Sanju Samson: టార్గెట్‌ చేధిస్తాం అనుకున్నా.. ఓడిపోవడం బాధగా ఉంది | Sanju Samson Says Its Giving Pain After Match Defeat With Delhi Capitals | Sakshi
Sakshi News home page

Sanju Samson: టార్గెట్‌ చేధిస్తాం అనుకున్నా.. ఓడిపోవడం బాధగా ఉంది

Published Sat, Sep 25 2021 9:32 PM | Last Updated on Sat, Sep 25 2021 9:36 PM

Sanju Samson Says Its Giving Pain After Match Defeat With Delhi Capitals - Sakshi

Courtesy: IPL Twitter

Sanju Samson Comments Lost Match To Delhi Capitals.. ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. 155 పరుగులల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ 121 పరుగులకే పరిమితమై 33 పరుగులతో పరాజయం పాలైంది. మ్యాచ్‌ ఓటమి అనంతరం రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ మాట్లాడాడు.

''మ్యాచ్‌ ఓటమి బాధ కలిగించింది. మాకున్న బ్యాటింగ్‌ లైనఫ్‌తో 155 పరుగుల లక్ష్యాన్ని చేధిస్తామనే అనుకున్నా. కానీ ఆరంభంలోనే వెనువెంటనే వికెట్లు పడడంతో ఒత్తిడి మీద పడింది. పిచ్‌ కూడా స్లోగా లేదు.. కాస్త కుదురుకొని చేతిలో వికెట్లు ఉంటే మ్యాచ్‌ను కచ్చితంగా గెలిచేవాళ్లం. నా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా. కానీ నేను ఒక్కడినే ఆడితే సరిపోదు.. జట్టుగా కలిసి ఆడితేనే సమిష్టి విజయాన్ని అందుకుంటాం. రానున్న ప్రతీ మ్యాచ్‌ మాకు కీలకమే. తర్వాతి మ్యాచ్‌కు బాగా సన్నద్దమవుతాం. జట్టులో మార్పులు అవసరం ఉన్నప్పటికీ జట్టులో ఎమోషన్‌ కాస్త ఎక్కువగా ఉంది. దీనిపై రేపు తుది నిర్ణయం తీసుకుంటాం'' అని చెప్పుకొచ్చాడు.  ఇక రాజస్తాన్‌ రాయల్స్‌ తన తర్వాతి మ్యాచ్‌ను సెప్టెంబర్‌ 27న ఎస్‌ఆర్‌హెచ్‌తో తలపడనుంది.

చదవండి: రనౌట్‌ అవకాశం.. హైడ్రామా.. బతికిపోయిన అశ్విన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement