Hurricanes
-
సహాయక చర్యలపై తప్పుడు ప్రచారం: కమలా హారిస్
వాషింగ్టన్: మిల్టన్, హెలెన్ హరికేన్ల సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలపై ట్రంప్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కమలా హారిస్ మండిపడ్డారు. నార్త్ కరోలినాలో వారం రోజుల పర్యటనలో భాగంగా రెండోరోజైన ఆదివారం ఆమె.. పలు చర్చిలకు వెళ్లి నల్లజాతీయులను కలిశారు. కోయినోనియా క్రిస్టియన్ సెంటర్లో ఆమె మాట్లాడుతూ.. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలకు సహాయం చేస్తున్న వారు నిజమైన హీరోలని కొనియాడారు. కానీ ఒక కీలక వ్యక్తి సహాయం చేయకపోగా, సొంత ప్రయోజనాలకోసం తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేస్తున్నారని ట్రంప్‌ను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షోభ సమయంలో రాజకీయ నాయకులు చేయాల్సింది అది కాదని హితవు పలికారు. హెలెన్ తుఫాను అనంతరం ఫ్లోరిడాలో పర్యటించిన ట్రంప్.. రిపబ్లికన్ల సహాయాన్ని ప్రభుత్వం కావాలనే నిలిపేస్తోందని ఆరోపించారు. చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉన్న వలసదారుల కోసం ఖర్చు చేయడంతో ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీకి ఇవ్వడానికి నిధులు లేకుండా పోయాయయని విమర్శించారు. ట్రంప్ వ్యాఖ్యలపై హారిస్ పైవిధంగా స్పందించారు. కమలా హారిస్ ప్రసంగానికి ముందు బైడెన్ గల్ఫ్ తీరంలోని టంపా, సెయింట్ పీట్ బీచ్ మధ్య హెలికాప్టర్లో హరికేన్ నష్టాన్ని సర్వే చేశారు. మిల్టన్ ఊహించినంత నష్టం చేయలేదని, చాలామంది సర్వం కోల్పోయారని, వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. విపత్తు సమయంలో సహాయక చర్యల్లో పాల్గొన్న ఫస్ట్ రెస్పాండర్లను బైడెన్ ప్రశంసించారు. ఇలాంటి సమయాల్లో డెమొక్రాట్లు, రిపబ్లికన్లుగా కాకుండా అమెరికన్లుగా పరస్పరం సహాయం చేసుకోవడం అభినందించదగ్గ విషయమన్నారు. సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులకోసం నిధులను మంజూరు చేశారు. పోలింగ్‌కు ఇంకా మూడు వారాల సమయమే ఉన్న నేపథ్యంలో వరుస తుఫానులు ఎన్నికలకు మరో కోణాన్ని జోడించాయి. -
మెక్సికో నగరాల్లో మొసళ్ల సంచారం
మెక్సికో సిటీ: మెక్సికో దేశంలోని తీర ప్రాంత నగరాల్లో ఇటీవల మొసళ్ల సంచారం ఒక్కసారిగా పెరిగింది. సముద్ర తీరాల వెంబడి తక్కువ లోతు నీళ్లలో ఉండే మొసళ్లు ఇటీవలి వరుస తుపాన్లు, వరదలతో జనారణ్యంలోకి వచి్చపడుతున్నాయి. టాంపికో, సియుడాడ్ మడెరో, అల్టమిరా నగరాల్లో తిరుగుతూ ప్రజలను భయకంపితుల్ని చేసిన కనీసం 200 మొసళ్లను పట్టుకుని, వాటి ఆవాసాలకు తీసుకెళ్లి వదిలేసినట్లు అధికారులు తెలిపారు. నీటి కొరత ఏర్పడినా, వరదలు వచి్చనా అవి ఇలా జనం మధ్యకు వచ్చేస్తుంటాయని, ఇదో సమస్యగా మారిందని అధికారులు అంటున్నారు. మెక్సికోలో మొసళ్లు రక్షిత జీవులు. అందుకే ప్రజలు చంపడానికి బదులుగా బంధించి అధికారులకు సమాచారమిస్తుంటారు. -
ఫిలిప్పీన్స్‌ను కుదిపేస్తున్న ‘వామ్కో’
మనీలా: భారీ తుపాన్లతో ఫిలిప్పీన్స్ అతలాకుతలం అవుతోంది. పది రోజుల క్రితం తీవ్రమైన గోని తుపానుతో ప్రభావితమైన క్వెజాన్, లుజాన్, రిజల్, మనీలా ప్రాంతంలోనే తాజాగా మరో తుపాను వామ్‌కోతో ప్రజలు వణికి పోతున్నారు. ఇప్పటి వరకు ఆరుగురు మరణించగా మరో 10 మంది గల్లంతయ్యారు. సుమారు 2 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారని సీఎన్ఎన్ తెలిపింది. కేవలం మూడు వారాల్లోనే ఫిలిప్పీన్స్‌పై ఐదు తుపాన్లు తీవ్ర ప్రభావం చూపాయి. గోని తుపాను కారణంగా నిరాశ్రయులైన 2.40 లక్షల మంది ఇప్పటికే తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్నట్లు రెడ్ క్రాస్, రెడ్ క్రిసెంట్ తెలిపాయి. -
పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ భగ్గు!
