Photo: IPL Twitter
ఐపీఎల్ చరిత్రలో రాజస్తాన్ రాయల్స్ అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. గురువారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 150 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 13.1 ఓవర్లలోనే చేధించింది. 41 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను అందుకుంది. ఈ క్రమంలో 150 అంతకన్నా ఎక్కువ టార్గెట్‌ను అత్యంత వేగంగా చేధించిన రెండో జట్టుగా రాజస్తాన్ రాయల్స్ నిలిచింది.
తొలి స్థానంలో డెక్కన్ చార్జర్స్ ఉంది. 2008లో ముంబై ఇండియన్స్‌పై 48 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను అందుకుంది. ఇక 2008లోనే ముంబై ఇండియన్స్ సీఎస్‌కేపై 37 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకొని మూడో స్థానంలో నిలిచింది.
ఈ మూడు సందర్భాల్లో రెండుసార్లు సెంచరీలు నమోదు కాగా.. ఒకసారి అర్థసెంచరీ నమోదు కాగా.. ముగ్గురు బ్యాటర్లు నాటౌట్‌గా నిలవడం విశేషం. 2008లో డెక్కన్ చార్జర్స్ ఓపెనర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ 47 బంతుల్లోనే 109 నాటౌట్, 2008లోనే ముంబై ఇండియన్స్ ఓపెనర్ సనత్ జయసూర్య 48 బంతుల్లో 114 పరుగులు నాటౌట్.. తాజాగా యశస్వి జైశ్వాల్ 47 బంతుల్లో 97 నాటౌట్ వీరోచిత ఇన్నింగ్స్‌లు ఆడారు.
What an end to the Yashasvi Jaiswal show at Eden Gardens 😍#IPLonJioCinema #KKRvRR #IPL2023 #TATAIPL #HallaBol | @rajasthanroyals @ybj_19 pic.twitter.com/3tQheL4Qm8
— JioCinema (@JioCinema) May 11, 2023
చదవండి: యశస్వి జైశ్వాల్ చరిత్ర.. ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ
Comments
Please login to add a commentAdd a comment