
టీమిండియా క్రికెటర్, ఐపీఎల్-2023లో కేకేఆర్ ఫ్రాంచైజీ కెప్టెన్ (తాత్కాలిక), దేశవాలీ క్రికెట్‌లో ఢిల్లీ క్రికెట్ జట్టు కీలక సభ్యుడైన 29 ఏళ్ల నితీశ్ రాణా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన సొంత రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అయిన ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ అసోసియేషన్‌తో (DDCA) దశాబ్దకాలానికి పైగా ఉన్న అనుబంధాన్ని తెంచుకున్నాడు. తదుపరి దేశవాలీ సీజన్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (UPCA)తో జతకట్టేందుకు నిర్ణయించుకున్నాడు.
ఈ మేరకు అతనికి ఇవాళ (ఆగస్ట్ 21) DDCA నుంచి NOC కూడా లభించింది. దీంతో రాణాకు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌తో అధికారికంగా అనుబంధం తెగిపోయినట్లైంది. త్వరలో ప్రారంభంకానున్న UPT20 Leagueతో రాణా యూపీ క్రికెట్ అసోసియేషన్‌తో జతకట్టనున్నాడు. ఈ లీగ్ ఇనాగురల్ సీజన్‌లో రాణా నోయిడా సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు.
Onto the next chapter. https://t.co/Zz1VyZKysA
— Nitish Rana (@NitishRana_27) August 20, 2023
టీమిండియా తరఫున ఓ వన్డే, 2 టీ20లు ఆడిన రాణా.. 2011లో ఢిల్లీ తరఫున అరంగేట్రం చేసి 40కి పైగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 50కి పైగా లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 100కి పైగా టీ20లు ఆడాడు. రాణా తన దేశవాలీ కెరీర్‌లో మొత్తంగా 9 సెంచరీలు, 46 అర్ధసెంచరీలు సాధించాడు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌తో బంధం తెంచుకున్న తర్వాత రాణా ఉద్వేగంతో ఓ ట్వీట్ చేశాడు.
ఆన్ టు ద నెక్స్ట్ చాప్టర్ అని క్యాప్షన్ జోడిండి DDCAతో ఉండిన అనుబంధాన్ని నెమరువేసుకున్నాడు. ఈ ట్వీట్‌లో అతను DDCAలో తనకు సహకరించిన ప్లేయర్స్, నాన్ ప్లేయర్స్ అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. కాగా, రాణా గత ఐపీఎల్ సీజన్‌లో శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీలో కేకేఆర్‌కు సారధిగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment