Champions League Twenty20
-
చాంపియన్స్ లీగ్ టి20 రద్దు
ముంబై: చాంపియన్స్ లీగ్ టి20 ను బీసీసీఐ రద్దు చేసింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ఈ టోర్నీని నిర్వహించడం కష్టమని బోర్డు నిర్ణయించిన నేపథ్యంలో దీన్ని రద్దు చేసింది. సీఎల్ టి20 స్థానంలో ఐపీఎల్‌లోని టాప్-4 జట్లతో మినీ ఐపీఎల్‌లాంటిది నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. బేబీ ఐపీఎల్ పేరుతో టోర్నీ నిర్వహించాలన్న ప్రతిపాదన కూడా ఉన్నట్టు తెలుస్తోంది. -
చాంపియన్స్ లీగ్ ఫైనల్: బ్యాటింగ్ దిగిన కోల్‌కతా
బెంగళూరు: చాంపియన్స్ లీగ్ టీ-20 ఫైనల్ సమరం ఆరంభమైంది. శనివారం రాత్రి జరుగుతున్న ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్లు ఊతప్ప, గంభీర్ బ్యాటింగ్‌కు దిగారు. ఆరంభం నుంచే ఈ జోడీ దూకుడు పెంచింది. స్టార్ ఆటగాళ్లతో కూడిన ఇరు జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. -
చాంపియన్స్ లీగ్-20: కోల్‌కతా ఘనవిజయం
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అభిమానులను మరోసారి చాంపియన్స్ లీగ్ కనువిందు చేసింది. సోమవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో డాల్ఫిన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 36 పరుగులతో ఘన విజయం సాధించింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన డాల్ఫిన్స్ పూర్తి ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 151 పరుగులే చేయగలిగింది. కోల్‌కతా బౌలర్లు నరైన్ మూడు, యూసుఫ్ పఠాన్ రెండు వికెట్లు తీశారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన కోల్‌కతా.. రాబిన్ ఊతప్ప (55 బంతుల్లో 85), మనీష్ పాండే (47 బంతుల్లో 76) అజేయ మెరుపు హాఫ్ సెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. డాల్ఫిన్స్ బౌలర్లు అలెగ్జాండర్, ఫ్రిలింక్ చెరో వికెట్ తీశారు. -
చాంపియన్స్ లీగ్-20: ఊతప్ప ఉతుకుడు.. మనీష్ మెరుపులు
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అభిమానులను మరోసారి చాంపియన్స్ లీగ్ కనువిందు చేసింది. సోమవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో డాల్ఫిన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన కోల్‌కతా.. రాబిన్ ఊతప్ప (55 బంతుల్లో 85), మనీష్ పాండే (47 బంతుల్లో 76) అజేయ మెరుపు హాఫ్ సెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. డాల్ఫిన్స్ బౌలర్లు అలెగ్జాండర్, ఫ్రిలింక్ చెరో వికెట్ తీశారు. -
చాంపియన్స్ లీగ్-20: పంజాబ్ 7 వికెట్లతో విజయం
మొహాలీ: చాంపియన్స్ లీగ్ టీ-20లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ లెవెన్ పంజాబ్ ఏడు వికెట్లతో కేప్ కోబ్రాస్‌పై ఘనవిజయం సాధించింది. 136 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్ మరో 11 బంతులు మిగిలుండగా మూడు వికెట్ల నష్టానికి విజయతీరాలకు చేరింది. వృద్ధిమాన్ సాహా (42 నాటౌట్) టాప్ స్కోరర్. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన కేప్ కోబ్రాస్ 18.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది. లెవీ 42, ఆమ్లా 40 పరుగులు చేశారు. అనురీత్ సింగ్, అక్షర్ పటేల్ మూడేసి వికెట్లు పడగొట్టారు. -
చాంపియన్స్ లీగ్ టీ-20: ధోనీ, జడేజా దూకుడు.. అశ్విన్ మాయ
