ఐపీఎల్-2025 సీజన్ కోసం ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాల సమర్పణకు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. అక్టోబర్ 31లోగా ఫ్రాంచైజీలన్నీ తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల వివరాలను సమర్పించాలి. అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటికే తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్లపై ఓ క్లారిటీ కలిగి ఉన్నాయి.
ఒక్కో ఫ్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. ఇందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు అవకాశం ఉంటుంది. రిటైన్ చేసుకునే క్యాప్డ్ ప్లేయర్లకు ఛాయిస్ ప్రకారం వరుసగా 18, 14, 11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. రిటైన్ చేసుకునే అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కు 4 కోట్లు పారితోషికం చెల్లించాల్సి ఉంటుంది. ఐపీఎల్-2025 వేలం నవంబర్ 25 లేదా 26 తేదీల్లో రియాద్‌లో జరగవచ్చు.
శ్రేయస్‌తో కేకేఆర్ కటీఫ్..?
కేకేఆర్ విషయానికొస్తే.. ఈ ఫ్రాంచైజీ కూడా తమ రిటెన్షన్ జాబితాను సిద్దం చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే కేకేఆర్ ఈసారి కెప్టెన్ పేరు లేకుండానే ముందుకు సాగనున్నట్లు సమాచారం. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో కేకేఆర్ గత సీజన్ టైటిల్ గెలిచినప్పటికీ.. ఈసారి అతన్ని రిటైన్ చేసుకునేందుకు ఫ్రాంచైజీ యాజమాన్యం ఆసక్తి కనబర్చడం లేదని తెలుస్తుంది. రిటెన్షన్ జాబితా సమర్పణకు మరికొద్ది గంటలు సమయమే ఉన్నా ఇప్పటికీ ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్ శ్రేయస్‌ను సంప్రదించలేదట. దీన్ని బట్టి చూస్తే కేకేఆర్ శ్రేయస్‌కు కటీఫ్ చెప్పడం ఖాయమని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే, శ్రేయస్ కోసం సొంత ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చనప్పటికీ.. మిగతా ఫ్రాంచైజీలు ఎగబడుతున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ శ్రేయస్ వేలానికి వస్తే ఇతన్ని దక్కించుకోవడం కోసం మూడు, నాలుగు ఫ్రాంచైజీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయట. కెప్టెన్‌గా శ్రేయస్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉండటంతో ఇతన్ని కెప్టెన్‌గా చేసేందుకు పలు ఫ్రాంచైజీలు ప్రణాళికలు సిద్దం చేసుకున్నాయని సమాచారం.
కేకేఆర్ రిటైన్ చేసుకునే అవకాశం ఉన్న ఆటగాళ్లు..
సునీల్ నరైన్
ఆండ్రీ రసెల్
ఫిలిప్ సాల్ట్
రింకూ సింగ్
Comments
Please login to add a commentAdd a comment