చెన్నై సూపర్ కింగ్స్ కు రాజస్థాన్ రాయల్స్ షాక్!
Published Fri, Oct 4 2013 11:42 PM | Last Updated on Fri, Sep 1 2017 11:20 PM
చాంఫియన్స్ లీగ్ ట్వెంటీ20 క్రికెట్ టోర్నిలో భాగంగా జైపూర్ లోని సవాయి మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన తొలి సెమి ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ 14 పరుగుల తేడాతో విజయం సాధించి.. ఫైనల్లోకి దూసుకెళ్లింది.
160 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 145 పరుగులకే పరిమితం కావడంతో 14 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చివర్లో అశ్విన్, మోరిస్ లు మెరుపులు మెరిపించి జట్టు విజయావకాశాలపై ఆశలు రేపారు. అయితే 28 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్లతో 46 పరుగులు చేసిన అశ్విన్.. ఫాల్కనర్ బౌలింగ్ లో అవుట్ కావడంతో చెన్నై ఓటమి తప్పలేదు. రైనా 29, మోరిస్ 26, విజయ్ 14 పరుగులు తప్ప మిగితా వారెవరూ రెండెకెల స్కోరును సాధించకపోవడంతో పరుగుల వేటలో చతికిలపడింది. రాజస్థాన్ బౌలర్ థాంబే మూడు వికెట్లు పడగొట్టారు.
తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. రహానే రాణించి 70, వాట్సన్ 32 పరుగులు చేయడతో రాజస్థాన్ జట్టు 159 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో బ్రావో 3, హోల్డర్, మోరిస్ రెండేసి వికెట్లు, శర్మ కు ఒక వికెట్ లభించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా థాంబేను ఎంపిక చేశారు.
Advertisement
Advertisement