బెంగళూరు: చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకుంది. చాంపియన్స్ లీగ్-20లో భాగంగా శనివారమిక్కడ జరిగిన మ్యాచ్‌లో ధోనీసేన 13 పరుగులతో పెర్త్ స్కార్చర్స్‌పై విజయం సాధించింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పెర్త్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 142 పరుగులే చేయగలిగింది. కోల్టర్ నిలే 30, వోజెస్ 27, టర్నర్ 22 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లు అశ్విన్ మూడు, నెహ్రా రెండు వికెట్లు తీశారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన చెన్నై పూర్తి ఓవర్లలో ఆరు వికెట్లకు 155 పరుగులు చేసింది. టాపార్డర్ విఫలమైనా జడేజా (44 నాటౌట్), ధోనీ (35) దూకుడుగా ఆడారు. -
'సూపర్ ఓవర్' మ్యాచ్ లో కేప్ కోబ్రాస్ విజయం
ఛాంపియన్స్ లీగ్ ట్వెంటీ20 టోర్నమెంట్ లో భాగంగా మొహాలీలో ఉత్కంఠ భరితంగా జరిగిన 'సూపర్ ఓవర్' మ్యాచ్ లో బార్బడోస్ ట్రైడెంట్ జట్టుపై కేప్ కోబ్రాస్ విజయం సాధించింది. టాస్ గెలుచుకున్న కేప్ కోబ్రాస్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన బార్బడోస్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఆతర్వాత 175 పరుగుల లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన కేప్ కోబ్రాస్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. దాంతో ఈ మ్యాచ్ సూపర్ ఓవర్ మ్యాచ్ గా మారింది. సూపర్ ఓవర్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కేప్ కోబ్రాస్ 11 పరుగులు చేసింది. ఆతర్వాత 12 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన బార్బడోస్ జట్టు 1 వికెట్ చేజార్చుకుని 10 పరుగులు మాత్రమే చేయడంతో విజయం కేప్ కోబ్రాస్ ను వరించింది. -
హోబర్ట్ రెండో విజయం
-
చాంపియన్స్ లీగ్-20: హోబర్ట్ ఘనవిజయం
రాయ్‌పూర్: చాంపియన్స్ లీగ్ టీ-20లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్ 86 పరుగులతో నార్తర్న్ డిస్ట్రిక్ట్స్‌పై ఘన విజయం సాధించింది. 179 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ 16.4 ఓవర్లో 92 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన హోబర్ట్ హరికేన్స్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లకు 178 పరుగులు చేసింది. బ్లిజర్డ్ (62) హాఫ్ సెంచరీ చేయగా, షోయబ్ మాలిక్ (45 నాటౌట్), టిమ్ పెయిన్ (43) రాణించారు. నార్తర్న్ బౌలర్లు సౌథీ, సోది, స్కాట్ తలా వికెట్ తీశారు. -
చాంపియన్స్ లీగ్ టీ-20: నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ లక్ష్యం 179
రాయ్‌పూర్: చాంపియన్స్ లీగ్ టీ-20లో భాగంగా మంగళవారం జరుగుతున్న మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్ 179 పరుగుల లక్ష్యాన్ని నార్తర్న్ డిస్ట్రిక్ట్స్‌కు నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన హోబర్ట్ హరికేన్స్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లకు 178 పరుగులు చేసింది. బ్లిజర్డ్ (62) హాఫ్ సెంచరీ చేయగా, షోయబ్ మాలిక్ (45 నాటౌట్), టిమ్ పెయిన్ (43) రాణించారు. నార్తర్న్ బౌలర్లు సౌథీ, సోది, స్కాట్ తలా వికెట్ తీశారు. -
చెన్నై సూపర్ విన్
బెంగళూరు: చాంపియన్స్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘనవిజయం నమోదు చేసింది. సోమవారమిక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 54 పరుగులతో డాల్ఫిన్స్‌పై నెగ్గింది. 243 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన డాల్ఫిన్స్ పూర్తి ఓవర్లలో 188 పరుగులకు ఆలౌటైంది. కాగా డాల్ఫిన్స్ లక్ష్యఛేదనను దీటుగా ఆరంభించింది. డెల్పోర్ట్ (34), చెట్టీ (37), జార్స్‌వెల్డ్ (30) రాణించారు. ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో ఓటమి తప్పలేదు. అంతకుముందు ఫోర్లు, సిక్సర్లతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం హోరెత్తింది. పరుగుల సునామీకి అభిమానులు తడిసిముద్దయ్యారు. సురేష్ రైనా (43 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 90) మెరుపు విన్యాసాలతో చెలరేగడంతో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. పూర్తి ఓవర్లలో ఆరు వికెట్లకు 242 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన చెన్నైతొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ డ్వెన్ స్మిత్.. మహారాజ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అయితే ఆ తర్వాత చెన్నై బ్యాట్స్‌మెన్ డాల్ఫిన్స్ బౌలర్లకు చుక్కలు చూపించారు. బ్రెండన్ మెకల్లమ్, రైనా దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. దీంతో తొమ్మిదో ఓవర్లోనే స్కోరు 100 పరుగులు దాటింది. రైనా 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. మెకల్లమ్ పరుగు తేడాతో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. రైనా అదే దూకుడు కొనసాగించగా, అతనికి డూప్లెసిస్ అండగా నిలచాడు. కాగా సెంచరీకి చేరువలో రైనా వెనుదిరగడంతో చెన్నై జోరు కాస్త తగ్గింది. చివర్లో రవీంద్ర జడేజా (14 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 నాటౌట్) రెచ్చిపోవడంతో చెన్నై భారీ స్కోరు నమోదు చేసింది. -
రెచ్చిపోయిన రైనా, చెన్నై భారీ స్కోరు
బెంగళూరు: ఫోర్లు, సిక్సర్లతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం హోరెత్తింది. పరుగుల సునామీకి అభిమానులు తడిసిముద్దయ్యారు. సురేష్ రైనా (43 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 90) మెరుపు విన్యాసాలతో చెలరేగడంతో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. చాంపియన్స్ లీగ్‌లో భాగంగా డాల్ఫిన్స్‌తో సోమవారం జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై పూర్తి ఓవర్లలో ఆరు వికెట్లకు 242 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన చెన్నైతొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ డ్వెన్ స్మిత్.. మహారాజ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అయితే ఆ తర్వాత చెన్నై బ్యాట్స్‌మెన్ డాల్ఫిన్స్ బౌలర్లకు చుక్కలు చూపించారు. బ్రెండన్ మెకల్లమ్, రైనా దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. దీంతో తొమ్మిదో ఓవర్లోనే స్కోరు 100 పరుగులు దాటింది. రైనా 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. మెకల్లమ్ పరుగు తేడాతో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. రైనా అదే దూకుడు కొనసాగించగా, అతనికి డూప్లెసిస్ అండగా నిలచాడు. కాగా సెంచరీకి చేరువలో రైనా వెనుదిరగడంతో చెన్నై జోరు కాస్త తగ్గింది. చివర్లో రవీంద్ర జడేజా (14 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 నాటౌట్) రెచ్చిపోవడంతో చెన్నై భారీ స్కోరు నమోదు చేసింది. -
నరైన్ మ్యాజిక్
సాక్షి, హైదరాబాద్: వరుసగా రెండు టి20 మ్యాచ్‌ల్లో నాలుగు ఓవర్ల కోటాలో 9 పరుగుల చొప్పున మాత్రమే ఇవ్వడం ఎవరికైనా సాధ్యమా..? సునీల్ నరైన్‌కు మాత్రమే సాధ్యం. తానెంత విలువైన బౌలరో నిరూపిస్తూ నరైన్ (3/9) మ్యాజిక్ చేయడంతో చాంపియన్స్ లీగ్ టి20లో కోల్‌కతా వరుసగా రెండో విజయం సాధించింది. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 4 వికెట్లతో లాహోర్ లయన్స్‌పై గెలిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. షహజాద్ (42 బంతుల్లో 59; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), ఉమర్ అక్మల్ (24 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. కేకేఆర్ బౌలర్ నరైన్ 4 ఓవర్లలో కేవలం 9 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టడం విశేషం. కోల్‌కతా 19.3 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేసి విజయాన్నందుకుంది. గంభీర్ (47 బంతుల్లో 60; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా, ఉతప్ప (34 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 100 పరుగులు జోడించారు. కానీ 47 పరుగుల వ్యవధిలో కోల్‌కతా 6 వికెట్లు కోల్పోయింది. సూర్యకుమార్ (5 బంతుల్లో 14 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) జాగ్రత్తగా ఆడి మ్యాచ్‌ను ముగించాడు. స్కోరు వివరాలు: లాహోర్ లయన్స్ ఇన్నింగ్స్: జంషెద్ (రనౌట్) 10; షహజాద్ (సి) ఉతప్ప (బి) చావ్లా 59; హఫీజ్ (సి) రసెల్ (బి) కుల్దీప్ 9; ఉమర్ అక్మల్ (సి) గంభీర్ (బి) కమిన్స్ 40; నసీమ్ (సి) సూర్యకుమార్ (బి) నరైన్ 0; సిద్దిఖ్ (ఎల్బీ) (బి) నరైన్ 2; రజా (బి) నరైన్ 0; రియాజ్ (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 151. వికెట్ల పతనం: 1-50; 2-75; 3-91; 4-98; 5-103; 6-103; 7-151. బౌలింగ్: కమిన్స్ 4-0-38-1; రసెల్ 4-0-38-0; చావ్లా 4-0-35-1; నరైన్ 4-1-9-3; కుల్దీప్ 4-0-21-1. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (బి) రసూల్ 46; గంభీర్ (బి) ఇక్బాల్ 60; బిస్లా (సి) అక్మల్ (బి) చీమా 6; పఠాన్ (సి) రియాజ్ (బి) చీమా 11; డస్కటే (ఎల్బీ) (బి) రియాజ్ 12; సూర్యకుమార్ (నాటౌట్) 14; రసెల్ (సి) రసూల్ (బి) రజా 1; కమిన్స్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (19.3 ఓవర్లలో 6 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1-100; 2-113; 3-115; 4-135; 5-146; 6-147. బౌలింగ్: హఫీజ్ 3-0-23-0; రజా 1.3-0-10-1; చీమా 4-0-42-2; రియాజ్ 4-0-25-1; రసూల్ 4-0-28-1; ఇక్బాల్ 3-0-25-1. -
గౌతీ మెరుపులు.. నరైన్ మ్యాజిక్
హైదరాబాద్: చాంపియన్స్ లీగ్‌లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ నాలుగు వికెట్లతో లాహోర్ లయన్స్‌పై ఘనవిజయం సాధించింది. 152 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కోల్‌కతా ఆరు వికెట్ల నష్టానికి మరో మూడు బంతులు మిగిలుండగా విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు గంభీర్ (60), రాబిన్ ఊతప్ప (46) చెలరేగి వంద పరుగుల భాగస్వామ్యంతో శుభారంభం అందించి జట్టు విజయానికి బాటలు వేశారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన లాహోర్ లయన్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లెకు 151 పరుగులు చేసింది. షెజాద్ (59) హాఫ్ సెంచరీతో పాటు ఉమర్ అక్మల్ (40) రాణించాడు. కోల్‌కతా స్పిన్నర్ సునీల్ నరైన్ (3/9) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. -
చాంపియన్స్ లీగ్: పంజాబ్ విజయం
మొహాలీ: చాంపియన్స్ లీగ్ టి -20లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ లెవెన్ పంజాబ్ నాలుగు వికెట్లతో బార్బడోస్పై విజయం సాధించింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ మరో రెండు బంతులు మిగిలుండగా ఆరు వికెట్ల నష్టానికి విజయతీరాలకు చేరింది. డేవిడ్ మిల్లర్ 46 (నాటౌట్), వీరేంద్ర సెహ్వాగ్ 31 పరుగులు చేశారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన పూర్తి ఓవర్లలో ఆరు వికెట్లకు 174 పరుగులు చేసింది. రీఫర్ 60 (నాటౌట్) మునవీర (50) హాఫ్ సెంచరీలతో రాణించారు. -
వారెవ్వా... విలియమ్సన్!
49 బంతుల్లో 101 నాటౌట్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలోనార్తర్న్ డిస్ట్రిక్ట్స్ విజయం ఓడిన కేప్ కోబ్రాస్ చాంపియన్స్ లీగ్ టి20 రాయ్‌పూర్: చాంపియన్స్ లీగ్ టి20లో ఓపెనర్ కేన్ విలియమ్సన్ (49 బంతుల్లో 101 నాటౌట్: 8 ఫోర్లు; 5 సిక్సర్లు) చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీలోనే తొలిసారిగా వేగవంతమైన సెంచరీతో అదరగొట్టడంతో నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిన 33 పరుగుల తేడాతో కేప్ కోబ్రాస్‌పై నెగ్గింది. శుక్రవారం ఇక్కడి షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 206 పరుగుల భారీ స్కోరు చేసింది. ప్రస్తుత సీజన్లో విలియమ్సన్‌దే తొలి సెంచరీ కావడంతో పాటు అతడి కెరీర్లోనూ ఇదే మొదటిది. ఈ కివీస్ స్టార్ తన ఇన్నింగ్స్‌లో కేవలం ఏడు బంతులనే వదిలేశాడు. మరో ఓపెనర్ డెవిసిచ్ (46 బంతుల్లో 67; 8 ఫోర్లు; 1 సిక్స్), వాట్లింగ్ (20 బంతుల్లో 32; 3 ఫోర్లు; 1 సిక్స్) మెరుగ్గా రాణించారు. లాంగెవెల్ట్, ఫిలాండర్లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కేప్ కోబ్రాస్ ఇన్నింగ్స్ 7.2 ఓవర్లలో 44/2 స్కోరు వద్ద భారీ వర్షం పడి మ్యాచ్‌కు వీలు కాలేదు. ఆ సమయంలో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిన కోబ్రాస్ 77 పరుగులు చేయాల్సి ఉంది. దీంతో నార్తర్న్ డిస్ట్రిక్ట్స్‌ను విజేతగా ప్రకటించారు. విలియమ్సన్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పురస్కారం లభించింది. విలియమ్సన్ దూకుడు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నార్తర్న్ ఇన్నింగ్స్‌ను ఓపెనర్ కేన్ విలియమ్సన్ పరుగులు పెట్టించాడు. మరో ఓపెనర్ డెవిసిచ్ కూడా ఇదే ఆటతీరును చూపడంతో కోబ్రాస్ బౌలర్లు చేష్టలుడిగిపోయారు. ప్రతీ ఓవర్లో కనీసం ఓ బౌండరీ ఉండేట్టు చూసుకున్న ఈ జోడి 11 ఓవర్లలో జట్టు స్కోరును 107 పరుగులకు చేర్చింది. అయితే 14వ ఓవర్లో డెవిసిచ్ రనౌట్ కావడంతో తొలి వికెట్‌కు 140 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అదే ఓవర్లో కెప్టెన్ ఫ్లిన్ డకౌట్ అయినా వాట్లింగ్ వరుసగా 4,4,6 కొట్టి రన్‌రేట్ తగ్గకుండా చూశాడు. చివర్లో విలియమ్సన్ సెంచరీ చేయడంపై కాస్త ఆందోళన నెలకొంది. 18వ ఓవర్ అనంతరం 90 పరుగుల వద్ద ఉన్న విలియమ్సన్కు ఆతర్వాత ఓవర్లో రెండు వికెట్లు పడడంతో సెంచరీ పూర్తిచేస్తాడా అనే ఉత్కంఠ నెలకొంది. చివరి ఓవర్లో తొమ్మిది పరుగులు చేయాల్సి ఉండగా ఫ్రీ హిట్ అవకాశాన్ని సిక్సర్‌గా మలిచి విలియమ్సన్ 48 బంతుల్లో శతకం అందుకున్నాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేప్ కోబ్రాస్ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. ఆరో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన ఆమ్లా (14 బంతుల్లో 20; 3 ఫోర్లు) అదే ఓవర్లో వెనుదిరిగాడు. అయితే వర్ష సూచనను అంచనా వేయకుండా నిదానంగా ఆడడంతో జట్టు మూల్యం చెల్లించుకుంది. స్కోరు వివరాలు నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ ఇన్నింగ్స్: డెవిసిచ్ (రనౌట్) 67; విలియమ్సన్ నాటౌట్ 101; ఫ్లిన్ (సి) ఒన్‌టాంగ్ (బి) ఫిలాండర్ 0; వాట్లింగ్ (సి) వాన్ జిల్ (బి) లాంగెవెల్ట్ 32; స్టైరిస్ (సి) విలాస్ (బి) లాంగెవెల్ట్ 0; మిచెల్ (సి) కెంప్ (బి) ఫిలాండర్ 0; సాన్ట్నెర్ నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 206 వికెట్ల పతనం: 1-140; 2-140; 3-191; 4-192; 5-192. బౌలింగ్: లాంగెవెల్ట్ 4-0-27-2; ఫిలాండర్ 4-0-39-2; క్లీన్‌వెల్ట్ 3-0-37-0; పీటర్సన్ 3-0-32-0; జిజిమా 2-0-20-0; ఒన్‌టాంగ్ 2-0-17-0; కెంప్ 2-0-34-0. కేప్ కోబ్రాస్ ఇన్నింగ్స్: వాన్ జిల్ (బి) బౌల్ట్ 0; ఆమ్లా (సి) సబ్ విల్సన్ (బి) కుగ్గెలీన్ 20; పీటర్సన్ నాటౌట్ 17; రమేలా నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (7.2 ఓవర్లలో 2 వికెట్లకు) 44 వికెట్ల పతనం: 1-0; 2-38. బౌలింగ్: బౌల్ట్ 2-0-8-1; సౌతీ 2-0-10-0; స్టైరిస్ 2-0-13-0; కుగ్గెలీన్ 1-0-11-1; సోధి 0.2-0-1-0. -
హైదరాబాద్‌లో చాంపియన్స్ లీగ్
న్యూఢిల్లీ: చాంపియన్స్ లీగ్ టి20 (సీఎల్‌టి20) మ్యాచ్‌లకు హైదరాబాద్ మరో సారి వేదిక కానుంది. సీఎల్‌టి20- 2014లో భాగంగా ఏడు మ్యాచ్‌లను ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంకు కేటాయించారు. ఇందులో ఐదు లీగ్ మ్యాచ్‌లతో పాటు రెండు సెమీ ఫైనల్ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, మొహాలీ, రాంచీ టోర్నీ వేదికలుగా 29 మ్యాచ్‌లు జరుగుతాయి. రాంచీలో జరిగే క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల అనంతరం టోర్నీ మొదటి ప్రధాన మ్యాచ్‌లో ఐపీఎల్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ హైదరాబాద్‌లో తలపడుతుంది. సెప్టెంబర్ 13నుంచి అక్టోబర్ 4 వరకు జరిగే ఈ టోర్నీ ఫైనల్ బెంగళూరులో నిర్వహిస్తారు. గత ఏడాది ఫార్మాట్‌లాగే మొత్తం 12 జట్లు బరిలోకి దిగుతున్నాయి. భారత్‌నుంచి నాలుగు, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలనుంచి రెండు జట్లు ఉండగా, పాకిస్థాన్, శ్రీలంక, న్యూజిలాండ్, వెస్టిండీస్ దేశాలనుంచి ఒక్కో జట్టు పాల్గొంటుంది. -
చెన్నై సూపర్ కింగ్స్ కు రాజస్థాన్ రాయల్స్ షాక్!
చాంఫియన్స్ లీగ్ ట్వెంటీ20 క్రికెట్ టోర్నిలో భాగంగా జైపూర్ లోని సవాయి మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన తొలి సెమి ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ 14 పరుగుల తేడాతో విజయం సాధించి.. ఫైనల్లోకి దూసుకెళ్లింది. 160 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 145 పరుగులకే పరిమితం కావడంతో 14 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చివర్లో అశ్విన్, మోరిస్ లు మెరుపులు మెరిపించి జట్టు విజయావకాశాలపై ఆశలు రేపారు. అయితే 28 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్లతో 46 పరుగులు చేసిన అశ్విన్.. ఫాల్కనర్ బౌలింగ్ లో అవుట్ కావడంతో చెన్నై ఓటమి తప్పలేదు. రైనా 29, మోరిస్ 26, విజయ్ 14 పరుగులు తప్ప మిగితా వారెవరూ రెండెకెల స్కోరును సాధించకపోవడంతో పరుగుల వేటలో చతికిలపడింది. రాజస్థాన్ బౌలర్ థాంబే మూడు వికెట్లు పడగొట్టారు. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. రహానే రాణించి 70, వాట్సన్ 32 పరుగులు చేయడతో రాజస్థాన్ జట్టు 159 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో బ్రావో 3, హోల్డర్, మోరిస్ రెండేసి వికెట్లు, శర్మ కు ఒక వికెట్ లభించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా థాంబేను ఎంపిక చేశారు. -
బిస్బేన్ హీట్‌పై ట్రినిడాడ్ గెలుపు
చాంపియన్స్ లీగ్‌లో భాగంగా ఆదివారమిక్కడ జరిగిన మ్యాచ్‌లో బిస్బేన్ హీట్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రినిడాడ్ అండ్ టొబాగొ విజయం సాధించింది. 25 పరుగుల తేడాతో బిస్బేన్ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ట్రినిడాడ్ నిర్ణీ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. కెప్టెన్ రామ్‌దిన్ 48 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 136 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బిస్బేన్ 18.4 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌటయింది. బర్న్స్(45) ఒక్కడే రాణించాడు. ట్రినిడాడ్ బౌలర్లలో రామ్‌పాల్ 4, ఎమ్రిట్ 2, నరైన్ 2 వికెట్లు పడగొట్టారు. రామ్‌దిన్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు.