ఐపీఎల్‌లో ఇవాళ (ఏప్రిల్ 14) రెండు ఆసక్తికర సమరాలు జరుగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో కేకేఆర్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుండగా.. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో సీఎస్‌కే, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుండగా.. రాత్రి మ్యాచ్ ముంబైలోని వాంఖడేలో జరుగనుంది.
మధ్యాహ్నం మ్యాచ్ విషయానికొస్తే.. హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న లక్నో.. పటిష్టమైన కేకేఆర్‌ను వారి సొంత మైదానంలో ఢీకొట్టబోతుంది. ప్రస్తుతం లక్నో 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో కేకేఆర్ రెండో స్థానంలో ఉంది. హ్యాట్రిక్ విజయాల అనంతరం కేకేఆర్ ఇటీవలే ఓ ఓటమిని ఎదుర్కొంది. కేకేఆర్ తమ చివరి మ్యాచ్‌లో సీఎస్‌కే చేతిలో పరాజయంపాలైంది. హెడ్ టు హెడ్ ఫైట్‌ల విషయానికొస్తే.. ఐపీఎల్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు 3 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. మూడు సందర్భాల్లో లక్నోనే విజయం వరించింది.
ముంబై, సీఎస్‌కే మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌ను అభిమానులు క్రికెట్ ఎల్ క్లాసికోగా (సమవుజ్జీల సమరం) పిలుస్తారు. ప్రస్తుత సీజన్‌లో ముంబై ఇండియన్స్ రెండు వరుస విజయాలతో ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుండగా.. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రెడీ తమ జైత్రయాత్రను స్టార్ట్ చేసింది. 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో సీఎస్‌కే పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. ముంబై 5 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతుంది. హెడ్ టు హెడ్ ఫైట్స్ విషయానికొస్తే.. ఇరు జట్లు మధ్య ఇప్పటివరకు 36 మ్యాచ్‌లు జరగగా ముంబై 20, సీఎస్‌కే 16 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి.
Comments
Please login to add a commentAdd a comment