ఐపీఎల్ 2024 సీజన్‌లో ఇవాళ (ఏప్రిల్ 16) మరో బిగ్ ఫైట్ జరుగనుంది. పటిష్టమైన, పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న రాజస్థాన్, కేకేఆర్ జట్లు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కత్తులు దూసుకోనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటర్లకు అనుకూలించనుండటంతో నేటి మ్యాచ్‌లో బ్యాటర్లు చెలరేగే అవకాశం ఉందని అంచనా.
ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లో ఐదింట గెలిచిన రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఐదింట నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన కేకేఆర్ రెండో స్థానంలో ఉంది.
హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్లు గతంలో 27 సార్లు ఎదురెదురుపడగా కేకేఆర్ 14, రాయల్స్ 13 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ఈ రెండు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది. ఈడెన్ గార్డెన్స్ విషయానికొస్తే.. ఈ మైదానంలో రాయల్స్‌పై కేకేఆర్‌దే పైచేయిగా ఉంది. ఇక్కడ ఇరు జట్లు 9 మ్యాచ్‌ల్లో తలపడగా.. కేకేఆర్ 6, రాయల్స్ 3 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి.
ప్రస్తుత సీజన్‌లో ఇరు జట్ల బలాబలాలపై లుక్కేస్తే.. రెండు జట్లు అన్ని విభాగాల్లో సమతూకంగా కనిపిస్తున్నాయి. ఇరు జట్లలో ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని అంచనా వేయడానికి వీల్లేదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అంత పర్ఫెక్ట్‌గా ఉన్నాయి ఇరు జట్లు.
కేకేఆర్ బ్యాటింగ్‌లో ఫిలిప్ సాల్ట్, సునీల్ నరైన్, రఘువంశీ, శ్రేయస్ అయ్యర్, రింకూ సింగ్, రసెల్ లాంటి విధ్వంసకర వీరులు ఉండగా.. రాయల్స్ బ్యాటింగ్ లైనప్‌లో యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, హెట్‌మైర్, రోవ్‌మన్ పావెల్ లాంటి మెరుపు వీరులు ఉన్నారు.
బౌలింగ్ విభాగం విషయానికొస్తే.. కేకేఆర్‌లో స్టార్క్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా లాంటి స్టార్ పేసర్లు ఉండగా.. రాయల్స్‌లో ట్రెంట్ బౌల్ట్, చహల్, అశ్విన్ లాంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమతూకంగా ఉండటంతో నేటి మ్యాచ్‌లో పైచేయి ఎవరిదని చెప్పడం చాలా కష్టం.
Comments
Please login to add a commentAdd a comment