Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ యంగ్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తన సూపర్ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. 21 ఏళ్ల వయసులో స్టన్నింగ్ ప్రదర్శనతో అదరగొడుతున్న జైశ్వాల్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో అర్థసెంచరీతో రాణించిన యశస్వి.. సీజన్‌లో 600 ప్లస్ పరుగులు మార్క్‌ను సాధించాడు.
ఒక సీజన్‌లో 600 పరుగుల మార్క్ అందుకున్న తొలి అన్‌క్యాప్‌డ్(టీమిండియాకు ప్రాతినిధ్యం వహించకుండా) ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. భారత్ తరపున యశస్వి ఒక్కడే ఈ ఘనత సాధించాడు. సీజన్‌లో 14 మ్యాచ్‌లాడిన జైశ్వాల్ 625 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ సహా ఐదు అర్థసెంచరీలు ఉన్నాయి.
ఇక ఐపీఎల్‌లో ఒక సీజన్‌లో 600ప్లస్ పరుగులు నమోదు చేసిన రెండో పిన్న వయస్కుడిగా జైశ్వాల్(21 ఏళ్ల 142 రోజులుల) నిలిచాడు. తొలి స్థానంలో రిషబ్ పంత్(20 ఏళ్ల 226 రోజులు), విరాట్ కోహ్లి(24 ఏళ్ల 193 రోజులు) మూడో స్థానంలో ఉండగా.. రుతురాజ్ గైక్వాడ్(24 ఏళ్ల 251 రోజులు) నాలుగో స్థానం, షాన్ మార్ష్(24 ఏళ్ల 282 రోజులు) ఐదో స్థానంలో ఉన్నాడు.
Another 50 for Jaiswal who's now the all-time #TATAIPL uncapped run-scorer!#PBKSvRR #IPLonJioCinema #IPL2023 #EveryGameMatters | @rajasthanroyals @ybj_19 pic.twitter.com/oq4NLnDdkI
— JioCinema (@JioCinema) May 19, 2023
చదవండి: #Duckouts: ఏడాదిలో ఎంత మార్పు.. జాస్ బట్లర్ చెత్త రికార్డు
Comments
Please login to add a commentAdd a comment