ధోనీసేన 13 పరుగులతో పెర్త్ స్కార్చర్స్పై విజయం సాధించింది.
బెంగళూరు: చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండ్ షోతో ఆకట్టుకుంది. చాంపియన్స్ లీగ్-20లో భాగంగా శనివారమిక్కడ జరిగిన మ్యాచ్లో ధోనీసేన 13 పరుగులతో పెర్త్ స్కార్చర్స్పై విజయం సాధించింది.
156 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పెర్త్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 142 పరుగులే చేయగలిగింది. కోల్టర్ నిలే 30, వోజెస్ 27, టర్నర్ 22 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లు అశ్విన్ మూడు, నెహ్రా రెండు వికెట్లు తీశారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన చెన్నై పూర్తి ఓవర్లలో ఆరు వికెట్లకు 155 పరుగులు చేసింది. టాపార్డర్ విఫలమైనా జడేజా (44 నాటౌట్), ధోనీ (35) దూకుడుగా ఆడారు.