Nitish Rana Wife Saachi Marwah Car Chased-Hit by Two Youths in Delhi - Sakshi
Sakshi News home page

#NitishRana: నితీశ్‌ రానా భార్యకు చేదు అనుభవం.. కారును వెంబడించి

Published Sat, May 6 2023 7:34 PM | Last Updated on Sat, May 6 2023 8:01 PM

Nitish Rana Wife Saachi Marwah Car Chased-Hit By Two Youths In Delhi - Sakshi

కేకేఆర్‌ కెప్టెన్‌ నితీశ్ రానా భార్య సాచీ మార్వాకు చేదు అనుభవం ఎదురైంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇద్దరు యువకులు బైక్‌పై ఆమె కారును వెంబడించడం కలకలం రేపింది. కారును వెంబడించడమే గాక ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడంతో సాచీ మార్వా వారి ప్రవర్తనతో ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. తన కారును వెంబడిస్తున్న యువకులను ఫోటో తీసి వీడియో రూపంలో బయటపెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ విషయాన్ని పోలీసులకు చెబితే.. అంతగా పట్టించుకోలేదని.. విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని పేర్కొనడం ఆశ్చర్యం కలిగించిందని సాచీ మార్వా తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. యువకుల ద్వారా తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె షేర్‌ చేసుకుంది.

''ఢిల్లీలో అది ఒక సాధారణ రోజు. నా పనులు పూర్తి చేసుకొని కారులో ఇంటికి వస్తున్నాను. వీళ్లు (ఫొటోలో ఉన్న యువకులు) యాదృచ్ఛికంగా నా కారును ఢీకొట్టడం మొదలుపెట్టారు.! కారణం లేకుండానే వెంబడించారు. నేను ఈ విషయంపై ఫోన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాను. దీంతో వారు నాకు 'ఇప్పుడు మీరు సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. ఇక దానిని వదిలేయండి! వచ్చేసారి ఆ బైక్ నెంబర్ నోట్ చేసుకోండి' అని అన్నారు. సరే కెప్టెన్. వచ్చేసారి వారి ఫోన్ నంబర్లు తప్పకుండా  తీసుకుంటానని చెప్పా'' అని పేర్కొంది.

చదవండి: రోహిత్‌ డకౌట్‌ వెనుక ధోని మాస్టర్‌మైండ్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement