చెన్నై సూపర్ విన్ | Champions League Twenty20: chennai beats dolphins | Sakshi
Sakshi News home page

చెన్నై సూపర్ విన్

Published Mon, Sep 22 2014 11:28 PM | Last Updated on Sat, Sep 2 2017 1:48 PM

చెన్నై సూపర్ విన్

చెన్నై సూపర్ విన్

బెంగళూరు: చాంపియన్స్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఘనవిజయం నమోదు చేసింది. సోమవారమిక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో చెన్నై 54 పరుగులతో డాల్ఫిన్స్పై నెగ్గింది. 243 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన డాల్ఫిన్స్ పూర్తి ఓవర్లలో 188 పరుగులకు ఆలౌటైంది. కాగా డాల్ఫిన్స్ లక్ష్యఛేదనను దీటుగా ఆరంభించింది. డెల్పోర్ట్ (34), చెట్టీ (37), జార్స్వెల్డ్ (30) రాణించారు. ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో ఓటమి తప్పలేదు.

అంతకుముందు ఫోర్లు, సిక్సర్లతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం హోరెత్తింది. పరుగుల సునామీకి అభిమానులు తడిసిముద్దయ్యారు. సురేష్ రైనా (43 బంతుల్లో 4 ఫోర్లు,  8 సిక్సర్లతో 90) మెరుపు విన్యాసాలతో చెలరేగడంతో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. పూర్తి ఓవర్లలో ఆరు వికెట్లకు 242 పరుగులు చేసింది.

టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన చెన్నైతొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ డ్వెన్ స్మిత్.. మహారాజ్ బౌలింగ్లో అవుటయ్యాడు. అయితే ఆ తర్వాత చెన్నై బ్యాట్స్మెన్ డాల్ఫిన్స్ బౌలర్లకు చుక్కలు చూపించారు. బ్రెండన్ మెకల్లమ్, రైనా దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. దీంతో తొమ్మిదో ఓవర్లోనే స్కోరు 100 పరుగులు దాటింది. రైనా 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. మెకల్లమ్ పరుగు తేడాతో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. రైనా అదే దూకుడు కొనసాగించగా, అతనికి డూప్లెసిస్ అండగా నిలచాడు.  కాగా సెంచరీకి చేరువలో రైనా వెనుదిరగడంతో చెన్నై జోరు కాస్త తగ్గింది. చివర్లో రవీంద్ర జడేజా (14 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 నాటౌట్) రెచ్చిపోవడంతో చెన్నై భారీ స్కోరు నమోదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement