చాంపియన్స్ లీగ్ టీ-20లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్లో హోబర్ట్ హరికేన్స్ 86 పరుగులతో నార్తర్న్ డిస్ట్రిక్ట్స్పై ఘన విజయం సాధించింది.
రాయ్పూర్: చాంపియన్స్ లీగ్ టీ-20లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్లో హోబర్ట్ హరికేన్స్ 86 పరుగులతో నార్తర్న్ డిస్ట్రిక్ట్స్పై ఘన విజయం సాధించింది. 179 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ 16.4 ఓవర్లో 92 పరుగులకు ఆలౌటైంది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన హోబర్ట్ హరికేన్స్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లకు 178 పరుగులు చేసింది. బ్లిజర్డ్ (62) హాఫ్ సెంచరీ చేయగా, షోయబ్ మాలిక్ (45 నాటౌట్), టిమ్ పెయిన్ (43) రాణించారు. నార్తర్న్ బౌలర్లు సౌథీ, సోది, స్కాట్ తలా వికెట్ తీశారు.