న్యూఢిల్లీ : అంతర్జాతీయ ధరల ప్రభావంతో ఇన్ని రోజులు వాహనదారుల జేబులకు భారీగా చిల్లులు పెట్టిన పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజుల నుంచి ఇంధన ధరలు దేశీయంగా స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. కానీ పెట్రోల్, డీజిల్ ధరలు దేశీయంగా మళ్లీ భగ్గుమననున్నాయట. దీనికి గల కారణం త్వరలో అట్లాంటిక్ మహాసముద్రంలో హారికేన్లు ప్రారంభం కానున్నాయట. అట్లాంటికా బేసిన్లో కనుక హారికేన్లు ప్రారంభమైతే, దేశీయంగా ఇంధన ధరలు భారీగానే పెరిగే అవకాశం కనిపిస్తోంది. అట్లాంటిక్ మహాసముద్రం, కరేబియన్ నది, మెక్సికో గల్ఫ్ కలిగి ఉన్న ప్రాంతాన్ని అట్లాంటిక్ బేసిన్గా పేర్కొంటారు. ఈ బేసిన్లో జూన్ నుంచి నవంబర్ వరకు హారికేన్ సీజన్ ప్రారంభమవుతోంది. ఏ సమయంలోనైనా రాకాసి హారికేన్ల విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది. ఆగస్టు మధ్యలో నుంచి అక్టోబర్ చివరి వరకు రాకాసి హారికేన్లకు పీక్ సీజన్. ఒకవేళ ఈ హారికేన్లు కనుక ఏర్పడితే, దేశీయంగా మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలను చవిచూడాల్సి వస్తోంది. గతేడాది కూడా భారీ ఎత్తున్న హార్వే హారికేన్, ఇర్మా హారికేన్ ఏర్పడటంతో, అంతర్జాతీయంగా రిఫైనరీ అవుట్ పుట్ 13 శాతం మేర పడిపోయింది. దీంతో ఇంధన ధరలు భారీగా పైకి ఎగిశాయి. ఈ ఏడాది కూడా మరికొన్ని రోజుల్లో అట్లాంటిక్ బేసిన్ ప్రాంతంలో ఏర్పడబోయే హారికేన్లు, ఇంధన ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో హారికేన్లకు, భారత్‌లో ఇంధన ధరలకు సంబంధం : గతేడాది సంభవించిన హార్వే, ఇర్మా హారికేన్లు, గల్ఫ్ కోస్ట్‌లోని అమెరికా రిఫైనరీ సామర్థ్యాన్ని దెబ్బతీశాయి. దీంతో సరఫరా తగ్గిపోయింది. అవుట్‌పుట్ పడిపోవడంతో, అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఒక్కసారిగా పైకి ఎగిశాయి. నైమెక్స్‌లో కూడా ఇంధన ధరల ఫ్యూచర్స్ పెరిగాయి. భారత్ ఇంధనాన్ని ఎక్కువగా గ్లోబల్ నుంచే దిగుమతి చేసుకుంటోంది. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో, దేశీయంగానూ ధరలు పెరిగాయి. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం రేటు పడిపోయింది. వీటన్నింటి పలితంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. మరోవైపు అంతర్జాతీయంగా ధరలకు అనుగుణంగా దేశీయంగా ధరలు మారేలా.. మన చమురు సంస్థలు రోజువారీ ధరల సమీక్షను చేపట్టాయి. ఈ రోజువారీ ధరల సమీక్షతో, తగ్గడం కంటే ఇంధర ధరలు పెరగడమే ఎక్కువగా ఉంది. -
హడలెత్తిస్తున్న అక్టోబర్
కోలుకోనివ్వని తుపాన్లు భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలు మిగుల్చుతున్న పండుగల నెల 123 ఏళ్లలో 76 తుపాన్లు అక్టోబర్ నెలలోనే 31 విపత్తులు హైదరాబాద్: కోస్తా జిల్లాలను అక్టోబర్ వణికిస్తోంది. ఈనెల వచ్చిందంటే పెను తుపాన్లు ముంచేస్తాయని ప్రజల్లో కలవరం. కోతకొచ్చే దశలో పంటలు ధ్వంసమవుతాయని రైతుల్లో ఆందోళన. ప్రధానమైన దసరా, దీపావళి పర్వదినాలతో కూడిన ఈ నెలలోనే అధిక సంఖ్యలో తీవ్రమైన తుపాన్లు వచ్చి తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాలు కలిగిస్తుండడమే ఇందుకు కారణం. ఈ ఏడాది కూడా అదే జరిగింది. గత ఏడాది అక్టోబర్ 10-15 తేదీల మధ్య పైలీన్, నవంబర్‌లో హెలెన్, లెహర్ తుపాన్లవల్ల కకావికలమైన సంఘటనలను ప్రజలు మరువకముందే ఈ ఏడాది హుదూద్ పెను విపత్తు ఉత్తరాంధ్రలో విధ్వంసం సృష్టించింది. 1891 నుంచి అందుబాటులో ఉన్న గణాంకాలను పరిశీలిస్తే ఇప్పటి వరకూ 76 తుపాన్లు సంభవించాయి. వీటిలో 31 అక్టోబర్‌లోనే రావడం గమనార్హం. అందుకే ఈ నెలను వాయుగుండాల (గండాల) మాసంగా విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అభివర్ణిస్తుంటారు. 123 ఏళ్లలో మొత్తం 76 తుపాన్లు రాగా అందులో 52 (మూడింట రెండొంతులు) అక్టోబర్, నవంబర్ నెలల్లోనే సంభవించాయి. రాష్ట్ర చరిత్రలో అతి పెద్ద పెను విపత్తుగా నమోదైన దివిసీమ ఉప్పెన కూడా నవంబర్ నెలలోనే సంభవించడం గమనార్హం. 1977 నవంబర్ 15-20 తేదీల మధ్య సంభవించిన దివిసీమ ఉప్పెన పదివేల మందిని పొట్టన పెట్టుకుంది. ఈ పెను విపత్తులో అధికారిక లెక్కల ప్రకారమే రెండున్నర లక్షల జంతువులు చనిపోయాయి. హా123 ఏళ్లలో అత్యధిక (23) తుపాన్లు నెల్లూరు జిల్లాలోనే తీరం దాటాయి. మరో 16 కృష్ణా జిల్లాలో తీరం దాటాయి. కోస్తాలోని తొమ్మిది జిల్లాలు సముద్రతీరంలోనే ఉన్నా నెల్లూరు, కృష్ణా జిల్లాల్లోనే ఎక్కువ తుపాన్లు తీరం దాటాయి. పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాల్లో ఇప్పటి వరకూ ఒక్క తుపాను కూడా తీరాన్ని దాటిన దాఖలాలు లేవు. ఇందుకు కారణాలేమిటనే విషయంపై పరిశోధనలు సాగించాల్సిన అవసరం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. హా1892 అక్టోబర్‌లో వారం వ్యవధిలోనే రెండు తుపాన్లు సంభవించినట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. 1987 అక్టోబర్‌లో కేవలం పక్షం వ్యవధిలో మూడు తుపాన్లు ముంచెత్తాయి. ఒక్కోసారి వరుసగా నాలుగైదేళ్లలో తుపాన్లే రావు. కొన్నిసార్లు వరుసగా నెలలోనే రెండు మూడు తుపాన్లు వస్తుంటాయి. ‘ఇందుకు కారణాలేమిటో పరిశోధనల ద్వారానే తేలాల్సి ఉంది. ఇవి పరిశోధనలకు కూడా అందని ప్రకృతి రహస్యం అనేది నా అభిప్రాయం’ అని వాతావరణ శాఖకు చెందిన ఒక నిపుణుడు‘సాక్షి’తో అన్నారు. ఈశాన్యంలోనే తీవ్రం... మన రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల కాలంలో కంటే ఈశాన్య రుతుపవనాల సమయంలో తుపాన్ల తీవ్రత అధికంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా అక్టోబర్‌లోనే మనకు ఎక్కువ తుపాను విపత్తులు సంభవిస్తుంటాయి. 1891 నుంచి గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్రంలో ఇప్పటిదాకా 76 తుపాన్లు వచ్చాయి. వీటిలో 31 విపత్తులు అక్టోబర్‌లోనే సంభవించడం గమనార్హం. జనవరి- ఏప్రిల్ మధ్య ఎన్నడూ తుపాన్లు రాలేదు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ నైరుతి రుతుపవనాలు ఉంటాయి. ఈ సమయంలో కూడా తుపాన్లు సంభవిస్తుంటాయి. నైరుతి రుతుపవనాల కాలంలో మన రాష్ట్రంలో ఇవి చాలా తక్కువే. ఈశాన్య రుతుపవనాల సమయంలో మాత్రం అధికంగా, తీవ్రంగా తుపాన్లు వచ్చి కోస్తా జిల్లాల్లో పంటలను ధ్వంసం చేయడమే కాకుండా విద్యుత్తు, రహదారి, సాగునీటి వనరుల వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. పెను నష్టం కలిగించిన తుపాన్లన్నీ అక్టోబర్, నవంబర్ మాసాల్లోనే రావడం గమనార్హం. ‘అక్టోబర్, నవంబర్ నెలల్లో సముద్ర ఉష్ణోగ్రతలు తుపాన్లకు చాలా అనువుగా ఉంటాయి. అల్పపీడనాలు తుపాన్లుగా మారుతుంటాయి. అందుకే ఈ నెలల్లోనే మనకు అత్యధిక తుపాన్లు, విపత్తు నష్టాలు సంభవిస్తుంటాయి’ అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రతినిధి నరసింహారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
హోబర్ట్ రెండో విజయం
-
చాంపియన్స్ లీగ్-20: హోబర్ట్ ఘనవిజయం
రాయ్‌పూర్: చాంపియన్స్ లీగ్ టీ-20లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్ 86 పరుగులతో నార్తర్న్ డిస్ట్రిక్ట్స్‌పై ఘన విజయం సాధించింది. 179 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ 16.4 ఓవర్లో 92 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన హోబర్ట్ హరికేన్స్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లకు 178 పరుగులు చేసింది. బ్లిజర్డ్ (62) హాఫ్ సెంచరీ చేయగా, షోయబ్ మాలిక్ (45 నాటౌట్), టిమ్ పెయిన్ (43) రాణించారు. నార్తర్న్ బౌలర్లు సౌథీ, సోది, స్కాట్ తలా వికెట్ తీశారు. -
చాంపియన్స్ లీగ్ టీ-20: నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ లక్ష్యం 179
రాయ్‌పూర్: చాంపియన్స్ లీగ్ టీ-20లో భాగంగా మంగళవారం జరుగుతున్న మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్ 179 పరుగుల లక్ష్యాన్ని నార్తర్న్ డిస్ట్రిక్ట్స్‌కు నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన హోబర్ట్ హరికేన్స్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లకు 178 పరుగులు చేసింది. బ్లిజర్డ్ (62) హాఫ్ సెంచరీ చేయగా, షోయబ్ మాలిక్ (45 నాటౌట్), టిమ్ పెయిన్ (43) రాణించారు. నార్తర్న్ బౌలర్లు సౌథీ, సోది, స్కాట్ తలా వికెట్ తీశారు.