IPL 2024: పాపం కావ్య మారన్‌.. క్షణాల్లో ముఖం మారిపోయింది..! | IPL 2024 KKR Vs SRH: Kavya Maran Facial Expression Changed After Klaasen Got Out In Last Over, Video Goes Viral - Sakshi
Sakshi News home page

IPL 2024 KKR Vs SRH: పాపం కావ్య మారన్‌.. క్షణాల్లో ముఖం ఎలా మారిపోయిందో చూడండి..!

Published Sun, Mar 24 2024 3:38 PM | Last Updated on Sun, Mar 24 2024 5:24 PM

IPL 2024 KKR VS SRH: SRH Owner Kavya Maran Facial Expression Changed, As Klaasen Got Out In Last Over - Sakshi

ఐపీఎల్‌ 2024లో భాగంగా కోల్‌కతా వేదికగా కేకేఆర్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌ చివరి బంతి వరకు హోరాహోరీగా సాగింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌.. ఫిలిప్‌ సాల్ట్‌ (40 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రసెల్‌ (25 బంతుల్లో 64 నాటౌట్‌; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగా.. ఛేదనలో హెన్రిచ్‌ క్లాసెన్‌ (29 బంతుల్లో 63; 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించినప్పటికీ సన్‌రైజర్స్‌ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. 

చివరి ఓవర్‌లో 13 పరుగులు అవసరం కాగా.. హర్షిత్‌ రాణా (4-0-33-3) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి సన్‌రైజర్స్‌ గెలుపును అడ్డుకున్నాడు. అప్పటికే శివాలెత్తిపోయిన క్లాసెన్‌ వికెట్‌తో పాటు షాబాజ్‌ అహ్మద్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆఖరి ఓవర్‌ తొలి బంతికే క్లాసెన్‌ సిక్సర్‌ బాదినప్పటికీ.. సన్‌రైజర్స్‌ మిగిలిన ఐదు బంతుల్లో 7 పరుగులు చేయలేక ఓటమిపాలైంది. క్లాసెన్‌ సిక్సర్‌ బాదాక (19.1వ ఓవర్‌) వీఐపీ స్టాండ్స్‌లో ఉన్న సన్‌రైజర్స్‌ యజమాని కావ్య మారన్‌ ఆనందంతో గంతులేసింది.

అయితే ఈ సంతోషం ఆమెకు ఎంతో సేపు నిలబడలేదు. 20వ ఓవర్‌ ఐదో బంతికి క్లాసెన్‌ ఔట్‌ కావడంతో కావ్య ముఖం​ ఒక్కసారిగా మారిపోయింది. అప్పటిదాకా నవ్వుతూ జాలీగా కనిపించిన ఆమె ఒక్కసారిగా ఢీలా పడిపోయింది. సుయాష్‌ శర్మ అద్భుతమైన క్యాచ్‌ (క్లాసెన్‌) పట్టి కావ్య ముఖంలో చిరునవ్వును మాయం చేశాడు. నాలుగు బంతుల వ్యవధిలో కావ్య ముఖంలో వచ్చిన మార్పులకు సంబంధించిన ఫోటోలను ఓ నెటిజన్‌ నెట్టింట షేర్‌ చేయగా అవి వైరలవుతున్నాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement