీయగా.. కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యాలు చెరొక వికెట్ తీశారు.
టార్గెట్ 177..120 పరుగుల వద్ద ఐదో వికెట్ డౌన్
లక్నోతో మ్యాచ్‌లో కేకేఆర్ 120 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. ఏడు పరుగులు చేసిన రసెల్ రవి బిష్ణోయి బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
11 ఓవర్లలో కేకేఆర్ 88/3
11 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. గుర్బాజ్ 6, రింకూ సింగ్ 3 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 8 పరుగులు చేసిన నితీశ్ రానా రవి బిష్ణోయి బౌలింగ్‌లో వెనుదిరగ్గా.. జేసన్‌రాయ్(45 పరుగులు) కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
6 ఓవర్లలో కేకేఆర్ 61/1
177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఆరు ఓవర్లలో వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. 24 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్ కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. జేసన్‌రాయ్ 36 పరుగులతో ఆడుతున్నాడు.
రాణించిన పూరన్.. కేకేఆర్ టార్గెట్ 177
కేకేఆర్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఒక దశలో 73 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో నికోలస్ పూరన్(30 బంతుల్లో 58 పరుగులు), ఆయుష్ బదోని(21 బంతుల్లో 25 పరుగులు) ఆరో వికెట్‌కు 74 పరుగులు జోడించారు. కేకేఆర్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరాలు తలా రెండు వికెట్లు తీయా.. హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి చెరొక వికెట్ తీశారు.
17 ఓవర్లలో లక్నో 133/5
17 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌జెయింట్స్ ఐదు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 44, ఆయుష్ బదోని 14 పరుగులతో ఆడుతున్నారు.
73 పరుగులకే ఐదు వికెట్లు.. కష్టాల్లో లక్నో
కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ తడబడుతోంది. 73 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 28 పరుగులు చేసిన డికాక్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో రస్సెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
మూడో వికెట్ కోల్పోయిన లక్నో.. 8 ఓవర్లలో 58/3
8 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌జెయింట్స్ మూడు వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ 24, కృనాల్ పాండ్యా క్రీజులో ఉన్నారు.
ఆరు ఓవర్లలో లక్నో 54/1
ఆరు ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. ప్రేరక్ మన్కడ్ 26, క్వింటన్ డికాక్ 20 పరుగులతో ఆడుతున్నారు.
4 ఓవర్లలో లక్నో సూపర్‌జెయింట్స్ 27/1
4 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌జెయింట్స్ వికెట్ నష్టానికి 27 పరుగుఉల చేసింది. క్వింటన్ డికాక్ 19, ప్రేరక్ మన్కడ్ 4 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు మూడు పరుగులు చేసిన కరణ్ శర్మ హర్షిత్ రానా బౌలింగ్‌లో క్యాచ్‌ఔట్‌గా వెనుదిరిగాడు,
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్
ఐపీఎల్ 16వ సీజన్‌లో శనివారం డబుల్ హెడర్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా 68వ మ్యాచ్‌లో కేకేఆర్, లక్నో సూపర్‌జెయింట్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది.
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), కరణ్ శర్మ, ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా(కెప్టెన్), ఆయుష్ బదోని, కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి
ప్లేఆఫ్ చేరే అవకాశాలు కేకేఆర్‌కు తక్కువగా ఉన్నప్పటికి లక్నోను ఓడిస్తే రేసులో ఉంటుంది.. ఒకవేళ లక్నో గెలిస్తే మాత్రం 17 పాయింట్లతో ప్లేఆఫ్‌కు వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌ను గెలిచిన సీఎస్‌కే రెండో జట్టుగా ప్లేఆఫ్‌కు క్వాలిఫై అయింది.
Comments
Please login to add a commentAdd a comment